Sunday, November 28, 2010

ఆకసాయిపల్లే-అవతార్

ఆకసాయిపల్లి -అవతార్
ఆ భూముల్లో ఖనిజాలు ఉండడం అక్కడి ప్రజలకు శాపం అవుతున్నది.ఖనిజాలు,ఇందనాలు సహజ సంపదలు పరిమితంగా
ఉండి అపరిమితంగా వాడితే అంతరించి పోయే అవకాశం ఉన్న వనరులు.ఇట్టి వనరులు గటకొంత కాలంగా కాంట్రాక్టర్ల లాభాపేక్షకు బలి అయి
పోతున్నాయి.ఆ విషయం తెలియని వారికి ఏమీ తెలియదు కూడా కానీ తెలిసిన వారు కూడా మరి అభివృద్ధి జరుగాలంటే వనరులను వాడుకోకుంటే
ఎలా అనే ప్రశ్నిస్తున్నారు. వనరులను విచ్చలవిడిగా వాడుతున్నందున అలివిగాని వాయి,జల,ధ్వని కాలుష్యాలతో పర్యావరణానికి జరుగుతున్నా
విఘాతాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
అది కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రం లోని 15 వ వార్డు.ఈ ధర్మపురి గ్రామ పంచాయతీ లో ఆ 15 వ వార్డు పేరు ఆకసాయి పల్లె.
ఆ పల్లె పరిధిలో 10 కిలోమీటర్ల విస్తీర్ణం లో సున్నపు రాయి నిలువలు ఉన్నాయట. ఇకనేమీ మైనింగ్ కాంట్రాక్టర్ల దృస్తి పదనే పడ్డది. తాను సమ్
తృప్తీ చెందిన భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తన లేఖ సంక్య. 8125/ఏం.పి. ఎల్./08 ద్వారా సర్వే నంబర్ 145,146 లోని 52 హెక్టార్ల
భూమిని కేటాయించాలని రెవెన్యూ అధికారులకు రాశాడు.రెవెన్యూ అధికారులు సర్వే చేస్తుండగా ఆకసాయి పల్లె ఆడ బిడ్డలు,అడివి బిడ్డలు అడ్డుకున్నారు.
ఎవరి సర్వేలను కొనసాగా నివ్వమని కరాఖండి గా తెగేసి చెప్పినారు.సర్వే అధికారులను అక్కడనుండి ఆ ఆడ తల్లులు తరిమి వేసినారు.
ఆకసాయి పల్లెలో వారికి బుద్ధి తెలిసి నప్పటి నుండి ఆ నాయకపు కులం (shedul tribs)కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి.
దాదాపు 70 సంవస్తారాల వయసున్న రామేళ్ళ పోషమ్ లస్మక్క దంపతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు తమ తాత ముత్తాతలనుండి అదే
గ్రామం లో నివసిస్తున్నట్టు తెలిపినారు. తమ చిన్నతనం లో ఆ గుట్టల పైన ఉండే కట్టెలను కొట్టుకొని పోయి ధర్మపురిలో అమ్ముకొని
తమ పిల్లలను కుటుంబాలను పోషించుకొనేవారమని తెలిపినారు.మొట్ట మొదట అక్కడ కేవలం మూడు గుడిసెలు ఉందేవట .ప్రస్తుతం 200
కుటుంబాలు,600 జనాభా ఉన్నది.తూర్పు నుండి పడమరవైపునకు వాలి ఉన్న ఆ గుట్ట బోరు పైన వీళ్ళ ఇండ్లు ఉన్నాయి.ఇండ్ల చుట్టూ
దాదాపు 400ఏకరాలల్లో సేద్యం చేస్తున్నారు.100 ఏకరాలల్లో వారి,300 ఏకరాలల్లో ఇతర పంటలు పండించుకుంటున్నారు. నాయకపు
కులం లోని బద్ధి,గడ్డం,తాట్ల,రామిల్ల,మేకల,బట్టుపల్లి వంశస్తులు కుటుంబాలు ఉన్నాయి, వేరేకులం వాళ్ళు ఎవ్వరూ లేరు.ఈ ఊరుకి ఆకసాయి
పల్లె అని పేరు రావడానికి కారణం ఆకాశం నుండి కురిసే వాన ఆధారంగానే ఈ గడ్డ పైన పంటలు పండుతాయి. వర్షాకాలం లో వానలు
పడ్డతర్వాత ఇక వానలు పడక పోయినా ఇక్కడ పంటలు ఎండి పోవు. ఇక్కడి సేదిమెంటరీ శిలలు పడిన వాన చినుకులను తమలో
దాచుకొని నెమ్మదిగా., తడి ఆరిపోతున్నాకొద్ది నెల తల్లి గొంతును తడుపుతున్న సంగతిని మేము కళ్ళారా చూశాము.బెత్తెడు మందం
మట్టిని తొలగిస్తే తేమ కనిపిస్తున్నదక్కడ.వానచినుకులు పడగానే మక్కలు కందులు కలిపి పంట వేస్తారట, మక్క పంట అయిపోగానే బబ్బెర్లు
వేస్తారట.బబ్బెర పంట కోసుకొని పెసర లేదా కూర అలసంద వేస్తారట. ఎల్లిపాయలు,ఉల్లిగడ్డలు,ధనియాలు,పసుపు పండిస్తున్నారు,.
,వీటికి వెతికి కూడా వాళ్ళు ప్రత్యేకించి తడి పెట్టరాట. ఒక వైపు విదేశాలనుండి కందులు దిగిమతి చేసుకుంటూ ఇక్కడ మనకు కందులు
పండించి పెడుతున్న భూములనేమో తవ్వి వేస్తామంటే ఇదెక్కడి అబ్నివృద్ధి అని ఆకసాయి పల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గుట్టలు అంటే కేవలం బండలు మాత్రమే కాదు అవి. ఈ భూగోళానికి తాపం తీర్చే ఓవర్ హెడ్ టాంకులు, అవసరం వచ్చినప్పుడల్లా
నీటిని వాడుకోవడానికి ఉన్న భూగర్భ సంపులు అవి. మిగులు జలాలను చెరువులకు,బావులకు,కుంటలకు, నదులకు దానం
చేస్తున్న దానకర్నూలు ఈ గుట్టలు. విచక్షణా రహితంగా ఈ గుట్టలను ధ్వంసం చేసుకుంటే మనలను మనం చంపుకున్నట్టే.
ధర్మపురి వద్ద ఈ మధ్య కాలం లో గోదావరి చాలా సార్లు ఎండి పోయింది. కానీ ఆకసాయి పల్లెలోని బావి ఎండి పోలేదు సరికదా
ధర్మపురి వాసులకు దాహార్తిని తీర్చింది. ఆకసాయి గుట్ట పసుల పాపన్న గుట్ట,బొరె గుట్ట లల్లో విస్తారమైన సున్నపు రాయి ఖనిజం
ఉంది.మైనింగ్ కాంట్రాక్టర్ల మాయలోబడి ఖనిజాలను తవ్వుకోవడానికి అనుమతి ఇస్తే మాత్రం గోదావరి ఎండి పోవడం మాత్రమే గాదు
దాదాపు20 కిలోమీటర్ల రేడియస్ లో బూమంతా ఎడారిగా మారిపోయి మానవ మనుగదే ప్రశ్నార్థకం కానుంది.
నిరక్షరాస్యులైన గిరిజనులు చేస్తున్నపాటి పోరాటమైన మనం చేయకుంటే మన భావి తరాలకు మనం తీరని అన్యాయం
చేసి న వాళ్లం అవుతాము.