Monday, March 26, 2012

ప్రభుత్వమా ఎంత దయలేని దానవే !
గోదావరి నది పైన కరీంనగర్ జిల్లాలో రామగుండము మండలం ఎల్లంపల్లి వద్ద శ్రీపాద ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఇది తెలంగాణా లో కట్టబడుతున్నది కనుక తెలంగాణా ప్రజలకు మేలు చేసేదని భ్రమ పడు తున్నారు కొందరు. ఈ ప్రాజెక్ట్ 20 టియంసి ల నీళ్ళ సామర్థ్యం తో నిర్మిస్తున్నారు.
7 . 5 టియంసి ల నీళ్ళు రామగుండం ఎన్టిపిసి కి పోతాయి. మన నీళ్ళు మన బొగ్గు తో ఇక్కడ తయారౌతున్న 2600 మేఘవాట్ల విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్
వాటా 700 మేఘావాట్లు అయితే తెలంగాణాకు దక్కేది మాత్రం కేవలం 150 టిఎంసి లే. ఇక మంథని కి ఒక 2 .5 టిఎంసి లు ఇస్తుంటే మిగిలన 10 టిఎంసిల
నీల్లు మొత్తంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే గోదావరికి ఉపనది అయిన మంజీరా నుండి 30 టిఎంసిల నీళ్ళు హైదరాబాద్ కు ఎత్తుకేల్తూ మెదక్ , నిజామాబాద్ జిల్లాల రైతులను ఎండబెడుతున్నారు. అంతర్జాతీయ నది నీటి ఒప్పందం ప్రకారం ఒక నది పరీవాహక ప్రాంతానికి మరొక నది నీళ్ళు తరలించకూడదు.. కాని ఇక్కడ గొదావరినదీ జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి నిరాటంకంగా తీసుకొని పోతున్నారు. ప్రస్తుతం మనకు ఈ 10 టియంసిలే
కనిపిస్తున్నాయి కాని రేపు మొత్తంగా 20 టిఎంసి లకు 20 టిఎంసి లు ఎత్తుకొని పోతారు.
ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు 215 కిలోమీటర్ల దూరం చాలా పెద్దపెద్ద పైపుల ద్వారా లోయర్ మానేరు ద్యాములో ఉన్నన్ని తమకు ఒక నీటి చుక్క ఇవ్వకుండా తరలించుక పోతూ ఉంటె ఈ ప్రజలు చూస్తూ ఉండాల్సిందే. ఈ ప్రాజెక్ట్ వలన రామగుండం మండలానికి చెందిన ముర్మురు, ఎల్లం పల్లి, పోట్యాల,
మద్దిర్యాల, ఉండెడ, కొత్తపేట, వెమునూరు, చేగ్యాం, రామునూరు, ముత్తునూరు, మొక్కట్రావుపెట్ మరియు వెల్గతోఉకు కు చెందిన నాటి శాతవాహనుల
రాజధాని అయిన కోటిలింగాల ముంపుకు గురిఅవుతాయి.వీరికి చెందిన దాదాపు 10 వేల ఎకరాల భూమి మరో రెండు వేల నివాస గృహాలు లాగేసు కుంటున్నారు.అలాగే ఎలాంటి భూమి జాగా లేకపోయినా రెక్కల కష్టం జేసుఒని బతుకుతున్న వివిధ కుల వృత్తుల వారికి వారు ఎవరిపైనా అయితే ఆధార
పడి జీవేస్తున్నారో వాళ్ళను నిరాశ్రయులను చేయడం ద్వారా వీళ్ళూ జీవనోపాధి కోల్పోతున్నారు. తాటి, ఈత వనాలు, మామిడి, సీతాఫలాల, చెట్లను చంపెస్తున్నందున గౌడ, తెనుగు, ముదిరాజ్, గొల్ల కుర్మా కులాల వృత్తుల వాళ్ళు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. అయితే వీరందరికీ పునారావాసం
కల్పించే సమయం లో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో జివో 68 లో చెప్పింది. ప్రాజెక్ట్ వలన ఆయా ప్రాంతాల ప్రజల సమస్త జీవనోపాధిని లాగేసు కుంటున్నాము
అనే సానుభూతి మాటలు చెబుతూనే ఆచరణలో తిరకాసు పెడుతున్నది.
ఈ గ్రామాలన్నీ సింగరేణి బొగ్గు గనులకు సమీపంగా ఉన్నాయి.బతుకు దెరువు కోసం కొందరు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్లకు ఆయా గ్రామాలల్లో ఇండ్లు వ్యవసాయ భూములు ఉన్నాయ్. తాత్కాలికంగా పనిజేసే చోట ఉన్నప్పటికిని వాళ్ళ భూముల సేద్యం జేసుకోవడానికి తలిదండ్రులను చూసుకొవాదానికి వస్తుపొతూ ఉంటారు.అయితే పెద్దపల్లి రెవెన్యు అధికారులు మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదని పునరావాస లబ్ది చెల్లించ నిరాకరిస్తున్నారు.
వాళ్ళ భూములు ,వాళ్ళ ఇండ్లు, వాళ్ళ సమస్త బతుకు దెరువు మరేవరికోసమో త్యాగం చేయండని బలవంతగా నిరాశ్రయులను చేస్తున్నారు. వాళ్ళ తాత
ముత్తాతల నుండి వాళ్లకు అన్నం బెడుతున్న భూమి, పెండ్లిళ్ళు పేరంటాలు చేస్తున్న భూమి, చస్తే వాళ్ళ శవాలను బొందబెట్టుకోవడానికి కడుపు తెరుస్తున్న
నేల తల్లి. ఇప్పటికి ఉద్యోగ రీత్యా ఎక్కడ ఉన్నా ఎక్కడ చనిపోయినా శవాలని తీసుక వచ్చి ఆయా గామాలల్లోనే ఖననం చేసుకుంటారు. అయినా మీరు శాశ్వత నివాసస్తులు కారు మీకు పునరావాస లబ్ది లభించదు అంటూ మిక్కిలి నిర్దయగా వ్యవహరిస్తున్నారు రెవెన్యు అధికారులు.
వాళ్ళ పేరుతొ రెవెన్యు రేకార్డులల్లో భూములు ఉంటాయి,పంచాయితీ రికార్డులల్లో ఇండ్లు ఉంటాయి, ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటాయి, రేషన్ కార్డులు ఉంటాయి అయినా మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదంటున్నారు. ఒక వ్యక్తీ ఆస్తి ఎక్కడైనా కలిగి ఉండడం ప్రాథమికమైన హక్కు, అలాగే జీవించి ఉండడం కూడా
ప్రాథమిక హక్కే! అయినపుడు ఈ అధికారులు ప్రజల ప్రాథమిక హక్కులు అయిన ఆస్తి హక్కు, జీవించే హక్కులను కాల రాయడం లేదా? ప్రజల ఉప్పుదిని
బ్రతుకుతున్న ఈ ప్రభుత్వానికి , అధికారులకు ప్రజల హక్కులను కాపాడాలన్న స్పృహ లేకుండా పోతున్నది.
వందల ఏండ్ల నుండి ఈ గ్రామాలు ఉన్నాయి, గ్రామాలను ఒరుసుకొని గోదావరి నది పారుతున్నది.అయిన ఈ గ్రామాలకు ఒక్కనాడు గోదావరి నీళ్ళ రుచిని
ప్రభుత్వాలు చూపించ లేదు. ప్రజలు వాళ్లకు వాళ్ళు కలుగ జేసుకున్న నీటి వనరులు దప్ప ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాల రాశి ఏమి లేదు. వందల సంవస్తరాల నుండి కలో గంజో దాగి కలిసి మెలిసి జీవేస్తున్న ప్రజలను ఒక్క కలం పోటుతో ఉళ్లు విడిచి వెళ్లి పోమ్మంటుంటే తుపాకి దెబ్బకు పక్షుల గుంపు చెదిరిపోయినట్టు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రజలకు సానిభుతితో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్నారు.
ఈ గ్రామాలన్నీ ఒక నాడు ప్రజాపోరాటాల ఒరవడిలో ఎరుపెక్కిన చైతన్య వంతమైన గ్రామాలే. మా కాలి కింది దుమ్ము లాంటి వారురా మీరు అంటే ఆ దుమ్మే
వారి కండ్లల్లో ఎగిసి పడిన మట్టి ఇది. ప్రజా రాజకీయాలు నేర్పిన ఎందరో విప్లవ వీరులు నడయాడిన నేల ఇది. అన్నలె గనుక ఉండి ఉంటె మనకు ఈ దుస్తితి
దాపురించి ఉండి ఉండేదా అనుకొంటున్నారు వాళ్ళ సామూహ చర్చల్లో, ఓ ప్రభుత్వమా! సమస్య నీవే సృస్తిస్తావు, పరిష్కారం కోసం వస్తే నీకు దిక్కున్న చోట
చెప్పుకోమని వెక్కిరిస్తావు, ప్రజలను పోరాటాల వైపు ఎగదోస్తావు, ఆ తర్వాత ఆ ప్రజల పైననే తుపాకి ఎక్కుబెడుతావు.
తన ప్రజలను ఆ ప్రజల ప్రభుత్వమే కాల్చి చంపడం ప్రజాస్వామిక పాలన కాదు అని సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించినా ఈ అధికారులకు తలకేక్కనపుడు
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ వేదుక్కోవాలో ఆలోచించే వైపు ప్రభుత్వాలే నేట్టివేస్తున్నాయి .
పెంటయ్య. వీరగొని.

Friday, March 9, 2012

granait kvarees.

రాళ్ళు కావు అవి - రాతి పుటలు మరి !
ప్రజల మేలు కోసమే జీవిస్తున్నం అను మాయ మాటలు జెప్పి ప్రజలిచ్చిన ఓట్ల తో అధికారం లోకి వచ్చిన రాజకీయ నాయకులు ప్రజాప్రయోజనాలకు పూర్తీ
వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు చెందవలసిన ప్రక్రుతి సహజ సిద్ధమైన వనరులను అన్నింటిని టోకున గంప గుత్తా గా కొద్దిమంది సంపన్నులకు
అమ్ముకుంటున్నారు. ప్రజా వ్యతిరేకమైన పాలనా పాపం బద్దలై ఐదు రాష్ట్రాల్లో వారి అధికారం పేకమేడల్లా కూలిపోతున్న సందర్భం ఇది. ఐన ఇక్కడ
కరీంనగర్ జిల్లాలో రాజ్యం నిర్భీతిగా తన విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉంది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి లో ఎల్లమ్మ గుట్ట ను గ్రానైట్ క్వారీ యజమానులు
దసరా పండుగ నాడు యాత మాంసాన్ని కోసి పోగులేసుకున్న చందంగా ఖండ ఖండాలుగా ఖండించిన గండ శిలలను తరలించుక పోవడానికి రహదారి వేస్తున్నారు.రోడ్డుకు అడ్డం వచ్చిన అతి ప్రాచీనమైన మానవ నాగరికత ఆనవాళ్ళు అయిన బృహత్ శిలాయుగపు సమాధులను కూలదొస్తున్న దృశ్యాలను పరిశీలకులు గా వెళ్ళిన భూమి రక్షణ సంఘం బాధ్యులు మాడన కుమారస్వామి, మార్వాడి సుదర్శన్, తోటపల్లి జగన్మోహన్ రావు, మరియు తెలంగాణా ఐక్య కార్యాచరణ కమిటి కన్వీనర్ వీరగొని పెంటయ్య గమనించి నారు.
పొట్లపల్లి ఐదు వేల ఏండ్ల కిందనే ఆరు చదరపు మైళ్ళ విస్తీర్ణం తో నాగరికత విలసిల్లిన మహానగరం అని బయటి ప్రపంచానికి ఇంకా తెలియదు.ఊరికి ఉత్తరంగా
ఎత్తైన ఎల్లమ్మ గుట్ట. గుట్ట పైకి ఎక్కితే అక్కడ ఒక చతుర్ముఖ మంటపం ఆనవాళ్ళు, ఆ మంటపం తూర్పు ముఖం లో రాతి యుగపు ఆయుదాలయిన గోద్దన్లు రాతి గదలను బండ పై నూరిన ఆనవాళ్ళు. గుట్ట శిఖరం నుండి తూర్పు వైపు కొంచం కిందకు వస్తే గండు శిలల రాశి మధ్యన ఒక సొరంగం,ఆ సొరంగం గుహలో
ఆదిమానవులు నివసించిన ఆనవాళ్ళు. వాళ్ళు గీసిన ,చెక్కిన బొమ్మలు రాతి గోడల పైన సజీవంగా దర్శనమిస్తున్నాయి. గుట్ట మొదట్లోనే ఏ అజ్ఞాత శిల్పో
చెక్కిన అందమైన ఎల్లమ్మ శిల్పం ఉన్నది. అది దాటి కొంచం ముందుకు పొతే ఆ మధ్యన ఎప్పుడో దమ్మక్క ,సారలమ్మలకోసం గద్దెలు నిర్మించడానికి తవ్విన
పునాదులల్లో బయటపడ్డ పదుల సంఖ్యలో లభించిన అందమైన నాగాదేవతా శిల్పాలు ఉన్నాయి. స్తానికుల ను అడిగినపుడు గ్రామం లో ఎక్కడ తవ్విన ఈ నాగాదేవతా శిల్పాలు విరివి గా లభిస్తాయి అని ఆది కాలం లో ఎక్కడ జనమేజయునిలాంటి వారెవ్వరో సర్పయాగం చేసినాడట అంటున్నారు. అంటే నాగ జాతి
మూలవాసులకు మరో జాతితో జరిగిన యుద్ధం లో నాగజాతి వారు పెద్ద సంఖ్యలో మరణించి ఉండవచ్చు.గిరిజన సాంప్రదాయం ప్రకారం వారి జాతి నాయకుల
చిహ్నాలను రాళ్ళ పైన చెక్కుకొని ఉండవచ్చును. ఒక ఎల్లమ్మ, ఒక నాగదేవత లాంటి ప్రతిమలను చూస్తుంటే మాతృస్వామిక వ్యవస్థ పరిడవిల్లిన జాడలు ఇక్కడ
కనిపిస్తున్నాయి,
పొట్లపల్లి నుండి దేవక్క పల్లి దాకా వందల సంఖ్యలో విస్తరించి ఉన్న బృహత్ శిలయుగపు సమాధులను గమనించినపుడు ఎక్కడ క్రీస్తు పూర్వం మూడు వేల
ఏండ్ల కిందటనే ఒక గొప్ప నాగరిక సమాజం నడయాడిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సమీపం లోఉన్న మాల గూడెం గుహలో అజంతా , ఎల్లోరా చిత్రాలను
బోలిన రంగులతో వేసిన బొమ్మలున్నాయి. బౌద్ధ మతం కూడా గొప్పగానే విలసిల్లిన జాడలు తెలిపే బౌద్ధ శిల్పాలు కూడా అనేకంగా ఉన్నాయి.
పోట్లపల్లికి ఈశాన్య దిశలో పడి కిలో మీటర్ల దూరంలో బయ్యన్న గుట్టల శ్రేణిని ఆనుకొని దొనబండ గుట్ట ,మూడు రోకండ్ల గుట్ట , బాపనాయనగుట్ట, ను కలుపుకొని మహ్మదాపురం గుట్టల శ్రేణులు ఉన్నాయి. ఆగ్నేయ దిశలో మన్నేగుట్ట ,మీర్జాపురం గుట్టల శ్రేణులు ఉన్నాయి. ఎత్తయిన ఈ గుట్టల శ్రేణుల పైన
దట్టమైన అడవుల మూలంగా లభించిన పుష్కలమైన జల సంపదతో ఈ నేల విలసిల్లిందని చెప్పడానికి ఎల్లమ్మ గుట్ట సమీపాన్నే తూర్పు వైపు ఉన్న ఎడెడ్ల
వాగు ఒక సాక్షం. ఇది ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోనే అత్యల్ప వర్షా పాతం గల ప్రాంతం, కాని ఆనాడు ఈ ఎడెడ్ల వాగు దాటేతందుకు ఏడు ఎడ్లను జతలుగా కట్టి
దాటుతుంటే ఒకనాడు ఆ ఏడు ఎడ్లు కూడా వాగు ఉధృతికి కొట్టుకొని పోయినాయట. అందుకే ఆ వాగుకు ఆ పేరు స్తిరపడిపోయిందట.
ఈనాడు అణుబాంబు కలిగి ఉండడం ఎంత సాంకేతిక విప్లవమో ఆనాడు ఇనుము తయారి అంటే విప్లవకరం. పోట్లపల్లిలో ఇనుము వండిన చిట్లం విస్తారంగా
కనిపిస్తున్నది. అంటే అక్కడ ఉత్పత్తి చేయబడిన ఇనుము ఆయుధాలకు, వ్యవసాయ పనిముట్లకోసం దేశవిదేశాలకు ఎగుమతి చేయబడి పొట్లపల్లి మహానగరం
ఆనాటు కాస్మోపాలిటాన్ నాగరికతకు చిహ్నంగా విలసిల్లినదనడానికి గుర్తుగా ఒక పురుషుడు ఆవును తీసుకొని పోతుంటే స్తీ తన బాలునితో వెంట వస్తున్న
శిల్పం దొరికింది. ఇది మెసపటోమియా చిత్రాన్ని పోలియిన్నది.
క్రీస్తు పూర్వం 200 నుండి క్రేస్తుశకం 200 మధ్యకాలం లోనే మనుధర్మ శాస్త్రం భారత, రామాయణ రచనా కాలం అని చెప్పబడుతోంది.అంటే పొట్లపల్లి కి
ఇంతకంటే గూడా ప్రాచీనమైన చరిత్ర ఉన్నట్లే, క్రీస్తు పూర్వం 1300 నుండి 1200 మధ్యకాలం లో మన దేశానికి ఆర్యులు ఆగమనం జరిగితే ఇక్కడ అంతకు ముందే నాగరికత విలసిల్లిన ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ఆదిమ సమాజం నుండి , శాతవాహన, కాకతీయుల దాకా ఒక సజీవ స్రవంతి లా సాగిన మానవేతిహాస
నాగరికతకు చిహ్నమైన అలనాటి మాహానగరమైన పోట్లపల్లిని కబళించడానికి ఇనుపకోరల గ్రానైట్ రాక్షసి కాలుమోపింది.
అయితే ఏంటి ? సహజ వనరులు వాడుకో కూడదా? అభువ్రుద్ది జరుగ వద్దా? అంటున్నారు కొందరు.
ఎల్లమ్మ గుట్ట 200 ఎకరాలు విస్తరించి ఉన్నది. గుట్టపైకి ఎక్కితే చుట్టూ మూడు వేల ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉన్నది. గుట్ట ఓవర్ హెడ్ ట్యాంక్ అయినందున మార్చి ఏప్రెల్ నెలలోని మండుటెండల్లో కూడా చుట్టూ పచ్చని వరిపోలాలు ఉన్నాయి.రెండు కుంటలు రెండు చెరువులు ఉన్నాయి, వర్షాకాలం
లో ఇవినిండుతే రెండు పాటలకు ధోకా ఉండదు. గుట్ట పైన నూట యాభయి దాక గుడ్డేలుగులు( ఎలుగుబంట్లు), వెయ్యికి పైగా కోతులు, నెమల్లు, జింకలు,
ఎదుపందులు ,అడవి పందులు ఉన్నాయి. గ్రానైట్ బ్లాస్టింగులతో ఇవన్ని అయితే చనిపోవాలి లేదంటే జనం లోకి పోయి జనాన్ని అయిన చంపుతాయి.
గుట్ట చుట్టూ పదివేల తాడి చెట్లు ఉన్నాయి. మామిడి, బత్తాయి తోటలు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఇవన్ని దాదాపు పది వేల మంది జనాభాకు జీవనోపాధి
కల్పిస్తున్నాయి.
ఇప్పుడు అ గట్టాను ధ్వంసం చేస్తే భూగర్భ జలాలు అడుగంటి పోయి వ్యవసాయం వట్టిపోయి , తాటి, మామిడి, బత్తాయి తోటలు ఎండిపోయి పదివేల మంది
జీవనోపాధి పోయి రోడ్డున పాడుతారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే జూసిన ఈ క్వారీ ద్వారా ఏటా యాభై లక్షల రాయల్టీ వస్తుందనుకొన్న ఓ 20 ఏండ్లకు 10 కోట్ల
ఆదాయం వస్తుంది కాబోలు. కాని ఈ 20 ఎండ్లల్లో 10 నుండి 20 వేల మంది శాశ్వతంగా నిరాశ్రయులై పోతున్న దానితో పోలిస్తే ఈ 10 కోట్లు ఈ మూలకు?
నిన్నటికి నిన్న జస్టిస్ జి.ఎస్. సంఘ్వి, జస్టిస్ ఏ.కే . గంగూలి లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం నోయిడా ప్రాంతం లోని పేదల భూములు గుంజుకొని పెద్దలకు
పందేరం చేస్తున్న విధానం కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న చందంగా ఉందని అభిబర్నించింది .అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టీస్ ఎల్. నరసింహారెడ్డి ఎమ్మార్
భూముల కేసులో ఎపి ఐ ఐ సి ద్వారా రైతుల భూములు కొల్లగొట్టి ఎమ్మార్ సంస్తకు కట్టబెట్టడం మిక్కిలి అనైతిక హేయమయిన చర్య అని అభివర్ణించింది.
పోట్లపల్లిలో ఉన్న గ్రానైట్ సహజ sampada prajalandari ummadi aasti. staanika ప్రజల upaadhi avakaashaalanu ధ్వంసం chesi , అతి pracheena itihaasa charitranu parishodhanalaku ఆనవాళ్ళు lekundaa chesi ikkadi ప్రజల jeevinche hakkunu kaala raasi
kevalam videshi avasaraalakosam , koddi మంది bada kantraktarlu marinni కోట్లు ఈ రాళ్ళ నుండి pindukovadaaniki palakulu
చేస్తున్న అతి kruramaina చర్య ఇది.
ikkadi prajalu ఈ గ్రానైట్ kvareeni nilipi veyaalani dimand chestunnaru. తన raajyaadhikaaram తో paalakulu kvaareeni
nadipistaamani mondi గా ముందుకు velite praja poraataala mundu paalakulu paraajitulu kaaka tappadu.
పెంటయ్య. వీరగొని.
కరీంనగర్.