Saturday, April 23, 2011

పారా హుషార్!

ఇవ్వాళ అందరం తెలంగాణ తొందరగా రావాన్ననే కోరుకుంటున్నం. ఎంత ఆలిశాం అయితే మన సంపదను వాళ్ళు అంతగా దోచుకొనే పోవట్టే. కాంగ్రెస్ మంత్రులేమో అభివృద్ధి మాకు ముఖ్యం
తెలంగాణ వచ్చేనాడు వస్తాది అనవట్టిరి.తెలుగుదేశం ఏమో రెండుకండ్ల సిద్ధాంతం అయే,బి‌జే‌పి కి ఉన్న బలమెంతని.ఇక టి‌ఆర్‌ఎస్ 9 డిసెంబర్ ప్రకటన రాంగానే సంబురాలల్లా మునిగిపోతే
వాణి ఉషారుల వాడు ఉండే, 5 జనవరి శాంతి చర్చలల్ల అందరికంటే ఎక్కువ మనోడే ఊకోబెట్టిండని అంటారు, శ్రీకృష్ణా కమిటీ ని బైకాట్ జెద్దామని విద్యార్థులు అంటే అది తెలంగాణ ఇచ్చేతందుకే వేసిండ్రు అంతిరి,పడి పడి విజ్ఞాపనలు ఇస్తిరి రిపోర్ట్ అనుకూలంగా రాకుంటే తెలంగాణ అగ్నిగుండమే నంటిరి .అనుకూలం కాదుకదా వ్యతిరేకంగా వచ్చే తిరుగబడే వాళ్ళను అణిచివేసుడు ఎట్లనో
పూసగుచ్చినట్టు చెప్పే.అండ్ల కాంగ్రెస్స్ నాయకులను టి‌ఆర్‌ఎస్ నాయకులను ఎట్లా మేనేజ్ చేయాన్నో కూడా చెప్పే. మీము మేనేజ్ అయ్యేటోల్ల లెక్క కనబడుతున్నాం రా బోసిడీకే అన మనకు
నోరు పెకులక పాయే .మిలియన్ మార్చ్ పిలుపుగూడా పెద్దాయన వద్దన్నడు అన్నరు. అక్కడ ఏమి జరిగిందో నేను మళ్ళా చెప్పవల్సిన పని లేదు.గాంధీ మహాత్ముడు గద చౌరా చౌరీ సంఘటన
తర్వాత స్వాతంత్రోద్యమాన్ని నిలిపి వేసి నట్టు మిలియన్ మార్చి తర్వాన ఉద్యమానికి సెలువులు ప్రకటిస్టీరి. ఇగ అంటేనేమో విమర్శ చెస్తర ఈగవాలనియ్యం ఖబర్దార్ అనవడితిరి.
5 మే 2000 నాడు కరీంనగర్ ల గర్జన కు మేమంతా హాజరైనమ్.అబ్బా గిప్పుడు సరైన నాయకత్వం దొరికిందని సంబుర పడ్డం. లోకల్ బాడీ ఎన్నికలల్లా పిచ్చి పిచ్చిగ గెలిపిచ్చినమ్ 2004 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ తోటి ఏమి ఒప్పందం జేసుకున్నావో కాంగ్రెస్సోల్లు కథవిప్పెదాక మాకు తెలువక పాయే.వాళ్ళు ఎస్సార్సీ అన్నమంటారు నీవ్వు చప్పుడు జెయ్యావు.సర్కారుల శరీకైటివి
అవినీతి విమర్శల బురుద వూసుకుంటివి .నీ వెంట ఉన్న ఎమ్మెల్లెలు దంటిడిసి పోయిరి. ysr వాణి తొత్తులు తలంగాణ ఇజ్జటు తీసిరి. నువ్వు కరీంనగర్ ఉంటనని ఉండకపోయినా ఇక్కడ ఏమి చేయక పోయినా కరీంనగర్ వాసులుగా మేమంతా వొత్లేసి గెలిపిచ్చి మళ్ళా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిచ్చినమ్. ఇది ఒక్క కే‌సి‌ఆర్ గొప్పదనామెనా ఇండ్ల ప్రజల భాగస్వామ్యం ఏమీ లేదా?
సీమాంధ్ర మీడియాలల్ల వాళ్ళు మనలను ఎంతగా అవమాన పరుస్తున్నారో దానికి దీటుగా మన పోరాటాలు లేకపాయే . బోనాలు దీసుడు,బతుకమ్మలాట,నిరసన ప్రదర్శనలు,కొవ్వొత్తుల ర్యాలీ,రక్తదానం,కాదుపోడంటే
రాస్తా రోకాయించి ఇక్కడొల్లనే ఇబ్బంది పాలుజేసుడు దప్పిస్తే సీమాంధ్రోనికి చీమకుట్టినాత్తన్న చేస్తాలేరు గదా?అరె భాయ్ నిన్నటికి నిన్న గా విమలక్క ఒక్కతి ఆమె బలమెంత? అని గుండెలదరగొట్టింది.మనకెందుకు అంతా డైర్ణం లేక పోయింది అని అడుగుతున్నం తప్పంటరానే అన్న?

వాణి రాజకీయ అవసరానికి డప్ప మన పోరాట పటిమకు తెలంగాణ ఇవ్వరని తేలిపోయింది కదా?సరే కే‌సి‌ఆర్ అన్నట్టుగా రేపు మే ల తెలంగాణ ఇస్తారనే అనుకుందాం.
అప్పుడు మన నీళ్ళ సంగతి, మన అప్పుల సంగతి మన ఆస్తుల సంగతి మన భూముల సంగతి గిట్లనే మెతుక మెతుకగా ఉంటే వాడు మన నెత్తిన చేయిబెట్టిపోతాడు.
అందుకనే మా బాధన్తా ఎందంటే మళ్ళా ఒక చెన్నారెడ్డిని మనమేవ్వాలమ్ గూడ చూడదల్చుకోలేదు.వ్యక్తిగతంగా ఎవ్వరినీ విమర్శించడం గాడు కానీ సక్కటి రాజా బాటల నడువుండ్రి
అడ్డ దారుళ్ళ నడిసి మల్లోసారి జనాలను ఆగమ్ జేస్తే చూస్తూ ఊరుకొనే ఓపికలు లేకనే మా తండ్లాట అంతా!

ఇగ మీరు కొట్లాడుతామంటే ఎవ్వలు అద్దంతండ్లు అని మరో మాట అంటాండ్లు.సాంబశివుడు మీ పొలిట్ బ్యూరో సభ్యున్ని నడి రోడ్డుమీద నరికి సంపితే కనీసం తెలంగాణ బందు పిలుపు
కూడా ఇవ్వలేనంతటిదయనీయ స్తితిలో ఉన్నమా మనం?మళ్ళీ బందు పిలుపు ఏంది అని అనుకుంటుండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ మనం ఏమి చేస్తామన్నా చెప్పే?
పోలవరం సుప్రీం కోర్ట్ పుణ్యాన ఆగితే అగుతుందేమో కావచ్చు గాని మనమయితే ఆపె పరిస్తితి లేదు,అంటే గొదావరిలొ నీళ్ళు మనవాటమనం వాడుకునేదానికి,భూగర్భ జలాలు అడుగంటింప
జేస్తున్న ఇసుక చౌర్యం ఆపేదనికి,గ్రానైట్ పేరుతోటి ద్వంసమ్ అవుతున్న గుట్టలను ఆపేదానికి మనం పూనుకొక పోతే తెలంగాణ వచ్చినంక మనం ఏమి చూసుకొని మురుసుడో చెప్పున్ద్రే.
ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం జిల్లాలల్లో లక్షలాది హెక్టారులల్లో ఓపెన్ కాస్ట్ గనుల పేరుతో కాలి కింది నేల కదిలిపోతూ నోటికాడి ముద్ద నేలపాలయితా ఉంటే ఇంకా చూస్తూ రేపుకుడా చూస్తూనే ఉంటామంటే ప్రజలు ఊరుకోరు. ఎందుకు అంటున్నామంటే ఈ క్వారి కాంట్రాక్టులల్లో కాంగ్రెస్,తెలగుదేశం,బి‌జే‌పి,తెరాస,కమ్యూనిస్టు అన్న తేడా లేకుండా అందరూ తిలాపాపం తలా
పిడికెడు పంచుకుంటున్నారు. మీరు అమెరికాలోనో హైద్రాబాదులోనో కుచ్చున్డి మేల్స్ రాసుడు గాదు ఒక్కసారి మా ఉత్తర తెలంగాణ జిల్లాలకు రాండ్రి ఇక్కడి విధ్వంసం చూడండి.ఓపెన్ కాస్ట్
మైన్ల తోటి ఎన్నెన్ని ఊళ్ళు ఎట్లా లేసి పోతున్నాయో?తర తరాలనుండి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న జనాలు ఊళ్ళు లేసి పోతున్నప్పుడు ఒకరిని బట్టుకొని ఒకరు ఎట్లా ఎదుసుకుంటా విడిపోతున్నారో ఒకసారి వాళ్ళ బాధలు,వాళ్ళ వలపోత,తలపోత వినున్డ్రి. మా ఆరాటం మీకు అర్థం అయితది.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పెంటయ్య.వీరగొని.

Friday, April 1, 2011

ఇగ బొమ్మల లొల్లి బందువెట్టి పాళ్ళు పంచుకుండేట్లనో చేప్పుండి

మరి మా గోడో!


విశాలాంధ్ర పేరుజెప్పి విరుగబడొస్టీరిగదన్న
హైద్రాబాదు,రంగారెడ్డి అదిలాబాదు కాడినుంచి
అంతట దస్తీలేసి ఆస్తి హక్కు అనబడితిరి
అధికారపు అంకుశం తో అనుగదొక్కబడితిరిగద

తెలంగాణ అనొద్దన్న తెలుగు ముఖ్యమంత్రొక్కడు
రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు జేసె నింకొక్కడు
ప్రాంతీయ మండళ్లను పాతరేసినోడొక్కడు
కృష్ణా గోదారి నీళ్ళు కూరాటికుండలు మీకు

నీళ్లూ నిధులల్ల ఎంతో నియ్యతు దప్పిండ్ర లేద
నౌకరీలు గుంజుకుంది నగ్నసత్యమేనాయే
మా రెండులచ్చలుద్యోగాల్ మాయం జేసిన కొడుకుల
వెదికి వెదికి తన్నలేదు ఎర్రిబాగులోళ్లయినమ్

ప్రాణహిత చేవెళ్ళ పోలవరం పోతిరెడ్డి
పొగులేసి పంచుకుంట్రీ పోసుగడంట్రు తెలంగాణ
పాలమూరు వలుసలాయే నలగొండకు ఫ్లోరైడూ
ఆదిలబాదు అడివిబోయే బతుకుబోయే మెతుకుబోయే

ద్రోహులనూ దొరుకబట్టి నిలువుపాతరేయనీకి
నీతిలేని రాజకీయ నేతలున్న నేల మాది
దొంగముండకొడుకులను దొరుకబట్టి కాల్చలేక
మంటలకాహుతులయ్యిరి మరుపురాని మాకొడుకులు

మలమల మాడిన శవాల మంటలాడుగుతున్నై
మాప్రాణాలూవృథాయేన మరిచితీరా మమ్మనంటూ
బుద్ధిజీవులారా మీ బుద్ధి మీద మన్నువడా
ఇన్నిజరిగేతొక్కనాడు తప్పన మీ మనుసురాలే

పేరూ పెద్దన,తిక్కన రూపమేమో రామ రామ
రాతి బొమ్మల్ రాలిపోతే వాటి ఖ్యాతి కీర్తి తక్కువైద్ద
అయినాసరే తెలబానునే తప్పయ్యిందని అంటా
తెచ్చియ్యిండయ్య ఒక్క శ్రీకాంతుడినన్న మాకు

మీ ఎంటివోడు అమరజీవి ఆఖరుకా బమ్మిరెడ్డి
బొమ్మలు బొమ్మలు బొమ్మలు ఎక్కడవడితక్కడనే
ఏమిటి సంబంధమయ్య ఎక్కి తోక్కే ఎన్ కౌంటరా ?
సరివత్తూర ఎవరైన కొమురం భీమ్ తోసాటిగా

కిరాయి కిట్టయ్య కమిటీ కిరాతకెనిమిది చాప్టర్
వేటా కొడువండ్లతోటి వేటాడ్తది సాంబశివుని
చందుసుబ్బరావన్నకు,కావడికుండల కవులకు,కత్తిపద్మరావన్నకు చేతులెత్తిమొక్తం గని
తక్కినాంధ్ర మేతావులు తప్పూ అనని మతులబేంధి ?

ప్రపంచాన్నే ముంచినట్టు పండ్లునూరుతుండ్రెంది
కోల్పోతున్నోల్లమ్మెము కొరకొర జూడమ గాయింత
కొల్లగొట్టేవాల్లవైపే కోరి కోరి నిలుస్తుండ్రు
బలమున్నోడే బతుకుడా?బతుకనీండ్రి బక్కోళ్లను--ఇయ్యనీండ్రి తెలంగాణ!

పెంటయ్య వీరగొని
తెలంగాణ ప్రజా ఫ్రంట్
కరీంనగర్.
9908116990