Saturday, January 28, 2012

గోదావరినది పైన కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి వద్ద శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 9 గ్రామాలు
కరీంనగర్ జిల్లాలో 9 గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నపుడు ఆ ప్రాజెక్ట్ వలన సంభవించే
పర్యావరణ విఘాతం,గురించి ప్రజలకు జరిగే జీవనోపాధి నష్టం గురించి స్పష్టంగా తెలియ జెప్పి ప్రజాభిప్రాయ సేకరణ జరుగాలి. ప్రజలకు ఇవ్వజూపె
నష్టపరిహారం గురించి గూడా తెలియజేప్పవలసిన బాధ్యతా ప్రభుత్వానిదే . సమాచారహక్కు ప్రకారం ప్రభుత్వానిది పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అద్యక్షులు జీవన్ కుమార్ మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు. కుక్కల గూడూర్
గ్రామాన్ని దర్శించినారు. ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఈ గ్రామం పాక్షికంగా ముంపుకు గురి అవుతున్నది. సర్వే జేసినా అధికారులు వ్యవసాయ భూములను నిర్మాణాలను సర్వే జేసి వ్యవసాయ భూములకు A క్యాటగిరికి 1.5 లక్ష లు నిర్నయిన్చినారట. నిర్మాణాలను కొలిచి ఒక్కొక్క చోట సగం ఇల్లు, ఒక బాత్ రూము వరకు మాత్రం తీసుకుంటాము మిగతాది మేము తీసుకోము అంతవరదాక నీళ్ళు రావు అంటూ అధికారులు బుకాయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నష్టపరిహారం తీసుకోవాలని పోలీసులతో బెదిరిస్తున్నారని ప్రజలు ఎంతో బేలగా బాధగా చెప్తున్నారు.
నిన్న గణతంత్ర దినోత్సవం నాడు భారత ప్రథమ పౌరురాలు tv లో ప్రసంగిస్తూ మన ప్రజలను మన ప్రజాప్రతినిధులను మనం నమ్మకుంటే ఎలా
అని మాట్లాడి నారు. మరి ఇక్కడ మన ప్రజల న్యాయమైన హక్కులను కాపాడవలసిన పోలీసులు ప్రభుత్వ అధికారుల మాటల ప్రకారం ఎందుకు అలా భయపెడుతున్నారో అర్థం కాదు. అంటే ప్రభుత్వం తమకు వేతనం చెల్లిస్తున్నది కనుక ప్రభుత్వం ఏది చెబితే దాన్ని పాటిస్తాం అని వాళ్ళు
అనుకోవడం సరిగాదు. ఉద్యోగులు ఎవరైనా వాళ్ళు వెతనరూపమ్ లో పొందుతున్న ప్రతి పైసా ప్రజల కస్తార్జితమే. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండే
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వేతనం తీసుకొనేది అన్న స్పృహ ప్రతి ఉద్యోగికి ఉండాలి.
అల్లాగే rehabilitation and resettlement act ప్రకారం గ్రామం లో కొంత భాగాన్ని ప్రభుత్వం తన అవసరం కోసం తీసుకొని తక్కిన భాగం తనకు అవసరం లేదని వదలి వేయడానికి వీలులేదు . ఎందుకంటే తర తరాలనుండి ఆ ఊరి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు. వారిని కొందరిని అక్కడే ఉంచి కొందరిని వేరే చోటికి వేల్లిపోమ్మనడం న్యాయం కాదని ప్రభుత్వ పాలసీఏ చెపుతాఉన్నది. ఆ ఉరి మొత్తం ప్రజలందరికి అనువైన ప్రదేశం చూసి అక్కడ వారికి పునరావాసం కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వానిది. కేవలం భూమి ఇల్లు ఉన్న వారికి మాత్రమె నష్ట పరిహారం ఇస్తాం మిగతా వారికి ఇవ్వం అంటే కూడా కుదురాదు. చేతి వృత్తులు చేసుకునే వారికి దినసరి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
అందుకు గాను ముందుగా ప్రభుత్వం ఒక సంప్రదింపుల కమిటీ వేయాలి , ఆ కమిటీ లో ప్రాజెక్ట్ వలన బాధిత వ్యక్తీ , సర్పంచు, mla ఉండాలి .వీరు ఎవ్వరు లేకుండా నష్ట పరిహారం నిర్ధారించి తీసుకోవాలని పోలీసులను పెట్టి ఒత్తిడి చేయడం ప్రజాస్వామికం కాదు. అన్ని వ్యవస్తల ను నిర్వీర్యం చేసి ప్రజలకు ఆయా వ్యవస్తల పట్ల నమ్మకం లేకుండా చేస్తే ప్రజల్లో అశాంతి పెరుగుతుంది, అందు వలన వ్యవస్తలో హార్మని లేకుండా పోయి అలజడులు లేస్తాయి ,యానాం లో రిజెయిన్ సమస్త కార్మికులను పీడించి వేధించి వేధించి ఏమి సాధించింది.వందలాది కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గి పాలు అయినాయి, ఆ సమస్త వైస్ చేర్మన్ అసువులు బాసినాడు. ఏ సంపద అయితే కార్మికులకు దక్కకుండా తానొక్కడే అనుభావిస్తానని అనుకొంటే
అతడే లేకుండా పోయినాడు. అంటే వ్యవస్తాలను కాపాడుకోకుంటే ఎంత మంది మార్బలం ఉన్న గూడా ఇవ్వాళ యానాం లో రిజెయిన్ సంస్త ఆస్తులు బుగ్గిపాలు అయినట్టే తమకే చెందాలి తాము మాత్రమె అనుభవించాలి అని అనుకుంటున్న ఈ సంపద వాళ్లకు దక్కకుండానే పోయే
పరిస్తుతులు ఏర్పడుతాయి.
పెంటయ్య. వీరగొని.
అడ్వకేట్, కరీంనగర్.

Friday, January 27, 2012

sanghatita poraataale sharanyam.

యానం లో వేతనాలకోరకు యాజమాన్యం తో పోరాటం జేస్తున్న కార్మికుల పైన పోలీసులు కాల్పులుజరిపి కార్మిక నాయకుణ్ణి చంపివేసినారు.
పరిస్తితిని చక్కదిద్దేకోరకు అదనపు బలగాలను సంఘటన స్థలి కి పంపినారట. పోయిన పోలీసులు ఎవరికీ మద్దతుగా వెళ్లినట్టు? ముందుగా పోయిన
పోలీసులు కాల్పులు జరుపడం ఎవరికీ రక్షణ కల్పించే కొరకు జరిపినట్టు. ఇంతవరుకు ఎక్కడయినా పోలీసుల కాల్పుల్లో కార్మికులు రైతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి కాని ఎక్కడైనా రైతులో లేక కార్మికుల చేతిలో యజమానులో మరే పెట్టుబడి దారో కాల్చి చంపబడిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. మరి అంత ఖచ్చితమయిన ఆధారాలు ఉన్న కూడా పదే పదే ఈ పోలీసు ప్రభువులు పేద రైతులను , కార్మికులను ఎందుకు కాల్చి చంపుతున్నారో సామాన్యులకు అర్థం కాని విషయం. ఇక్కడ యానం లో ఆ కంపని యజమానికి ఏమైనా ఆర్ధిక నష్టం జరిగితే జరిగి ఉండ వచ్చుగాని చనిపోయిన కార్మిక సోదరుడు అయితే తన కుటుంబ సభ్యులకోసం తిరిగి రాడు. కార్మికుల చమట తో సంపాదించుకున్న ఆస్తి కాలిపోతే మల్లి ఆ కార్మికులే ఆ సంపద అంత సంపాదించే పెడుతారు.
పది పదిహేను రోజుల కింద చెంద్రబాబు రాష్ట్రాన్ని లక్ష కోట్లకు ముంచిన నాయకుని బొమ్మలను ఎక్కడబడితే అక్కడబెడితే కులగోట్టబాడుతాయి అని హేచ్చరించినాడు. దానికి ప్రతిగా ఆ పార్టి నాయకుని ప్రతినిధి మీ ఎన్టీ ఆర్ బొమ్మలు ఉండవు అంటాడు. మా నాయకుని బొమ్మల జోలికి వస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం జేస్తాము అంటారు.కాని ఈ రెండు విగ్రహాలు నిక్షేపంగా ఉంటాయి . ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.అంబేద్కర్ బొమ్మలు కూల్చబడుతున్నయి. దానికి నిరసనగా కేవలం దళిత సంఘాల వాళ్ళు మాత్రమె ఆందోళన చేస్తున్నారుగాని అంబేద్కర్ భారత దేశం మొత్తానికి నాయకుడు కనుక అందరం కలిసి దోషులను శిక్షించే విధంగా కృషి చేస్తాం అనే అన్య వర్గాల వారు కరువైనారు. గణతంత్ర దినోత్సవం నాడు కూడా అంబేద్కర్ బొమ్మ కూల్చబదిన్ది . దోషులను ఎంతటి వారైనా కతినంగా శిఖిస్తాము అని సర్కారు హుంకరిస్తుంది కాని ఏమీ జరుగదు.
ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి కానివ్వండి,అయన జలగం వెంగల రావు కానివ్వండి, ఎన్టి రామ రావు గానివ్వండి, చెంద్రబాబు గానివ్వండి, వైఎస్సార్ గానివ్వండి ముఖ్య మంత్రులుగా పనిజేసిన ఈ పెద్దమనుషులు పదవుల్లోకి వచ్చేటందుకు డబ్బ్లు ఖర్చు చేసిన వాళ్ళే.మళ్ళీ అధికారం లోకి రావడానికి సంపాదించిన వాళ్ళే. తాము మాత్రమె గాకుండా తమ తరతరాలు తిన్న ఒడువని ఆస్తులు సంపాదిస్తారు,తమ సంతానాలు తిరిగి రాజ్యాధికారం లోకి రావడానికి అవసరమైన ఆర్ధిక, రాజకీయ నేపథ్యం ఏర్పాటు చేసి పెడుతారు. ఏ మావోయిస్టులో చెప్పింది గాదు స్వయంగా జాతిపిత గాన్ధిమహాత్ముడే చెప్పిన దేమంటే నీ జేబులో నీ కనీసావసారాలకు మించి ఒక్క రూపాయి ఉన్న అది పక్కవానికి చెందవలసినదే , వాని జేబులో ఉండవలసిన దాన్ని నీవు కాజేసి నట్టే అని అన్నాడు. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుని వద్ద తరతరాలు తిన్న తరుగని ఆస్తి ఉంటది వాళ్ళు అపర అన్నహజారేలవలె ఫోజులు పెడుతున్నారు,మేమే అభివృద్ది చేసినం అంటే మేమే చేసినం అని సొంత డబ్బా వాయించుకుంటున్నారు. పైన తెలిపిన నాయకులు తాము సంపాదించుకున్నది మాత్రమె గాకుండా... మీరు సంపాదించుకున్నది అంతా ప్రజలకు చెంద వలసినదే దాన్ని మేము మీ నుండి కక్కిస్తాము అని నిలదీసిన వేలాది మంది విప్లవ యోధులను చంపించినారు.
అట్లా వాళ్ళు కోట్లు సంపాదించిన నాడుగాని , ప్రశ్నించిన వాళ్ళను చంపివేసిన నాడుగాని ఏ ఒక్కరు ఆ ప్రశ్నించిన వాళ్ళ పక్షాన నిలువక పోగా అట్లా ప్రశ్నించడం నేరము గదా అన్నారు. అట్లా ప్రశ్నించిన ఏ ఒక్కరికి గూడా స్వంత ఇల్లు లేదు.సెంటు భూమి లేదు. బ్యాంకు లో వాళ్లకు అంటూ ఒక్క పైసా బ్యాలెన్సు లేదు. కాని వాళ్ళంతా వేల సంఖ్యలో ప్రజల కోసం ప్రాణాలు సమర్పించినారు. అయినప్పటికీ వాళ్ళ చర్యలను తీవ్రవాద చర్యలు అన్నారు. ప్రజలకు చెందవలసిన వేల , లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ స్వంత ఆస్తులుగా మార్చుకున్న వాళ్ళపట్ల చట్టం తనపని తాను చెసుక పోతుంది అంటారు. ఆ చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కాదుగదా వాళ్ళ జ్ఞాపకార్థం నిర్మించుకున్న స్తూపాలను అవి ఎంత ప్రతిస్తాత్మకం అయినవి అయినా రాతో రాత్ కూల్చివెయబడుతాయి . అరె మావోని ఘోరి అయినా కట్టుకున్టం అంటే ఒప్పుకోబడదు. సాటి మనుషులను చంపినా , వాళ్ళ జ్ఞాపక చిహ్నాలను అలనాటి పిండారీల వలె పేల్చి వేసినా సభ్య సమాజం లో స్పందన ఉండదు.
లక్షలాది ఆదివాసులను నిర్వాసితులను జేసి పోలవరం కడుతామంటే వద్దనే వాళ్ళు కరువౌతారు. వేలాది మంది మత్స కార్మికులకు అన్నం బెట్టె బేల భూములను మల్టినేషనల్ కంపనిలకు అప్పగిస్తామంటే వద్దన్నవాల్లను కాల్చి చంపుతారు. ఆదిలాబాడునుండి ఖమ్మం వరకు లక్షలాది హెక్టార్ల బంగారం పండే సారవంతమైన భూమిని ఓపెన్ కాస్టుల పేరుతొ మరుభూమిగా మార్చి ప్రజలను పక్షుల వలె వలసలకు పంపితే అడ్డుజేప్పిన వాళ్ళను అభువ్రుద్ది నిరోధకులు అని నిందిస్తారు. కోట్ల సంవస్తారాలక్రితం రూపొందిన గుట్టలు ప్రజలకు ఓవర్ హెడ్ తుంకులు అయి వన్య ప్రాణులకూ గృహాలై రక్షణ ఇస్తుంటాయి.ఎవరి ప్రయోజనం కోసమో అవన్నీ ధ్వంసం చేయబడుతాయి , కాని కాదనే వారుండరు. ఇది వర్గాసమాజం దీన్ని అంతం జేయలంటారు కాని అనిచివేయబడుతున్న తెలంగాణా ప్రజలు ప్రత్యెక రాష్ట్రం కోరితే మటుకు అడ్డుజేబుతారు. తెలంగాణ ప్రత్యెక రాష్ట్రం కావాల్సిన్దేనంటారు కాని ఎస్సి వర్గీకరణ మాత్రం వద్దంటారు. నిజంగా నే సంపద అంతా అందరికి సమానంగా పంచాబడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న వాళ్ళంతా తమ తమ భేషజాలు , స్వార్థ ప్రయోజనాలు పక్కనబెట్టి సమిష్టిగా ఉద్యమించవలసిన తక్షణ అవసారాన్ని గుర్తించవలసిన అవసరం బడుగు బలహీన వర్గాల పైననే ఉన్నది.అట్లా సంగటిత పోరాటాలకు ముందుకు రాకుంటే?
ఇవ్వాళ మన నాయకుల విగ్రహాలు కూల్చివెస్తున్నరని , యానం లాంటి చోట మన తోటి కార్మికులను కాల్చి చంపుతున్నారని మొత్తుకొంటే వేట రుచి మరిగిన ఈ మృగారాజులకు వేరు వేరు జేసి వేటాడడం లో ఉన్న ఆ మృగయావినోదం రెట్టింపు అవుతుందే గాని భీతిపడబోవు.
పెంటయ్య.వీరగొని.
అడ్వకేట్
కరీంనగర్,

Sunday, January 22, 2012

apara raajulu!

పూర్వ కాలం లో రాజులు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి మారువేషాల్లో ప్రజల్లో తిరిగి వాళ్ళ అవస్తలు గమనించి ఆ కస్టాలు తీర్చే వారని కథల్లో చదువుకున్నాము.అట్టి రాజులు చాల గొప్ప ప్రజారంజకులు అని ధర్మప్రభువులు అని ప్రజలు కీర్తించే వాళ్ళని కూడా చదువుకున్నాము. కాని ప్రజల కష్టాలకు కారకులు ఎవరో ఆ కథల్లో ఎక్కడ చెప్పిన దాఖలా లేదు. రాజు తన జనానా ఖర్చులకు, తన చీని చీనాంబరాలకు, దిన చర్యలకు,సేవకుల ఖర్చులు, సైన్యాల నిర్వాహణకు, శత్రు రాజులపైకి దండయాత్రలకు, తన రాజ్యవిస్తరనకోసం జరిగే యుద్దాలకోసం సైనికుల , ఆయుధాలకోసం అవసరమైన సొమ్మును ప్రజల నుండే వసూలు చేసే వాడు అని కూడా చదువుకున్నాము, అంటే ప్రజలు పడుతున్న అన్ని కష్టాలకు పరోక్షంగా రాజులే కారకులు అన్న విషయం ఆలోచించే వాళ్లకు అర్థం అయినాగుడా రాజ విధించే శిరచ్చేదం లాంటి శిక్షలకు భయపడి ప్రజలు ప్రశ్నించే వారు కాదు అనే విషయాలు సత్యకామ జాబాలి లాంటి కథల్లో కనిపిస్తుంటాయి.
అది రాజరిక వ్యవస్థ.. కాని ప్రస్తుతం నడుస్తున్నవి ప్రజాస్వామిక ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నాము.ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకోసమే పాలిస్తున్న ప్రభుత్వాలు ఇవి అని పొలిటికల్ సైన్సు లో చదువుతున్నాము.
అయితే ప్రజల్లో భాగమైన రైతుల కస్టాలు స్వయంగా చూసి పరిష్కరిస్తాము అని అపర రాజులు అయిన చంద్ర బాబు తన చెంద్ర దండును వెంటబెట్టుకొని వస్తే జగన్ వైఎస్సార్ సేన రక్షణలో తెలంగాణలో పర్యటించిన సంగతి చూసి నాము. రాచరిక వ్యవస్తలో ఎలాగైతే ప్రజల సమస్త కష్టాలకు రాజులు కారణం అయ్యేవాల్లో ఇక్కడ తెలంగాణా లో ప్రజలందరి సమస్త కష్టాలకు, నష్టాలకు బాధ్యులు సీమాంధ్ర నాయకత్వం.. ప్రధానంగా చెంద్ర బాబు తెలుగు దేశం ప్రభుత్వం,మరియు వైఎస్సార్ నాయకత్వం లో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వాల కారణం అనేది తెలంగాణా లో ప్రతి పౌరుడు ఇవ్వాళా అంటున్నాడు. తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లో కలువడానికి ముఖ్య కారణం కాంగ్రెస్సు. అలాగే రాసుకున్న రాతలు చేసుకున్న ఒప్పందాలు, ఉల్లంఘించి తెలంగాణా నీల్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు బొగ్గు,విద్యుత్తూ,ఇలా సమస్త సంపదలు తెలంగాణా ప్రజలకు దక్కకుండా సీమాంధ్ర పెట్టుబడి దారులకు కట్టబెట్టినవి ఈ రెండు ప్రభుత్వాల ఏలుబడిలోనే.. తెలంగాణా లోనే రైతులను నిండా ముంచింది వీళ్ళే ఇవ్వాల రైతులను ఉద్ధరిస్తామని ప్రగల్బాలు పలుకు ఇగిలిచ్చుకుంట వస్తున్నది వీళ్ళే.
రైతులకు గిట్టుబాటు ధర వీళ్ళు కల్పించలేదని వాళ్ళు,, వాళ్ళు కల్పించ లేదని వీళ్ళు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకొని ప్రజలను ఇంక మోసగించ గలమని వీళ్ళు భ్రమిస్తున్నారు. రైతుల పట్ల వీళ్ళు చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారు. ఒక పిన్నీసు ను తయారు జేసినా ఆ తయారిదారు తన ఉత్పత్తి కి ధరను తనే నిర్ణయించి అమ్ముకుంటాడు . అట్లాగే దాని ధర కూడా సార్వ జనీనంగా అంతా ఒకే ధరతో అమ్ముకుంటాడు.అట్లా వాడు అమ్ముకోవడానికి ప్రభుత్వాలు సవా లక్ష రాయితీలు ఇస్తాయి .. రైతు పండించే ధరను మాత్రం అతడు నిర్ణయించడానికి వీలు లేదు. ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల పైన రైతు పండించిన ధాన్యానికి ధర ఉంటుంది., ఒక్కక్క సారి పోయిన సంవస్తరం ధరకంటే గూడా తక్కువకు రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు గత సంవస్తరం పత్తి క్వింటాల్ ఆరు వేలు ఉంటె ఈ సంవస్తరం గరిష్టంగా నాలుగు వేలే ఉంది.. అంతే గాక ప్రాంతానికి ఒకరకంగా , సరుకుకు ఒక రకంగా వ్యాపారుల ఇష్టానుసారంగా రైతులను దోచుకోవడానికి వ్యవస్తీక్రుతమైన ఏర్పాట్లు ఉంటాయి, సరుకు రైతుల వద్దనుండి వ్యాపారుల వద్దకు చేరగానే ధరలు ఆకాశానికి పోతాయి .అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా,కమ్యునిస్టు అయినా బిజెపి అయినా అందరు ఒకే సూత్రాన్ని ఎందుకు అవలంభిస్తున్నారు? ఎందుకంటే పారిశ్రామాదిపతులు ఇస్తున్న లేదా ఇవ్వజుపుతున్నడబ్బులు కావాలి కనుక వాళ్లకు లబ్ది చేకూర్చే విధానాలు అవలంభిస్తారు . అలాగే రైతుల ఓట్లు కాకాలి కనుక వాళ్ళ కు ఏవో రాయితీలు ఇస్తున్నట్టు నమ్మబలుకుతారు. కాని ఎప్పుడు కూడా వారు చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. నిజంగానే పాలిస్తున్న పార్టీలు రైతులకు మేలు చేసే ప్రభుత్వాలే అయితే కాస్మీరునుండి కన్యాకుమారి దాకా , బొంబాయి నుండి ఒరిస్సా దాక రైతుల ఆత్మహత్యలు నిరంతరాయంగా ఎందుకు జరుగుతున్నట్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా ఒక్క జిఎమ్మారు , ఒక జిందాలు ఒక బ్రాహ్మణి , ఒక వేదాంత, ఏదయినా ఒక ఆయిల్ కంపని వాళ్ళు ఎవ్వరైనా ఎక్కడైనా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మనకు ఒక్కటయినా కనిపించదు ఎందుకు ?
అయితే అంతిమంగా అయన చంద్రబాబు గానివ్వండి , జగన్ గానివ్వండి , కిరణ్ గానివ్వండి.మరే పాలకుడైనా గానివ్వండి ప్రజల పైన రైతుల పైన ప్రేమ అంటే అది వాళ్ళ ఓట్ల పైన ప్రేమ దప్ప ఆ వర్గాల ప్రయోజనం కోసం ఉద్దేశింప బడింది కాదు అనేది నిర్వివాదాంశం. ఇక ఇక్కడ తెలంగాణా లో వీళ్ళ పర్యటనల సారాంశం చాల స్పష్టం,ఏంటంటే తెలంగాణా వాదాన్ని పూర్వపక్షం చేసి ఇక్కడ ప్రజల్లో తెలంగాణా వాదం ఏమి లేదు అని ప్రపచానికి చెప్పడానికే అందరు కలిసి ఆడుతున్న దొంగ నాటకం. అన్ని పార్తీల వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వచ్చేసరికి ఎవరికీ వారు విడివిడిగా కొట్లాడుతున్నగూడా తెలంగాణా విషయం వచ్చేవరకు మాత్రం అందరుకల్సి తెలంగాణా రాకుండా అడ్డుకోవడానికి చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్న విషయాన్ని తెలంగాణా ప్రజలు జాగ్రత్తగానే గమనిస్తున్నారు.
పెంటయ్య.వీరగొని
అడ్వకేట్ , కరీంనగర్.

Click here to Reply or Fo

Tuesday, January 17, 2012

adiyunu okanduku manchide!

అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ బెంగుళూర్ లో చదువుతున్న విద్యార్థులు కామన్ స్కూల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తాము ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నతమైన వాళ్ళం
అయిఉన్నాము, మమ్ముల్ని మాతో సమానంగా సరితూగ లేని పిల్లల సరసన కూర్చొని చదువుకోనాలని శాసించే హక్కు ప్రభుత్వాలకు ఉండడం అంటే మా వ్యక్తీ గత స్వేచ్చకు భంగకరం అవుతుంది
అని వాళ్ళు బాధపడి పోతూ అక్కడ కామన్ స్కూల్ విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నా ప్రొఫెసర్ జి.హరగోపాల్ గారి ప్రసంగాన్ని అడ్డుకోన్నారని చదివినాము.
జ్ఞానం. విద్య , సంస్కృతీ , సంస్కారం ఒక మనిషికి ఎక్కడ నుండి లభిస్తాయి అని ప్రశ్నించుకుంటే అవి ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానో వచ్చేటివి కావు , అవి మనుషులు ఈ భూమి మీద
సంచరిస్తున్నప్పటినుండి ఒకరి నుండి ఒకరికి, ఒక సమూహం నుండి మరొక సమూహానికి, ఒక తరం నుండి మరొక తరానికి,ఇచ్చి పుచ్చుకున్న వ్యవహారాలని అర్థం అవుతాయి.మనిషి బ్రతుకదానికి
ప్రాథమికంగా స్వాశించడానికి గాలి తర్వాత అత్యంత ప్రాథమిక అవసరం ఆహారం. ఆ ఆహార సంపాదనలో మనిషి అనేక వేల సంవస్తరాలు పెనుగులాడి, బతుకు పోరాటం జేసి స్తావర జీవితాలకు వచ్చిన
తర్వాత వ్యవసాయం అభివృద్ది జేసుకొని మిగులు ఉత్పత్తి సంపాదించుకున్న తర్వాత ఆ మిగులు సంపదను గతం లో వలె అందరికి సమానంగా పంచకుండా కొందరే దాన్ని దాచుకొనే క్రమం వచ్చిన
తర్వాత సంపద ఎవరివద్దనైతే పోగు అవుతూ పోయిందో వారి ఆధిపత్యం పెరుగుతూ పోయిన విధం చరిత్రలో చూస్తుంటాము. తాము కుదబెట్టుకొన్న సంపదను మరొకరు లాగుకొని వెళ్ళకుండా సైన్యం
కావాల్సి వచ్చ్సింది, సైన్యం తో బాటుగా రాజ్యం వచ్చ్సింది. చిన్న చిన్న రాజ్యాలు ఓడగోట్టబడుతున్నందున సామ్రాజ్యాల అవసరం వచ్చింది. ఈ క్రమం లో ఉత్పత్తిలో భాగస్వాములు కాక పోతున్న
వారి సేవలకు కూడా ప్రతిఫలం ఇవ్వవలసిన పరిస్తితి లో ఉత్పత్తితికి మూలాధారమైన భూమికి అధిపతి రాజు , భూసురుడు. భూమి అంతా ఆయనకే చెందుతుంది కనుక ఆ భూమిని ఎవరు సేద్యానికి
ఉపయోన్చినా రాజుకు పన్ను చెల్లించాలి అనే చట్టం చేసినారు.. అట్లా సేవారంగం లో ఉన్నవారికి ప్రజల కష్టార్జితం వెళ్ళడం ప్రారంభం అయింది. సేవారంగం లో ఉన్నవారికి నిరంతరం ఆహార అన్వేషణలో
పెనుగులాట తప్పింది. వారికి ఆలోచించడానికి విశ్రాంతి లభించింది . విశ్రాంత జీవులు ప్రకృతుని నిశితంగా పరిశీలించి సూర్య, చంద్రుల గతి, ఉరుము,మెరుపు, మేఘాలు వర్షించడం,పంటలు పండడం,
అగ్గిని కనుక్కోవడం చక్రాన్ని, లోహాన్ని కనుక్కోవడం జరిగింది, ఆ శ్రామికులు ఈ సేవారంగం లో ఉన్నవారికి విశ్రాంతి కలిగించకుండా ఉండిఉంటే వీళ్ళకు వాటిని కనుక్కోవడం వీలయ్యేది కాదు. ఆ
కనుక్కున్నా వాళ్ళు అదంతా మా ప్రతిభే అని ఏనాడు అనుకోలేదు. పేటెంట్ హక్కులు తీసుకోలేదు. అదంతా సమాజగాతమే అయ్యింది. ఇంతాగా ప్రజాస్వామిక ఆలోచనలు లేని నాడే ఆ శాస్త్రజ్ఞులు
అది మా ప్రతిభాకాడు అదంతా ప్రజలందరి పైశోధనల ఫలితమే అన్నారు.
రాజ్యాలు రాజులకోరకు అనే భావన పోయి ప్రజాస్వామీకరించాబడి రాజ్యం ప్రజలకోరకే అని అనుకున్న తర్వాత ఆనాటి రాజులు భూస్వాములు, తమ బూజు వాసనలను వదిలించుకోకుండా అవుతున్న
ఉత్పత్తులు, ఉత్పత్తిసాధనాలు అయిన భూమి, పరిశ్రమలు, యంత్రాలు తమవే కనుక ఉత్పత్తి అవుతున్న సంపద తమదే అని శ్రమ పడుతున్న వారికి జీతాలు మాత్రమె ఇస్తాము ఉత్పత్తి సాదహనాల
పైన హక్కులు మాత్రం ఇవ్వము అంటూ తదనుగుణంగా చట్టాలు చేస్తున్నారు. చేస్తున్న చట్టాలు అన్నిగుడా తమ ప్రయోజనాలు నెరవేర్చే విధంగానే ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. ఆ విధంగా సంపద
చదువు కొందరికి మాత్రమె అందుబాటులోకి వచ్చిందన్న విషయం అర్థం అవుతుంది. జరుగుతున్నా సంపదలో హక్కు గురించి ఆలోచించకుండా నిరంతరం సంపద శ్రుస్తిలో పాలు పంచుకొంటున్న
సమూహాలు ఎల్లవేళలా ఆలోచనా రహితంగా ఉండవుకదా? ఇప్పుడు వాళ్ళు తమ హక్కు ను అడుగుతున్నారు. చట్! మీరు మా దగ్గరకు కూడా రావడానికి అర్హత లేని వాళ్ళు అని వాళ్ళను దూరం
కొడితే వాళ్ళు ఘర్షణకు దిగుతారు. సమాజాలల్లో అంతర్యుద్ధం మొదలవు తుంది. అందుకే బూర్జువా మేధావులు, ఫిలాసఫర్స్ ప్రజల హక్కులు కాపాడున్నట్లు నటించాలని అల నటించక నగ్నంగా
బయట పడితే మన అధికారాలకే ఇబ్బంది అని కోల్పోతున్న సమూహాలు రాజ్యాధికారం కోసం తిరుగబడితే అణిచివేతకు హింసను ప్రయోగించ వలసి వస్తుంది ఆ తిరుగుబాటులో మనకు ప్రాణ నష్టం
జరుగుతుంది, కనుక మనం దోచుకు తింటున్న సంపదలో రాలిపడుతున్న తుంపరల ను అయినా వాళ్లకు దక్కేటట్లుచూసుకోవాలి అని చెప్పుకొన్నారు. మనలో కలుపుకోన్నట్లు అయినా నటించాలి
అని రాసుకున్నారు. ఈ పిల్లకాకులను పెంచిన ఆ పెద్దకాకులకు ఈ సామాజిక స్పృహ లేక పోవడం వలన పెద్దకాకుల మాటలను, వాదనలను వినివినీ ఉన్న పిల్లకాకులు అట్లా వాదిస్తున్నారు.
అదియును ఒకందుకు మంచిదే, కోల్పోతున్నవాళ్ళు ఇప్పటికైనా తమలో తాము పోట్లాడుకోవడం ఆపివేసి సంపద అంతా అందరికి సమానంగా చెందే పోరాటాలవైపు సాగిపోతారని ఆశిద్దాం.
పెంటయ్య.వీరగొని.
న్యాయవాది.
కరీంనగర్.

Tuesday, January 10, 2012

telangaana prajalu chustunnaru.

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా చంద్రబాబు పాద యాత్ర చేస్తుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కిరణ్ కుమార్ సర్కార్ బాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికం,
వాస్తవానికి ఈ నినాదం తో ప్రభుత్వాన్ని నిలదీయ గలిగిన నైతికత బాబుకు లేదు. ఇతని హయాం లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రైతులు , ప్రజలు ఎద్యమిస్తే కాచి చంపిన ఒక
అప్రజాస్వామికుడు. మరో విషయం , బాబు యాత్ర శాంతి భద్రతలకు విఘాతం అని. ఎవరి శాంతి, ఎవరి భద్రత? ప్రజలెవ్వరు గూడా చార్జీలు పెంచాలని కోరుకోవడం లేదు.పెంచ వద్దనే అంటారు.
ప్రజల ఉద్దేశానికి మద్దతుగా బాబు ఉద్యమిస్తానంటే ప్రజలేందుకు వద్దంటారు.? ఈ యాత్ర అయితే గియితే కిరణ్ శాంతికి ఇబ్బంది అవుతుందేమో ?
ఇంకో విషయం , అతడు చంద్రబాబు గావచ్చు,కిరణ్ కుమార్ గావచ్చు, అధికార పీఠం అధిస్టించినపుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం జేసి పక్ష పాత రహితంగా , స్వీయ ప్రయోజనాలకు
తావులేకుండా ప్రజలందరికి సమాన న్యాయం చేస్తామని చెప్పి అధికార పీఠం అధిష్టించిన వారే. కాని కోట్లాది ప్రజలకు కష్ట నష్టాలు కలిగే అనేక చర్యలు చేపడుతూ పిడికెడు పెట్టుబడిదారుల
పెట్టుబడులు మరింత పెరిగే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు.తీసుకుంటున్నారు. ముఖ్యంగా , తెలంగాణా నీళ్ళు, భూములు, ఉద్యోగాలు, నిధులు, వనరులు తెలంగాణా ప్రజలకు చెందకుండా
తమ ప్రాంతం వాడని, తమ వర్గం వాడని, తమ కులం వాడని, తమ తమ బంధు మిత్రులకు లబ్ది చేకూర్చినారు. రాజ్యాంగం ప్రకారం ప్రాంతాల భేదం లేకుండా పాలించిన వాళ్ళ నందరిని జైళ్లల్ల
పెట్టాలి.
చంద్ర బాబు వరంగల్ లో పర్యటించినపుడు గాని, ఇపుడు జగన్ నిజామ బాద్ లో పర్యటిస్తున్నపుడు గాని ప్రజలు నిరసనలు తెలుపుతూ వీరి పోరులు, దీక్షలు తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర
ఆకాంక్షను పూర్వ పక్షం చేస్తాయి గాని తెలంగాణా రాష్ట్ర సాధన లక్షాన్ని బలపర్చేవిగా లేవు అని అడ్డు చెప్పినారు. తెలంగాణా ప్రజల శాంతికి విఘాంతం కలుగుతున్నదని రోడ్ల పైకి
వచ్చి అడ్డుకొనే ప్రయత్నం చేసినారు.ప్రజాస్వామ్యం లో ప్రజల అభిప్రాయాన్ని మన్నిస్తేనే ప్రజాస్వామ్యం మనగాలుగుతుందని ప్రజలు నెత్తి నోరు కొట్టికొని చెప్పినారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఇబ్బంది లేకుండా తెలంగాణా వాదం పూర్వ పక్షం అయ్యే పని జరుగు తున్నది కనుక నాయకులను గృహ నిర్బంధం లో పెడుతారు, అయిదు వేల మందిని అరెతుజేస్తారు.వందల సంఖ్యలో
ప్రజల కాళ్ళు,చేతులు విరిచి తలలు పగులగోట్టడానికి తమ బలగాలకు తోడుగా ప్రయివేటు దండులను అనుమతిస్తారు. యునివర్సిటీ హాస్టల్ గదులల్లోకి వెళ్లి ఆడ పిల్లలని గూడా చూడకుండా
ఇష్టం వచ్చినాట్లు కొట్టినా, విద్యార్థుల పైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపినా, ఈ దమన కంద చూడ లేక 800 మంది పిల్లలు తమ ప్రాణాలు దీసుకుటే అటు ప్రభుత్వం గాని ఇటు
ప్రతిపక్షం గాని అది తమకు సంబంధించిన విషయమే గానట్టు ఎక్కడ గుడా ఒక్క మాట మాట్లాడని మీకు ఇవ్వాల రైతుల పెరుజేప్పుకొని తెలంగాణా లో కాలుబట్టే అర్హత ఉందా?
తెలంగాణాకు ప్రధాన అద్దంకి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణా లో నడిపించవలసిన బాధ్యతా కిరణ్ కుమార్ పైన ఉంది. తెండు సార్లూ తెలంగాణా రాకుండా అడ్డుపడిన
చంద్ర బాబుకు తెలంగాణలో కూడా తన పార్టీని బతికిన్చుకోవాల్సిన బాధ్యతా ఉంది. తెలంగాణా నినాదం ఆధారం తో రెండుసార్లు గద్దేనిక్కి తల్లి రొమ్ముగుద్దిన తాయీ గండడు
వై ఎస్సార్,, తనయుడు తండ్రి ఆశయం కోసమట తెలంగాణా లో తన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యతత జగన్ కు కూడా ఉందట. కాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలను కాపాడ
వలసిన బాధ్యత మాత్రం ఎవరికీ లేదు. అలాగే ఈ పార్తీలల్లో తిరుగుతున్నా తెలంగాణా నేతలకు రేపు తమ పార్టీల టిక్కెట్లు గావాలె, ఆ నాయకులు ఇచ్చేలేదా ఇప్పించే డబ్బులు
గావలె .తప్పిజారిపోయి గెలిస్తే అధికారం పంచుకొనే పదవులు గావలె, అంతే గాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలతో వాళ్లకు పని లేదు.తమ నేతల మాటను తెలంగాణా లో తన్నులు
బడి అయినా తన్ని అయినా నెగ్గించి ! భళీరా మన్నీడా, శహబ్బాస్! అంటే , బాంచన్ దొరా, అనే గడీ పాలేర్లుగా నిలబడుతున్నారు.
ఇక అత్యంత ప్రధానమైన విషయం, అందరు అనుకుంటున్నట్టుగా తర తమ భేదాలు లేకుండా అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణా వాదాన్ని తమ తమ మాటల గారడీలతో తమకు
అనుకూలంగా మార్చుకొని ఓట్లను దండుకొని ప్రజాప్రతినిధులుగా గెలిచి అధికారం సంపాయించి సంపద పెంచుకోవడానికే దప్ప ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా
పాలిస్తాము,నడుచుకున్టాము అనే వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించడం లేదు.
రైతుల సమస్యల పేరుతొ చంద్రబాబు గాని, జగన్ గాని , తెలంగాణలో తిరుగుతారట, కాని తెలంగాణా ఇవ్వాలని మాత్రం అనరట. అయినా ఎద్దిబాగుల తనం అందామా ఇంత అవకాశ వాదం,
ఇంత స్వార్థపరత్వం అందామా మన తెలంగాణా నేతలు వాళ్ళ సీమాంధ్ర నాయకులకు వీర బావుటా ఎత్తుతూనే ఉన్నారు . ఇక అదేదో సినిమాలో అన్నట్లుగా పూరేకు పూరా తెలంగాణా వాదం తో
రెండుసార్లు అధికారం లోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళ పార్టి అన్ని పార్టీల అభిప్రాయాన్ని అడుగుతది కాని తమ అభిప్రాయం చెప్పదు. ఇక్కడనేమో వీళ్ళు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటారు.
ఈ రైతు డ్రామాలు,రచ్చబండ డ్రామాలు, ఉపఎన్నికల డ్రామాలు,ఎవరికోసమో,ఎందుకోసమో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు... ఉపఎన్నికలు, మున్సిపాలిటీ, స్తానిక సంస్తలు,
ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు, ఎన్నికలాట. అప్పుడు ఎన్నికల కోసం దప్ప ప్రజల కోసం ఏమీ చేయని , చేయలేని మీకు ఎందుకు ఓటు వేయాలని నిలదీయనున్న తెలంగాణా ప్రజలను
నిలువరించే దమ్ము మీ కిరాయి సైన్యాలకు ఎంత మాత్రం ఉండబోదు .
పెంటయ్య వీరగొని.

Friday, January 6, 2012

prajasvaamika hakkulu maaku undavaa?

చంద్ర బాబు మాల్లో సారి అబద్దాలుజెప్పి తెలంగాణా ప్రజల చెవిలో పూవుపెట్టి పోయిండు. అయన తెలంగాణాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడ లేదట? నిజ్జంగా నిజమేనా? వాజ్ పేయి సర్కారుల ఒక్క ఓటు
రెండు రాష్ట్రాలు అన్న మానానికి మేము తెలంగాణా ఇవ్వబోతున్నమంటే అడ్డుతగిలి అప్పుడు తెలంగాణ రాకుండా చేసింది ఎవరు మరి? అసెంబ్లీ లో తెలంగాణా అనవద్దు వెనుక బడిన ప్రాంతాలు అని మాట్లాడాలని
ఆదేశించినది ఎవరో? తొమ్మిది డిసెంబర్ అర్ధరాత్రి నుండి రాజకీయం నడిపి నన్నపునేని రాజకుమారితో లగడపాటికి ముద్దులు ఇప్పించి మన పార్టీలు ఎవ్వైతే ఏందీ మనం అందరం సీమంధ్ర వాళ్ళమే, తెలంగాణా వాళ్ళు
మన ఏలుబడి పిడికిలి నుంచి జారిపోతమంటే మనమెట్ల పోనిస్తం అని ఐక్యంగా అడ్డుదగులదానికి నాయకత్వం వహించింది ఎవ్వరు? నిన్నటికి నిన్న అసెంబ్లీ లో అవిశ్వాస తీర్మానం లో మూడు గంటలు మాట్లాడి తెలంగాణా
ముచ్చట ఒక్కసారన్న తీయడానికి నీకు నోరు రాలేదు ఎందుకు? ఏడు వందల మంది తెలంగాణా బిడ్డలు కాంగ్రెస్ , టిడిపి బొంకు రాజకీయాల కారణంగా చనిపోతే కనీసం సంతాప తీర్మానం పెట్టడానికి కూడా నీ మహా నాడు
లో అవకాశం లేకుండా పోయినంతటి అప్రస్తుతమైపోయిన మా తెలంగాణా విషయం నిన్ను ఇవ్వాల తనగురించి నీతో నోరు తెరిపించి మాట్లాదిపిచ్చింది. ఇన్ని సంవస్తరాల నుండి మా తెలంగాణా ప్రజలకు జీవన్మరణ
సమస్య అయ్యి మేము పోరాటం జేస్తుంటే మా గురుంచి ఒక్క మాట జెప్పడానికి కూడా నీకు అసెంబ్లీలో నోరు రాకపాయే కాని నేను మీ తెలంగాణాకు వ్యతిరేకం కాను అనేదానికి నీకు నోరెట్ల వచ్చే గదా ?
మనందరికీ తెలిసిన సంగతే ... అదే ఉప ఎన్నికలు వస్తున్నాయి గనుక ఎట్లా నన్నా కొన్ని ఓట్లు సంపాయిన్చాలేనన్న తపన కనిపిస్తున్నది. కాని మా ఉసికే, మా బొగ్గు, మా నీళ్ళు, మా ఉద్యోగాలు, మా గుట్టల
గ్రానైటు , బాక్షైతు, ప్రధానంగా మా భూములు కొల్లగొట్టుక పోతుంటే మీకు మీ కాంగ్రెస్సుకు వ్యతిరేకంగా మేము పోరాటం జేస్తూ వస్తున్నాం. అది మా ప్రజాస్వామిక కాంక్ష అయిన తెలంగాణా రాష్ట్రం వస్తే దప్ప
ఈ విధ్వంసం ఆగదని. కాని ఒక ప్రతిపక్ష నాయకునివి అయి ఉంది పది జిల్లా ల నాలుగు కోట్ల మంది ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను నీవు అసెంబ్లీ లో ఎందుకు ప్రస్తావించలేదని అడిగితె నీ ప్రజాస్వామిక హక్కుకుభంగం
వాటిల్లిందా? నీ ఒక్కనికి గీ మాత్రం ఇబ్బంది అయితే అంత బాధ పడి పోతున్నావే, మా నాలుగుకోట్ల మంది ప్రజాస్వామిక హక్కుకు భంగం కలిగితే మేము ఎంత బాధపడి పోవాలేనో చెప్పు? మా వెయ్యి మంది బిడ్డల
రక్తం ఏరులయి ప్రవహిస్తే మేము ఎంత బాధ పడి పోవాన్నో చెప్పు? మా ఆపతిల , మా సంపతిల, మా ఏడుపుల, మా ఓదార్పుల అక్కరకు రాని నువ్వు ఇవాళ నీకు ఓట్ల అక్కెర బడంగనే అలాయి బలాయి దీసుకుంట
అంటే నిన్ను ఎట్లా నమ్ముమంటావు. మీ సోదరుడు రాజశెకరుడు 2009 ఎన్నికల పోలింగు అటు అయిపొంగానే , తెలంగాణాకు పోవాన్నంటే ఇక మనకు పాస్పోర్టులు గావాన్నత అని కారేడ్డమాడ లేదా?
టీ అర ఎస్ ను తిడితే తెలంగాణా ఉద్యమం గాదు? ఓ తెలంగాణా టి డి పి నాయకులారా మీరు తెలంగాణా కొరకు చేసిన పోరాటం ఏదైనా ఉంటె ఒక్కటి జెప్పండి. రాజీనామాలు అంటారా? అదొక జోక్ అయిపొయింది.
చేయవలసినప్పుడు వాళ్ళు చేస్తే మేము చేస్తామని డ్రామాలు చేసిండ్రు. సకల జనుల సమ్మె లో మీరు ఎక్కడబోయిండ్రు? పార్ల మెంటులో అసెంబ్లీలో తెలంగాణా రాష్ట్రం కోసం మీరు చేసింది ఏందో సెప్పుండ్రి?
నిన్నటికి నిన్న కిరణ్ కుమార్ తెలంగాణ ల తిరిగి పోయిండు. ఇవ్వాల తెలంగాణా టిడిపి వాళ్ళు చెంద్ర బాబును తిప్పిండ్రు, రేపు వై ఎస్సార్ పార్టి వాళ్ళు జగన్ ను తిమ్పుతారు. ఎల్లుండి నుంచి ఇదే సీమాంద్ర మీడియా,
సీమంద్ర పెట్టుబడి దార్లు అగాగో చూడండి తెలంగాణా ల తెలంగాణా వాదమే లేడని విశాలాంధ్ర విషం గక్కుతాడు పరకాల..
, ... ప్రజాస్వామ్యం గురించి తెగ బాధపడి పోతున్నారు గదా? 5 జనవరి 2010 నాడు డిల్లి లో చిదంబరమే ఏమన్నడు? ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను మనం పట్టించుకోక పొతే ఉద్యమం మన
చేతుల్లోంచి వెళ్లి పోవాల్సిన వాళ్ళ చేతుల్లోకి పోతది అని అనలేదా? మరి అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మతికి రాదు. చర్చిల్ మహాశయుడు అన్నట్టుగా నేను నీ ఆలోచనలతో అసలు ఏకీభవించక పోయినా
నీ ఆలోచనలు చెప్పుకొనే ప్రజాస్వామిక స్వచ్చకోసం నా గొంతులో చివరి ఉపిరి ఉన్నంత వరకు పోరాడుతా నని అన్నాడు గదా? మరి ఆ ప్రజాస్వామిక స్వేచ్చ ప్రకారమే గదా ఆనాడు బషీర్ బాగ్ లో అయినా
ఇయ్యాల 2009 ఎన్నికలప్పుడు నీవు అన్న తెలంగాణ వాదానికి ఎందుకు నిలబడుత లేవు అని నిలదీసిన పాపానికి ఐదువేల మంది అర్రేస్టు, వందల మంది తలలు పగుల గొట్టిచ్చి అక్రమ కేసులు
బెట్టిస్తావ్ ఇదేనా నీ ప్రజాస్వామ్యం అని తెలంగాణా ప్రజలు నిలదీస్తున్నారు. అట్లనే ఇంకొక్క మాట మా తెలంగాణా మాకు కావాలె అని పాటబాడినమా బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికి పిచ్చినావు , మా వీణవంక రవీందర్ రెడ్డి ని, మా కనుకా చారిని తెలంగాణా జనసభలో పనిజేసినందుకని నడివీధిలో నరికి చంపిపిచ్చినావు . అప్పుడు నీకు ప్రజాస్వామ్యం లో ప్రతి పౌరునికి తన భావం చెప్పుకొనే స్వేచ్చ ఉంటది అన్న విషయం ఎందుకు
గుర్తుకు రాలేదని అడుగుతున్నాం. నీకు ఒక్కనికే ప్రజాస్వామిక హక్కు ఉంటాడా? తెలంగాణా గడ్డమీద పుట్టిన పాపానికి మాకేవ్వరికి ప్రజాస్వామిక హక్కులు ఉండవా? అవి కేవలం మీ సమైక్యాంధ్రుల సొత్తు మాత్రమేనా?
పెంటయ్య. వీరగొని.
అడ్వకేట్
కరీంనగర్.