Monday, December 13, 2010

మీడియాలో అందరం చూస్తున్నాము. వాళ్ళ హోమ్ మినిస్టరే యేడాదికింద ప్రకటించిన కేసుల ఎత్తివేత అమలు చేయండి అంటే యెంత యాగీ చేస్తున్నారో చూస్తున్నాము.వంగవీటి మోహనరంగా,రాజీవ్ గాంధీ లు చంపబడ్డపుడు ఎన్ని గృహదహనాలు,ఎంత ఆస్తుల విధ్వంసం ,ఎన్ని బస్సుల కాల్చివేత, ఎన్ని ప్రైవేట్ ఆస్తులు బుగ్గిపాలు అయ్యింది మనం మర్చిపోలేదు ఇంకా.అందులో పాల్గొన్నవాళ్లు చాలా మంది గూండాలు,హంతక చరిత్ర ఉన్నవాళ్లే, అయిన గూడా రాజ్యానికి ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి చట్టాలను గురించి మాట్లాడే వాళ్ళకు ఏది గుర్తుకు రాలేదు.తమ వర్గం,తమ కులం వాళ్ళ పైన కేసులు ఎత్తివేస్తే ఆయా సర్కారులను వీళ్ళు పల్లెత్తు మాట అనలేదు సరికదా అభినందించిన వాళ్ళే వీళ్ళంతా.అది ఎంత చట్టవ్యతిరేకమయింది అయిన కానివ్వండి ఎంత అమానవీయమైంది అయినా కానివ్వండి తమ రాజకీయాలను ఆమోదించే వాళ్లెనా,తమ అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లెనా అయితే ఏ కేసులు ఉండవు .వై ఎస్సార్ బాడీ గార్డ్ సూరీడు రాజీవ్ విద్యామిస్సిన్ లోని కోట్లాది రూపాయలను పసి పిల్లలకు దక్కవలసినవి వాళ్ళ విద్యావసరాలు తీర్చ వలసిన సొమ్ము అప్పనంగా బొక్కి కూర్చుంటే సూర్యనారాయణ మీదగాని ఆయన ఉంపుడుగత్తెమీద గాని ఏ కేసులు ఉండవు.
రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కులను కలరాస్తున్న వేల కడుపు మండిన యువత రాజ్యాంగం లో ఉన్న అవకాశాల మేరకే ఉద్యమిస్తే 307 హత్యా ప్రయత్నం కేసులు పెట్టి తీవ్రమయిన నేరాలకు పాల్పద్దవారిని ఎలా విడిచి పెడుతాము అని ఒక హోమ్ మంత్రి అన్నా ఒక j p అన్నా తెలంగాణ ప్రజలు ఎలా సాహిస్తారు అన్న కనీస ఇంగిత జ్ఞానం లేని రాజ్యం ఆ రాజ్యాన్ని సమర్థిస్తున్న తెలంగాణ శాసన సభ్యులను తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం క్షమించరు.
కానీ అధికార పీఠం పయిన కూర్చున్న పెద్దలకు ప్రజల అభిప్రాయాలతో ఏమీ సంబంధం లేనట్లుగానే వాల్లు ప్రవర్తిస్తున్నారు. అది అరిస్టాటిల్ చెప్పింది అయినా అంబేడ్కర్ చెప్పింది అయినా ప్రజల అభీస్టమ్ మేరకే పరిపాలన సాగాలి.కానీ ఏమి జరుగుతున్నదో చూస్తున్నాము, వాళ్ళ వాళ్ళ రాజకీయాలకు ఇబ్బన్దులు గానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బందులు గాని జరుగనంత వరకు ప్రజలు ఎంత అరిచి గీ పెట్టిన రాజ్యం పట్టించుకోవడం లేదు అనేది మనం ప్రత్యక్షంగా చాలా చాలా విషయాలల్లో చూస్తున్నాము. అది హైద్రాబాద్ చుట్టుపక్కల భూముల కుంభకోణం గాని సెజ్జులు గాని,జలయజ్ఞం గాని, ఘనుల కుంభకోణం గాని, k v p కొండ సురేఖ పంచాయితీ గాని బోఫోర్స్ కుంభకోణం నుండి బొగ్గుల వాగు ఓపన్ కాస్ట్ కుంభకోణం దాకా అన్నింటిలో ఒకటే ధోరిని అవలంభిస్తున్నారు.
తెలంగాణ విషయం లో కూడా వాళ్ళ రాజకీయ అవసరాలకోసం అప్పుడప్పుడు అది కాంగ్రెస్ కానివ్వండి తెలుగు దేశం కానివ్వండి,ప్రజారాజ్యం కానివ్వండి,రేపు జగన్ పార్టీ కానివ్వండి తెలంగాణ అంటున్నారు, అంటూనే ఉంటారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తమ బలమయిన ఆకాంక్ష ను అనేక సార్లు చాలా స్పస్టంగా kcr మాటల ప్రకారం దిమ్మ దిరిగి పోయేలా చెప్పినారు.TRS చెప్తున్నట్లు రేపు 16 డిసెంబర్ నాడు 25 లక్షల మంది తో ప్రదర్శన్ చేస్తే ఈ గుడ్డి సర్కారుకు జ్ఞానోదయం అయ్యేది కొత్తగా ఏమీ ఉండది అనేది జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారికి అందిరికి సులభంగానే అర్థం అవుతున్నది.ప్రజల అభిప్రాయం ఏమిటో ఇప్పటికే చాలా స్పస్టంగా ప్రజలు పదే పదే చెప్పినారు.బలప్రదర్శన కూడా ఇప్పటికే అనేకసార్లు జరిగింది. కొత్తగా ఈ బల ప్రదర్శనతోటి అదనంగా జరిగేది,ఒరిగేది ఏమీ లేదు.ఖర్చూ కాలయాపన దప్ప .
ఆనాడు బ్రిటిష్ సర్కారును ఎదురించడానికి ఏ సహాయ నిరాకరణ అయితే చేపట్టినామో ఇప్పుడు కూడా పోరాడుటము, ఉద్యమిస్తాము అని చెప్పే శక్తులు,శ్రేణులు, రాజకీయ పార్టీలు,ఒక చంద్రబాబు, ఒక లగడపాటి, ఒక జగన్మోహన రెడ్డి, ఒక కావూరి, ఒక సుబ్బిరామి రెడ్డి, ఒక రామోజీ, ఒక మోహన్ బాబు, ఒక చిరంజీవి, ఒక మురలి మోహన్,ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరైతే తెలంగాణ కు వ్యతిరేకంగా పనిజేస్తూ తెలంగాననే మార్కెట్ గా సొమ్ముజేసుకుంటున్నారో వాళ్లందరి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా ప్రణాళికలు వేసుకొని అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది తప్ప ఇక ఈ మీటింగులు చాటింగులతో ప్రయోజనం ఉండదు, అసలే ఉండడా అంటే ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఓట్లు, సీట్ల ప్రయోజనం ఉంటుంది ,తెలంగాణ వచ్చినా మంచిదే రాకున్నా మంచిదే రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ పేరుతో మాకిన్ని ఒట్లూ,మా వెంట తురుగుతున్నవాళ్లకు కొన్ని సీట్లు దక్కితే చాలా సంతోషం అనుకునే వాళ్ళు చేసే జిమ్మీక్కులు ఇంకా ఎంతో కాలం జనం నమ్మరు,
ఇప్పటికయినా ప్రత్యక్ష పోరాటానికి ఉద్యమ శక్తులు పిలుపునివ్వాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇంకా ఇప్పటికీ జరుగుతున్న ఆత్మహత్యలే. సీరియస్ పోరాటాలు ఉంటే ఆత్మహత్యలు ఉండవు.

Sunday, December 5, 2010

చల్గల్ గడి -గుడి గా మారుస్తామంటున్న ప్రజలు.

తెలంగాణలో గడీలు ఆనాడు నిర్భందాలకు నిలయాలు. దొరలమాటలను,అధికారాలను ధిక్కరించడం కాదుగాదా కేవలం ప్రశ్నించినా కూడా పాపమే అయినరోజులను ఈ నాడు పాడుపడిన గడిల శిథిలాలలో ప్రజలు నెమరు వేసుకుంటున్నారు.అది కరీంనగర్ జిల్లా
ఈ జిల్లాలో మొత్తం 7 గడీలు ఉన్నాయి.బండలింగాపూర్,భీమారం,చల్గల్,ఇటిక్యాల,నేరెళ్ళ,రాజారం,మద్దునూర్ లల్లో ఈ గడీలు ఉన్నాయి.1978 లో జగిత్యాల జైత్రయాత్ర నాటికి ఈ గదీలన్నీ దాదాపుగా తామరాజశాన్ని కొనసాగిస్తూ ఉన్నెవే.ప్రజల చైతన్యాన్ని అంచనా వేసిన కొందరు తెలివైన దొరలు గడీలని విడిచి హైద్రాబాద్ లాంటి చోట భూములు కొనుక్కొని పారిశ్రామిక వేత్తలుగా తమ రూపాలను మార్చుకున్నారు.కేవలం ప్రజలతో ఘర్షణ పడి గడి విడిచింది కేవలం మద్దునూరి రాజేశ్వరావు దొర మాత్రమే.దొరలు గడీలను విడిచి పట్టణాలకు పోయినా గడీలను మాత్రం అమ్మకుండా గడీ పాలనలోని వ్యవసాయ భూములను మాత్రం అమ్ముకొన్నారు.దొరలు అమ్ముకున్న ఆ భూములతోనే పట్నం లో లింగాపుర్భావనమ్(హిమాయత్నగర్)నేరెళ్ళబాపూది నేరెళ్ళ భవనం.ఇంకా అనేక పరిశ్రమలు స్టాపించుకోవడానికి ఇక్కడి గడిల భూములన్నీ ఇందనం అయినాయి.

ఈ గడిల అమ్మకం మాత్రం కేవలం 5 సంవస్తారాలనుండి ప్రారంభం అయింది.ఇప్పటికే నేరెళ్ళగడి పూర్తిగా అమ్మితే రాజారం గడి మాత్రం పాక్షికంగా అమ్ముకుంటే ఇటిక్యాల గడిని సత్యనారాయణ రావు దొర వారసులు ఊరికి ఉచితంగానే వదిలి పెట్టినారు.కానీ జగిత్యాల పక్కనే ఉన్న చెలగాల్ గడిని దొరవరసులు ఒక కోటి డెబ్బై లక్షలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నట్లు ప్రజలకు తెల్సిందట.

నిజాం నవాబుల పాలన రాజుతోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ఒక గడి,జగిత్యాల పట్టణం లో ఒక టవర్ గడియారం నిర్మించాలని కోరినారాట .ఆనాటి చల్గల్ దొర జువ్వాడి ధర్మ జగపతి రావు నిజాము ప్రభువు కోరిన విధంగా ఆ నిర్మాణాలు చేస్తూనే చల్గల్ లో కూడా తనకంటూ ఒక గడి నిర్మించుకున్నాడట.ఈ జువ్వాడి జగపతి రావు ధర్మపురి మండలం లోని తిమ్మాపూర్ అనే గ్రామం నుండి చేల్గల్ కు ఇల్లరికం వచ్చినాడట. ఈయన కరుడుగట్టిన దోరే అయిన ఈయనకు ధర్మ జగపతి రావు అనే పేరు ఎందుకు వచ్చిందట అంటే ఈ దొర దర్శనానికి వచ్చే సామాన్యులకు అప్పుడప్పుడు దర్శనం ఇచ్చే వాడట. ఇతని దర్శనం కోసం జనం రోజుల తరబడి గడి ముందు వేచి ఉండే వారట. దొర బయటికి వచ్చినప్పుడు దర్శనం కోసం వేచి ఉన్న ప్రజలకు తల ఒక పైసా దానం ఇచ్చే వాడట. ఆ పైసా దానం చేసినందుకే ప్రజ్లలు ఎంతో దాతృత్వం తో ధర్మ ప్రభువు అనే బిరుదాన్ని అయంకు దానం చేశారు.ధర్మ జగపతిర రావు కొడుకు రాజగోపాల రావు.గడిపై ఇతని పేరే ఉంది.రాజగోపాల రావు కొడుకులు కృష్ణ భూపాల రావు,డా.రాంభూపాల రావు.రాంభూపాల రావు హైద్రాబాద్ లోని సత్య కిడ్నీ సెంటర్ యజమాని,ఆయన మరణాంతరం ఆయన కూతురు సత్య కిడ్నీ సెంటర్ చూసుకుంటున్నది.కృష్ణ భూపాల రావు మాత్రం జీవించి ఉన్నాడు.ఇతనికి ఇద్దరు బిడ్డలు. ప్రస్తుతం కృష్ణ భూపాల రావు గడిని అమ్మకానికి పెట్టినాడు.

ప్రజల వాదన ఏమంటే గడికి చెందిన 700 ఎకరాల సస్యశ్యామల మైన భూములను అమ్ముకుంటే మేమి అడ్డం తిరుగలేదు.మారెక్కల కస్టమ్ తో కట్టబడిన ఈ గడిని మేమే కంటికి రెప్పల ఇన్నాళ్ళు కాపాడుకున్నాము ఈ గడి ని గ్రామానికి విడిచి పెడితే దొరకు ఏమి నస్టమ్ అంటున్నారు. కానీ దొర అది మా ఆస్తి మేము ఎందుకు వదిలి పెడుతము అని అమ్మకానికి పెట్టినాడు.ఏమి దైవ మాయోగాని రియాయల్టర్లు భూమిని చదును చేస్తుంటే అందులోనుండి పురాతన శిల్పాలు,విగ్రహాలు తవ్వకాల్లో నుండి బయట పడ్డాయి,ఇంకేముంది ప్రజలంతా గడిని గుడి గా మారుద్దామ్ అంటూ ఏక కంటమ్ తో ఉన్నారు.రియల్టర్ దొరకు ఫిర్యాదు అయ్యాడు.దొర పోలీసు బలగాలతోనవంబర్ 5నా చల్గల్ కు వచ్చినాడు.దొర కారు కూడా దిగకుండానే ప్రజలంతా ఆయన్ని అడ్డుకున్నారు.గడిని అమ్మేది లేదని ఖరఖండిగా తెగేసి చెప్పినారు.తోపులాట జరిగింది.పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రజలు తమ చేతికి అందిన రాళ్ళు రప్పలతో పోలీసులపైనా తిరుగుబాటు చేస్తూ తమ పైన లాఠీ చార్జ్ చేసిన పోలీసులను ఒక కిలోమేటర్ దూరం తరిమి వేసినారు. తర్వాత పోలీసులు గాల్లోకు ఫైరింగ్ చేసినారు.ప్రజలు అప్పటికి చెల్లాచెదురు అయినారు కానీ తెల్లవారి గడీ మొత్తం గ్రామస్తులచే నిండి పోయింది.గడి ప్రస్తుతం ప్రజల అధీనం లో ఉంది.

ఈ గడిలు ఉన్న ప్రతి గ్రామం లోని ప్రజలు అంటున్నదేమిటంటే మేము గత 50 సంవస్తారాలుగా ఈ దొరలు అమ్ముతున్నా భూములు కొనడానికే మా రెక్కల కస్టమ్ అంతా ధరబోస్తున్నాము.మంచి బట్ట కట్టింది లేదు మంచి బువ్వ తిన్నది లేదు. అన్నాడు మాతాతలు,అయ్యలు దొరల వద్ద వెట్టి చాకిరు చేసి బతికితే మేము ఇప్పుడు ఆ దొరల భూములు కొనుక్కోవడానికి మా రెండు తరాల కుటుంబాలు అరువ చాకిరీ చేసి వాళ్ళ పెట్టుబడులు మరింతగా పెంచుకోవడానికి మేము మరింత చాకిరీ చేయ వలసి వస్తున్నదని వాపోతున్నారు.

భూమా,పెట్టుబడా ఎడైతే ఏమి అది పెరుగడానికి మానవ శ్రమే ఆధారం అనేది చల్గల్ ప్రజలు మరోసారి ప్రపంచ ప్రజల దృస్టికి తీసుకొనే వచ్చినారు.