Thursday, December 15, 2011

bhajan--poraataalu.

పొట్టి శ్రీరాములు మరణించింది 16,డిసెంబర్ 1952. మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆయన దీక్ష చేసిండు.
ఆయన చనిపోయే నాటికి హైద్రాబాద్ ఒక రాష్ట్రామ్గా నాలుగు సంవస్తారాల నుండి ఉంటున్నది. హైద్రాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపాలి అన్నదే ఆయన డిమాండ్ కాదు.
మద్రాసీలు ఆంధ్రుల ప్రయోజనాలను కొల్లగుడుతున్నారు కనుక మేము మదరాసీలతో కలసి ఉండలేము మాకు మేము విడిగా ఉంటాము అంతే గాకుండా మద్రాస్ ను
ఆంధ్రులకే రాజధానిగా ఉంచాలన్నది ఆయన డిమాండ్. తెలంగాణ వాదులు నెత్తి నోరూ కొట్టుకొని చెబుతున్నా సమైక్య వాదులు పాపం ఆయనను తమ వాదానికి, మరియు
సమైక్యాంధ్ర ప్రదేశ్ కు నవంబర్,1 1956 తో ఆయన త్యాగాన్ని ముడిబేడుతున్నారు కనుకనే తెలంగాణ వాదులు పొట్టి శ్రీరాములు మరాన్ని, ఆయన త్యాగాన్ని మాతో ఎందుకు
పారాయణం చేపిస్తున్నారని అభ్యంతర పెడుతున్నారే తప్ప ఆయన త్యాగాన్ని తక్కువ చేయడం లేదు, సరి గదా ఆయన ఆశయం మేరకు పీడకులనుండి పీడితులను
విడిపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు.
అయితే తెలంగాణ ప్రాంతం లోని ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఏవాదన ఎట్లాఉన్నా అతడు మా వాడు కనుక మేము ఆయన్ని స్మరించుకుంటామ్ అని పూలమాలలు
వేస్తున్నారు. అది వాళ్ళ గొప్ప మనుసును, ఎవరు త్యాగం జేసినా వారిని మేము గౌరవిస్తాము అనే తెలంగాణ ప్రజల సంస్కారాన్ని తెలియజేస్తున్నది. కానీ సమైక్య
వాదం పేరుతో దోపిడి చేయాలని చూస్తున్న వర్గాలు మాత్రం ఆడిగదిగో చూడండి తెలంగాణలో ఎంతమంది సమైక్య వాదాన్ని సమర్తిస్తున్నారో అంటూ తోకతెగిన నక్కల్లా
అరుస్తున్నారు.
ఇదే సందర్భం లో రైతుల సమస్యలు అంటూ చంరబాబు త్లంగాణలో పర్యటిస్తున్నాడు. 2004 ఎన్నికల్లో ప్రేత్యేక తెలంగాణ వాదాన్ని వ్యతిరేకింస్తూ ఎన్నికల్లో పోటీ చేసి
ఘోరంగా ఓడిపోయిన సంగతి గుణపాఠంగా తీసుకొని 2009 ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని నెత్తికి ఎత్తుకొని అధికారం కైవసం చేసికోవడానికి మరో ప్రయత్నం
చేసిండు. కానీ అతని పాలన లో జరిగిన ప్రజా వ్యతిరేక చర్యలను అప్పటికి ఇంకా మరిచిపోని ప్రజలు మరో సారి ఆయన్ను తిరస్కరించినారు. 7 డిసంబర్ 2009 లో
అసెంబ్లీలో తెలంగాణ బిల్లు మీరు పెడుతార మమ్ముల పెట్టుమంటారా అని బీరాలు పలికి తీరా 9 డిసంబర్ ప్రకటన రాగానే తానే ముందుండి కాంగ్రెస్, ప్రజారాజ్యమ ,
తెలుగుదేశం పార్టీలు అన్నిటితో ఆంధ్ర ప్రాంతం లో అంధోలన చేసి తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి ఇవ్వాళ నేను తెలంగాణకు వ్యతిరేకం కాను అంటూ తెలంగాణ ఓట్లను
తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ లోని తెలుగు దేశం నాయకులు ఆయన భజన చేస్తూ ఆయన ఫోటోల ఫ్లెక్షీలు కడుతూ తెలంగాణకు అడ్డుతగిలిన
బాబుకు నిస్సిగ్గుగా రక్షణ కావచ్చాలుగా నిలిచి తెలంగాణ ప్రజల గుండెలు ఆవిసేలా ప్రవర్తిస్తున్నారు.
అలాగే జగన్ భజన పరులు జగన్ ఫ్లెక్షీలు పెడుతూ జగన్ ను కూడా తెలంగాణ లోకి ఆహ్వానించే దానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే కిరణ్ కుమార్ ను
రచ్చబండ పేరుతో ఇప్పటికే రెడ్ కార్పెట్ పర్చి ఆహ్వానం పలికిన సంగతి తెలంగాణ ప్రజలు చూసియే ఉన్నారు.
అసలు తెలంగాణ రాజకీయ నాయకులు ఇట్లా వెన్నెముక లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నట్లో చూడాల్సి ఉంది. ఇటు తెలంగాణ ప్రజలు అన్నివిధాల నస్టపోతున్నా స్వయంగా
రాజకీయంగా తాముకూడా ప్రజల్లో ఘోరంగా అపఖ్యాతి పాలవుతున్నా కూడా తెలంగాణ రాజ్కీయ నాయకులు ఆంధ్ర పాలక వర్గాలకు ఎందుకు దాసోహం అంటున్నారు?
కేవలం తాము , తమ పూర్వీకులు ఏండ్లతరబడి ఫూడల్ ఏలుబడిలో ఇన్నందుకేనా లేక అంతా కంటే మిక్కిలి అయిన ప్రయోజనం ఏదైనా ఉందా అనుకుంటే తాము
సాధికారత సాధించే అవకాశం ఉంది కూడా బానిస మనస్తత్వం తో కేవలం సులభ పద్దతిన డబ్బు అధికారం సాధించుకోవాలన్న అత్యాశతో మాత్రమే తెలంగాణ రాజకీయ
నాయకులు దాబ్బులకు అధికారానికి అమ్ముడు పోతున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు ఒక మహోన్నతమైన లక్షణం ఉంది, ఎన్ని సార్లు పడిపోయినా పీయూష పక్షుల
వలె పైకి లేచి పోరాటం చేస్తూనే ఉంటారు. అది తెలిసే పీడకులకు భయం, అది ఉన్నది కనుకనే దాని పెరుచెప్పుకొని సొమ్ముచేసుకుంటున్నవాళ్ల భరోసా!
కనుక తెలంగాణ ప్రజలు తమ బలాన్ని, బలహీనతలనూ గమనిస్తూ పీడకులని ఓడించే పోరాటాలు చేస్తూనే ఉంటారు. అదే చరిత్ర చెప్తున్నా సత్యం.
వీరగొని పెంటయ్య

Thursday, November 10, 2011

సామాజిక తెలంగాణ అవసరమా ఇప్పుడు?

మొదటి SRC రిపోర్ట్ హైద్రాబాద్ ప్రావిన్స్ ను యథాతథంగా కొనసాగించాలని చెప్పినా గూడా సీమాంధ్ర వాళ్ళ రాజధాని సమస్య తేలనందున కర్నూలు డేరాలల్లా

రాష్ట్ర రాజధాని కొనసాగించడం కష్టతరమై ఆనాటి నుండే లాబీయింగ్ లో ఆరితేరిన సీమాంధ్రులు అమ్ముడుపోయే నాయకత్వం తెలంగాణ లో ఉన్న ఖర్మానికి గోరేటి వెంకన్న

పాటలో చెప్పినట్టు సల్లంగా వచ్చి పట్నం లో పరుచుకొనే కుసున్న నాటి నుండే మేం వీళ్లతో కలిసి ఉండలేమన్న వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఆలాంటి ఉద్యమాలను

కాష్ చేసుకొనే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అయినా పోరాటాలు చేస్తున్న వాళ్ళు మొక్కవోని ధైర్యం తో పోరాటాలు చేస్తున్నారు అమాయకులైన కొందరు యువకులు

ద్రోహులను దొరుకబట్టి చంపే ధైర్యం లేక వాళ్ళను వాళ్ళే అంతం జేసుకుంటున్నారు . ఆ శవాల మీద ప్రమాణం జేసిన నీతి లేని నేతలు వాళ్ళ చావుల పునాదిగా పదవులను

పదిలం జేసుకొనే వాళ్ళు కొందరయితే కొత్తగా పదవులను పొందే వాళ్ళు మరికొందరు దళారీలు బొందకాడి నక్కల లెక్క నక్కి నక్కి జూస్తున్నారు . నంగి నంగి మాట్లాడు

తున్నారు. ప్రజలు అందరినీ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకులేవ్వరో, తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళకు అమ్ముడు పోతున్న

దెవ్వరో , ఉద్యమాన్నీ కుదువబెట్టుకొని నెత్తుటి కూడు తెంతున్నదేవ్వరో ఎవరు ఏందో ప్రజలు చాలా జాగ్రత్తగానే గమనిస్తున్నారు.

1956 నుండి అసమ్మతి గళం వినిపిస్తున్న తెలంగాణ ప్రజలు 1969 లో చెన్నారెడ్డి ద్రోహం నాటికి 370 మందిని కాంగ్రెస్స్ ప్రభుత్వం కాల్పుల్లో చంపి వేస్తే అలా అణిచి

వేయబడ్డ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించిన యువత కేవలం ప్రాంతీయ అసమానతలు మార్చడం మాత్రమే గాకుండా ప్రజల మధ్యనున్న మొత్తంగా అసమానతలను

తోలింగించాలన్న లక్షమ్ తో ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ఉద్యామిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. 1969 లో పడిలేచిన ఉద్యమం వరంగల్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ

జనసభ నేతృత్వం లో చంద్రబాబు ప్రభుత్వం లో మరో సారి కండ్లురిమి లేచింది, కానీ బాబు ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని ఎంతక్రూరంగా అణిచి వేసిందో బెల్లి లలిత దేహం

ముక్కలు ముక్కలు గా నరుక బడిన తీరు చెప్తుంది( ఇప్పుడు మేము సైతం తెలంగాణ అంటూ పాటబాడుతున్న రెండుకండ్ల తెలుగు లీడర్లు ఏమి జవాబు చెప్తారో మరి)

2000 నుండి 2009 వరకు చుక్క రక్తం చింద కుండ ఏ ఒక్కరూ రోడ్డు పైకి రాకుండా తెలంగాణ తెస్తామన్న ఎన్నికల ఉద్యమ కారులు కడకు సకల జనులను రోడ్డు

మీదికి పిలువక తప్పలేదు. పసి పిల్లల నుండి పండు ముసలి వరకూ, గెజిటెడ్ ఆఫీసర్ల నుండీ రోజుకూలి జీతగాళ్ల వరకూ, వివిధ కులసంఘాలు, వృత్తి సంగాలు ,

విద్యార్థి ,కార్మిక, కర్షక సకల జనులు చారిత్రాత్మకంగా 43 రోజులు సమ్మె జేసినా అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించ లేదు. సరిగదా

ఆ పార్టీ గూడా తప్పించుకునే మాయమాటలే చేక్ప్పింది గాని ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష ను మన్నించిన పాపాన పోలేదు. పైగా రెండవ SRC అని మరో మోసానికి

తెరలేపే ప్రయత్నం చేస్తుంటే మరికొంత మంది సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.సామాజిక అంశం తేలేదాకా భౌగోళిక తెలంగాన గురించిన ఆలోచన

వద్ధనీ అడ్డు వస్తున్నారు.

సామాజిక తెలంగాణ వస్తే ఎవరికి ఏమి లాభం? కొందరు SC, ST , BC లకు రాజకీయంగా పోటీలు జెసి గెలిసే అవకాశం ఉంటుంది గావచ్చు.ఈ రోజు ఎన్నికల్లో

గెలువాలంటే డబ్బులు లేన్దే గెలవడం సాధ్యపడదు.ఏ సామాజిక వర్గం అయినా గూడా ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉంటే తప్ప ఎన్నికల్లో గెలువలేడు. అతడు ఆర్థికంగా

మరింత సంపన్నుడు అయ్యే కొరకు సంపన్న వర్గాలకు చాలా నిజాయితీ తో సేవజేస్తాడు డప్ప తన వర్గం వాళ్ళకు అసలు అక్కరకు రాదు సరిగదా తమ సామాజిక వర్గాన్నే

నిందిస్తాడు కూడా. కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట మండలం అనంత సాగర్ అనే వూళ్ళో ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాలువ పోయే తోవలో ఎత్తయిన కొండలు

అడ్డువస్తున్నాయని ఆ కొండల కిందుగా ఒక సొరంగా మార్గం తవ్వాలట. అసలు ఆ ప్రాజెక్ట్ కు ఇంత వరకు ఏ అనుమతులు కూడా లేవు అయినా YSR పుణ్యమా అని

1200 కోట్లతో ఒక ఆంధ్ర బినామీ కాంట్రాక్టర్కు పని అప్పగించి నారు. ఆయన రైతులకు మాయమాటలు జెప్పి సొరంగం కొంత మేరకు తవ్వి ఆ వెళ్ళిన మట్టి అంతా పక్కన

ఉన్న దళిత రైతుల పంటభూములల్లో పోసి బిల్లు ఎత్తుకొని జెండా ఎత్తేసినాడు. అమ్బ్గెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ ద్వారా ఎన్నికయిన ఒక ప్రజా

ప్రతినిధి తనకు ఒత్లేసి గెలిపిచ్చిన ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి కాంట్రాక్టర్ పక్షాన నిలిచి దళితుల పక్షాన మాట్లాడిన వాళ్ళను ఘోరంగా అవమాన పర్చిన విషయం

వ్యాసకర్త ప్రత్యక్షానుభవం.

కళ్యాణ్ సింగ్ లోడీ వంశం , కర్పూర్ ఠాకూర్ మంగలి,కరుణా నిధి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఉమాభారతి వీళ్ళంతా బి‌సి ముఖ్య మంత్రులు

అజిత్ జోగి, బాబు లాల్ మరాన్దీ, అర్జున్ ముండా , శిబూసోరెన్, వీలు ఎస్టీ ముఖ్యమంత్రులు, మాయావతి ఎస్సీ ముఖ్యమంత్రి, అయితే ఏమి జరిగింది? BC,ST ,SC

సామాన్య పేదల బ్రతుకుల్లో ఏమయినా మార్పులు వచ్చినాయ? ఆయా సామాజిక వార్గాల ప్రజల సమస్యల్లో మౌలిక మయిన మార్పులు ఏమయినా జరిగినయా?

ఇప్పటి ఈ రాజులే కాదు, అప్పటి శాతవాహనులు కుమ్మరి వాళ్ళు, చాళుక్యులు గొల్లకుర్మలు, రాష్ట్రకూటులు ఎర్రగొల్లలు,కాకతీయులు కుర్మ, మౌర్యులు దాసి,

గూర్జరులు లంబాడ, పాలిస్తున్నది ఎవరయితే ఏమిటి వాళ్ళు ఏ వర్గ ప్రయోజనాల కొరకు పాటుబడుతున్నారనేదే ప్రధానం. పెంటయ్య్ వీరగొని.

Sunday, November 6, 2011

కరీంనగర్ జిల్లా [ప్రజా ఫ్రంట్ !

కరీంనగర్ జిల్లా లో తెలంగాణ ప్రజా ఫ్రంట్

9 వ అక్టోబర్ 2010 నాడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభ హైద్రాబాద్ లో జరిగిన రోజున ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరైనారు..
ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడుతుంది అన్న ఒక స్పష్టమైన అవగాహనతో జిల్లాకు రావడం జరిగింది. జిల్లా నుండి రాష్ట్రానికి ప్రతినిధులుగా డా||సూరేపల్లి

సుజాత.మేకల వీరన్న యాదవ్. తిరుపతి రెడ్డి మరియు వీరగొని పెంటయ్య లను రాష్ట్ర మహా సభలో ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కు వచ్చిన వెంటనే సంస్త నిర్మాణ బాధ్యతలు చేపట్టే

కొరకు జిల్లా లో ఉన్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంథని, హుజూరాబాద్, సిరిసిల్ల డివిజన్లల్లో ఎలా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలో ఎవరెవరు ఏ డివిజనుకు బాధ్యత వహించాలో

నిర్ణయం చేసుకొని కార్య క్రమాలకు పూనుకున్నారు. సంఘటిత రంగం మాత్రమే గాకుండా చైతన్యానికి మారు పెరయిన సింగరేణి ప్రాంతం నుండే కార్య క్రమాలు ప్రారంభిస్తే ఊపు వస్తుందన్న

ఉద్దేశం తో ముందుగా గోదావరిఖని కి వెళ్ళడం జరిగింది.ఒక 300 మంది హాజరైన ఆ సభ t p f కార్యక్రమాలతో తమ సంఘీభావం వ్యక్త పరుస్తూ నవెంబర్ 1, 2010 విద్రోహ దినం పాటించ

దానికి ముందుకు వచిండ్రు. కానీ కార్య కర్తల పైన వచ్చిన నిర్భందం వలన ఎంత వేగం తో ముందుకు వచ్చిండ్రో అంటే వేగం తో మనం పిలిస్తే మళ్ళీ రాకుండా వెళ్ళిపోయినారు.

అణగారిన హక్కుల పోరాట సంఘం tpf కు మద్దతుగా కరీంనగర్ పట్టణం లో ఒక సభ జరుపుతున్నాం అని ఆ సభకు tpf చేర్మన్ ను ఆహ్వానించారు. కానీ ఆ సభలో హాజరైన

మేకల వీరన్న యాదవ్ ను వేదిక పైకి పిలువక పోవడం మాత్రమే గాకుండా సంస్థ చేర్మన్ అధ్య్క్షతన జరిగిన సభలో సంస్థ జండా కూడా వద్దని తీసివేయడం తో tpf బాధ్యులు బాధపడినారు.

ఆ తర్వాత తెలంగాణ పోలిటికల్ jac నిర్వహించిన సభలకు సంస్థ చేర్మన్ వచ్చిగూడా అక్కడి స్టానిక బాధ్యులకు సమాచారం ఇవ్వకపోవడం తో సంస్త నిర్మాణం పైన దాని ప్రభావం పడ్డది

దాని కారనంగా చాలా కాలం పాటు సంస్త కార్యక్రమాలు ఏవీ గూడా సాగా లేదు. రాస్త్ర కమిటీ సమావేశాలకు హాజరు గావడము డప్ప జిల్లా లో ఏ కార్యక్రమాలు జరుగలేదు.

రాస్థ్త్ర కమిటీ సభ్యులు రత్నమాల, వెదకుమార్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా విస్తృత స్తాయి కార్య కర్తల సమావేశం ఏర్పాటు జేసుకొనే జిల్లా అఢక్ కమిటీ వేసుకోవడం జరిగింది.

వి సుధాకర కన్వీనర్ గా మరో 12 మంది కోకన్వీనర్లతో కమిటీ వేసుకున్న తర్వాత కొంత చలనం ప్రారంభమయింది. చొప్పదండి నియోజక వర్గం బాధ్యుడు వీరన్న, కరీంనగర్ టౌన్ బాధ్యుడు

మొగురం రమేశ్ అణగారిన హక్కుల పోరాట కమిటీ బాధ్యుల్డు రమేశ్, మొదలగు వారు తీవ్రంగా కృషి చేసి జగిత్యాల, చొప్పదండి, హుస్నాబాద్, కరీంనగర్ నియోజక వర్గాలల్లో మండల కమిటీలు

మరియు గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది. 9 అక్టోబర్ 2011 నాడు సంస్త ఆవిర్భావం రోజున అమరవీరుల స్తూపం వధ్ధ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి రేకుర్తి వరకు ఊరేగింపు గా వెళ్ళి అక్కడ

స్టానిక కార్యకర్తల సహకారం ప్రధానగా గాయకుడు పరుషరమ్ నేతృత్వం లో tpf జండాను ఆవిష్కరించుకోవడం జరిగింది.

అక్టోబర్ 13 నుండి సకల జనుల సమ్మేలో భాగంగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు సన్హీభావం తెలుపడానికి సంస్థ ఉపాధ్యక్షులు ఆకుల భూమయ్య, వీరగొని పెంటయ్య గోదావరిఖనికి వెళ్ళి

కార్మికులు ఏర్పాటు జేసిన సమ్మేలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించి వారి త్యాగాలని కొనియాడి తెలంగాణ సాధించ బడే దాకా తెగించి పోరాడాలని కోరడం జరిగింది. సకల జనుల సమ్మె విరమించ బడ్డ

తర్వాత tpf పేర సమ్మె విద్రోహులెవరూ అని వెలువద్ద కరపత్రం చదివి కొందరు కార్మికులు బాధను వ్యక్తీకరించినారు. సమ్మె ప్రారంభానికి సన్నధ్ధం జేయడానికి ఏ ఒక్క ఉద్యమ సంస్థ గాని, tpf బలపర్చిన

aituc గానీ ఏ కార్మిక సంఘం గాని ముందుకు రాకపోయినా కార్మికులే స్వచ్ఛందంగా పాల్గొని ఇన్ని రోజులు సమ్మేజేస్తే ఖమ్మం లాంటి చోట ప్రధానంగా aituc ముందుబడి సమ్మె నీరుగారిస్తే పిలిచినా

కూడా రాలేమని చెప్పిన ఉద్యమ సంస్తలు ఇవ్వాళ కార్మికుల పోరాటాన్ని , చైతన్యాన్ని కించ పర్చే విధంగా అంటే గాకుండా తెలంగాణకు ప్రధాన అద్దంకి అయిన కాంగ్రెస్స్ ను శకుని పాత్ర పోషిస్తున్న tdp

ని ఒక్క మాటకూడ అనకుండా ఒక వైపు rtc సమ్మె విరమించ బడ్డ తర్వాత నిరాశ నిస్పృహలకు లోనయినా కార్మికులకు ఆత్మ స్టయిర్యాన్ని ఇచ్చి మరో పోరాటానికి సంసిద్ధులను చేయాల్సింది పోయి

ఇలా కరపత్రాలు తీయడం పట్ల ఉద్యమం లో చురుకుగా పోల్గొన్న కార్యకర్తలు తాము నొచ్చుకున్నామని వ్యాసకర్తతో చెప్పినారు.

జిల్లాలో ప్రధాన వనరులు అయిన బొగ్గు, నీళ్ళు, గ్రానైటే, ఇసుక యధేచ్చగా సీమాంధ్ర గుత్తేదార్లతో బాటుగా, తెలంగాణ దొరలు కూడా దోచుకు తింటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే లోగానే

ఈ వనరులు తరిలీ పోకుండా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణి లో రోజు ఒక లక్ష తొంబై వేల తన్నుల బొగ్గు, అలాగే రెజు వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అదే విధంగా వేల క్యూబిక్ మీటర్ల ఇసుక

ఈ భూమి నుండి తరలిపోతుంటే ఇక్కడి నెల తరిగి పోవడం మాత్రమే గాకుండా స్టానిక ప్రజలకు జీవానాధారాలు అడుగంటి పోతున్నాయి.గుద్దెలుగులు, నెమళ్లు అంతరించి పోతున్నాయి తద్వారా పర్యావరణ

సమతుల్యత చెడిపోయి రేపు రేపు ఈ గడ్డ పైన జన్మించిన బిడ్డలకు పీల్చడానికి పరిశుభ్రమైన గాలి, తాగాదానికి నీళ్ళు, తినడానికి తిండిగుడా దొరుకని దుర్భర స్థితి దాపురించ బోతున్నది. ఈ సమాజం లో

ఆలోచించ గలిగిన ప్రతి మనిషి స్పందించ వల్సిన అత్యవసర పరిస్తితి కరీంనగర్ జిల్లాలో ఉంది.

Monday, October 10, 2011

అలిసి పోకుండా ఆఖరుదాక పోరాటం చేద్ధామ్!

బస్సులు నడుస్తాయని ఒకడు, సింగరేణిలో కార్మికులు డ్యూటీలో జాఇన్ అవుతున్నారని ఒక చానెల్ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. కానీ సకల జనులారా సమయిక్యాంధ్ర ప్రచారాలను నమ్మకండి.అలిసి పోకుండా కదా దాకా ఉద్యమిద్దామ్.
ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం జేసుకోవలే.ఓట్ల ఉద్యమం ప్రారంభమయిన 2001 నుండి జూసీనా ఆ తర్వాత 2004 నుండి జూసీనా ఇగ వచె తెలంగాణ ఆగా వచె అంటున్నారే గాని తెలంగాణ తెచ్చే తండుకు ఏ రాజకీయ పార్టీ చేసింది పెద్దగా ఏమీ లేదు.ఎన్నికల్లో పోటీ జెసి ప్రజల్లో పరువు నిలుపుకొనే పని ఒకరు జేస్తే మా అధిస్తానమ్ తో చెప్పి మేమే తలంగాణ టెస్టమ్ అని పబ్బం గడుపుకున్న వాళ్ళే గాని కేంద్రాన్ని గట్టిగా నీలేసింది నీలేయ గలిగిన పరిస్తితి తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు.లేకుంటే 9 డిసెంబర్ ప్రకటన ఎట్లా వఛ్చిందని ప్రశ్నించే మిత్రులు చాలా మండే ఉన్నారు.కడుపుజింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు గాని,మరి వచ్చి నట్టే వచ్చి వెనక్కుపోతే 9 దేసెంబర్ ప్రకటన ఓన్ జేసుకున్న మిత్రులు దాన్ని కాపాడే పోరాటం లో ఎందుకు వెనుక బడ్డట్టో? అయితే ఇక్కడ నా వాదన ఎవరిని తక్కువ జేయడానికి కాదు. కానీ ఎప్పుడయితే ఎక్కడ కూడా చరిత్రలో తమ తమ జీతాలకో నాటాలకో కాకుండా అశేష ప్రజాజీకమ్ ఆకాంక్షల మేరకు ఉద్యోగులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,సింగరేణి కార్మికులు,ఆర్ టి సి కార్మికులు,సమస్త ఉద్యోగ వర్గాలతో బాటుగా వివిధ వృత్తుల, కుల సంగాల జే ఏ సి లు ఎవరికి వాళ్ళే వాళ్లడయిన పోరాట రూపాలతో రోడ్డు మీదికి వచ్చిన తర్వాత మేము ఎక్కడ వెనుక బడి పోతామో అని కొన్ని రాజకీయ పార్టీలు పోటీలు బడి ప్రజల ముందుకు వచ్చిఫోటోలకు ఫోజులు ఇస్తున్న విషయాన్ని చూస్తున్నామనుకో కానీ ప్రభుత్వాలు కదిలింది ఇప్పుడే కదా?
కనుక సకల జనుల సమ్మె ఎంత ప్రభావ వంతమైనదో మనం అర్థం జేసుకోవాల్సిన అవసరం ఉంది.సకల జనుల సమ్మె ద్వారానే దాని వినూత్నమయిన రాజీ లేని పోరాట రూపాల ద్వారానే తెలంగాణ సాధించుకో గలుగుతాము. రాజకీయ నాయకులు ఇప్పుడు వస్తున్నట్టుగానే ప్తజల వెనుక బడి రాక తప్పదు.వాళ్ళకు మనం గావాలే.
పెంటయ్య. వీరగొని.

Monday, June 6, 2011

ప్రశించే వాళ్ళంతా ప్రభుత్వం దృస్తీలో ఆటంక వాదుళే!

రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలిపినా గూడా సహించలేని స్తితిలో అవినీతి పరులు, వాళ్ళ రక్షకులు!

యోగా గురూ రామ్ దేవ్ బాబాను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చెప్పిన కారణాలు,1) ఆయన మాట తప్పినాడు అని 2)
శాంతి,భద్రతల సమస్య ఉన్నది అనేది.
ఆయన మాట తప్పింది ఎక్కడ? ప్రభుత్వం ఏదయితే ఒప్పుకున్నదో అదే విషయాన్ని రాత పూర్వకంగా ఇమ్మని అడుగడం
నేరం ఎట్లయ్యిందో?శాంతి భద్రతల సమస్య ఎట్లయ్యిందో ప్రభుత్వం ప్రజలకు అర్థం చేయించడంలో విఫలం అయ్యింది. బాబా
అడుగుతున్న విషయాలను ప్రభుత్వం గనుక ఒప్పుకుంటే నిరసన విరమిస్తానని లేఖ ఇ వ్వుమని అడుగడం లో వారికి ఎంత
హక్కు ఉంటుందో బాబా గూడా ప్రభుత్వాన్ని లేఖ ఇమ్మని అడుగడం లో అంతే హక్కు ఆయనకు కూడా ఉంటుంది అన్న కనీస
ప్రజాస్వామ్య విలువలు పాటించని నిరంకుశ ఏలుబడిలో ఉన్నాము మనం. ప్రభుత్వానికి ఏ రకమయిన కుటిలపు ఆలోచనలు
లేకుంటే వారు అంగీకరించిన విషయాలకు లేఖ ఇస్తే దీక్ష విరమించ బడేదే కదా? మరి ప్రభుత్వానికి ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది? అంటే ప్రభుత్వం రామ్ దేవ్ బాబా కు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్ డడం ఇస్తాం లేదు. ఆ దొంగ సంపాదన అంతా తర తరాలకు తమ వారికే చెందాలన్న రాజ్యాంగ వ్యతిరేకమయిన ఉద్దేశం తో కేవలం మభ్య పెట్టె కొరకే మాట ఇచ్చింది గాని దాన్ని నిలబెట్టుకోవాలన్న నిజాయితీ ప్రభుత్వానికి లేదని తేటతెల్లం అయ్యింది. ప్రభుత్వ నిజస్వరూపం బయట పడింది.
ఇక రెండో కారణం శాంతి భద్రతలు. అసలు ఎవరికి శాంతి? ఎవరి భద్రత? అది పశ్చిమ బెంగాల్ నుండి ఛత్తీస్ గఢ్ దాకా కోయ గోండు గూడాలల్లో పోలీసులతో మాకు శాంతి లేకుండా పోతున్నది.బడా బడా కార్పొరేట్ సంస్తలతో మా భూములకు భద్రత
లేకుండా పోతున్నది అని ఆ ఆదివాసీలు మొత్తుకుంటే మీకు మావో లతో సంబంధాలు ఉన్నాయి అది మా శాంతి భద్రతల
సమస్య అంటూ నోరు ముయిస్తున్నారు. ఇక్కడ రామ్ దేవ్ బాబా దేశంలో శ్రుస్టించ బడ్డ సంపద అది దేశ సంపదే . అది
భారత దేశానికే చెందాలి అన్నందుకు ఆయన్ను అరెస్టు చేసి డెల్లి బహిష్కారం చేస్తారు.ఇదెక్కడి న్యాయం?
మహిళలకు గౌరవం, చట్ట సభల్లో హక్కులు అంటారు. సాక్షాత్తు దేశ రాజధాని నడిబొడ్డున అందునా రాంలీల మైదానం లో
నడి రాత్రి మహిళలు,పిల్లలు అని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసే అధికారం ఏ రాజ్యాంగం కల్పించిందట
వీళ్ళకు. బాబా చేస్తున్నది రాజ్యాంగ బద్ధమే అయినా వాళ్ళకు నొప్పి కలుగుతున్నది కనుక బాబా దీక్షకు ఆటంకం కలిగించి
నారే అనుకుందాం. కానీ ఈ మహిళలు,పిల్లలు చేసిన నేరం ఏమిటాటా? సరే వాళ్ళ దృష్టి లో నేరమనే అనుకుందాం. కానీ
రాత్రి నిద్ర పోయిన వాళ్ళ పైన దాడి చేయడం ఫ్యూడల్ సంప్రదాయం కూడా కాదుకదా? వాళ్ళు చెప్పుతున్న ఏకైక కారణం
వీళ్ళకు ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని. మావోలనంటే నిషేదిస్థిరీ మరి ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళను ఎప్పుడు
నిషేధించినారు తండ్రి?
మిమ్ములను ప్రశ్నిస్తే వాడు మావోనో, ఆర్‌ఎస్‌ఎస్ ఓ లేదా ముస్లిం తీవ్రవాదో అని నెపంబెట్టి మీ అవి నీతిని అక్రమాలను
అణిచివేతలను ఎంత కాలం కొనసాగిస్తారు? ప్రజలంతా తిరుగబడనంత కాలం కొనసాగిస్తారు. ప్రజలు తిరుగ బడితే మీరు
ఎంత కాగితం పులులో ఈజిప్టు ప్రజలు నిరూపించారు.
పెంటయ్య. వీరగొని.

Saturday, June 4, 2011

మన విద్యా విధానం ఒక పరిశీలన!

మన విద్యా విధానం ఒక పరిశీలన!
బడులు తెరుస్తున్నారంటేనే బడుగు వర్గాల కు బుగులు బుగులు మొదలయితది . పుస్తకాలు కోనాలి, స్కూల్ బ్యాగులు, ఉనిఫార్మ్ బట్టలు, షూష్ .వీటితోబాటుగా స్కూల్ కు కట్టవల్సిన ఫీసులు అవన్నీ తల్సుకోని ఎట్లనో అనుకుంటూ
మదన పడని మనిషి కనిపించడు. ఇదంతా ఎందుకయ్యా చక్కగా సర్కారు బడిలో చేర్పిస్తే ఈ పుస్తకాల గొడవ ఉనిఫార్మ్స్ ఫీసులు ఏవీ ఉండవు గదా అంటే చూస్తూ చూస్తూ పిల్లలను చెడగొట్టుకొముగదా అంటున్నారు. అంటే సర్కారు
బడుల్లో వేస్తే పిల్లలు ఎక్కడయినా చెడిపోయిన దాఖలాలు ఉన్నాయా అని అంటే గవన్నీ మాకు తెలువయి గాని ఎవాలన్న జూస్తే ఎందుకు గన్నవుర సదివిచ్చుకొను చేతగానోనిన్వి అని అంటరు అంటున్నాడు.ఈ పరిస్తితికి కారణాలు
అడిగితే టీచర్ల మీద సర్కారు, సర్కారుమీద, ఇంకా కాదు పోడంటే తల్లిదండ్రులమీద టీచర్లు నెపం వేస్తున్నారు. ఏ విమర్శలు ఎట్లా ఉన్నగాని చదువులయితే తలిదండ్రులకు పెద్ద భారం అయితే అవుతున్నయి.
రాజ్యాంగం లో రాసుకున్నట్టుగా ప్రతి పౌరునికి విద్యను అందించ వలసిన బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పించుకొని కార్పొరేట్ సంస్తలకు అప్పగించినయన్నది కాదన లేని సత్యం, ప్రస్తుతం ఉన్న మార్కెట్ సూత్రాల ప్రకారం ఎక్కడ
మెరుగయిన సేవలు దొరుకుతే అక్కడ సేవలు పొందడం న్యాయం అనే న్యాయ సూత్రం నడుస్తున్నది. కానీ విద్య అనేది వ్యాపారం కాదు అనే స్పృహ అటు ప్రభుత్వాలకు ఇటు ఉపాధ్యాయులకు కూడా లేకుండా పోయింది.
విద్య సమాజ గతం అయినది. ఒక తరం నుండి మరో తరానికి అంది ఇచ్చే ఒక జ్ఞానం, ఒక నాగరికత, ఒక ఎరుక, ఒక్ జీవన విధానం, అటువంటిది ఇవ్వాళ అంగట్లో అమ్ముకొనే, కొనుక్కునే సరుకుగా మారిపోయింది. అందుకు
కారణం ఒకరి పై ఒకరు నెట్టివేసుకోవడం కాకుండా సమాజ హితం కోరుతూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
విద్య అనేది ఒకనాడు వేట, మల్లయుద్దం ,వీళ్ళంబులతో గురిచూసి కొట్టడం గా ఉండేది. కానీ స్తల కాలాలను అర్థం జేసుకోవడానికి, గత చరిత్రను అధ్యయనం జెసో, గుర్తుజేసుకోనో భవిష్యత్తరాలకు ఎరుకజెప్పడానికి తమ
అనుభవాలను కంటస్తం జేయడామో, లేదా ఏదో ఒక దానిపై రాసి భద్ర పర్చడమో జరిగేది. ఆ రాసిన దానిని చదువడమే విద్య అయి వాళ్ళే సామాజాలకు మార్గ నిర్ధేషకులు గావడం తో రాయడం ,చదువడం అనే ప్రక్రియకు
చాలా ప్రాధాన్యం పెరిగింది. భారత సమాజం లో అప్పటికే చాతుర్వర్ణ వ్యవస్తా ఉదండడం మూలంగా శూద్రులమ్తా పైవర్గాలకు సేవజేసే పనిలో ఉండి విశ్రాంతి దొరుకక, శూద్రులు చదువ గూడదు అనే ఆంక్షల మూలంగా చదువు
నుండి దూరంగా ఉంచ బడితే అప్పటికే ఆవిర్భవించ బడిన పురోహిత వర్గం ముందుగా చదువడం, రాయడం అభ్యసించి ఆతర్వాత గురుకులాలల్లో తమ వారితో బాటుగా క్షత్రియులకు గూడా విద్య నేర్పుంచారు.
ఈ విద్య ప్రజల భాషలో గాకుండా పాలకుల భాషలో ఉండడం మూలాన ప్రజలకు అదంటేనే తమకు అందనిది, అర్థం గానిది అనే భావన. సరే క్రీస్తు పూర్వమే మొదలయిన విదేశీ దాడులు చానిక్యుని కాలం దాకా విరివిగానే
సాగినాయి. అక్కడ కొంత విరామం దొరికినా మధ్య ఆసియా నుండి,అఫ్గానిస్తాన్ నుండి విదేశీ దండయాత్రలు మొదలయినాయి. అప్పుడుకూడా వారిదయిన భాష రాజా భాష అయినందున రాజా శాశనలంటే సామాన్యులకు
అర్థం గాని విషయాలే. ఇక అంతిమంగా వచ్చిన ఆంగ్లేయులు కూడా ఇంగ్లీష్ నే వాళ్ళ పాలన భాష గా వాడుకున్నారు, ఇప్పటికీ అదే విధానం కొనసాగు తున్నందున ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఉంటున్నందున
పజలల్లో ఒక క్రేజీ ఏర్పడింది, ఎట్లాగయిన జెసి ఇంగిష్ మీడియం లో చదివిస్తేనే పిల్లలకు మంచి భ్విష్యత్తు ఉంటుంది అన్న భావన తలిదండ్రుల హృదయాల్లో బలంగా నాటుకొని పోయింది.
ఇక భాష అంటే ఏమిటో చూద్దాం! భాష అంటే కేవలం అచ్చులు,హల్లులు ,వ్యాకరణం, సందులు,సమాసాలు,అలంకారాలు మాత్రమే గాదు. భాష అంటే ఆ ప్రజల జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంబురాలు, ఆటలు
పాటలు అన్నీ అన్న మాట. ఎవరిదైనా వాళ్ళ ఇంటి భాష కానప్పుడు పైన చెప్పుకున్నవన్నీ వాటి అసలు రూపాన్ని కోల్పోతాయి. వర్షం కావాల్సిన మనకు రెన్ రెన్ గో ఎవే పాఠం అయి కూర్చుంటుంది.పిల్లోనికి కన్ఫూషియన్,
ఇట్లా ఎన్నయినా ఉదాహరణలు చెప్పవచ్చు,
మరి ఈ ఆంగ్ల భాషా వ్యామోహం నుండి తలిదండ్రులను తప్పించే ప్రయత్నం ఎలా అన్నది పెద్ద ప్రశ్న. ఈరోజు ఇంగ్లిష్ కార్పొరేట్ కాలేజీ లకు కాదుగానీ రెండు మీడియం ల తో నిర్వహించ బడుతున్న పాఠశాలల యజమానులను
అడిగి చూడండి. ఏ మీడియం నుండి వచ్చిన పిల్లల విషయ పరిజ్ఞానం ఎట్లా ఉందో? విషయ పరిజ్ఞానం మాత్రమే గాదు ఉపాధ్యాయుల పట్ల, తోటి మిత్రుల పట్ల సమాజం పట్ల వారి వైఖరి చాలా పెదసరనరంగా ఉన్నట్లుగా ఆ
పాఠశాలల యజమానులే చెప్తున్నారు. ఇక ఉపాధి అవకాశాల గురించి చూసినా ప్రతి సంవస్తారం 100,000 మంది ఇంజనీర్లు కాలేజీ లనుండి బయటకు వస్తున్నారు అందులోనుండి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎందరు? ఇంకా అందులో
నుండి అమెరికా పోతున్న వాళ్ళు ఎండ్రు? మన చదువులు అన్నీ అమెరికా మార్కెట్ కు ఊడిగం చేయడమేనా? లేక మనకంటూ ఒక్ దేశం ఉన్నది, ఆ దేశం లో కొన్ని వనరులు ఉన్నాయి ఆ వనరులను సక్రమంగా ఉపయోగించు
కొనే నైపుణ్యం మనకు అవసరం అన్న విషయం మన అకాడమిసియన్లకు ఎందుకు పట్టడం లేదు. మన దేశం లో ఈ రోజు ఉత్పత్తి అవుతున్న సరుకులు, అంటే ప్రకృతి వనరులన్నీ సరుకులు గా మార్చుతూ వాళ్ళు అనుభవించే
కాడికి అనుభవించి తక్కిన 400 లక్షల కోట్లు, స్విస్ ,మారిషియస్ బంకుల్లో మడుపు పెట్టుకుంటున్నారే ? ఇంత సంపద సృస్టించ బడుతున్న ఈ దేశానికి తన దంటూ ఒక టెక్నాలజీ తనడంటూ ఒక భాష అవసరం లేకుండా
పోతున్నది గదా? ఒక్ భాష అంటే మళ్ళీ హింది నా తమిలమా? మరో భాష అని కాదు ఎవరి మాతృ భాషలో వాళ్ళకు వీడి బోధించ బడితే విషయ పరిజ్ఞానం కావలసినంత ఉంటుంది. వాళ్ళ వాళ్ళ సంస్కృతిని కాపాడు కున్నట్టు
ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల మోజు పట్ల తలిదండ్రులకు కనువిప్పుకలిగే విధంగా ప్రణాళికలు రూపొందించు కోవాలిసిన బాధ్యత రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం మీదనే ఉండి.
ఎందుకంటే ప్రభుత్వమే జూన్ 13 నుండి ఏదో యాత్ర చేస్తుందట. ఎందుకయ్యా అంటే డ్రాప్ ఔట్ పిల్లలను బడిలో చేర్పిస్తుందట. ఎందుకంటే అది తన బాధ్యత అంట. సరే మంచిదే. చాలా మంది పిల్లలు చదువు పట్ల ఆసక్తి
లేక, ఇంట్లో వసర్తి సరిగా లేక బడి మానేస్తున్నారు. ఈ లోపాలను సారి దిద్ద కుండానే బడి బయటి పిల్లలను బడిలో వేస్తే మళ్ళీ వాళ్ళు బడి బయటకు రావడానికి ఎంతో సేపు పట్టదు.
ప్రధానంగా మరో విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వ బడులను ఎవరుకూడా అవి తమవి, తాము కాపాడుకోవాలి అని అనుకోవడం లేదు. ఆయన ముఖ్యమంత్రా, విద్యాశాఖ మంత్రా. విద్య శాఖ కార్య దర్షా, డైరెక్టరా, జిల్లా
విద్యాధికారా, ప్రధానోపాధ్యాయుడా, తరగతి ఉపాధ్యాయుడా?ఇందులో ఏ ఒక్కరూ కూడా నిజాయితీ గా ఈ బదులు మావి అనుకున్న చోట ప్రజలు ఆ బడులల్లోనే చదివిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు. కానీ మొత్తంగా
విద్యానంతా ప్రైవేట్ పెట్టుబడుడ్డారులకు కట్టబెట్టాలన్న ఆలోచన కలిగిన ప్రభుత్వాలు తమ తప్పును అంగీకరించకుండా ఆకలి అయ్యేవాళ్ళకు అన్నం పెట్టకుండా రెండు బఠానీ గింజలు చేతిలో పెట్టి తామెంత ఔధార్య వంతులో
చూడండి అని ప్రజల ముందుకు వస్తుంటే ముంచుక వస్తున్న ముప్పు అయిన నిరుద్యోగం, నిరక్షరాస్యత, గుణాత్మకమయిన విద్య కొందరికే అందుబాటులోకి వచ్చే ప్రమాదం, విద్యా గాంధానికి నోచుకోకుండా అసాంఘిక
శక్తులుగా మారిపోనున్న ప్రమాదాన్ని విజ్ఞులైన వాళ్లయినా పట్టించుకోకుంటే ఈ సమాజానికి బఃవిష్యత్తు ఉండదు.
వీరగొని పెంటయ్య.
విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.
కరీంనగర్, 9908116990

Wednesday, May 18, 2011

మాయమై పోతున్న మనిషి

మనిషి మాయమైతుంటే ఎవరి బాధ్యత ఎంత?

గల్లీ నుంచి డిల్లీ దాకా అందరూ ఒకేమాట అంటున్నారు.మానవత్వపు విలువలు మంటగలిసి పోతున్నాయని, మణిశన్న వాడు మాయమైపోతున్నాడని తరతమ భేదం లేకుండా

అంతా ఒకటే విమర్శ చేస్తున్నారు.ఇది నిప్పంతా నిజం.ఇట్లా ఎందుకు జరుగుతున్నది మరి.ఇప్పుడున్న మానవ ఇతిహాస చరిత్ర కు దాదాపు ఐదు వేల సంవస్తారాల వయసున్నదని

అంటున్నారు .ప్రకృతి మానవ నాగరికత అనేక మార్పులకు గురి అయింది.కానీ అది అంతా కూడా అభివృద్ధి వైపు సాగింది.అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్న.

తత్వ శాస్త్రం లో ఒక ఉదాహరణ ఉంది. ఒక వడ్ల గింజో,లేదా ఒక మక్కా గింజో మట్టి లో నాటితే ఒక మొలక వస్తుంది. అది గింజ కంటే గూడా ఉన్నతమయింది ఎందుకంటే రేపు

అది ఇలంటే ఎన్నో గింజలకు తొలి రూపం కనుక. ఆమోలుక పెద్దవెరిగి దాని కడుపులో నుండి ఒక కంకిని ఇస్తుంది. ఆ మొక్క కూడా నశించి చారెడు ధాన్యానికి జన్మనిస్తుంది.

గింజ, మొక్క నాశిస్తున్నా గూడా అంతకంటే ఉన్నతమయిన అంటే ఒక్క గింజ నుండి చారెడు ధాన్యం వస్తుంది కనుక అది అభివృధ్కి నిదర్శనం అయ్యింది.భూమికి గాని ప్రకృతికి గాని

ఎక్కడ నస్టమ్ జరుగలేదు. ఇదే చర్యను అక్కడే పదే పదే చేసినా జరిగేది అభివృద్ధియే గాని అంతకంటే ఏమీ గాదు .ఇన్ని వేల సంవస్తారాల నుండి జరుగుతున్నది అదే అయినా

సాంకేతిక పరిజ్ఞానం పెంచుకున్న మనిషి అత్యాశకు లోనై ఎక్కువ సౌఖ్యాలు తక్కువ కాలం లో అనుభవించాలన్న దురాశతో ప్రకృతి విధ్వంసానికి పూనుకుంటున్నాడు.అడవులు పోతే సరే

మళ్ళీ చెట్లు నాటుకుందామ్ గుట్టలు,పర్వతాలు, భూగర్భ నిక్షేపాలన్నీ విచక్షణా రహితంగా వినియోగించుకోవడం ద్వారా మనుషుల అవసరాలకంటే సంపద అధికంగా సృస్టించ బడుతున్నది

అది గూడా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండడం మూలాన ప్రస్తుత అభివృద్ధి నమూనా ఫలితాలు విచ్చల విడిగా వారు అనుభవిస్తున్నారు. తక్కిన జనాలకు కూడా అదే ఆదర్శం అని

సిద్ధాంతీకరిస్తున్నారు. ఆ వెంపర్లాటలో ఆ పెనుగు లాటలో నీవు సాటి మనిషిని వెనక్కి నెత్తితే తప్ప లేదా సాటి మనిషికంటే ముందు పరిగెడితే తప్ప నీవు సక్సెస్ కాలేవు అని వ్యక్తుత్వ

వికాసపు పాఠాలు చెప్పుతున్నా మేధావులే మణిశన్న వాడు మాయమై పోతున్నాడని వాపోతున్నాడు.

ఇప్పటికీ మనిషి విషపు వీక్షణాల బారిన పడని మనుషుల జీవన విధానం గమనిస్తే వాళ్ళ పిల్లలు మేక పిల్లలతోనో, ఆవుదూడలతోనో ,కుక్క,పిల్లి పిల్లలతోనో,అడవుల్లో ని సాధుజంతువుల

కూనలతోనో,ఆడుకుంటారు.అవ్వే వాళ్ళ ఆటబొమ్మలు.ప్రాణమున్న జీవులతో ఆడుకుంటారు కనుక ప్రాణుల పట్ల,ప్రత్యేకించి మనుషుల పట్ల మానవ్త్వం తో వ్యవహ రించాలని వాళ్ళకు

ప్రత్యేకించి చెప్పవలసిన పని లేకుండానే పోతున్నది.అట్లాగే తోటి వారి పట్ల కన్నా తలిదండ్రుల పట్ల కరుణతో ఉంటున్నారు.చెట్టు,పుట్ట భూమే వాళ్ళ జీవనాధారమైనా ఆగర్భ శ్రీమంతులైన

అంబానీ సోదరుల్లా కాట్లాడుకున్న సంఘటన మచ్చుకైనా కనిపించదు.ప్రాణులతో, మనుషులతో వాళ్ళకు ఉన్న దైహిక సంబంధమే వాళ్లలోని మనిషి మాయమై పోకుండా కాపాడుత్న్నది.

ఇక్కడ నాగరికులం అనుకుంటున్న సమాజం లో చూస్తే ఆట బొమ్మలు రైఫోల్లు,పిస్టల్లు, ఫైరింగులు,దొంగల వేటా,శత్రుసైన్యాల పేరుతో అమ్మా,నాన్నల్నో,అక్కా చెల్లెల్లనో,అన్నదమ్ములనో

ఫైర్ చేస్తారు ఇక్కడి బాలలు, పసితనం ఇంకా వీడకముందే నర్సరీ,ఎల్‌కే‌జి లకు పంమ్పించదమ్,అటునుండి అతే రెసిడెన్సీయల్ స్కూళ్ళు,కాలేజీలు అటుతర్వాత అమెరికా .

పిల్లల పెంపకం, ఆస్తుల సంపాదన,సౌఖ్యాలు అనుభవించాలన్న తపనతో మనిషి సృస్టించ అలివిగాని సృస్తిని విధ్వంసం చేయడం లో పోటీ పడి ఉత్పత్తియ అయిన సంపదను

తామే అనుభవించాలనే అత్యాశతో మానవ సమూహాలన్నీ పోటీ పడుతుంటే సమాజలకు మార్గదర్శకత్వం వహించ వలిసిన ఆలోచనా పరులు క్రియ శూన్యంగా ఉంటే ఇంకా మనిషితనం

ఎక్కడ బతికి బట్టగడుతుంది?

అభివృద్ధి వద్దా? ఇంకా ఆది మానవుల్లాగే జీవించాలని నీ ఉద్ధేషమా అని ప్రశించే వాళ్ళు కూడా ఉంటారు.అభివృద్ధికి నిర్వచనం ఆరంభం లోనే చెప్పినాను.అయినా మరో సారి నా చుట్టుపక్కల

జరుగుతున్న నా అనుభవాలను ఇక్కడ మీ ముందు ఉంచుతాను.నా నివాసం కరీంనగర్ జిల్లా కేంద్రం.ప్రతి దినం వందలాది పొడవైన పెద్ద భారీ వాహనాలల్లో ఇక్కడ నుండి గ్రానైట్ రాయి

సింగపూర్, చైనా,రష్యాలకు ఎగుమతి అవుతుంది,పోనీ అక్కడ వాళ్ళకు ఇదేమయినా ఆహార పదార్థమా అంటే కాదుగదా? కేవలం తమ ఆడంబరం కోసం చేస్తున్నారు, దానితో ఇక్కడి గుట్టలు

పర్వతాలు విధ్వంసం అయి జలవనరులు ఇంకి పోయి సుసంపన్నమయిన భూములన్నీ ఏడార్లుగా మారుతున్నాయి.ప్రతిదినం పత్రికల్లో చూస్తుంటాం గుట్టలల్లోని గుడ్డెలుగులు ఉర్లళ్ళకు

వస్తున్నాయి,బావులల్లో పడి చనిపోతున్నాయి, చెట్లు ఎక్కి కిందపడి చనిపోతున్నాయి.నెమల్లు ,కుందేళ్ళు,అడవిపందులు,కోతులు, ఉళ్లమీదబడి మనుషులతో మరణిస్తున్నాయి,

రోడ్లన్ని నాశనం అవుతున్నాయి పంటలతో బాటుగా మనుషుల ఆరోగ్యాలన్నీ నాశనమయి పోతున్నాయి, స్టానిక ప్రజలకు కట్టే,పుల్ల,ఆకు, నీరు,నిప్పు పంట ఫలము ఇచ్చిన ఆ వనరు

ద్వంసమ్ అయ్యి స్తనికులకు కాస్తాలు కడగండ్లు మిగులిస్తుంటే కొద్ది మంది పెట్టుబడుదార్లు కోటీశ్వర్లు అవుతుంటే మరెక్కడో ఉన్న సంపన్న వర్గాల ఆడంబారాల ఇగో సంతృప్తి పడుతుంటే

స్టానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ రక్షక దళాలౌ అభివృధ్హ్ధి అదే నంటూ కాదన్న వారిని కటకటాల పాలు జేస్తే ఇక్క మంత్రులు,ఎమ్మేల్యేలు,ఎంపీలు,అందులో భాగస్వాములయితే

మనుషుల్లోని మణిశన్న వాణ్ని ఎవరు మాయం జేస్తున్నట్టు. మాయం చేసేది వాళ్ళే మళ్ళీ మొత్తుకొనేది వాళ్ళే కనుక చైతన్య వంతమయిన ప్రజా తమ బాధ్యత ఏమిటో వాళ్ళే నిర్ణయించుకోవాలి.

Saturday, May 14, 2011

ఓట్ల రాజకీయాలు ఎట్లున్నాయో చూస్తున్నారా?

ఒకచోట రెండు లక్షల కోట్ల కుంభకోణం 2స్పెక్ట్రమ్ విషయాన్ని అసహ్యించుకున్న తమిళ ప్రజలు కరుణానిధిని గద్దెనుండి తొలగించారు.అవినీతికి మారుపేరే అయినా జయలలితా చిన్న గీత పక్కన 2g పెద్దగీతే గాదా అని జయాని కరుణించారు.
అట్లాగే పశ్చిమ బంగాల లో మార్క్సిస్ట్ పేరు తో కప్తాలిస్టేక్ పనే జేస్తున్న దొంగ మార్క్సిస్టులకు బాలెగానే బుద్ధి చెప్పారు.
కానీ ఇక్కడ ఆంధ్ర లో మాత్రం అటు అయ్యా రాజశేకారుడు కొడుకి రాజా వారు లక్ష కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడ్డా
జనం పట్టిచ్చుకోలేదు.
ఇట్లా ఎందుకు జరుగుతున్నది.ప్రజలు ఎక్కడయిన సహజంగా అవినీతి పరులను నిరంకుశులను సహించరు అది మానవ
స్వభావం కూడా! కానీ ఇక్కడ మానవ స్వభ్వానికి బిన్నమయిన చర్య ఎందుకు జరిగినట్టో విశ్లేషకులు ఆలోచించాలి.ఒకటి
కాంగ్రెస్స్ వాళ్ళు జగన్ కంటే గూడా అవినీతి పరులు అనో లేదా నిరంకుశులు అనో లేదా అప్రాజా స్వామిక వాదులు అనో
ప్రజలు భావించి ఉండాలి.అట్లా చూసి నప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినట్టు తాను లక్షల కోట్లు అక్రమంగా
సంపాదిస్తే అందులో తన వాటా తీసుకోకొండానే సోనియామ్మో లేదా వాళ్ళ అధిస్తానమో ఎందుకు ఉరుకుంటుంది.కనుక ఆ
అవినీతిలో సింహా భాగం కాంగ్రెస్స్ పెద్దలకు దక్కింక్ది కాదా?కనుక తమిళ నాద్కులో వలె చిన్న గీతను మరిపిస్తూ పెద్ద గీతా
గీయబడి నప్పుడు సహజంగానే ప్రజలు చిన్న గీతను మన్నిస్తా ఉన్నారు మరి. అందరూ అవినీతి పరులే అయినప్పుడు
అందులో చిన్న అవినీతి పరుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమేనా? మొత్తంగా అవినీతిని
కుటుంబ పాలనను వ్యతిరేకించ కుండా ఇలా చిన్న చిన్న దొంగలకు అధికారం అప్పగిస్తూ పోతే స్వాతంత్ర ఫలాలు అందిరికి
ఈ ప్రజస్వామ్యం లో అందు తాయా?అల అందువు అని ప్రజా రాసులంతా అనుకోని ప్రత్యామ్నాయ రాజకీయాలను
వెదుక్కొంటే తద్వారా సంభవించే సామాజిక కుడుపులకు బాధ్యత ఈ సమ్మంజానిది కాక అందులో భాగస్వాములవబోతున్న
ప్రజారసులదేనా?
ఆలోచనా పరులు అందరూ మిన్న కుంటె రానున్న పరిణామాలకు మా బాధ్యత కేదూ అని తప్పుకోవడానికి కుదురాదు .

Saturday, April 23, 2011

పారా హుషార్!

ఇవ్వాళ అందరం తెలంగాణ తొందరగా రావాన్ననే కోరుకుంటున్నం. ఎంత ఆలిశాం అయితే మన సంపదను వాళ్ళు అంతగా దోచుకొనే పోవట్టే. కాంగ్రెస్ మంత్రులేమో అభివృద్ధి మాకు ముఖ్యం
తెలంగాణ వచ్చేనాడు వస్తాది అనవట్టిరి.తెలుగుదేశం ఏమో రెండుకండ్ల సిద్ధాంతం అయే,బి‌జే‌పి కి ఉన్న బలమెంతని.ఇక టి‌ఆర్‌ఎస్ 9 డిసెంబర్ ప్రకటన రాంగానే సంబురాలల్లా మునిగిపోతే
వాణి ఉషారుల వాడు ఉండే, 5 జనవరి శాంతి చర్చలల్ల అందరికంటే ఎక్కువ మనోడే ఊకోబెట్టిండని అంటారు, శ్రీకృష్ణా కమిటీ ని బైకాట్ జెద్దామని విద్యార్థులు అంటే అది తెలంగాణ ఇచ్చేతందుకే వేసిండ్రు అంతిరి,పడి పడి విజ్ఞాపనలు ఇస్తిరి రిపోర్ట్ అనుకూలంగా రాకుంటే తెలంగాణ అగ్నిగుండమే నంటిరి .అనుకూలం కాదుకదా వ్యతిరేకంగా వచ్చే తిరుగబడే వాళ్ళను అణిచివేసుడు ఎట్లనో
పూసగుచ్చినట్టు చెప్పే.అండ్ల కాంగ్రెస్స్ నాయకులను టి‌ఆర్‌ఎస్ నాయకులను ఎట్లా మేనేజ్ చేయాన్నో కూడా చెప్పే. మీము మేనేజ్ అయ్యేటోల్ల లెక్క కనబడుతున్నాం రా బోసిడీకే అన మనకు
నోరు పెకులక పాయే .మిలియన్ మార్చ్ పిలుపుగూడా పెద్దాయన వద్దన్నడు అన్నరు. అక్కడ ఏమి జరిగిందో నేను మళ్ళా చెప్పవల్సిన పని లేదు.గాంధీ మహాత్ముడు గద చౌరా చౌరీ సంఘటన
తర్వాత స్వాతంత్రోద్యమాన్ని నిలిపి వేసి నట్టు మిలియన్ మార్చి తర్వాన ఉద్యమానికి సెలువులు ప్రకటిస్టీరి. ఇగ అంటేనేమో విమర్శ చెస్తర ఈగవాలనియ్యం ఖబర్దార్ అనవడితిరి.
5 మే 2000 నాడు కరీంనగర్ ల గర్జన కు మేమంతా హాజరైనమ్.అబ్బా గిప్పుడు సరైన నాయకత్వం దొరికిందని సంబుర పడ్డం. లోకల్ బాడీ ఎన్నికలల్లా పిచ్చి పిచ్చిగ గెలిపిచ్చినమ్ 2004 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ తోటి ఏమి ఒప్పందం జేసుకున్నావో కాంగ్రెస్సోల్లు కథవిప్పెదాక మాకు తెలువక పాయే.వాళ్ళు ఎస్సార్సీ అన్నమంటారు నీవ్వు చప్పుడు జెయ్యావు.సర్కారుల శరీకైటివి
అవినీతి విమర్శల బురుద వూసుకుంటివి .నీ వెంట ఉన్న ఎమ్మెల్లెలు దంటిడిసి పోయిరి. ysr వాణి తొత్తులు తలంగాణ ఇజ్జటు తీసిరి. నువ్వు కరీంనగర్ ఉంటనని ఉండకపోయినా ఇక్కడ ఏమి చేయక పోయినా కరీంనగర్ వాసులుగా మేమంతా వొత్లేసి గెలిపిచ్చి మళ్ళా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిచ్చినమ్. ఇది ఒక్క కే‌సి‌ఆర్ గొప్పదనామెనా ఇండ్ల ప్రజల భాగస్వామ్యం ఏమీ లేదా?
సీమాంధ్ర మీడియాలల్ల వాళ్ళు మనలను ఎంతగా అవమాన పరుస్తున్నారో దానికి దీటుగా మన పోరాటాలు లేకపాయే . బోనాలు దీసుడు,బతుకమ్మలాట,నిరసన ప్రదర్శనలు,కొవ్వొత్తుల ర్యాలీ,రక్తదానం,కాదుపోడంటే
రాస్తా రోకాయించి ఇక్కడొల్లనే ఇబ్బంది పాలుజేసుడు దప్పిస్తే సీమాంధ్రోనికి చీమకుట్టినాత్తన్న చేస్తాలేరు గదా?అరె భాయ్ నిన్నటికి నిన్న గా విమలక్క ఒక్కతి ఆమె బలమెంత? అని గుండెలదరగొట్టింది.మనకెందుకు అంతా డైర్ణం లేక పోయింది అని అడుగుతున్నం తప్పంటరానే అన్న?

వాణి రాజకీయ అవసరానికి డప్ప మన పోరాట పటిమకు తెలంగాణ ఇవ్వరని తేలిపోయింది కదా?సరే కే‌సి‌ఆర్ అన్నట్టుగా రేపు మే ల తెలంగాణ ఇస్తారనే అనుకుందాం.
అప్పుడు మన నీళ్ళ సంగతి, మన అప్పుల సంగతి మన ఆస్తుల సంగతి మన భూముల సంగతి గిట్లనే మెతుక మెతుకగా ఉంటే వాడు మన నెత్తిన చేయిబెట్టిపోతాడు.
అందుకనే మా బాధన్తా ఎందంటే మళ్ళా ఒక చెన్నారెడ్డిని మనమేవ్వాలమ్ గూడ చూడదల్చుకోలేదు.వ్యక్తిగతంగా ఎవ్వరినీ విమర్శించడం గాడు కానీ సక్కటి రాజా బాటల నడువుండ్రి
అడ్డ దారుళ్ళ నడిసి మల్లోసారి జనాలను ఆగమ్ జేస్తే చూస్తూ ఊరుకొనే ఓపికలు లేకనే మా తండ్లాట అంతా!

ఇగ మీరు కొట్లాడుతామంటే ఎవ్వలు అద్దంతండ్లు అని మరో మాట అంటాండ్లు.సాంబశివుడు మీ పొలిట్ బ్యూరో సభ్యున్ని నడి రోడ్డుమీద నరికి సంపితే కనీసం తెలంగాణ బందు పిలుపు
కూడా ఇవ్వలేనంతటిదయనీయ స్తితిలో ఉన్నమా మనం?మళ్ళీ బందు పిలుపు ఏంది అని అనుకుంటుండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ మనం ఏమి చేస్తామన్నా చెప్పే?
పోలవరం సుప్రీం కోర్ట్ పుణ్యాన ఆగితే అగుతుందేమో కావచ్చు గాని మనమయితే ఆపె పరిస్తితి లేదు,అంటే గొదావరిలొ నీళ్ళు మనవాటమనం వాడుకునేదానికి,భూగర్భ జలాలు అడుగంటింప
జేస్తున్న ఇసుక చౌర్యం ఆపేదనికి,గ్రానైట్ పేరుతోటి ద్వంసమ్ అవుతున్న గుట్టలను ఆపేదానికి మనం పూనుకొక పోతే తెలంగాణ వచ్చినంక మనం ఏమి చూసుకొని మురుసుడో చెప్పున్ద్రే.
ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం జిల్లాలల్లో లక్షలాది హెక్టారులల్లో ఓపెన్ కాస్ట్ గనుల పేరుతో కాలి కింది నేల కదిలిపోతూ నోటికాడి ముద్ద నేలపాలయితా ఉంటే ఇంకా చూస్తూ రేపుకుడా చూస్తూనే ఉంటామంటే ప్రజలు ఊరుకోరు. ఎందుకు అంటున్నామంటే ఈ క్వారి కాంట్రాక్టులల్లో కాంగ్రెస్,తెలగుదేశం,బి‌జే‌పి,తెరాస,కమ్యూనిస్టు అన్న తేడా లేకుండా అందరూ తిలాపాపం తలా
పిడికెడు పంచుకుంటున్నారు. మీరు అమెరికాలోనో హైద్రాబాదులోనో కుచ్చున్డి మేల్స్ రాసుడు గాదు ఒక్కసారి మా ఉత్తర తెలంగాణ జిల్లాలకు రాండ్రి ఇక్కడి విధ్వంసం చూడండి.ఓపెన్ కాస్ట్
మైన్ల తోటి ఎన్నెన్ని ఊళ్ళు ఎట్లా లేసి పోతున్నాయో?తర తరాలనుండి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న జనాలు ఊళ్ళు లేసి పోతున్నప్పుడు ఒకరిని బట్టుకొని ఒకరు ఎట్లా ఎదుసుకుంటా విడిపోతున్నారో ఒకసారి వాళ్ళ బాధలు,వాళ్ళ వలపోత,తలపోత వినున్డ్రి. మా ఆరాటం మీకు అర్థం అయితది.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పెంటయ్య.వీరగొని.

Friday, April 1, 2011

ఇగ బొమ్మల లొల్లి బందువెట్టి పాళ్ళు పంచుకుండేట్లనో చేప్పుండి

మరి మా గోడో!


విశాలాంధ్ర పేరుజెప్పి విరుగబడొస్టీరిగదన్న
హైద్రాబాదు,రంగారెడ్డి అదిలాబాదు కాడినుంచి
అంతట దస్తీలేసి ఆస్తి హక్కు అనబడితిరి
అధికారపు అంకుశం తో అనుగదొక్కబడితిరిగద

తెలంగాణ అనొద్దన్న తెలుగు ముఖ్యమంత్రొక్కడు
రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు జేసె నింకొక్కడు
ప్రాంతీయ మండళ్లను పాతరేసినోడొక్కడు
కృష్ణా గోదారి నీళ్ళు కూరాటికుండలు మీకు

నీళ్లూ నిధులల్ల ఎంతో నియ్యతు దప్పిండ్ర లేద
నౌకరీలు గుంజుకుంది నగ్నసత్యమేనాయే
మా రెండులచ్చలుద్యోగాల్ మాయం జేసిన కొడుకుల
వెదికి వెదికి తన్నలేదు ఎర్రిబాగులోళ్లయినమ్

ప్రాణహిత చేవెళ్ళ పోలవరం పోతిరెడ్డి
పొగులేసి పంచుకుంట్రీ పోసుగడంట్రు తెలంగాణ
పాలమూరు వలుసలాయే నలగొండకు ఫ్లోరైడూ
ఆదిలబాదు అడివిబోయే బతుకుబోయే మెతుకుబోయే

ద్రోహులనూ దొరుకబట్టి నిలువుపాతరేయనీకి
నీతిలేని రాజకీయ నేతలున్న నేల మాది
దొంగముండకొడుకులను దొరుకబట్టి కాల్చలేక
మంటలకాహుతులయ్యిరి మరుపురాని మాకొడుకులు

మలమల మాడిన శవాల మంటలాడుగుతున్నై
మాప్రాణాలూవృథాయేన మరిచితీరా మమ్మనంటూ
బుద్ధిజీవులారా మీ బుద్ధి మీద మన్నువడా
ఇన్నిజరిగేతొక్కనాడు తప్పన మీ మనుసురాలే

పేరూ పెద్దన,తిక్కన రూపమేమో రామ రామ
రాతి బొమ్మల్ రాలిపోతే వాటి ఖ్యాతి కీర్తి తక్కువైద్ద
అయినాసరే తెలబానునే తప్పయ్యిందని అంటా
తెచ్చియ్యిండయ్య ఒక్క శ్రీకాంతుడినన్న మాకు

మీ ఎంటివోడు అమరజీవి ఆఖరుకా బమ్మిరెడ్డి
బొమ్మలు బొమ్మలు బొమ్మలు ఎక్కడవడితక్కడనే
ఏమిటి సంబంధమయ్య ఎక్కి తోక్కే ఎన్ కౌంటరా ?
సరివత్తూర ఎవరైన కొమురం భీమ్ తోసాటిగా

కిరాయి కిట్టయ్య కమిటీ కిరాతకెనిమిది చాప్టర్
వేటా కొడువండ్లతోటి వేటాడ్తది సాంబశివుని
చందుసుబ్బరావన్నకు,కావడికుండల కవులకు,కత్తిపద్మరావన్నకు చేతులెత్తిమొక్తం గని
తక్కినాంధ్ర మేతావులు తప్పూ అనని మతులబేంధి ?

ప్రపంచాన్నే ముంచినట్టు పండ్లునూరుతుండ్రెంది
కోల్పోతున్నోల్లమ్మెము కొరకొర జూడమ గాయింత
కొల్లగొట్టేవాల్లవైపే కోరి కోరి నిలుస్తుండ్రు
బలమున్నోడే బతుకుడా?బతుకనీండ్రి బక్కోళ్లను--ఇయ్యనీండ్రి తెలంగాణ!

పెంటయ్య వీరగొని
తెలంగాణ ప్రజా ఫ్రంట్
కరీంనగర్.
9908116990

Thursday, January 6, 2011

తెలంగాణ వచ్చేదాక తెగించి పోరాడుదే!

తెలంగాణ ప్రజల ఆకాంక్షాకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక మనమంతా భయపడినట్లుగా వ్యతిరేకంగానే వచ్చింది. సంవాస్తర

కాలంగా వాళ్ళు తిరిగి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. సామాన్య జనాలు ఏదయితే తమ తమ సంభాషణలల్లో ఏవయితే పరిష్కారాలు

చూపినారో అవే పరిష్కారాలు ఈ మేతావులు చెప్పినాయి.

1).ఆంధ్ర ప్రదేశ్ రాస్త్రాన్ని యధాతథంగా కొనసాగించడం.

2).తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజించడం.హైద్యాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచడం.

3)హైద్రాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ.కోస్తాంధ్ర రాష్ట్రాల ఏర్పాటు.

4) హైద్రాబాద్,రంగారెడ్డి,మేదక్,మహబూబ్నగర్,నల్గొండ జిల్లాలతో హైద్రాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసి,సీమాంధ్ర,తెలంగాణ రాష్ట్రాల

ఏర్పాటు.

5) హైద్రాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం,సీమాంధ్ర రాష్ట్రనికి కొత్త రాజధాని నిర్మించడం,

6)మూడు ప్రాంతాలల్లో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి రాజ్యాంగ బద్ధ బోర్డులు ఏర్పాటు జెసి రాష్ట్రాన్ని యధావిధిగా కొనసాగించడం.

మొదటి మూడు పరిష్కారాలు ఆచరణ సాధ్యం కాదు అని కమిటీయే అభిప్రాయం చెప్పింది.4వ పరిష్కారం కూడా ప్రజలు

ఆమోదించక పోవచ్చు అని కమిటీ అబిప్రాయ పడింది.5వ పరిష్కారం లో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుంది అని మరియు రాష్ట్ర

పాలనకు సరిపోయినంత రెవెన్యూ రాదు అని చెప్పింది.ది బెస్ట్ పరిష్కారం 6వ ది అని చెప్పింది.ఇది ఎంత అన్యాయం.నక్సలైట్లు

పుట్టుక వచ్చింది సమయిక్య రాష్ట్రం లోనే. ప్రజా సమస్యలు సరిగా పరిష్కరించని కారణంగా రాజ్యాంగం లోని ఆర్టికల్ 39 ప్రకారం

సంపద,అధికారం ఒక్క చోటనే కెంద్రీకృతం కాకుండా చూడాలన్న సూత్రానికి వ్యతిరేకంగా ఒక చంద్ర బాబు, ఒక రాజశేకర్ రెడ్డి సంపద

అంతా ఒక్క చోట కొద్ది మందికి చెందే విధంగా చట్టాలను చేసి అధికారం తో ప్రజలకు,రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలించిన దాని

ఫలితంగా నక్సలిసమ్ వచ్చిందే గాని వాళ్ళకు వాళ్ళుగా పుట్టుకొని రాలేదు.పుట్టుకతో ఎవరు కూడా నక్సలైట్లు కాదు. నక్సలైట్లు

గా మారిపోదాం అని అవరుకూడా కోరుకోరు అందరికీ అన్నీ సమానంగా దొరికినపుడు.అంటే ఆ బూచి చూపి తెలంగాణాను అడ్డుకోవాలని

చూస్తున్నారు తెలంగాణ వనరులను కొల్లగొట్టాలని కాచుక కూచున్న వాళ్ళు.చివరి పరిష్కారం 1956 నుండే పెద్దమనుషుల ఒప్పందం,

ఆరుసూత్రాల పథకం,గిర్గ్లాని కమిటీ,ఆరువందల పది జీవో,అన్నీ ఎలా విఫలమైనవో చూసిన తర్వాతకూడా తెలంగాణ ప్రజలు ఈ

పరిష్కారాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు. ఇక అంతిమంగా నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నది ప్రత్యేక తెలంగాణ

స్వపరిపాలన,స్వాభిమాన రక్షణ, అందుకు మార్గం ఒకటే అది సమైక్యంగా ఉద్యమించదమే.రాజకీయ పార్టీలు ఇంకా మీన మేశాలు

లెక్కబెడుతూ కూచున్టే ప్రజలు తరిమే కోడుతరో లేక వాళ్ళకు అవకాశం వచ్చినపుడే చూసుకుంటారో వాళ్ళే తేల్చుకుంటారు.