Sunday, October 3, 2010

ప్రజల అమాయకత్వాన్నే ఆస్తులుగా మార్చుకుంటున్నారు.

ప్రజల అమాయకత్వాన్నే ఆస్తులుగా మలుచుకుంటున్నారు.
అది కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం బి బి రాజ్ పల్లి.చిన్న పల్లెటూరు, చుట్టూ గుట్టలు
ఉన్నందున ఆ పల్లెను గుట్టల పల్లె అని కూడా పిలుస్తారరట. ఈ పల్లెలో దాదాపు 400 ఇండ్లు
ఒక వేయి పై చిలుకు జనాభా ఉన్నారు. ఆ గ్రామానికి సర్పచు దాసరి లక్ష్మి, కానీ సర్పచు
ఎవరు అని అడిగితే మాత్రం అందరూ దాసరి లక్ష్మి భర్త శంకరయ్య అనే చెప్తున్నారు. గ్రామం లో
ఉన్న జనాభాను కమ్యూనిటీ పరంగా చూస్తే ఎక్కువ మంది దళితులు ఉన్నారు.
ఒక పెద్ద మనిషి ని వాకబు చేయగా ఈ ప్రణతమ్ లో శంకరపల్లే నుండి మ్యాడమ్ పెళ్ళి వరకు
ఉన్న దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న భూమి అంతా వెనుకత దొరలదే అని అన్నాడు.
ఈ గుట్టల మధ్యన అక్కడక్కడ వ్యవసాయానికి పనికి వచ్చే భూముల్లో దళితులు గుడిసెలు
వేసుకొని నివసించే వారని, గుట్టల పైన దొరికే సీతాఫలాలు, తేనె, వంట చెరుకు, తునికి,మోదుగ
ఆకుల సేకరణ, గొర్రె,మేకల,ఆవుల పెంపకం తో పొట్టపోసుకొనే వాల్లట. కానీ అరుగాలం పని దొరికే
వ్యవసాయం చేసుకోవడానికి తమకంటూ స్వంతంగా భూమి లేని కారణంగా ఇక అక్కడ ఎక్కువ
కాలం బతుకు కొనసాగించడం సాధ్యపడని భావించిన జనం అక్కడి నుండి వెళ్ళి పోవడానికి
సిద్ధ పడినట్లు చిప్పినారు. అయితే తెలంగాణ ప్రాంతం లో జరిగిన సాయుధ పోరాటం ఫలితంగా
ఆ ఉర్లన్నిటికి జాగీరుదారులైన తాండ్ర వంశస్టులైన వెలమదొరలకు అప్పటికే అక్కడ నివసిస్తున్న
దళితులకు ఆ భూములు పంచక తప్పని పరిస్తీతి ఎదురైంది అని స్థానిక హరిజన పెద్ద మనిషి
చెప్పినాడు. అప్పటి నుండి ఈ అరవై ఎండ్లుగా కస్టమో సుఖమో అందరూ ఒక్క చోట ఆ గుట్టల
మధ్యన వాళ్లంతా జీవిస్తున్నారు.
మూడు సంవస్తారాల క్రితం తమిళనాడు అధినాయకురాలు జయలలితా అనుచరుదనంటూ
అంబరీషన్ అనే వ్యాపార వేత్త ఒకరు వచ్చినారు. మీ భూములు మీకే ఉంటాయి ఇంకా కాదంటే
మేము ఈ భూముల్ల నుండి గ్రానైట్ అనే రాళ్ళు తీసివేసిన తర్వాత మీ భూములు ఇంకా చదును
అవుతాయి అని మాయా మాటలు చెప్పి ఒక్కో ఎకరా పదహారు వెయిల చొప్పున 22 సంవస్ట
రాలకు కౌలుకు రైంచుకొని పోయినాడు. కానీ అతడు క్వారి ప్రారంభించలేదు. ఇప్పుడు స్టానిక
నాయకులకు ఆ గుట్టల పైన కన్ను పడింది.
గ్రామం లో ప్రధానంగా ఉన్న గొల్లకురుమ కులస్తులకు 2000 వెయిలకు పైగా గొర్రెమేకలు
ఉన్నాయి. వాటిని మేపుకోవడానికి సీలింగు లోని మిగులు భూములను యాదవ సంగానికి
సీత ఫలాల సేకరణకు ముదిరాజ్ కులస్తులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఈ భూములను లబ్ది
దారులు అమ్ముకోవడానికి వీలు లేదు. ఈ గ్రామాలకు రెవెన్యూ గ్రామం అయిన ఇబ్రాహీం నగర్
పట్వారీ రాజేందర్ రావు ను పట్టుకున్నారు గ్రానైట్ బకాసురులు. మీరు ఈ భూముల్లో వ్యవసాయం
చేయడం లేదు కనుక ప్రభుత్వం మీ భూములను స్వాధీనం చేసుకోబోతున్నది, మీరు మాకు
ఈ భూములు వద్దు అనిగనుక సంతకాలు చేస్తే మీకు ఎకరా 70 వేల చొప్పున ఇప్పిస్తానని
రాజేందరావు తో చెప్పించారు.అమాయకులైన ముదిరాజ్ ,గొల్లలు సంతకాలు చేశారు. అలాగే
పట్టభూములకు ఎకరా లక్ష చొప్పున 22 ఏండ్లకు కౌలుకు రాయించుకున్నారు. రెపోమాపో
గ్రానైట్ క్వారి మొదయితే ఆ పచ్చదనం మచ్చుకు కూడా లేకుండా పోతుందనీ, వేసుకున్న
పంటలపైనా దుమ్ము కప్పికొని పోయి పుప్పొడి ఉండక వేసిన కంకులకు గింజలు రావని,
బ్లాస్టింగ్ చప్పుళ్ళకు గుట్టల పైన ఉన్న గుడ్డేలుగులు ఊళ్ళోకి వస్తాయని, సీతాఫలాలు ఇక
ఉండవని, భూమిలోని నీరు ఇంకి పోతుందని, పడవలసిన వానలు ఇకనుంది ఇక్కడ పడవని
ఆ భూమి ఇక నివాస యోగ్యం కాదని వాళ్ళకు తెలియదు. తెలిసి చెప్పవలసిన రాజకీయ
నాయకులు గానీ ప్రజలకు ట్రస్టీలు గా నిలువవలసిన అధికారులు గాని వాస్తవాలు ప్రజలకు
చెప్పకుండా అభివృద్ధి అంటే ఇదే అని అంటున్నారు

ప్రజల అమాయకత్వాన్నే ఆస్తులుగా మార్చుకుంటున్నాఋ