Monday, September 13, 2010

చెట్లు-గుట్టలు -అవే రేపటి మన జాడలు-2 !

చుట్టూ ఉన్న ఈ గుట్టల వలన కురిసే వర్షాపాతం తో ఊరికి ఉన్న మూడు పెద్ద చెరువులు,
నాగుల చెరువు ,ఊరచెరువు ,ఆరేడు చెరువు నిండుతాయి. గుట్ట ఏనెల పొంటి ఉన్న ముప్పై
ఆరు కుంటలు నిండుతాయి . ఈ మూడు చెరువులు ముప్పైయారు కుంటలు ప్రతి సంవస్తారం
నిండుతున్న కారణంగా ముఖ్యంగా భూగర్భ జలాలు బాగా పైన ఉండి గ్రామం లో మూడు వందల
వ్యవసాయ బావులలో సమృద్దిగా నీరు ఉండి రెండు పంటలకు రెండు వేల ఏకరాల్లో వరి, రెండు
వందల ఏకరాల్లో మామిడి, వంద ఎకరాల టేకు, అరవై ఏకరాల నిమ్మ తోటలతో, భూమి ఉన్న
వాళ్ళకు మాత్రమే గాకుండా భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు నెల్లు
.చేతి నిండా పని దొరుకుతున్నది.
ఈ గుట్టల పైన కురిసే వాన చిన్నచిన్న కుంటలు నింపడంతో బాటుగా నాగుల చెరువు,
అన్నారం చెరువు, రంగం పేర చెరువులను నింపి మిగిలిన నీరు మానేరు నదిలో ,కలుస్తుంది
మరోవైపు నుండి ఈదులాగట్టేపల్లి చెరువు, అన్నారం ఊరడి చెరువు, రంగంపేట చెరువులను
నింపి మిగిలన్ నీటిని మానేటిలో వదులుతుంది. ఇంకొక వైపునుండి లలితపూర్ గుట్టల్ల నుంచి
దేవంపల్లిచెరువు నింపి రంగంపేట్ గ్రామానికి చెందిన గుండ్ల కుంట నింపి మానేరును చేరుతుంది.
కరీంనగర్ జిల్లాలో గంభీరావ్ పేట నుండి మొదలై కాటారం మండలం దామరకుంట వద్ద
గోదావరిలో సంగమించే మానేరు నది జిల్లాలోని 40 మండలాలకు పరీవాహక ప్రాంతమైన జీవనదీ.
ఆ జీవనదికి జీవగర్రలు ఈ బండల కొండలు.
గ్రానైట్ క్వారీల వలన ఎత్తైన గుట్టల స్తానమ్ లో బండలు పెకిలించబడ్డ బొందలతో ఊర్ల చుట్టూ
పగులగొట్టబడిన రాళ్ళు,మట్టి దిబ్బలు,వెలసి వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి
భూములన్నీ ఏడార్లుగా మారే ప్రమాదం ఉంది. క్వారీల బ్లాస్టింగుల మూలంగా ఎగసిపడే రాళ్ళు,
దుమ్ముతో ... ఉన్న పంటలు పర-పరాగ సంపర్కానికి దూరమై, వరి, మామిడి, నిమ్మ, మక్కా,
కూరగాయతోటలన్ని నాశనమై పోతాయి. గందకం కర్బండయాక్సైడ్ సిలికాన్ అణువులు గాలిని
సాంధ్రీకరించడం వలన సిలికోసిస్, బాంక్రయిట్స్ వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉంది. అలాగే
లక్షల ఏండ్ల నుండి కొండల ఉపరితలాలు గాలికి సూర్య రశ్మికి ఎక్స్పోస్ కావడం వలన రేడియో
ధార్మిక శక్తిని ఎమిషన్ చేసి వదిలించుకున్నాయి కానీ ఇప్పుడు నూతనంగా కొండలను
పగలేసినందున బండల్లో ఇమిడియున్న యురేనియామ్ ,థోరియం లాంటి మూలకాలు సూర్య
రశ్మికి ,గాలిలో ఉన్న వివిధ వాయువులతో ఎక్స్పోజ్ అయ్యి రేడియో ధార్మిక కిరణాలను విడుదల
చేయడం వలన కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంటుంది.
కర్ణాకర్ణిగా ఈ విషయాలన్నీ తెలుసుకున్న ప్రజలు గ్రామం లో సర్పంచును నిలదీశారు.
గ్రామానికి సంబంధించి ఏ విషయమైనా గ్రామం లో డప్పు చాటింపు వేయించి గ్రామ సభ పెట్టి
ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పంచాయత్ రాజ్ చట్టం లో చెప్పబడింది.అలాంటిదేమీ
లేకుండానే గ్రానైట్ క్వారి గుత్తేదారులు బహూకరించిన పర్సులతో సంతృప్తి చెందిన గ్రామ పరి-
పాలన యంత్రాంగం అనుమతి ఇచ్చింది. గ్రామ పంచాయితీ తీర్మానం చట్ట ప్రకారం జరిగిందా లేదా
అని పరిశీలించి పైకి పంపవల్సిన తహసిల్దార్ తన వాటా తనకు ముట్టగానే పైకి పంపించారు.
ఇలా ఎవరి వాటాలు వారు తీసుకొని మానవ మనుగడనే అపహాస్యం పాలు చేస్తున్నారు.
గ్రానైట్ క్వారికి వ్యతిరేకంగా ఆగస్టు 16 నాడు జిల్లా చరిత్రలోనే ప్రప్రథమంగా రెండు వేల మంది
మహిలలతో కలక్టరేటును ముట్టడించి మెమోరాండం సమర్పించినారు.మానకొండూరు శాసన
సభ్యులు ఆరేపల్లి మోహన్కు మెమోరాండం ఇచ్చారు.అభివృధిని అడ్డుకోగూడదని ఉచిత సలహా
ఇచ్చారు, జిల్లా కలెక్టర్ ను కలువడానికి గ్రామస్తులు రెండు సార్లు వచ్చిన వారికి ఇంటర్వ్యూ
లభించ లేదు. సెప్టెంబర్ 9 నాడు స్టానికేతరురాలైన మనకొండూరు తహసిల్దార్ అన్నారంలో
గ్రామ సభ పెట్టింది. ప్రజలు గ్రానైట్ క్వారి గురించి ఆమెను నిలదీస్తే ధిక్కారమున్ సైతునా అని
తలచిన సీమాంద్ర అధికారిణి చిత్తు కాగితాలు ఏరుకొనే మాదిగ ముండలు నన్ను ప్రశ్నించే
వారయ్యరా అని కులం పేరుతో దూషించింది. కోపోద్రికులైన మహిళలు తహసిల్దారును గ్రామ
పంచాయితీ గదిలోకి నెట్టి తలుపులు వేశారు. సరే... పోలీసులు వచ్చి విడుపించుక పోయారుగానీ
ప్రభుత్వాధికారిని విధులకు ఆటంకం కలిగించారని తెల్లవారి సెప్టెంబర్ 10 నాడు ఆరుగురిని అరెస్ట్
చేసి తీసుకు వెళ్లారు. కులం పేరుతో దూషించిన సీమాంధ్ర అధికారిణి పై కేసేందుకు పెట్టరు అని
ఐదు వందల మంది మహిళలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే గాని ఎస్సై స్పందించ లేదు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణకని సెప్టెంబర్ 11 నాడు అన్నారం వెళ్లిన ఎస్సై గ్రామస్తులను
తీవ్రంగా బెదిరించి వచ్చారు.
గ్రామ సభ కొరకు డప్పుచాటింపు చేయకుండా గ్రామస్తులకు మాటమాత్రం చెప్పకుండా
గ్రామసభ పెట్టకుండానే తీర్మానం రాసి పంపిన సర్పంచ్ పైనా కేసు ఉండదు, ఆ కాగితాలు పరిశీలించ
చకుండా చేతులు తడిపిన పుణ్యానికి పంటలను పశువులను పర్యావరణాన్ని ప్రజల ఆయుర్-
ఆరోగ్యాలను ధ్వంసం చేయడానికి సిఫారసు చేయడం తో బాటుగా కులం పేరుతో దూషించిన
తహసిల్దార్ పై ఏ చేర్యా ఉండదు. ఎక్కడినుండో వచ్చి ఇక్కడి సంపదను మరెక్కడికో తరలించుక
పోతూ ఇక్కడి ప్రజలను వనరులను కొల్లగొట్టుక పోతున్న గ్రానైట్ గుత్తేదారులపై ఏ కేసు ఉండదు,
రాజ్యాంగ కల్పించిన అవకాశం మేరకు శాసనా సభ్యుడుగా ఎన్నికై ఈ ప్రజల ప్రయోజనాలకు
కట్టు బడి ఉంటానని దాని పైనే ప్రమాణంచేసి గద్దెనెక్కి .,ఆ ప్రజల బ్రతుకులను బండలు చేస్తున్న
విధ్వంసకులైన క్వారి యజమానులకు దన్నుగా నిలిచిన స్టానిక ఎమ్మెల్లే పైన ఏ కేసు ఉండదు
ప్రజాభిప్రాయ సేకరణ జరుగకుండానే డిసాస్టర్ మేనేజ్మెంటుకూ అవసరమైన చర్యలేమీ గైకొన
కుండానే అనుమతి మంజూరు చేసిన గనుల శాఖ అధికారుల పైన ఏ చర్యా ఉండదు. కానీ...
రేపటి తరాలకు అన్నం కోసం, అవసరాలకోసం , ఆరోగ్యాల కోసం తల్లడిల్లిన జనం ఇది తగదు
తగదు అంటే తన్ని కేసులు పెడుతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
ప్రజాస్వామ్యయుతంగా వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు, అధికారులను కలిశారు,
తీడితేనే తిరుగబడ్డారు. ప్రజాస్వామ్యయుత పోరాటాలకు ,పరిష్కారాలకు ఈ ఎల్లక్షన్ల డెమోక్రసీ
స్కోప్ ఇవ్వకుంటే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారని కేంద్ర గృహ మంత్రి
చిదంబరం ఏడాది క్రితమే చెప్పినాడు.
రాజ్యం , ఓపెన్ కాస్టులు అంటది,, ఇనుప ఖనిజాలు అంటది , గ్రానైట్ క్వారీలు అంటది, అదే
అభివృద్ధి అంటున్నది. మాకు అన్నం పెట్టె మన్నును తవ్వోద్దంటే మర్ల బడుతార అని తుపాకీ
తీస్తున్నది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వలెనే ఈ నాటికి అదే పద్దతి అవలంభిస్తున్న ఈ సర్కారు
ప్రజలనుండి... ప్రజలకొరకూ.. అని చెప్పుకుంటే ప్రజలు ఇంకా ఎంతో కాలంనమ్మరు , సహించరు.

చెట్లు-గుట్టలు-అవే రేపటికి మన జాడలు !

అన్నారం ఒక చిన్న గ్రామం. చుట్టూ లక్షల సంవస్తారాల నుండి ఆ భూమి పైన జరుగుతున్న
మార్పులను వెయిల సంవస్తారాలనుండి మనుషుల ఆరాట పోరాటాలను గమనిస్తూ గమ్యం
చూపుతున్న పెద్ద పెద్ద నల్లటి బండసరం రాళ్లతో మోదుగ,తునికి,సీతాఫలం,ఉండ్రుగ,వేప చెట్లతో
పచ్చని ఎత్తయిన గుట్టలు , ఆ గుట్టల నడుమ పాటగాడు చెప్పినట్టు భూమికి పచ్చని రంగేసి-
నట్టున్న పచ్చటి పంటపొలాలతో,పల్లె నిజంగానే పాడిపంటల పల్లెసీమే. కరీంనగర్ జిల్లా కేంద్రానికి
సమీపాన ఉండటంతో ఆధునిక వ్యవసాయ పద్దతులు,అక్షరాస్యత,చేతివృత్తులు,అందరికీ చేతి
నిండా పని.
ఉన్నట్టుండి మూడు నెలల క్రితం ఆ వూళ్ళో గ్రానైట్ బాంబు పడింది.ఊరికి ఉత్తరాన ఉన్న ఊర-
గుంట, నాగులమ్మ గుట్టల్లో బ్లాస్టింగ్ చప్పుళ్ళతో ఊరు ఉలిక్కి పడ్డది. సంగతేందని ఆరదీసింది.
కొందరు సంపన్నులైన గుత్తేదార్లు నాగులమ్మ గుట్ట, ఊరగుట్టలోని బండరాళ్లను తవ్వి తీసి
గ్రానైట్ గా మార్చి దేశవిదేశాలకు అమ్ముకోవడానికి అనుమతి తెచ్చుకున్నారని తెలిసింది.
ఆ గుట్టలతో మనకు వచ్చెదేంది పొయ్యేదీందని కొందరు అనడం తోటి అందరూ పెద్దగా ఏమీ
పట్టించుకోలేదు. పుట్టల్లోని చీమలు తెట్టెల్లోని తేనె చిన్నా చిన్న జీవరాసుల తింటూ ఇంతవర-
దాకా , పిల్లాపాపలతో గుట్టల దోనల్లో చీకు చింత లేకుండా జీవిస్తున్న గుడ్డేలుగులు బ్లాస్టింగు
బాంబింగులకు బెదిరి పోయి పట్టపగలే ఊరిమీద పడి దొరికిన వాల్లను దొరికినట్లు నోటితో కొరికి
పంజా తో గాయ పరిచి నాయి. కొరిజీవి మిగిలినా ,కండ్లు కాళ్ళు,చేతులు కోల్పోయిన వారి
గగ్గోలుకు స్పందించి దయార్ద్ర హృదయురాలయిన స్టానిక ఎస్ ఐ ఒక గుడ్డేలుగును తన సర్వీస్
రివాల్వర్ తో కాల్చి చంపి ప్రజల భయాలను పాటా పంచలు చేసింది. గుట్టల్లోని చెట్లలో స్వేచ్చగా
పురివిప్పి నాట్యమాడిన మయూరాలు భయం తో కాపాడుతారనుకొని గ్రామం లోకి వస్తే ఈకలు
పీకి తినగా మిగిలినవాటిని అభయారన్యానికి అప్పగించారు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న
పెద్దమనుషులు ఇంతటి తోనే ఏమయిందిరా కొడుకులాల? మనం ఇట్లానే నోరు మూసుకొని
ఊకుంటే ఈ జంతువుల పక్షుల్లాగే మనం కూడా ఈ పచ్చని పంట పొలాలను , మనలను
నిలబడనిచ్చిన నేలను , నీళ్ళు తాపిన చెర్లను , గుండెల నిండా గాలిని పీల్చుకొనిచ్చిన చెట్టు
చేమా పుట్టా బూసీని వదిలి పెట్టి పొట్ట చేత బట్టుకొని సెంచారం బోకటే ఉంటుందని చెప్పిండ్రు.
మిన్నిరిగి మీదబడే దాకా ఏదీ నమ్మని మన మేధోవంతులు అట్లేట్ల? అని ప్రశ్నించినారు .
సీతాఫలాలు సేకరించి అవసరార్థులకు ఇంతవరదాక అందజేసి పొట్టబోసుకున్న ముదిరాజ్
తెనుగు వాళ్లకు జీవనోపాధి పోతుంది. మేకలు,గొర్రెలు ,పశువులు, ఇకనుండి గుట్టల పయికి
పోయి మేయడానికి గడ్డి ఉండదు.మేత ఉండదు, పెండ , పిడుకలు ఉండవు, ఏరుకొని
తెచ్చుకోవడానికి గుట్టపైన కట్టెలు ఉండవు. ఇవన్నీ ఒక ఎత్తైతే వర్షపాతం తగ్గిపోయి చెరువులు
ఎండిపోయి బుగర్భజలం తగ్గిపోయి ఇంతవరదాక తేనెపట్టులాంటి పొలాలన్నీ బీడు భూములుగా
మారిపోనున్నాయని అందరికీ తెలిసేసరికి ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఉప్పెన లేచి నట్లయింది