Saturday, July 24, 2010

మా తల్లి భూదేవి

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము!

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము
లక్షల సంవస్తారాలు మంచు దుప్పటిల మగ్గి
బడబాగ్నిగ బద్దలయ్యి పురిటి నొప్పులెన్నోతీసి
గాలి నీరు గుట్ట చెట్టు ప్రజలను ప్రసవిస్తివమ్మ

మహిమగల్లా నీదు మన్నులానుంచెల్లి
నీళ్ళు నిప్పులే గాదు అన్న పానాదులను
అడుగకుంటిచ్చినవు ఆదికాలము నుండి

నీ ఎద పైన కాలూని ఎదిగినవి వృక్షాలు
పూలు పండులే గాదు కొమ్మరెమ్మలే గాదు
ఔషధీ యుక్తమగు ఆకులలములు ఇచ్చి
సల్లంగా సాదినవు ఎల్ల జనులను తల్లి

పుడమి తల్లలనాడు పుక్కిలుంచుమిసిన
గండుశిల కొండలు బండ రాళ్లన్నియు
మేఘాల పిండినవి నీ కడుపు నింపినవి
వడగాలి సుడిగాలి అధిక ఉష్ణోగ్రతల
అడ్డు నిలిచాపినవి అందరూ బతుకుటకు.

కానీ........... తల్లీ............

తల్లి వీపును చీల్చి తల్లినే చంపేటి
తేలు పిల్లల తీరు తేలినము మేమంత
అడవులను నరికినము బోడులను చేసినము
సంద్రాల నిండుగా విషమునూ నింపినము

ఐరనూ ఓరనీ సున్నాపురాయని
గ్రానైటు క్వారియని ఓపనూ కాస్టుయని
తల్లి నీ కడుపునూ పెళ్లగించితిమమ్మ
అయిలూ లాగేసి బొగ్గునూ తవ్వేసి
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

రేడియము థోరియము ఆటమూ బాంబులతో
మా బొందలను మేమే తవ్వుకుంటున్నాము
కూర్చున్న కొమ్మనే నరుకుకుంటున్నాము
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

Tuesday, July 6, 2010

ఎవరి సంపదను ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు ఎవరికి సొమ్ములు ఇస్తున్నారు?

ధా రాజా తథా ప్రజా అనేది పాత సామెత ఇప్పుడు యథాప్రజా తథా రాజా అంటూ ఒక ఎలక్ట్రానిక్ ఛానెల్ చర్చ నిర్వహిస్తున్నది.
ఆ చర్చలో మాట్లాడుతున్న నాయకులు ఎన్నికలల్లో ప్రజలు ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు కనుక అధికారం
లోనికి వచ్చిన తర్వాత మాకూ తీసుకోక తప్పడం లేదు అంటూ అది అంతా ప్రజల తప్పే అని అంటున్నారు. ఈ చర్చ ను గమనిస్తూ
ఉంటే రాజకీయ నాయకుల అవినీతికి ఈ చానల్ ఒక లెజిట్మెసి కల్పించినట్లు గా ఉన్నది. అవినీతిని సార్వజనీ కరణ చేస్తూ
అక్రమ సంపాదన తప్పు కాదు,అవకాశం దొరికినపుడు ఎవరైనా సంపాదించుకుంటారు,అలా సంపాదిస్తేనే కదా ఎవరైనా మళ్ళీ
అధికారం లోకి వచ్చేది అని ఒక నూతన కాకపోయినా ఆదర్షాలకు భిన్నంగా ఇదే ఈ కాలపు ఆదర్శం అని చెప్తున్నారు.
చిన్నా చితకా అధికారులు ఏమో కానీ ఒక మోస్తరు అధికారం అంటే తన అధికారం వలన ప్రజలకు చీమ కాలంత మేలు జరిగినా
ఆయనకు అదనపు సంపాదన వచ్చి తీరుతున్నది.చిన్న గుమాస్తా నుండి ఐ ఏ ఎస్ అధికారి వరకు,హోమ్ గార్డ్ నుండి డి జి పి
వరకు,గ్రామ సర్పంచి నుండి ముఖ్య మంత్రుల వరకు లక్షల కోట్ల సంపాదన కూడ బెట్టుకుంటున్నట్లు వాటిని విదేశీ బ్యాంకులల్లో
దాచుకుంటున్నట్లు ఆయా వ్యక్తుల ప్రత్యర్తుల విమర్శలల్లో వింటున్నాము. వాళ్ళే మన పాలకులు. వాల్లనే ఆరాధిస్తూ మళ్ళీ మళ్ళీ
వాళ్ళే కావాలని ఓట్లు వేసి ఎన్నుకుంటున్నాము. వాళ్ళ ఆస్తులను అధికారాలను కాపాడదానికి మనకున్న రక్షణ వ్యవస్తాను
అడ్డం పెడుతున్నాము. చట్టాలను రూపొందించే అధికారాలను కట్టబెడుతున్నాము. కనుక తమకు సంక్రమిస్తున్న అధికారాలను
సుస్తిరం చేసుకోవడానికి రాజకీయ నాయకులు,వారి తర్వాత వారి వారసులు అధికారం కోసం ఏమయినా చేస్తున్నారు.
ఆ మద్యన ఒక పాంప్లెట్ చూసాను. వై యస్ రాజా రెడ్డి మంచి ఒడ్డు పొడుగు ఉన్న పహిల్వాన్ అనీ,కడప జిల్లాలోని ఒక ముగ్గు
రాళ్ల క్వారీ యజమాని వద్ద కులీలను అజమాయిషీ చేయడానికి నియమించబడి కొంత కాలానికి అక్కడ లభిస్తున్న లాభాలను
చూసి క్వారి యజమానిని భౌతికంగా తొలగించి తానే క్వారిలను ఆక్రమించుకున్నాడని రాశారు. ఆ తర్వాత ఆయన కుమారులు
అప్పటికే క్వారీల ద్వారా లభించిన లాభాల పెట్టుబడితో శాసన సభకు గెలిచిన రాజశేఖర్ రెడ్డి పైన అసెంబ్లీ వద్దనే హత్యా
ప్రయత్నం కూడా చేసినట్లు ఆ పాంప్లెట్ లో రాశారు. దాని పైన ఎవరు కూడా కౌంటర్ చేయలేదు కూడా. అంటే రాజ్యాధికారం
ద్వారా ఒక కుటుంబానికి కేవలం ఒక్క తరం లోనే రెండో తరానికి ముఖ్య పదవిని కొనుక్కోగలిగినంతటి సంపద సంపాదించుకునే
అవకాశం లభించింది.ఆ ముఖ్యమంత్రి పదవి దక్కక పోయే సరికి ఆ యువ రాజు ఊరూ వాడా ఎలా ఏకం చేస్తున్నాడో
చూస్తున్నాము.
మన రాజ్యాంగం ప్రకారం ,లభించిన రాజ్యాధికారం తోటి దేశం లో ఉన్న సహజ వనరులు,ఉత్పత్తి అవుతున్న సంపద అంతా
ప్రజలందరికి సమానంగా పంచవలసిన బాధ్యతను విస్మరించి సహజ వనరులను,సంపదలను వాళ్ళే వ్యక్తిగత ఆస్తులుగా
మార్చుకుంటున్నారు. ఆ అధికారం తోటే ప్రజల డబ్బులతోటే పోషించ బడుతున్న రక్షణ యంత్రంగాన్ని తమకు,తమ ఆస్తులకు
రక్షణగా వాడుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని ఎవరయినా గొంతెత్తిటే ఆ గొంతుకలను ఉత్తరిస్తున్నారు.
మహాత్మా గాంధీ వాళ్ళు నిత్యం జపించే వ్యక్తి. ఆయనే ఒక సారి ఏమన్నాడంటే నీ కనీస అవసరాలకు మించి నీ వద్ద ఒక్క
రూపాయి ఉన్నా అది నీ పక్కవానికి చెందవలసినదే. అంటే నీ జేబులో ఉన్న రూపాయి వాని జేబులోనుండి నీవు దొంగిలించినదే అని అన్నాడు
అక్రమంగా సంపాదించిన ఈ అవినీతి సొమ్ము అంతా ఎవరికి చెందాలి? ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజలు త్యాగమూర్తులా? లేక
సకల సౌఖ్యాలు ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధుల?

పెట్రోల్ ధరల పెంపు బందులు.

పెట్రోల్ ఉత్పత్తుల పెంపు పైన దేశవ్యాప్తంగా బంధు జరిగింది.ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉన్నది అనడానికి అనేక ఉదాహరణలు
ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజల ఇస్టమ్ మేరకే పరిపాలించాలి మరి. ఒకవైపు ప్రజలంతా పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తుంటే
ప్రభుత్వం మాత్రంససేమిరా అంటున్నది. అంతేగాకుండా భరత్ ఝన్ ఝన్వాలా లాంటి ప్రజా వ్యతిరేక మేధావులు ప్రభుత్వ
పాలసీలను సమర్థిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. మరో పాలక మేధావి ఇందర్ మల్హోత్రా రాజీవ్ గాంధీ చేసిన ఏకైక మంచి
పని భోపాల్ లో ఎం ఐ సి గాస్ లీక్ కు కారణమైన అందర్శన్ ను విడిచి పెట్టదమేనని కితాబు ఇస్తాడు. ఇంతటి ప్రజా వ్యతిరేకమైన
వ్యాసాలను మన పత్రికలు ప్రచురిస్తాయి.
బందు వలన 13 వేల కోట్లు నస్టమ్ జరిగిందట.ఇది జాతికి నస్టమట.కనుక బంధు జరుపవలసింది కాదని కొందరి వాదన.సరే వాదన
కొరకు ఒప్పుకుందాం. కానీ ప్రజల అభీస్టానికి వ్యతిరేకంగా పెంచబడిన ధరల వలన ఎన్ని లక్షల కోట్ల నస్టమ్ వాటిల్లనుందో ఈ
మేధావులు చెప్పరు. పైన చెప్పిన 13 వేలు ప్రజల నస్టమ్ కాదు అవి వాస్తవానికి ప్రజలకు మిగిలినాయి. కానీ ధరవరల పెరుగు
దలతో నస్టమ్ వాటిల్లేది ప్రజలకు. లాభాలు వచ్చేది పెట్టుబడి దార్లకు.
భరత్ ఝన్ ఝన్వాలా మాటల్లోనే మనం ఉపయోగిస్తున్నపెట్రోల్ లో దిగుమతి చేసుకుంటున్నది 80% మన దేశం లోనే లభిస్తున్నది
20%.మరి మన దేశం లోనే లభిస్తున్న 20% పెట్రోల్ పైన గూడ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. అది వివక్షత గాదా? ఈ డబ్బులు
ఎవరి ఖతాలోనికి పోతున్నాయో ఎందుకు లెక్కలు చెప్పరు? దరలు పెంచకుంటేనట ప్రభుత్వాలు ఆ ధరలు భరించడానికి
అదనంగా కరెన్సీ ముద్రించ వలసి ఉంటుందట? ఎంత అడ్డగోలు లెక్కలు చెప్తున్నారు ఈ మేధావులు? కరెన్సీ ఎలా ముద్రుస్తారు?
దేశం లో ఉత్పత్తి కానున్న సకల వస్తువులు సరుకులుగా మారి మార్కెట్ లోనికి వస్తే వాటిని మారకం చేసుకోవడానికి అవసరమైన
మేరకు కరెన్సీ ఉత్పత్తి చేస్తుంది ఏ దేశమైనా. ప్రభుత్వ నిర్వాహణ కొరకు సరుకుల పైన పన్నులు వేస్తాయి ప్రభుత్వాలు. అలా
కాకుండా ఇస్టమ్ వచ్చిన విధంగా కరెన్సీ ముద్రించుకుంటూ పోతే ఆ కరెన్సీ కి విలువే ఉండదు. ఇంతటి నగ్న సత్యాలను
సైతం అబద్దాలతో దేశ ఆర్థిక విధానాలను కూడా వక్రీకరించి రాస్తుంటే పత్రికలు ప్రచురిస్తాయి . ఈ పద్దతికి భిన్నంగా కరెన్సీ
ముద్రించరా అని అంటే ముద్రిస్తారు కానీ ఈలాంటి పరిస్తీతుల్లో కాదు. అట్లా ఇస్టమ్ వచ్చిన విధంగా ముద్రించుకుంటే ఇక
ఇన్ని దేశాలనుండి ఇంతేసి అప్పులు ఎందుకు మనకు?
సరే ఇక ఈ పెట్రోల్ ధరల ను ఎవరు ఎలా నిర్ణయిస్తారు? వాస్తవానికి గాలి,నీరు ఎలా సహజ సిద్దంగా లభిస్తున్నాయో పెట్రోల్
కూడా అంటే సహజసిడ్డంగా లభిస్తున్నది. నీళ్ళు బాటిల్లాలో,గాలి పంఖా బిగించిన తర్వాత సరుకులు అయినట్లుగా పెట్రోల్ కు
మానవ శ్రమ జోడించిన తర్వాత సరుకు అయింది. ఆ సరుకుకు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన డిమాండ్ మేరకు రేట్లను
పెంచుతూ పోతున్నారు.అసలు ఏదైనా ఒక సరుకుకు రేటు ఎలా నిర్ణయించాలి?
ఉదాహరణకు ఒక కుండ రేటును ఎట్లా నింర్ణయించాలి? ఒక పది బండ్ల మట్టి ని తేవడానికి అయిన బండి కిరాయి, ఒక ఇద్దరు
మనుషులతో మట్టిని మెత్తగా నలుగ కొట్టేడానికి.మరో నలుగురు మనుషులతో నీళ్ళు పోయించి మెత్తగా తొక్కించడానికి,
రెండు రోజులు కుమ్మరి కుండాలను ఆనడానికి,ఒక రోజు వాటి అడుగులు మూయడానికి. ఒక నాలుగు బండ్ల కట్టేలా ఖరీదు,
ఈవెగాక ఇంకా ఏమయినా ఖర్చులు అయి ఉంటే మార్కెట్ రేటు ప్రకారం లెక్క వేసి ఆ కుమ్మరి వాము నుండి తీసిన కుండల్లో
నుండి పలిగి పోగా మిగిలిన ఒ ముప్పయి కుండలు ఉన్నాయి అనుకుంటే అయిన ఖర్చు ఒ 600 రూపాయలు అనుకుంటే ఒక్కక్క
కుండకు 20 రూపాయల ధర నిర్ణయించాలి. కానీ జరుగుతునది ఏమిటి? పరిశ్రమాధిపతి వస్తువు ఎంతకూ తయారు అయింది అన్నది
కాకుండా తనకు ఎంత లాభం కావాలో అంతకు ధర నిర్ణయిస్తున్నాడు.దీన్ని నియంత్రించ వలసిన ప్రభుత్వాలు విదిల్చ బడుతున్న
ఎంగిల్లి మెతుకులకు ఆశపడుతూ ఎవరు ఏ తీరుగా రేట్లు నిర్ణయించుకున్నా మాట్లాడకుండా పైగా వాటి పైన మరింత పన్నులు
వేసి ప్రజల కొనుగోలు శక్తి తో పరాచికాలు ఆడుతున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్తాలో ప్రజల అభిస్టమ్ మేరకు ప్రభుత్వాలు నడుచుకోకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రజలు చూసుకుంటారు.
ఇవ్వాళ బంధులతో ప్రభుత్వాలల్లో చలనం రాకుంటే ఇంతకంటే మెరుగైన పోరాట రూపాలను ప్రజలు తమ ఆచరణాలద్వారా
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాట రూపలల్లోనుండి వెతుక్కుంటారు,పోల్చి చూసుకుంటారు.