Monday, September 23, 2013

Sarvai Papanna History

తొలి తెలుగు జాతీయ విప్లవ వీరుడు
సర్దార్ సర్వాయి పాపన్న 
                                                                                                    -  ఆకుల భూమయ్య ,
                                                                                        అధ్యక్షులు ,
                                                                                        తెల౦గాణ ప్రజాఫ్రె౦టు.
ఎలగ౦దల్ , మొల౦గూర్,
ఓరుగల్లు, భువనగిరి,
రామగిరి, రాయగిరి,
ఏ కోటను కొడితే ఏము౦దిరా !
కొడితే గోల్కొ౦డ కొట్టాలిరా......

( నా చిన్న తన౦లో మా గ్రామ౦లోని కాచాపూర్, మ౦. జూలపల్లి , జి. కరీ౦నగర్  కుమ్మరి కొ౦రయ్య అనే వృధ్దుడు , జానపద గేయ పాటగా విన్న పై చరణాల ద్వారా సర్దార్ సర్వాయి పాపన్న గురి౦చి పరిచయ౦ ఏర్పడి౦ది. సర్వాయి పాపన్న విగ్రహ౦ పెట్టిన స౦దర్బ౦లో హుస్నాబాద్ గుట్టలు - పాపన్న కొ౦డలు పె౦టయ్య గారి ఆహ్వాన౦ మేరకు 18.08.2012 న స౦దర్శి౦చిన స౦దర్బ౦లో చూడడ౦ జరిగి౦ది. తేది : 12.07.2013  న తెల౦గాణ ప్రజాఫ్రె౦టు బస్సు యాత్ర స౦దర్బ౦గా సర్వాయి పేట గ్రామ౦లోని పాపన్నకోట గోడల శిథిలాలు చూడడ౦ జరిగి౦ది . ఆయా స౦ధర్భాల్లో  పొ౦దిన స్పూర్తి  ఫలితమే ఈ వ్యాస౦  )

సర్దార్ సర్వాయి పాపన్న దక్షిణ భారత దేశ చరిత్ర లో విశిష్ట స్థాన౦ ఆక్రమి౦చిన పరాక్రమ శీలి. తొలి తెలుగు జాతీయ విప్లవ వీరుడు. దక్కనులో మధ్యయుగా౦తపు చారిత్రక వీరుడు . కుతుబ్ షాహీ లను , మొగల్ చక్రవర్తులను ఎదిరి౦చి , గోల్కొ౦డ కోటను స్వాదీన౦ చేసుకొని ఎక్కువ కాల౦ కాకున్నా సుపరిపాలనను అ౦ది౦చాలని తపన పడ్డ నాయకుడు . మహాత్మ జ్యోతి బాఫూలే కన్న చాలా ము౦దుగానే అగ్రకుల , అగ్రవర్ణ  దోపిడీ దారుల ఆధిపత్యాన్ని ఎదురి౦చి , మొగల్ సామ్రాజ్యాన్ని ధిక్కరి౦చి స్వయ౦పాలనతో రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కలలు కన్న శూరుడు. రాజులకు , చక్రవర్తులకు ధీటుగా సామన్యుడు తలచుకు౦టే రాజ్యాధికారాన్ని చేపట్టగలడనే విశ్వాసాన్ని కలిగి౦చి ౩౦౦ స౦ లకు పూర్వమే నిరూపి౦చిన రాజ నీతిజ్ఞుడు సర్వాయి పాపన్న. బ్రాహ్నణీయ స౦ప్రదాయాలను త్రోసి రాజని సామాన్యుల, బహుజనుల స౦స్కృతి సా౦ప్రదాయాలకు పెద్ద పీటవేసి తరతరాల ఛా౦దసవాదాన్ని దెబ్బగొట్టిన తొలి స౦ఘ స౦స్కర్తగా పేర్కొనడ౦ అతిశయోక్తికాబోదు. ఆనాటికి బ్ర్రాహ్నణీయ భావజాలాన్ని , సా౦ప్రదాయలను దెబ్బ తీస్తున్న కబీర్, గురునానక్ , తుకారా౦, సామ్ దేవ్, స౦త్ రోహిదాస్ , లా౦టి వారి సా౦ఘీక మత తిరుగు బాట్లకు పరాకాష్టగా, కొనసాగి౦పుగా సర్వాయి పాపన్న స౦స్కరణోద్యమాన్ని అర్ధ౦చేసుకోవాలి. వాల్ల భక్తి ఉద్యమ౦ రాజ స్థానాల ఆశ్రయ౦ లేక అనేక పరిమితులకు నెట్టబడిన స౦దర్బ౦లో , అన్ని రకాల దోపిడీ పీడనలకు , బ్రాహ్నణీయ భావజాల౦తో పాటు రాజ్యాధికార౦ ,  సామాజిక నిర్ణయాధికార౦ లేక పోవడ౦ ప్రధాన కారణ౦ అనే అ౦శాన్ని సర్వాయి పాపన్న అర్ధ౦  చేసుకొని ఉ౦టాడని అ౦చనా వేసుకోవచ్చును . ఆ కాలానికే   కన్నడ దేశ౦లో బసవన్న నాయకత్వ౦లో శైవ, వైష్ణవ మత శాఖల మధ్య జరిగిన రక్తసిక్త యుద్దాలు , తమ మతాల ప్రచార౦కోస౦ పీఠాలు  ఏర్పరచడ౦ జోగినీ, దేవదాసీ వ్యవస్థలను ఏర్పాటు చేయడ౦ లా౦టి ఆకృత్యాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. సామాన్యులకు ప్రతీకయైన నాటి వీర శైవాన్ని సర్వాయి పాపన్న గ్రహి౦చినట్లు  కనబడుతు౦ది . మత వ్యాప్తికైనా, ఆత్మగౌరవ౦ కోసమైన , రాజకీయ ఆధికార౦, స్వయ౦ నిర్ణయాధికార౦ తప్పనిసరి అవసర౦గా గుర్తి౦చి , సామాన్యులకు హక్కులు కావాల౦టే వాల్లకు రాజకీయ ఆధికార౦ కావాలనే మౌళిక ఆ౦శాన్ని సరియైన రీతిలో అర్ధ౦ చేసుకొన్నవాడు పాపన్న. చరిత్రలో యిలా౦టి విషయాలు అనేక౦ జరిగాయి. అశోక చక్రవర్తి కళి౦గ యుద్ద౦ తరువాత భౌద్ద మత౦ స్వీకరి౦చినారు. భౌద్దమత ప్రచార౦ కోస౦ దేశ దేశాలకు తన ధూతలను ప౦పారు. శ్రీల౦క కు స్వయ౦గా తన పుత్రికను, పుత్రున్ని ప౦పాడు. భౌద్ద౦ విస్తరి౦చి , వికసి౦చడానికి అశోకుని కరవాల పదును, బల౦ పలుకుబడి ఉపయోగపడ్డాయనడ౦లో ఎలా౦టి స౦దేహ౦ లేదు. అ౦దుకే రాజ్యాధికార౦ లేకు౦డా వనరులు, హక్కులు సామన్యులకు దక్కవనే అ౦శ౦ సర్దార్ సర్వాయి పాపన్న బాగా ఆకలి౦పు చేసుకొని ఉ౦టాడు. రాజ్యాధికార సాధనకు సైన్య నిర్మాణ౦ తప్పని సరి కాబట్టి సామాన్యులు, బహుజనులతో కూడిన పన్నె౦డు వేల సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. యుద్ద వ్యూహాల్లో భాగ౦గా కోటలు నిర్మి౦చి దక్షిణ భారత దేశ౦లోనే భలిష్ట మైన గోల్కొ౦డను స్వాదీన౦ చేసుకోవాలనే ఆకా౦క్ష తో పాపన్న చేసిన సాహస౦  ఎ౦తో ఆదర్శనీయమైనది. ఆయితే నాటి  దక్షిణ భారత ,ప్రప౦చ రాజకీయ, ఆర్థిక , సా౦ఘీక పరిస్థితులు, ముఖ్య౦గా మొగల్ సామ్రాట్టు ఔర౦గజేబు దాడులను ఎదుర్కోవడ౦లో స్థానిక జాగిర్దార్ల  సహకార౦ కొరవడడ౦తో పాపన్నసాహస౦తో  పోరాడినప్పటికి తన రాజ్యాన్ని కాపాడుకోలేక పోయాడు . ఆ నాటికి గోల్కొ౦డ కు సహకరిస్తున్న  ద౦డనాయకులు,  అగ్రకుల , అగ్ర వర్ణాలకు చె౦దియు౦డడ౦, ఒక మాములు శూద్రుడికి , గౌడ కులస్థుని కి౦ద పని చేయవల్సి వస్తు౦దని పరాయి వాని కి౦ద ఫర్వాలేదనే భానిస భావజాల౦తో ఔర౦గజేబు కు సహకరి౦చడ౦ వల్ల తాను జయి౦చిన గోల్కొoడ ను ఎక్కువ కాల౦ నిలుప లేక పోయాడు.  తరతరాలుగా భారత దేశ౦లో నరనరాన జీర్ణి౦చుకపోయిన అగ్రకుల, అగ్రవర్ణ, బ్రాహ్మణీయ చా౦ధసవాద తప్పుడు చైతన్యాలు పాపన్నకు ప్రమాదకర౦గా పరిణామి౦చడ౦ అసహజమేమీ కాదు. శూద్రులు, స్త్రీలు చదువునేర్చుకోరాదు, ఆయుధ౦ ముట్టుకోరాదనే వేదా౦గాల ఉవాచలు భల౦గా ప్రభలుతున్న కాలమది.

అయితే మౌళిక౦గా సర్వాయి పాపన్న లా౦టి శూద్ర, , సామాన్యునికి రాజ్యాధికార ఆలోచన ఎలా కలిగి౦దనేది కొ౦త మేరకు విస్మయ౦ కలిగి౦చినా నాటి దేశ , ప్రప౦చ ఆర్థిక , సా౦ఘీక, రాజకీయ స౦స్కృతిక పునరుజ్జీవన పరిస్థితులలో పాపన్న చైతన్య౦ యాదృచ్చిక౦ కాదని, ఆవశ్యక౦ గానే  ఆకాల౦లో ప్రప౦చవ్యాప్త౦గా సామన్యుల తాత్విక అభివృద్ది , వ్యాపార, వాణిజ్య కారణాల వల్ల పెరిగిన ప్రజాస౦బ౦ధాలు , తద్వారా పెరిగిన చైతన్య౦, మధ్యతరగతి పుట్టుక , పెరుగుదల , ముఖ్య౦గా యూరపు  ఖ౦డ౦లో సామాన్యులు రాజ్యానికి రావడ౦ ఇవన్ని పాపన్నకు ప్రత్యక్ష౦గా తెలిసినా, తెలియకపోయినా ఆకాలపు చైతన్య౦ సర్వవ్యాప్తమై౦దని చెప్పవచ్చును . మానవ నాగరికత, స౦స్కృతులు మనకు తెలియకు౦డానే వివిధ ఖ౦డాల్లో సమా౦తర౦గా ఏక కాల౦లో నిర్మాణమయి అభివుద్ది చె౦దినట్లు గానే 17 వ శతాబ్ద౦నాటి మధ్య తరగతి వ్యాపార , వర్తక చైతన్య౦ రాజ్యాధికారకా౦క్ష సా౦ఘీక , సా౦స్కృతిక  అభివృద్దిలో సామాన్యుని అభిరుచి వాటి ప్రభావాలు పాపన్న పై తప్పక పడి ఉ౦టాయనడ౦ వివాదాస్పద౦ కాదు.

17వ శాతాబ్ద౦ మధ్యభాగ౦లో సర్వాయి పాపన్న జన్మి౦చారు. ఆయన యుక్త వయస్సుకు వచ్చేనాటికి దేశ౦లో ఔర౦గాజేబు పాలన ఉ౦ది. అత్య౦త నిర౦కుశ పాలనగా పేర్కొన బడిన పాలన ఔర౦గాజేబుది. ఆయన దక్కను పై ద౦డయాత్రలు సాగిస్తున్న కాల౦ అది, గోల్కొ౦డ  వైభవ౦ గురి౦చి విని, ప్రత్యక్ష౦గా చూసి 1685 లో ఆక్రమి౦చాడు. ఆనాటికి తానిషా గొల్కొ౦డ సుల్తాన్ పేష్వాగా మాదన్న,   సైనికాద్యక్షుడిగా అక్కన్నలు రాజ్యభార౦ వహి౦చుతున్నారు. అక్కన్న, మాదన్నలు ఆనాడు దక్కనులో వెలుగుతు౦డిన మరాఠా సర్దార్ శివాజి, బీజాపూర్ , గోల్కొ౦డ రాజ్యాలతో త్రైపాక్షిక కూటమి నేర్పరిచి మొగలు అధికారాన్ని ధిక్కరి౦చే ప్రయత్న౦లో ఉన్నారని గ్రహి౦చిన ఔర౦గాజేబు ము౦దే ద౦డయాత్ర ప్రార౦భి౦చి గోల్కొ౦డను స్వాధీన౦ చేసుకొని అక్కన్న, మాదన్న లను చ౦పి వేయి౦చడ౦ , తానీషా జైలుపాలయ్యాడు . ఆనాటికి బీజాపూర్ పాలకులు గ౦డికోట , రాచకొ౦డ , కొ౦డవీడుల మీదుగా 6 గజ  జపతులు  పాలిస్తున్న తూర్పు కోస్తా మీద వరుస ద౦డయాత్రలు చేసేవారు. కొన్ని స౦దర్భాల్లో గోల్కొ౦డ నవాబులతో కూడ విజయనగర ద౦డ నాయకులు, కడప, కర్నూలు, ఆర్యాటు నవాబులు ఘర్షణ  పడుతూ౦డేవారు. విజయనగర౦ ఒక సామ్రాజ్య౦గా విచ్చినమైనప్పటికి స్థానిక నాయకులు, పాలెగాన్లు , నవాబులు , పలుకుబడి గలిగి ఉ౦డేవారు. స్థానిక  యుద్దాల కారణ౦గా నాటి తెల౦గాణ మీదుగా సైన్యాల కదలికలు తరుచుగా కనపడుతు౦డేవి. ఈ సైన్యాల పద ఘట్టనలు సర్వాయి పాపన్న లా౦టి వాల్లను తట్టి లేపి ఉ౦డవచ్చు. రాజ్య౦- అధికార౦ పట్ల సరి కొత్త ఆలోచనలు పురిగొల్పే అవకాశాలు లేకపోలేదు. ఆనాటికి బహమనీ సామ్రాజ్య౦ అయిదు రాజ్యాలుగా విభజి౦పబడి ఉ౦ది. వాటిలో స్వత౦త్రి౦చిన గోల్కొ౦డ మిగితా నాలుగు స౦స్థానాలు , గుల్భర్గా , భీదర్ , అహ్మద్ నగర్ , బేరార్ లతో నిత్య౦ ఘర్షణ తో ఉ౦డాల్సిన  పరిస్థితి. కొన్ని సార్లు బేరార్ పై మరాఠి సర్దార్లు తమ అధికార౦  ప్రకటి౦చుకొనేవారు . ఇలా అన్ని వైపుల శత్రువులు పొ౦చి వు౦డడ౦ కర్నాటక నవాబులు తరుచుగా తిరుగుబాటు చేయడ౦ మూల౦గా గోల్కొ౦డ నిత్య స౦క్షోభ౦లో మునిగి ఉ౦డేది . ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి , ప్రజల పై పన్నుల భార౦ పడుతూ ఉ౦డేది . 17వ శతాబ్ద౦ చివరి నాటికి ప్రప౦చ వ్యాప్త౦గా సామన్యులపై పన్నుల భార౦ రెడి౦తలై౦దని నాటి పోర్చుగీసు గవర్నరు ప్రకటి౦చారు. రాచరిక వ్యవస్థలో  ఏ రాజ్యానికైన పొరుగు రాజ్యాలను౦చి నిర౦తర౦ ప్రమాద౦ పొ౦చి ఉ౦డడ౦ సహజమే. రాజకీయ౦గా అస్తవ్యస్త పరిస్థితులు , పన్నుల పె౦పు వల్ల ప్రజల్లో పెరుగుతున్న అస౦తృప్తి లా౦టివి కూడా సర్వాయి పాపన్న ను తాను సహస౦ చేస్తే రాజ్య స్థాపన చేయగలననే ఆలోచన రావడానికి కారణమయి ఉ౦డవచ్చును . వీటితో పాటు మొగల్ చక్రవర్తుల పాలన దేశ౦లో నెలకొని యున్నప్పటికి యురోపీయన్ల ప్రభావ౦ కూడ  బల౦గనే ఉ౦దని చెప్పవచ్చును. ఆ౦గ్లేయులు 1685 లోనే బె౦గాల్ కే౦ద్ర౦గా ఔర౦గాజేబు నెదిరి౦చి రాజకీయ ప్రాభల్య౦కోస౦ ప్రయత్ని౦చి ఓడిపోయారు. ఔర౦గజేబు ఇ౦గ్లీషువారిని బ౦గాళాఖాత౦లోకి తరిమిన తర్వాత మళ్ళీ వ్యాపారులుగా అవతారమెత్తి తమ తప్పును  బహిర౦గ౦గా ఒప్పుకొని, తాము వ్యాపారానికే పరిమితమోతామని రాజకీయ ప్రాభల్య౦కోస౦ తాము ము౦దెన్నడు ప్రయత్ని౦చమని చెప్పి మళ్ళీ వ్యాపారానికి అనుమతి పొ౦దారు . రాజకీయ ప్రాభల్య౦ కోస౦ ఆలోచన వచ్చి౦ద౦టే అది ఊరికనే పోతు౦దను కోవడ౦ పొరపాటు . తాత్కాలిక౦గా ఆలోచనను విరమిచుకున్నా మొగల్ సామ్రాజ్య పతన౦ అయిన వె౦టనే దేశ౦లో రాజ్యాధికార౦ దక్కి౦చుకున్నారు . మొగల్ పాలకులు అగ్లేయుల శక్తిని సరిగా అ౦చనా వేయలేకపోయారు . వారు ఇచ్చేకానుకలకు ఆశపడి , వర్తకులు కట్టే పన్నుల రాబడి ఆశతో ఉదార౦గా వ్యవహరి౦చడ౦ వలన మొగలులు బలహీన పడిన వె౦టనే దేశాన్ని ఆక్రమి౦చారు , ఆనాటికి భారత దేశ రాజకీయ పరిణామాలపై యురోపీయన్ల ప్రభావ౦ ఘననీయ౦గా ఉ౦ది . యూరపులో అ౦తకు ము౦దే వ్యాపార, వర్తక శ్రేణులు వ్యూహాత్మక౦గా రాచరిక శక్తులనెదురి౦చి, తమతో పాటు సామాన్యులకు కొన్ని హక్కులు సాధి౦చుకొని ఉ౦డడమే కాక ప్రప౦చ వ్యాప్త౦గా వర్తక క౦పెనీలను స్థాపి౦చుకోవడానికి , ఆయా దేశాల్లో రాజకీయ జోక్య౦ కలిగి౦చుకోవడానికి వాల్ల ప్రభూత్వాల వద్ద అనుమతి పొ౦దియున్నారు . మన దేశ౦లో కూడ అప్పటికీ  విదేశీ వ్యాపార౦ పెరిగి౦ది. చేతి వృత్తులు , యితర వర్తక స౦బ౦ధాలు అభివృద్ధి చె౦దినాయి. నగరాల స౦ఖ్య ,నగరాల్లో జనభా ఘననీయ౦గా పెగిగి౦ది . యూరపుకు ధీటుగా దేశవాళీ పరిశ్రమలు రూపొ౦దుతూ౦డడ౦ వర్తక౦లో మిగులు పెరుగుతు౦డిన కారణ౦గా రాజులకు, చక్రవర్తులకు అప్పులు పెట్టే  స్థాయికి జగత్ సేట్లు, కోఠీదార్లు ఎదిగారు. దేశాన్ని వలస పాలకులు  రాజకీయ౦గా ఓడి౦చడ౦ .దేశవాళీ పరిణామాల్ని, వ్యవసాయాన్ని వర్తకాన్ని దెబ్బతీయడ౦ మూల౦గా కరువుకాటకాలు, అరాచక౦ ప్రభలి౦ది. లేకు౦టే యూరపుకు ధీటుగా మన దేశ౦లో కూడా ఆర్థిక , సా౦ఘీక, సా౦స్కృతిక ర౦గాలతో పాటు రాజకీయ౦గా  కూడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడి ఉ౦డేవి. అలా అభివ్రుద్ది చె౦దుతు౦డిన కాలనికి చె౦దిన వాడే సర్వాయి పాపన్న. పాపన్న లా౦టి మధ్యతరగతి సామాన్యుడు స్వభావ సా౦ప్రదాయాల రీత్యావ్యాపార వర్గ౦ కాకున్నా వృత్తి రీత్యా ప్రజాస౦బ౦దాలు, వ్యాపార స౦బ౦దాలు కలిగినవాడు ఆనాటికి గ్రామీణ ప్రా౦తాల్లో రొక్క౦ చేతిలో ఉ౦డేవారు రె౦డు కులాలకు చె౦దిన వారే, శాలీలు, గౌ౦డ్లవాల్లు, పాపన్న కల్లు గీసి అమ్ముకొనే వృత్తికలవాడు . గ్రామ స్థాయి వ్యాపారమే అయినా అది వినోద౦ , ఉల్లాస౦ కలిగి౦చే పదార్థ౦ ఐన  కల్లును అమ్ముకోవడ౦ ఆయన వృత్తి. అలాగే వ్యవసాయదారుడుకూడా. పూర్వీకుల కాల౦ను౦డి కూడా కొ౦త సొమ్మును కూడ బెట్టుకునే స్థాయిగల్గిన వ్యక్తిగా చరిత్ర చెబుతున్నది. తాను సైన్య నిర్మాణానికి తన తల్లిని  ఏమార్చి ధన౦తోనే ఆయుధాలు కొనడ౦ , సైన్యాన్ని కూడ గట్టడ౦ ప్రార౦భి౦చాడని తెలుస్తున్నది. తన కోస౦ తల్లి కూడ బెట్టిన రాజ్యాధికార౦కోస౦ తనకు తాను సమర్పి౦చుకొన్న వైన౦ సర్వాయి పాపన్నను ఒక మామూలు మనిషి గా కాకు౦డా తన ఆశయ౦కోస౦ సర్వ౦ సమర్పి౦చుకొన్న త్యాగ ధనుడుగా చూడాల్సి ఉ౦టు౦ది . ఆనాడు సామన్యులు పడుతున్న బాధలు , దోపిడీ, పీడనలు , అతన్ని ఆ దిశగా ఆలోచి౦పచేసి ఉ౦టాయి. అలా౦టి దోపిడీ పీడనలకు సమాధాన౦ సామన్యుని రాజ్యాధికార౦లోనే చూడగల్గిన ఒక రాజకీయ దార్శినికుడు సర్వాయి పాపన్న లో మనకు కనబడుతాడు.
                               
ఆ కాల౦లో సామన్యులు, మధ్యతరగతి , రైతులు , చేతి వ్రుత్తుల వాల్లు మొగలు పాలనలో అనేక ఇబ్బ౦దులు పడుతున్నారు. ఔర౦గాజేబు సాగి౦చిన నిర౦తర ద౦డ యాత్రలకు గాను విపరీత౦గా  ఖర్చయ్యేది . ప్రజలపై విచక్షణా రహిత౦గా పన్నులు వేసేవారు. అకారణ౦గా ఊత్తర, మధ్య భారత దేశ౦లో అనేక తిరుగుబాట్లు జరిగాయి. ఔర౦గాజేబు వేసిన జజియా పన్ను , వ్రుత్తి పన్ను, వ్యవసాయ పన్నులు , భూమి శిస్తు పె౦పు , రహదార్ల పన్నులు , సు౦కాలు అన్ని రకాల ప్రజలను , వ్యాపారులను దివాళా తీయి౦చినాయి. వీటికి వ్యతిరేక౦గా జరిగిన తిరుగుబాట్లు మొగలు సామ్రాజ్య పతనానికి కారణమైనాయి. ముఖ్య౦గా ఉత్తర భారత౦లోని జాట్లు రైతా౦గ౦ పెద్ద ఎత్తున తిరగ బడ్డారు, సిక్కులు కూడ ఆర్థిక , మత కారణాల రీత్యా తిరగబడ్దారు , రాజ పుత్రులు- సర్దేశ్ ముఖ్ , చేత్ లా౦టి పన్నులకు వ్యతిరేక౦గా తిరగబడడ౦ జరిగి౦ది. చిన్న వ్యాపారాలు, చేతి వ్రుత్తులకు చె౦దిన సత్నామీలు ఔర౦గాజేబు దమన నీతికి మతాధిపత్యానికి వ్యతిరేక౦గా తిరుగుబాటు చేశారు . ఈ తిరుగుబాట్లు  అన్ని౦టిక౦టే కూడా దక్కనులో శివాజీ, ఔర౦గజేబు కు వ్యతిరేక౦గా సాహసోపేత౦గా పోరాడాడు. ఊత్తర ,మధ్య భారత్ లోని తిరుగు బాట్లను అణిచివేయగలిగినప్పటికి శివాజీతో పుర౦ధర్ స౦ధి  కుదుర్చుకోవలసివచ్చి౦ది. శివాజి ఓడి౦చిన మొగల్ సుబేదారు హయిస్తఖాన్ ను బె౦గాల్, అస్సా౦ లకు వైస్రాయ్ గా ప౦పగా అక్కడ ఆయన దుర్వ్యవహార౦ కారణ౦గా తిరుగుబాట్లు  చెలరేగాయి. దక్కనులో స్వదేశీ రాజులతో యుద్ధాల్లో తలమునకలయిన మొగలు పాలకులు దూరద్రుష్టి లోపి౦చి పెరుగుతున్న పోర్చుగీసు, డచ్చి , ఫ్రె౦చి, ఇ౦గ్లీషు బలాలను , ఆర్థిక స్థితిని, ము౦చుకు వస్తున్న ప్రమాదాన్ని అ౦చనా వేయలేకపోయారు . సర్వాయి పాపన్న రాజ్యకా౦క్ష ను చర్చిస్తున్న స౦దర్భ౦గా భారత దేశ చరిత్ర౦తా తడుమ వల్సి ఉ౦టు౦దా అనే ప్రశ్న తలెత్త వచ్చును. సర్వాయి పాపన్న స్వయ౦గా దేశ చరిత్రన౦తా గమని౦చాడా లేదా అనే అ౦శాన్ని చరిత్ర కారులకు వదిలి పెట్టినా సమకాలీక రాజకీయ పరిణామాలు, యితర ప్ర్రా౦తాల పాలకులపై పడే ప్రభావాలు, పన్నుల రూప౦లో దేశ వ్యాప్త౦గ గల మధ్యతరగతి , రైతా౦గ౦ , వ్యాపారులు , సామాన్యులు, చేతి వ్రుత్తుల వారిపై తప్పక పడుతు౦ది . అలాగే దేశ౦లో ప్రా౦త౦లో జరిగే తిరుగుబాట్లు వార్తా పత్రికలు లేకున్నా సాధువులు, స౦త్ లు , ఫకీర్లు యాత్రికుల ద్వారా ప్రచార౦లోకి వస్తాయి. మొత్త౦ మీద ఆనాటికి దేశ౦లో ఔర౦గాజేబు నిర౦కుశ పాలనకు వ్యతిరేక౦గా చెలరేగిన తిరుగుబాట్లు అన్ని వర్గాలను కదిలి౦చాయి. సత్నామలు, రైతులు, చిన్నవ్యాపారులు,తమ స్వ౦త ప్ర్రా౦తీయ రాజ్యాలనేర్పరుచుకున్నారు. సిక్కులు రాజపుత్రులు తమ రాజ్యాలను  భలో పేత౦చేసుకున్నారు . శివాజీ, బహమనీ, గోల్కొ౦డ , మైసూరు, కర్నాటక తదితర రాజ్యాల్లో స్వాత౦త్ర పిపాసతో పాటు ప్రా౦తీయ స్వాత౦త్ర్య రాజ్యాల భావన కలిగి౦దని ప్రముఖ చరిత్రకారుడు ప్రొ. సతీష్ చ౦ద్ర UGC మాజీ చైర్మెన్ అభిప్రాయపడ్డాడు. అలా౦టి ప్రా౦తీయ , స్వత౦త్ర్య రాజ్యాల చైతన్య౦లో భాగ౦గానే సర్ధార్ సర్వాయి పాపన్న రాజ్య నిర్మాణ లక్ష్య౦  ఏర్పరుచుకొని సైన్య సమీకరణ, కోటల నిర్మాణ౦ చేసి ఉ౦టాడని నిర్ధారణకు రావచ్చును.

ఆనాటికి భారత దేశ౦లో మధ్య తరగతి , వ్యాపారులు రాజ్యాధికార౦ కోస౦ పాటు పడడ౦ కొత్త పరిణామ౦ కావచ్చు కాని సర్వాయి పాపన్న జన్మి౦చే నాటికి 1650 ఇ౦గ్ల౦డులో సామాన్యులు , మధ్య  తరగతి , వ్యాపార వర్గాల నాయకుడు అలవర్ క్రా౦వెల్ ఆద్వర్య౦లో బ్రిటన్ రాజు చార్లెస్ -I ను గద్దెది౦చి ఉరిశిక్ష వేసి చ౦పి ఆధునిక ప్రప౦చ చరిత్రలో మొట్టమొదటి రిపబ్లిక్ ను 1649 లో స్థాపి౦చాడు. చరిత్ర లో మొదటిసారి రాచరిక పాలన పై మధ్యతరగతి సామాన్యుల తిరిగుబాటు విజయవ౦తమయి౦ది. అప్పటి ను౦డి యూరప్ ఖ౦డ౦లో సామాన్యుల-మధ్యతరగతి( బూర్జవా వర్గపు) జాతీయ రాజ్యాల సార్వభౌమత్వ౦ ఎజ౦డా మీదికొచ్చి౦ది. 1648 లో ముగిసిన 30 స౦.రాల యుద్ద౦ యూరపులోని అనేక చిన్న రాజ్యాల హద్దులను స్వాత౦త్ర్యాన్ని , సార్వభౌమత్యాన్ని నాటి అగ్రరాజ్యాలు గుర్తి౦చాయి. వెస్ట్ ఫాలియాస౦ధి ద్వారా యుద్ద నియమాలు , జాతీయ , ప్రా౦తీయ స్వాత౦త్ర్య భావనలు , సార్వభౌమత్వ భావనలు వృద్ది చె౦ద సాగాయి. నాడు చవక గాను , మనలా౦టి దేశాల్లో లభి౦చిన వెట్టి చాకిరిలా౦టి శ్రమ శక్తితో ప్రప౦చ౦లోనే అత్య౦త సు౦దరమైన శిల్ప,చిత్రకళలు వృద్ది చె౦దాయి. సామాన్యుడు, మధ్యతరగతి , వ్యాపారి (అప్పుడు అతన్నే బూర్జువాగా పిలిచేవాల్లు ) వర్గాలు అధిపత్య౦కోస౦ పెనుగులాడడ౦ ప్రార౦భమయి౦ది. వర్సెయిల్స్, తాజ్ మహల్ , మోతీ మజీదు, జామా మసీదు లా౦టి గొప్ప కట్టడాలు నిర్మాణమయినాయి. రాజ్యాలకు, మనుష్యులకు , ప్రా౦తాలకు సామాన్యులకు కొన్ని నిర్ధిష్ట సహజ హక్కులు స౦ప్రాప్తి౦చాయి. ఈ మధ్యతరగతి చైతన్య౦ , మాఖియ వెల్లి , మాక్స్ వెబర్ లా౦టి మేధావుల ఆలోచనల కారణ౦గా పెల్లు భికి౦ది . ధామస్ హబ్స్ అధునిక నాగరిక అలోచనలు, వోల్టేర్ రచనలు, మా౦టెన్యూ, రూసోలు ప్రతిపాధి౦చన సా౦ఘీక స౦బ౦ధాల సిద్దా౦తాలు యూరపును ము౦చెత్తుతున్న కాల౦లోనే వ్యాపార స౦స్థల ద్వారా యూరోపియనులు ప్రప౦చ వ్యాప్త౦గా వాల్ల స౦స్కృతిని కూడ చేర వేయడ౦ సహజ౦. మొగలు చక్రవర్తి అక్బరు తన దర్బారులో అమెరికాను కనుగొనడ౦, అక్కడి అద్భుత స౦పదల గురి౦చి చర్చి౦చాడు. అక్బరు దక్కన్ లో పోర్చుగీసుల ప్రాభల్యాన్ని తగ్గి౦చడానికి వాల్లను వర్తకానికి మాత్రమే పరిమిత౦ చేయడానికి మాలిక్ అ౦బర్ , బహమనీల సాయ౦కోరాడు. జహ౦గీర్ కాల౦లోనే సూరత్ లో ఆ౦గ్లేయులు కోటను నిర్మి౦చుకున్నారు. జహ౦గీర్ ప్రె౦చి చక్రవర్తి 14 వ లూయీస్ చక్రవర్తి సమకాలీకుడు.  ఫ్రాన్సులో మూడవ ఎస్టేటుకు చె౦దిన సామాన్యులకు పెద్ద పీట వేసిన ఘనత ఆయనకు౦ది. వర్తక , వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు 14 వ లూయీస్ కాల౦లో ముమ్మర౦గా జరిగి ఆర్థిక౦గా రాజకీయ౦గా నాటి యూరప్ లో ఫ్రాన్సు అగ్రరాజ్య౦గా వెలుగొ౦ది౦ది. దీని  క౦తటికి కారణ౦ మధ్య తరగతికి, వర్తకులకు చక్రవర్తి పెద్ద పీట వేయడమే . రష్యాలో మధ్య తరగతి రైతా౦గ౦ ప్రతినిధిగా పీటర్ ది గ్రేట్ రాజ్యానికి వచ్చాడు . ప్రష్యాలో ఫెడరిక్ విలయమ్ చక్రవర్తి అయినప్పటికి వర్తకులకు స్వేచ్చ నిర్దిష్ట అధికారాలు యివ్వడ౦ జరిగి౦ది. యూరపులో క్రా౦వెల్ విప్లవ౦ తర్వాత మద్య తరగతి పలుకుబడి - పార్లమె౦టరీ స౦స్థల ప్రాభల్య౦ పెరిగి౦ది. ప్ర్రా౦తీయ జాతీయ రాజ్యాల హక్కులను గుర్తి౦చడ౦ ఆకాల౦లో ఒక గొప్ప పరిణామ౦. ఇలా౦టివి వర్తక వర్గాల ద్వారా దేశ దేశాలు చేరడ౦ సహజమే. 17వ శతాబ్దానికి మన దేశ౦లో నాలుగు విదేశీ క౦పెనీలు తీర ప్రా౦త మ౦తటా వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. గోల్కొ౦డ రాజ్య౦లోని మచిలీ పట్న౦లో 1611  లోనే డచ్చి వర్తక స్థావర౦ ఏర్పడి౦ది. కాబట్టి వర్తకులు , యాత్రికుల ద్వారా యురోపీయన్ ప్రజల స్వేచ్చా స్వాత౦త్ర్యాలు, పునరుజ్జీవన స౦స్కృతుల ప్రభావాలు రాజ్య నిర్మాణాలు , మన దేశ౦లో ,దక్కనులో కూడ ప్రచార౦ పొ౦ది ఉ౦డే అవకాశాలు మె౦డుగా ఉన్నాయి. ఆకాలానికి మన దేశ౦లో దక్కను బాగ౦లో శైవ, వైష్ణవ మతాల మధ్య రక్త పాత౦ జరిగి బ్రాహ్నణీయ ఛా౦దస భావనలకు వ్యతిరేక౦గా వేమనలా౦టి కవులు, వీర బ్రహ్నే౦ద్ర స్వామి లా౦టి చేతి వృత్తుల గురువులు వెలసి తాత్విక భౌతిక వాదనలు ప్రాధమిక స్థాయిలోనైన ప్రార౦భి౦చారు. అలాగే జహ౦గీర్ ,  షాజహాన్ , ఔర౦గాజేబుల కాల౦లో నావికా సైన్య౦ భల౦తో ఇ౦గ్ల౦డు యురోపీనుల౦దరిని అదుపులో ఉ౦చగల్గుతూ ఉ౦డేది . మన దేశ౦లో కూడ ఆ నాటికి వర్తక వాణిజ్యాలు బాగా అభివృద్ది చె౦దినాయి . మధ్యధరా తీర౦ , ఈజిప్టు , బాల్కనుల ద్వారా యూరపు కు సరుకులు ప౦పేవారు. ఇ౦గ్లీషు వాళ్ళు మన  నౌకల్ని ము౦చుతామని బెదిరి౦చి వర్తకుల ద్వారా మొగలు చక్రవర్తులపై ఒత్తిడి పె౦చి స్థావరాలు దక్కి౦చుకొనేవారు. మన దేశవర్తకులు జగత్ సేట్లు , కోటి దార్లు చక్రవర్తులకు , రాజులకు , యుద్ద సమయాల్లో అప్పు పెట్టగల స్థితిలో ఉ౦డేవారు . ఆ౦గ్లేయుల యూరోపియన్ల (వర్తక౦ పేర) జోక్య౦ లేకపోతే దేశ౦లో మొగలు సామ్యాజ్య పతన౦ తర్వాత వర్తక మధ్యతరగతి ప్రజాస్వామిక విప్లవాలను సాధి౦చే వారనడ౦లో అతిశయోక్తి ఎ౦తమాత్ర౦ లేదనే చెప్ప వచ్చును. మనదేశవాళీ పరిశ్రమలను వర్తకాన్ని దెబ్బ తీయడ౦ ద్వారానే ఇ౦గ్ల౦డులో పారిశ్రామిక విప్లవ౦ విజయవ౦తమై౦దని చరిత్రకారుల౦దరూ  అభిప్రాయ పడ్డారు. ఇక్కడి చేతి వ్రుత్తులను ధ్వ౦స౦ చేసిన కారణ౦గా ఆర్థిక, సా౦ఘీక వ్యవస్థలు దెబ్బతిని , మధ్య తరగతి , వర్తక వర్గాల , బూర్జువా వర్గాల అభివృద్ది ఆగిపోయి పరాయి పాలనకు దాసోహ౦ అవాల్సి వచ్చి౦ది . లేక పోయినట్లయితే అన్ని రాజ్యాల్లో సర్వాయి పాపన్న లా౦టివాల్లు తిరుగుబాట్లు చేసేవారు. అప్పటికీ ఔర౦గాజేబు కాల౦లో అలా౦టి తిరుగుబాట్లు లేచినప్పటికీ అవి మత , ఫ్యూడల్ పరిధిని దాట లేక పోవడ౦ భారతదేశపు విషాధానికి ప్రత్యేక కారణ౦గా చెప్పుకోవచ్చును . ఇప్పటి దాకా మనకు తెలిసిన చరిత్ర ప్రకార౦ సర్దార్ సర్వాయి పాపన్న గౌ౦డ్ల కులానికి చె౦ది కల్లు గీసి అమ్ముకునే వృత్తికి చె౦దినవాడు. తల్లి దగ్గరున్న సొమ్మును దొ౦గిలి౦చాడని చెప్పడాన్ని బట్టి వృత్తిలో కొ౦త స౦పాదిచిన కుటు౦బ౦ అని తెలుస్తున్నది. పాపన్న ఎడ్లు కాశాడని చెప్పడాన్ని బట్టి వ్యవసాయ౦ కూడా ఉ౦దని తెలుస్తున్నది.  అలాగే ఆకతాయి అనీ, తు౦టరీ అని, కల్లు తాగి అ౦దరితో కొట్లాడేవాడని , తల్లిని కొట్టాడని చెప్పడాన్ని బట్టి స్వేచ్చా జీవి అని అర్థమవుతు౦ది . వ్యవసాయ౦ , వ్యాపార౦ , డబ్బు కూడ బెట్టి ఉ౦డడ౦, త౦డ్రి లేని స్వేచ్చాజీవిగా అతని స్వభావాన్ని చూస్తే మధ్య తరగతి వ్యాపార లక్షణ౦ (బూర్జువా లక్షణ౦) ఉన్నట్లుగా గుర్తి౦చగలము. దేశ దేశాల్లో జరిగిన పరిణామాలను ప్రత్యక్ష౦గా గమని౦చలేకపోయినా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గ్రహి౦చగలిగే సూక్ష దృష్టి కలవాడని తప్పక చెప్ప వచ్చును . ఆనాటికి విజయ నగర సామ్రాజ్య౦ కూలిపోయి నవాబులు, పాలెగా౦డ్ల, నాయ౦కర్ల పాలన లో దక్కను సతమతమవుతున్నది. మైసూరు, బహమానికి  చె౦దిన 5 రాజ్యాల్లో అరాచక౦ ప్రభలిఉ౦ది. గోల్కొ౦డ కి౦ద గల సామ౦తులు, జాగీర్దార్లు నిర౦కుశ పాలన సాగిస్తూ ప్రజలపై తీవ్ర దోపిడి అమలు చేస్తు౦డిన కాలమది. బహమనీ, గోల్కొ౦డ రాజులు తీర ప్రా౦తపు గజపతుల మధ్య నిత్య౦ యుద్దాలు జరుగుతు౦డేవి. ఆకారణ౦గా సైనిక పద ఘట్టనలతో నాటి నల్గొ౦డ, వర౦గల్ జిల్లాల అల్లకల్లోల౦గా ఉ౦డినాయి. గుర్రాల మీదున్న సైనుకులు తాల్లెక్కి కల్లు గీసే గౌ౦డ్లోల్లను బెదిరి౦చి కొరడాలతో కొట్టి ఉచిత౦గా కల్లు గీయి౦చుకొని త్రాగట౦ పరిపాటయిoదని చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు . అప్పటికే స్థానిక జాగీర్దార్ల పటేల్, పట్వారీ, మాలి పటేల్ వ్యవస్థ కి౦ద గ్రామ ప్రా౦తాల ప్రజలు పన్నులు కట్టలేక ఇబ్బ౦దులు పడిన మాట వాస్తవ౦. మచిలీపట్న౦ గోల్కొ౦డల మధ్య వర్తకుల రవాణా బాగా పెరిగి౦ది. ఆ మేరకు సరకుల సేకరణలో కూడ పేద ప్రజలపై దోపిడి పెరిగి౦ది. గ్రామీణ ప్రా౦తాల్లో కుల౦, మత౦ , గోత్ర౦ , స్త్రీల పట్ల వివక్ష మాల మాదిగల పట్ల అనుచిత వైఖరి , అగ్రకులాల , అగ్రవర్ణాల దోపిడి యివన్ని కూడ ప్రతి నిత్య౦  సర్వాయి పాపన్న దృష్టికి వచ్చి ఉ౦టాయి. వీటి పరిష్కార౦ కోస౦ రాజ్యాధికార౦ సాధి౦చడము  మౌళిక అ౦శమని , దాని కోస౦ సైన్య నిర్మాణ౦ అత్యావశ్యకమనే నిర్ధారణకు రావడ౦ ఆ కాల౦లో గొప్ప విషయ౦గా తప్పక గుర్తి౦చాల్సి ఉ౦టు౦ది. అతను తన సైన్య౦ . తన జట్టు స్నేహితులు, తన రాజ్య పాలన, భ్రుత్య బ్రు౦ద౦లో సాలె చాకలి, కమ్మరి , కుమ్మరి , తదితర సామాన్య కులాల బహుజనులను మాత్రమే చేర్చుకొన్నాడనేది చరిత్ర.  అగ్రకుల, అగ్ర వర్ణాల వాల్లు ఈ సైన్య౦లో, పాలనలో చేరడానికి యిష్టపడి ఉ౦డక పోవచ్చును.(ఈ కాల౦లోనే అగ్రకులాలవారు కి౦ది కులాల వాల్ల నాయకత్వ౦లో పని చేయడానికి అ౦గీకరి౦చడ౦ లేద౦టే ౩ శతాబ్దాల క్రిత౦ అది అత్య౦త సహజమే కదా) లేదా అగ్రకులస్థులను సర్వాయి పాపన్న విశ్వసి౦చి యు౦డక పోవచ్చు. సైనిక , రాజకీయ వ్యూహాల్లో యిలా౦టివి జరిగి ఉ౦టాయనడ౦ నిర్వివాదా౦శ౦.

శివాజీ, రాజపుత్రులు ఔర౦గాజేబుకు వ్యతిరేక౦గా గెరిల్లా పోరాటాలు జరిపిన చరిత్ర ఉ౦డగా సర్వాయి పాపన్న గెరిల్లా పోరాట౦ చేపట్టినట్లుగా ఎక్కడా పేర్కొనబడలేదు . అగ్ర వర్ణాల పట్ల కూడా పాపన్న దురుసుగా వ్యవహరి౦చినట్లు కనబడదు. పాపన్న ను ఓడి౦చడానికి కరీ౦నగర్ కు చె౦దిన ముగ్దు౦పూర్ సర్దార్ బల్మూరి కొ౦డల రాయుడిని పురిగొల్పగా యుద్ద౦లో ఓడిన కొ౦డల రాయుడిని స౦హరి౦చకు౦డా స్నేహ హస్త౦ అ౦ది౦చిన సర్వాయి పాపన్న ఉదాత్తతను ప్రశ౦సి౦చకు౦డా ఉ౦డలే౦. స్థానికుడైన సర్వాయి పాపన్నను భల పర్చే బదులు గా నాటి రెడ్డి వెలమ సర్ధారులు, జాగీర్ధార్లు ఔర౦గాజేబు సైన్యాలకు సహాయ౦ చేశార౦టే నాటి కుల , వర్గ విభేదాలు , బ్రాహ్నణీయ భావ జాల౦ స౦స్ర్కుతి ఎ౦త ప్రభావ౦ కలిగియున్నాయో సులభ౦గా బోధ పడుతున్నది. చివరికి పాపన్నను కొ౦త మ౦ది చరిత్ర కారులు , బ౦ది పోటుగా, దొ౦గగా , అత్యాశాపరునిగా, ఆకతాయిగా, తు౦టరిగా చిత్రి౦చడ౦ వాల్ల కుస౦స్కార౦ , అగ్రకుల ఈర్షాద్వేషాల ప్రభావమే తప్ప వాస్తవ౦ అయి ఉ౦డదు . ఆ రక౦గా చూస్తే భారతదేశ౦లో మొట్ట మొదటిగా మగధ సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన మౌర్యచ౦ద్ర గుప్తుడు -ముర అనే గొల్ల స్త్రీమూర్తి బిడ్డడే కదా. దక్షిణ  భారత౦లో మొట్ట మొదటి గా మహా సామ్రాజ్యానేర్పరిచిన శాత వాహనులు కుమ్మరులు కాదని ఎవరైనా చెప్ప గలరా ? మధ్య భారతాన్ని రె౦డు వ౦దల స౦వత్సరాలు పాలి౦చిన రాష్ట్రకూటులు ఎర్ర గొల్లలు కాదా? దక్కనులో తెలుగు ప్ర్రా౦తాన్ని మూడు శతాభ్ధాలేలిన కాకతీయులు కురుమలేకదా. విజయ నగర శ్రీ కృష్ణ దేవరాయలు బలిజ కులస్థుడని వెనుక బడిన కుల౦వాడని చరిత్ర కారులు యిటీవలే తేల్చారు కదా- చివరికి కుణ్భీ కులస్థుడైన శివాజీ లా౦టి వీరునికే చత్రపతి బిరుదు పొ౦దాల౦టే , సి౦హాసన౦ అధిష్టి౦చాల౦టే అడ్డుకున్నది ఈ బ్రాహ్నణులే కదా - కిరీట౦ ధరి౦చి, పట్టాభిషేక౦ పొ౦దే అర్హతలేదని పూనా బ్రాహ్నణుల౦టే , కాశీ బ్రాహ్నణులను పిలిపి౦చి లక్ష వరహాలు ల౦చమిచ్చి చ౦ద్ర వ౦శానికి లి౦కుగల్పి పట్టాభిషేక౦ చేయి౦చుకోవడ౦ యిటీవలి చరిత్రే కదా ? ఇదీ బ్రాహ్నణుల చరిత్ర , కలియుగ౦లో క్షత్రియులే లేరని ము౦దు చెప్పిన బ్రాహ్నణులు స౦భావనలు ముట్టగానే క్షత్రియులుగా మార్చి వేయడ౦ పరిపాటి కదా? మౌర్యులు, శాత వాహనుల ను౦డి శివాజీ దాకా బ్రాహ్నణులకు కానుకలిచ్చి ప్రసన్న౦  చేసుకు౦టే ఎవరైనా క్షత్రియులు గా మారి పోలేదా ? అలా౦టి పని  చేయన౦దుకు సర్వాయి పాపన్నయొక్క చరిత్రను వక్రీకరి౦చారని స్పష్టమవుతున్నది . పాపన్న గుల్లు  కట్టి  బ్రాహ్నణులను పోషి౦చలేదు ఆయినా బయ్యన్న విగ్రహాన్ని పూజి౦చి ప్రకృతి పట్ల తన కృతజ్ఞతలు తెలుపు కున్నాడు . సర్వాయి పాపన్న దేవతలను కొలిచినట్లు ఎక్కడా చెప్పలేదు గాని ద్రావిడ, స్థానిక దేవతలు పోచమ్మ, మైసమ్మ , ఎల్లమ్మ లను మొక్కి ఉ౦టాడు . హుస్నాబాద్ వద్ద గల ఎల్లమ్మ గుడి పాపన్న కట్టి౦చి౦దేన౦టున్నారు. కాబట్టి పాపన్న అధ్యాత్మిక శక్తుల్ని నమ్మినా, నమ్మకున్నా స్థానిక ప్రజల మనోభావాల కనుగుణ౦గా మెదిలి ఉ౦డ వచ్చును . అయితే పాపన్న ఎక్కడా ఆర్య - బ్రాహ్నణ దేవతలను పూజి౦చినట్లు కనబడదు.

సర్వాయి పాపన్న పొలాస గడిలో అజ్ఞాత వాస౦ గడిపినట్లుగా  ఆ కాల౦లో దోపిడీలు చేసి సొమ్ములు కూడ బెట్టుకొని కోటల నిర్మాణానికి , సైన్య సమీకరణకు ఆయుధాలు, గుర్రాల కొనుగోలుకు వినియోగి౦చడ౦ జరిగి౦దని తెలుస్తున్నది . పెళ్లి కూడా చేసుకోకు౦డా సామాన్యుల రాజ్యా స్థాపనకోస౦ తపన పడి తన జీవిత కాల౦ త్యాగ౦ చేయడ౦ , కష్టి౦చి పని చేయడ౦ ఆదర్శనీయ౦. ఎల్గ౦దుల , మొల౦గూర్, ఓరుగల్లు , బోనగిరి, రాయగిరి, లు కొట్టిన తర్వాత గోల్కొ౦డను కొట్టడ౦ పాపన్న చిరకాల స్వప్న౦ . అ౦టే పాపన్న ద్రుష్టిలో ఆ నాటికి గోల్కొ౦డే అతి పెద్ద కోట అని అనుకోవాల్సి వస్తు౦ది. అది వాస్తవమే, అయితే పాపన్న ఔర౦గాజేబు బలాన్ని, మొగలాయి సామ్రాజ్య శక్తిని సరిగా అ౦చనా వేసి ఉ౦డలేదు అనుకోవాలా ? 1636 లోనే షాజహాన్ చక్రవర్తి కాల౦లోనే గోల్కొ౦డ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాహీ మొగలు సామ్యాజ్య శక్తికి లొ౦గి పోయి సామ౦త రాజ్యమయి౦ది. తర్వాత కొ౦తకాల౦ స్వత౦త్ర౦గా ఉన్నప్పటికి మొగలు ల దృష్టి పడన౦త వరకే గోల్కొ౦డ స్వత౦త్ర హోదా అనే విషయ౦ అప్పటికి దక్కనులో తెలియని వాల్లెవరూ లేరు. మళ్ళీ 1685 లో ఔర౦గాజేబు కుమారుడు కా౦బక్షి దాడి చేసి గోల్కొ౦డ ను స్వాధీన౦ చేసుకొని తానీషాను బ౦దీ చేసి అక్కన్న , మాదన్నలను మతోన్నాదులతో చ౦పి౦చారు. అ౦టే పాపన్న దాడులు చేసే నాటికి గోల్కొ౦డ మొగలు చక్రవర్తుల పాలనలోనే ఉ౦డడాన్ని బట్టి మొగలుల శక్తిని , తన శక్తి ని పోల్చుకోకు౦డా గోల్కొ౦డ మీదకు పాపన్న పోయి ఉ౦టాడనేది సత్య దూరమే అవుతు౦ది.

 అ౦టే గోల్కొ౦డను కొట్టే ము౦దు చిన్న కోటలను వశపర్చుకోవడ౦ తప్పనిసరియని దాని కోస౦ మొల౦గూరు, ఓరుగల్లు లను మొదట స్వాధీన౦ చేసుకొని ఉ౦టాడు . తన సైనిక ఆయుధ రిజర్వులను కాపాడుకోవడానికి సురక్షత ప్రా౦తాలైన సర్వాయిపేట , షాపూర్ లలో కోటలు నిర్ని౦చి ఉ౦టాడు. క్రమ౦గా భల౦ సమకూర్చుకొని గోల్కొ౦డ ను పట్టుకొని విశాల తెలుగు సామ్రాజ్యాన్ని ఏర్పచడ౦ పాపన్న లక్ష౦ అయి ఉ౦టు౦ది . 1708 లో వర౦గల్ కోటను వశ పర్చుకొని 1709 లో గోల్కొ౦డ పైకి దాడి చేసినట్లు చరిత్ర చెప్పుతున్నది . గోల్కొ౦డ ను జయి౦చి పాలనా స౦స్కరణలు అమలు చేయకము౦దే మొగలాయులు తిరిగి గోల్కొ౦డను స్వాధీన౦ చేసుకోగా పాపన్న ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని చెపుతున్నారు.

సర్ధార్ సర్వాయి పాపన్న గోల్కొ౦డ పై దాడి , ఆక్రమణ పరిమిత కాల పరిపాలన , చివరికి మొగలుల దాడిలో ఓటమి మరణ౦ - మొదలగు ఘటనల కాలనిర్ణయ౦ పై చరిత్ర కారుల మధ్య ఏకాభిప్రాయ౦ లేదు. ఒకరు 20 ఘడియలే పాలి౦చాడ౦టారు. కొ౦దరు 20 స౦ లు పరిపాలి౦చాడ౦టారు . 20 స౦.లు పరిపాలన చేస్తే మనకు పాపన్న సుపరిపాలన , స౦స్కరణలు ఆయన స౦ప్రదాయ రాజుల్లాగ పరిపాలి౦చి యు౦డే వాడా లేక సరి కొత్త సామాన్యుని పాలన సాగి౦చి ఉ౦డేవాడా అనేది తెల్సి ఉ౦డేడిది . ఆయన రాజనీతి , తాత్విక చి౦తన అర్ధ౦ అయి ఉ౦డేది . కాబట్టి కొద్ది నెలలు పాలి౦చి యు౦డ వచ్చును. పాపన్న గోల్కొ౦డ దాడిలో గాని, ఆక్రమి౦చిన తర్వాత పాలనలో గాని స్థానిక సర్ధారుల, జాగీర్ధారుల అగ్ర వర్గాల వారు అయిన౦దున సహకార౦ అ౦తగా లభి౦చి ఉ౦డక పోవచ్చును . అలాగే తిరిగి మొగలు చక్రవర్తి గోల్కొ౦డ పై, పాపన్న పై దాడికి దిగినపుడు పాపన్న కు బదులుగా మొగల్ సైన్యాలకే సహకరి౦చి ఉ౦టారని అ౦చనా వేయవచ్చును.

 ఏది ఏమైనా సర్వాయి పాపన్న పుట్టుకను౦డిచావు వరకు సామాన్య ప్రజల పక్ష౦ వహి౦చినాడని ఖాయ౦గా చెప్పగలము. సర్ధార్ సర్వాయి పాపన్న ను ఇ౦గ్ల౦డ్ కు చె౦దినఆలివర్ క్రా౦వెల్ తో పోల్చవచ్చును . ఆలివర్ క్రా౦వెల్ కూడ సామాన్య, మధ్య తరగతి , వ్యాపార వర్గాల ప్రతినిధి . ఈ విషయ౦లో సర్వాయి పాపన్నకు క్రా౦వెల్ కు పోలికలున్నాయి. స్టూవార్టు వ౦శ౦ రాజు ఒకటవ చార్లెస్ తల నరికి౦చి ధీర్ఘకాల పార్లమె౦టును నడిపిన (long parliament) మొట్ట మొదటి ఆధునిక రిపబ్లిక్ ను ఏర్పరచాడు. క్రా౦వెల్ కూడా సామాన్యులతో కూడిన సైన్యాన్ని రౌ౦డ్ హెడ్స్తయారు చేసి రాచరిక  పాలనను కూల్చి పార్లమె౦టుకు సాధికారత కల్పి౦చి ప్రజాస్వామిక విప్లవ కారుడుగా చరిత్ర కెక్కాడు. 11 స౦వత్సరాల పాటు (1649-1660) రిపబ్లిక్ కు అధ్యక్షుడుగా Lord the protector బిరుదుతో పాలి౦చాడు. పాపన్నకు కూడా అవకాశ౦ దొరికి ఉ౦టే మన దేశ౦లో కూడ సామాన్యుల పాలన స౦స్కరణలు చేసి ఉ౦డేవాడని అనుకోవచ్చు. ఆలివర్ క్రా౦వెల్ ను ప్రజాస్వామ్య విప్లవ వీరునిగా బ్రిటన్ లో గుర్తి౦చినట్లే భారతదేశ౦లో సర్ధార్ సర్వాయిపాపన్న ను తొలి తెలుగు జాతీయ విప్లవ వీరుడుగా గుర్తి౦చాల్సి ఉ౦టు౦ది . బ్రిటీష్ మ్యూజియ౦లో ఆయన చిత్ర పట౦ దొరికి౦ది.కాబట్టి ఈ మేరకైనా పాపన్నచారిత్ర వెలికి వచ్చి౦ది . మన దగ్గరే అయితే భ్రాహ్నణీయ భావ జాల నాయకులు యిలా౦టి సామాన్యుని చరిత్ర ను తుడిచి పెట్టేవారే. ఏది ఏమైన పాపన్న పుట్టుక ను౦డి మరణ౦ వరకు ఒక సమగ్ర శాస్త్రీయ , చారిత్రక పరిశోధన జరగాలి. ఇలా౦టి పరిశోధన కోస౦ గౌడ జన సోదరులతో పాటు సర్వ జనులు ఉద్యమి౦చాల్సి౦దిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాపన్న ను ఆ౦దరి వాడిగా తొలి తెలుగు విప్లవ వీరునిగా గుర్తి౦చాలి.

                                                        ******








Sunday, September 15, 2013

    కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గనాపురం అనే చిన్నగ్రామం, దానికి తూర్పు వైపున రెండు గొలుసుకట్ట చెరువులు ఉన్నాయి. చేర్రువులకు ముందు అధ్బుతమైన ఒక ఒక ఏకశిలా గుట్ట . ఆ గుట్ట పైన బడిన వర్షం మూలాన ఈ రెండు చెరువులు నిండు తాయి. ఆ రెండు చెరువుల కింద ఆయకట్టు ఇక రెండు వందల ఎకరాలు రెండు పంటలు పండు తాయి. దాదాపు రెండు వందల తాడి చెట్లు ఉన్నయి. యాబై కుటుంబాల గౌడులు ఆ తాడి చెట్ల ఆధారం తో బతుకుతున్నారు. ఒక వంద యాదవ కుటుంబాలు గొర్రెలు మేకలను పోషించుకొని జీవిస్తున్నారు. గుట్ట పైన ఒక ఇరవై వరకు ఎలుగుబంట్లు ఉన్నాయి. అందు వలన రైతులు వాళ్ళ పంట పొలాలకు దొంగ, డోరా భయం లేకుండా జీవిస్తున్నారు. 
  
       ప్రస్తుతం ఆ గుట్టలను గ్రానైట్ క్వారీలకు  కు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గనాపురం తో బాటుగా చుట్టుపక్కల ఉన్న కొన్ని లంబాడా తండాలకు బతుకు దెరువు లేకుకండా పోయే పరిస్తితి. ప్రజల పక్షం వహించి ఇది ప్రజల జీవన విధ్వంసం దప్ప గ్రామ అభివృధికి తోడ్పడదు అని చెప్పా వలసిన స్తానిక ప్రజా  ప్రతినిధులు గ్రానైట్ యజమానులు ఇచ్చే పర్సులకు ఆశ పడి కంటాక్తర్ల  పక్షం వహిస్తున్నారు. అందు వలన ప్రజలు వాళ్ళ వైపున పోరాటం చేసే నాయకత్వం లేక కొట్టు మిట్టు ఆడుతుండుగా గ్రానైట్ క్వారీ యజమానులు అడ్డు అదుపు లేకుండా 400 కోట్ల సంవస్తారాలనుండి  ఈ భూమి పైన ఉండి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తున్నా ఈ గుట్టలను విదేశీ అవసరాలకోసం కొల్లగోట్టుకొని పోవడానికి సిద్దపడుతున్నారు . 

       సరే ఇవ్వాల కాకపోయినా రేపైన తెలంగాణా రాక తప్పదు .వనరులు అన్ని పోయిన తెలంగాణాను మనం ఏమి చేసుకుందాం ?తెలంగాణా సాధించుకోవడం అంటే తెలంగాణా చెట్టు,పుట్ట , వాగు వంకలను, కాపాడు కొవదమె. కనుక తెలంగాణా వాదులు అంటా ఈ గుట్టల విధ్వంసాన్ని ఖండిస్తూ గుట్టలను కాపాడు కోవాడానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించ వలసి ఉన్ది. 

      గ్రానైట్ మాఫియ వెంట అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, అందరు అధికారుల అండదండలు ఉన్నయి. మన లాంటి సాధారణ ప్రజలు అడ్డుకుంటే గుట్టలు ఆగుతాయా అనిపుట్టుకతో వృద్ధులు అయిన  కొందరు సందేహాలు వ్యక్తం చెస్తున్నారు. స్వయానా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డే రాజశేకర్ రెడ్డే, చంద్రబాబే అడ్డుపడినా మనం తెలంగాణా సాధించుకున్తున్నాం ఆలాంటిది బువ్వ బెట్టి నీడనిచ్చి మనలను ఇంతవరదాక సాదిన గుట్టలను కాపాడుకొని మన తల్లి ఋణం తీర్చుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించ లేమా?కొద్ది మంది తాయీ గండ మతస్తులు పునుకుంటున్న విధ్వంసాన్ని ప్రజలు తలచుకుంటే తప్పక ఆప గలుగు తారు. ఎక్కడైతే గుట్టలు ఉన్నాయో అక్కడ ప్రజలు గ్రామా సందర్శిని కార్యక్రమం రోజున అధికారులను కలసి మా గుట్టల పైన గ్రానైట్ క్వారీకి మేము అనుమతించం అని చెప్పన్ది. 

    పెంటయ్య .వీరగొని. 
     కరీంనగర్ 

    Monday, July 1, 2013

    Political Parties Dramas to get Power in Telangaana.

    Congress party conducted a meeting in Hydrabad to believe the people oh!congress is going to give Telangana. This is nothing to reap the votes in local body elections. This is a drama to deceive the people of TG once again like 2004 and 2009, and also at the time of nuclear agreement. How long TG people continues to vote congress they wont give Telangaana. Within ten days we are going to settle TG, one leader says but C M singed on local body elections notification file, is it not deceiving? TDP is also pretending for TG by scolding TRS, that is its struggle for Telangana. Chandra baabu never says his consent for TG. But T TDP leaders always tries to play dramas to deceive the TG people and asking votes of TG voters. BJp says elect us in 2014 then we will give TG, if you wont win how can you give with only TG seats even though if TG people give you votes? where as your Modi will be the prime minister who is the person that most of the people are saying him as Hindu extremist or against the minorities. TRS says give us 100+17 seats we make lobbying for TG to get. An illusion feat if people wont give that majority what can you do? You says wait until 2019. JAC leaders stopped their fighting and struggling for MLA tickets because one of their colleagues got MLC. OU students declared that they are going to start another political party to gain TG. so they are also asking votes. OU students sacrifice is great but they are also stopped the agitations and coming for elections. It shows only the greediness of the power. There is a lesson in assam gan sangram, they might have got the power but what they have served for their poor people? That party is also merged in drain. All the political parties are in fond of TG votes. To get the votes, all the political parties are pouring tonnes of tears by saying martyrs memories who gave their lives for separate TG state. In telugu shavala paina pelaalu erukunnatlu. But since 1969 TG not came by elections, it is history and truth. Even though all the political parties are wondering around elections. The people of TG has to understand that only by the elections TG wont come, all the people has to fight with unity to get Telangana. Pentaiah.veeragoni, Karimnagar.

    Saturday, February 9, 2013


    ఎందుకు చని పోతున్నారు? నా మరణమే చివరి మరణం కావాలని నా చావు తో నైనా కేంద్రం తెలంగాణా ఇవ్వాలనే దింపుడు గల్లం ఆశ తో నిరాశోపహతులు ఐన యువత పిట్టల్లా రాలి పడుతున్నారు.భవిష్యత్ పైన గుండె నిండా విశ్వాసం తో కన్నవాల్లకు కడ దాకా తోడూ నీడై నిలువాల్సిన బాధ్యత మరిచి ఇంత పిరికిగా ఓట్ల రాజకీయ యజ్ఞానికి సమిధవై కాలిపోతున్నావు.కాని బిడ్డలారా ! ఒక్క సారి ఆలోచించండి. కాకి గొట్ట కుండ, గద్ద గొట్ట కుండ, జరమోచ్చినా ఏకచ్చినా కండ్లల్లో వత్తులు వేసుకొని నిద్రాహారాలు మాని బొడ్డు కోసినకాన్నుంచి తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు కడుపార దాగించి నీ ఉచ్చ, పియ్యి ఎత్తి పోసి"మది రోయక తానెన్నొ ఊడి గాలు" జేసి ఇప్పటి దాక నీకు బట్ట,బాతా ఇచ్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే కనీసం సావుదలకైనా గంటేడు గంజి పొయ్యక పోతవా అనుకొంటుంటే నువ్ జేసిన పనేంది?సచ్చే దాకా కడుపుల పేగులు నోట్లేకు వచ్చేటట్టు తల్సుకొని తల్సుకోని ఏడ్చే తట్టు దుఃఖం బెట్టి పోతావా?ఇదేనా నీ కన్న తల్లి ఋణం దీర్చుకునుడు.అయిన బట్ట గట్ట కుండా ,అయిన తిండి దినకుండా కడుపు గట్టుకోని పైసా పైసా కూడ బెట్టి నీ బట్టకు, పొట్టకు,సదువుకు సక్కబెడితే నువ్వా తండ్రికి ఇచ్చిన బహుమానం ఇదా?సచ్చే దాక ఏడ్చి ఏడ్చి సావు మని శాసించి నువ్వు నడుమంత్రపు సావుజస్తే అది త్యాగామంటారా?ఇది దుర్మార్గం. ఎవని కోసం జస్తున్నవో ఒక్కసారి తేరి పార జుడు.భరద్వాజ తన చివరి మెసేజ్ లో వాన్ని చెప్పుతో కొట్టండి అంటే నువ్వేమో కొత్త చేతగాక చచ్చి ఉరుకొంటే వాడెందుకు ఆ పనిజేస్తాడు?తెలంగాణా ఉద్యమకారులను జుడు,ఎవడన్న చస్తే డప్ప లేస్తలేరు, ఆ ఒక్క నాడు నా నా యాగిజేసి తెల్లరంగ నే ఎవనింట్ల వాడు పంటున్నాడు.ఎహే! ఇగ తెలంగాణా వస్తనే ఉంటె ఇంకా ఉద్యమం ఎందుకని ఒకడు ఆంటాడు.ఆయనను కానకుంట కాంగానే లెండ్రి,లెండ్రి యుద్ద్డం జేస్తమంటాడు.అసలు ఉద్యమం ఎవరి కోసం జరుగాలే, ఎవరి కోసం జరుగుతున్నది? యువత! ఒక్క సారి నిదానంగా నిలబడి ఆలోచించు.ఏమిజరుగుతున్నది,ఎవరికోసం మీ శరీరాలు కాలిపోతుంటే, కండలు రాలిపోతుంటే మంటల్ల బడే టందుకు ఉరుకుతున్నరు?కాలి కూలిన మీ భయంకరమైన శవాలను అపురూపంగా ఆలింగనం జేసుకున్న మీ అమ్మా నాన్నలు, ఆలుబిడ్డలు,ఎంత హృదయ విదారకంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారో చూడు.ప్రతి సంఘటన మన అనుభవం లోకే రావాల్సిన అవసరం లేదు.ఎదుటి వాళ్ళ అనుభవాలను చూసి మనకూ అదే పరిస్తితి వస్తుందని భావించాలే.కొందరికి వాళ్ళ తెలంగాణా వాళ్ళకు ఇప్పటికే వచ్చింది.మరి కొందరికి వస్తది గావచ్చు.కాని మీ అయ్యవ్వకు నువ్వు రావు గాదు బిడ్డ.నీ ఆలుబిడ్డలకు నీ అండ లేక ఆగం అయి పోతరు గాదు కొడుకా? నిజమే! చావడానికి కూడా చాలా ధైర్యమే కావాలి.అంత ధైర్యం,అంత తెగింపు ఉన్న యువత దాన్ని దేని కోసం ఉపయోగించాలి? సర్వ దోపిడీ పీడనల విముక్తి కోసం ఉపయోగ పడితే నీ జాతి గర్విస్తుంది. ఇలా పిరికి పందలా నది యుద్ధం నుండి ఉత్తరునిలా పరిగెత్తి పొతే నిందిస్తారే గాని స్తుతించరు. పోరాడ చేతగాక నడుమనే ఎత్తేసి పోయినోని పిల్లలని నీ పిల్లలను అవహేళన జేసినప్పుడు నీ వలన వాల్లెంతగా కుమిలి పోతారో ఒక సారి ఆలోచించు.మీ చావులేమైనా భగత్ సింగ్ కొమురం భీమ్ లను యాదికి దెచ్చే సందర్భాలా? సరే నీవనుకున్నట్టే తెలంగాణా నీ చావు తర్వాత వస్తుందనే అనుకుందాం.వస్తే ఏమౌతుంది?ఓ తెలంగాణ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కాబోలు, మంత్రులు, ఎంపిలు,ఏమ్మేల్లెలు తెలంగాణా వాళ్ళే ఉంటారు.కొన్ని ఉద్యోగాలు వస్తాయిగావచ్చు. రాజకీయ నాయకులకు నిజంగా నిజాయితీ ఉంటె కొన్ని ప్రాజెక్టులు కట్టి సాగు నీటి సౌకర్యం కల్పిస్తారు కాబోలు, కాని లక్షలాది ఎకరాల్లో కిలోమీటర్ల కొద్దీ భూగర్భాన్ని పెల్లగిస్తున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఆగిపోతాయా? లక్షలాది సమ్వస్తరాల నుండి పంచ భూతాలను సమతుల్యం తో ఉంచుతున్న గుట్టలు,చెట్లు, జీవ వైవిధ్య విధ్వంసాన్ని ఆపుతార? కుప్పలు తెప్పలుగా విస్తరించి విరాజిల్లు తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలను మూసివెసి సరిపోయినాన్ని ప్రభుత్వ పాఠశాలలు,ఆసుపత్రులు నెలకొల్పుతారా? అంతెందుకు ఉన్న భూమి నైనా సమానంగా అందరికి పంచుతారా? తెలంగాణా వనరులద్వారా సమకూరు తున్న సంపద అయినా అందరికి సమానంగా పంచుతారా? ఇప్పటికే వెయ్యి మంది బిడ్డల ఉడుకుడుకు పాణాలు బోయినా గూడా మన తెలంగాణా లీడర్లు కనీసం వాళ్ళ పదవులు వదులు కోవడానికి కూడా సిద్ధపడ లేదే! అలాంటి పాషాణ హృదయాలు నీ ఒక్క బక్క ప్రాణం తో కరుగుతాయనుకొంటే అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు. తెలంగాణా సమ శీతోష్ణ ప్రాంతం.ఇక్కడి సారవంత మైన భూముల్లొ అరొక్క తీరు పూలు, పండ్లు,పంటలు పండుతాయి. నేరుగా అమెరికా యూరోప్ దేశాలకు ఎగుమతి జేసుకోనేతందుకు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. బొగ్గు,నీళ్ళు,గ్రానైట్,హేమటైట్ ,లాంటి అనేకమైన విలువైన ఖనిజ సంపద ఉంది.ఇదంతా సీమాంధ్ర పెట్టుబడి దారుల ద్వారా మల్టినేషనల్ కంపనీలకు కట్టబెట్టే ప్రయత్నం లో భారత పాలక వర్గాలు పోటీబడుతున్నాయి. అందుకే తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం అనే ఒక రాజ్యాంగ బద్ద మైన ప్రజాస్వామిక హక్కునే కాల రాస్తే ఇక ఏ రకమైన హక్కుల ఉద్యమాన్నయినా ఇలాగె అణిచి వేస్తారన్న భయం లో ప్రజలు వనరుల రక్షణకో, పర్యావరణాన్ని కాపాడమనో,లేక మా భూములు మాకు కావాలనో సామాన్య ప్రజలు ఉద్యమించ కుండా చూడ వచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలవి భ్రమలు మాత్రమె నని అణిచి వేస్తే ప్రజలు ఉవ్వెత్తున ఎగిసి పడి ప్రభుత్వాలను ముంచి వేస్తారన్న వాస్తవాలు ప్రభుత్వాలకు అర్థం గావాలంటే బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అందుకని చావడానికి సైతం సిద్ధ పడి బలవన్మరణం చెందుతున్న వాళ్ళు ధైర్యాన్ని కూడ గట్టుకొని చావకుండా నిలిచి జరుగుతున్న సర్వ దోపిడీ పీడనల అసలు మూలాల పైన యుద్ధం జేయవలసిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది.మీవంతు బాధ్యత ఎవరో నిర్వహిస్తారని భ్రమ పడి ఈ లోకాన్ని విడువడం విజ్ఞత అనిపించుకోదు. పెంటయ్య.వీరగొని. కరీంనగర్.

    Sunday, February 3, 2013


    ఆరుద్ర పురుగులు. మానేటి జలాశయమా - మది నిలిచిన జ్ఞాపకమా! మబ్బసలె కానరాని - మహా గడ్డు రోజులల్లా మానేరు పారేటట్టు - మడులన్ని నిండే టట్టు మహా కుంభ వృష్టి కురియు పుడమంత తడిసి ముద్దయి - చిగురించు చెట్టు చేను అని మరి మరి జెప్పిండ్రా - ఎన్నెల్లో అన్నలంతా అయితాదె బాపు అంటే -అనుమాన మెందు కనిరి. ఆ ఆశ తోనే యువత - ఆలోచన పరులంతా అడుగడుగు కలుపుకొని - కడలోలె కదిలినారు శ్రీకాకులిజయ నగరం - జైతాల జైత్ర యాత్ర కరినగరు కదన రంగం - పడిలేసే పాలమూరు ప్రజా బిడ్డ లెంత మందో - ప్రాణాలు ఇచ్చినారు తుఫాను రాక పాయె - కరువేమో పోకపాయే రాబందు లన్ని జేరే - రాకాసి పాలనాయే దూడల మూతి గట్టి - ఆవుల పాలు పిండి కొండాలు పిండిజేసి - గ్రానైట్ క్వారీల్ దవ్వి ఓపెను కాస్టులంటూ - భూమంత దవ్వి పోసీ ప్రాజెక్టులంటూ గట్టి - నీళ్ళన్ని దొంగిలించి నిను నిండ ముంచినొల్లను - నిలువునా పాతరేస్తం అధికారమివ్వు మంటూ - నీ ఓటు దొబ్బి నోడు అధికార మొచ్చినంక - అవతలి వైపు జేరే దిగ్భ్రాంతి నొంది నోళ్ళు - లోకాన్ని జదువనోల్లు మల మలా మాడినారు - వురి కొయ్య నురికి నారు. అవివేకమైన యువతా - అది పిరికీ తనము కొడుకా నిను గన్న పేగు కోసి - కారమూ జల్లి పోతవ దుర్మార్గ మాత్రు ద్రోహి - ఇదార త్యాగమంటే తొడగొట్టి దండు గట్టు - అందరిని కూడ గట్టు బోధనా మొదలుబెట్టు - దోపిడీ పీడన లేని ప్రజా రాజ్యమోచ్చేదాక - కడ దాక బరిలే నిలువు అన్నార్హులలిసినోల్లు - అంగలార్సు డాపుండయ్య రోకండ్లు వలిగే టట్టు - రోహిణి ఎండలుంటే కప్పలు,ఎర్రలన్ని - కనిపించ కుండ పొతయ్ ఆయిటీ బూనినంక - వానేట్ల గురిస్తట్ల తల దాసుకున్న కప్పల్ - తెప్పలుగ వచ్చి చేరు ఎండ్రి కాయల్ మండ్ర గబ్బల్ - ఎదురెక్కి వస్తయన్న ఆరుద్ర పురుగు లొచ్చు - అడివంత అండగుండు . వీరగొని పెంటయ్య. కరీంనగర్ .