Tuesday, March 25, 2014

మానేటి జలాశయమా !

మానేటి   జలాశయమా
మది జిలికిన  ఆశయమా !

                           సీమాంధ్ర  పాలకూలే
                           శ్రీమంత మంత   దోచి

                           తెలగాణ  ముంచిరాని
                           ప్రజలంత ఏకమయ్యీ

                           ప్రాణాలు    ఒడ్డి  పోరి
                           సీమాంధ్ర   పెత్తనాన్ని
                           ఓడించి   గెలిచినారు   .

తెచ్చింది  మేమే నంటే
ఇచ్చింది   మేమే నంటూ

పోటీలు బడుతు వచ్చి
ఉదరా గొట్టుతుండ్రు

మాకంటే మాకే ఓటని
పడి పడీ మొక్కుతుండ్రు !

                             గిరిజనుల ఉసురు దీసే
                             పోలవరం ఆపకుండా

                            పొలాలు , సంపదంతా
                            పజల పరమ్ జెయ్యకుండా

                            పదవులు ఎక్కిణాంక
                            పంపకాలకు పన్నాగం

                            పారేటి     నీళ్ళ  తోటి
                            వీచేటి   గాలి కలిపి

                            భూమిలో ఉన్న ఖనిజం
                            పైనున్న చెట్టు గుట్ట

                            గుండు గుత్త  అమ్మేటొల్లు
                            వీర్ని  నమ్ము డెట్ల  వారి  !

Thursday, March 20, 2014

సామాజిక న్యాయం సాధ్యమేనా ?

ప్రస్తుతం సామాజిక తెలంగాణా పేరిట ఒక పెద్ద చర్చ జరుగుతోంది . ఒక ఓట్ల రాజకీయ పార్టీ బీసీ లకు ముఖ్య మంత్రి పదవి ఇస్తామమంటే , మరో రాజకీయ పార్టీ దళితులకు ముఖ్య మంత్రి పదవి ఇస్తామని ఆయా సామాజిక వర్గాల ఓట్లు దక్కించు కోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి . నిజంగానే ఆయా రాజకీయ పార్టీలు చెబుతున్నట్లుగా ఆ సామాజిక వర్గాలకు ముఖ్య మంత్రి పదవి లభిస్గే లభిస్తే పేదల సమస్యలు పరిష్కరించ బడుతాయా ? ఒకసారి ఆలోచిద్దాం . 

 క్రీ . పూ . 3 వ శతాబ్దం .లో అలేగ్జాండార్ దండయాత్ర తర్వాత విదేశీ దండయాత్రలను సమర్థవంతంగా ఎదురుకొని దేశాన్ని రక్షించు కోవాలంటే ఆనాటికి ఉన్న చిన్న చిన్న రాజ్యాల తో సాధ్య పడదన్న ఉద్దేశం తో చాణుక్యుడు ముర అనే దాసీ కుమారుడైన చంద్ర గుప్తున్ని చక్ర వర్తిని జేసి ముర పేరుతొ మౌర్య సామ్రాజ్యాన్ని స్తాపించి దాదాపు 150 సంవస్తరాలు దాసీ పుత్రులు రాజ్య పాలన చేసినట్లు చరిత్రలో చదువుకున్నాము . అలాగే క్రీ . శ . ఒకటవ శతాబ్దం శాలి వాహనులు రాజ్యాధి కారం లోకి వచ్చి వాళ్ళు కూడా 120 సం . పై బడే పరిపాలించి నారు . 8 వ శతాబ్దం లో ఎర్రగొల్లలు అయిన రాష్ట్ర కూటులు  115  సం . రాజ్య పాలన చేసినారు . 11వ శతాబ్దం లో కురుమ కులాంకి చెందిన కాకతీయులు 250 సం . రాజ్య పాలన చేసినారు . గుర్జరులు లంబాడ వాళ్ళు  రాజ్య పాలన చేసినారు .గోండ్వాన ప్రాంతాన్ని గోండు రాజులే పాలించి నారు . ఇదంతా రాజరిక పాలన లో జరిగింది . కనుక రాజ ధర్మం మేరకు దాస దాసీలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారని అనుకుందాం . 

1947తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చి 1950 లో మనకంటూ ఒక రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిస్తిత చూద్దాం . కర్పూరి ఠాకూర్ సింగ్ ,కళ్యాణ్ సింగ్ ,ఉమా భారతి, కరుణానిధి , లాలూ ప్రసాద్ యాదవ్ , ములాయం సింగ్ యాదవ్ ఆయన కొడుకు అఖిలేష్           యాదవ్ , ఆంద్ర ప్రదేశ్ కు ఆనాడు టంగు టూరి అంజయ్య , వీళ్ళంతా బి . సి  వర్గాలకు చెందిన ముఖ్య మంత్రులే . అట్లాగే అజిత్ జోగి , బాబు లాల్ మరాండి , అర్జున్ ముండా , శిబూ సోరెన్ , మధూ కోడా వీళ్ళంతా ఎస్టీ వర్గాలకు చెందిన ముఖ్య మంత్రులు . నిన్నటికి నిన్న ఎస్సీ వర్గానికి చెందిన మాయా వతి కూడా పది సంవస్తరాలు ఉత్తర ప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా పనిజేశారు . వందల సంవస్తరాలు బీసీ లు రాజ్యాలు ఏలినారు .ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్తలో కూడా బీసీ , ఎస్టీ , ఎస్సీ వర్గాలకు చెందిన వారు చాలా మందే ముఖ్య మంత్రులు గా చాలా సంవస్తారాలే పరిపాలించి నారు . అయిన కూడా ఆయా వర్గాల ఆర్ధిక సామాజిక పరిస్తితులల్లో పెద్దగా మార్పులు ఏమీ రాలేదు . మరి ఎందుకు మార్పు రాలేదో మనం ఆలోచించాలి . 

ఫ్యూడల్ వ్యవస్థ లో పాలించిన వారు ఎవరైనా పూజారి వర్గాల ప్రతినిధి గానే వ్యావహ రించాలి గాని పేదల పక్షాన లేదా కర్షకుల , దాసీ దాస జన పక్షాన ఆలోచించ డానికి వాళ్లకు అవకాశం లేదు . అట్లాగే ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్య వ్యవస్థ లో బడా బడా పెట్టు బడి దారుల ప్రయోజనాలు రక్షించే కొరకే ఎవరికైనా అధికారం ఇవ్వబడుతున్నది తప్పితే పేదల బాగు కోసం కాదు అని మనం గుర్తించాల్సి ఉంటుంది . మొన్నటికి మొన్న మీ ఇష్టం వచ్చి నట్లు పెట్రోల్ ధరలు పెంచనివ్వను అంటే జయ పాల్ రెడ్డి గారి మంత్రి పదవి మారి పోయింది . రిలయన్స్ అధినేత ఢిల్లీ లో విద్యుత్ చార్జీలు ఉత్పత్తి ధర తో పొంతన లేకుండా ఎట్లా పెంచుతాడన్నా నేరానికి అరవింద కేజ్రీ వాల్ తన ముఖ్య మంత్రి సీటునే వదులు కోవాల్సి వచ్చింది . అంటే ఒక ఎమ్మెల్లె సీటో ఒక మంత్రి పదవో ఒక ముఖ్య మంత్రి సీటో పొంది సంతృప్తి చెందడం కాదు లూసర్స్ బాధ్యత . 

ఇంత వరదాక వ్యవస్తలో తాము కోల్పోయిన దానికి న్యాయమైన వాటా లభించే కొరకు జరుగుతున్న మౌలికమైన పోరాటాలల్లో భౌతికంగా , బౌద్ధికంగా పాల్గొన కుండా అంది వస్తున్న అధికారం కోసం అర్రులు చాస్తే అయితే వ్యక్రులు గా వాళ్ళు లాభ పడుతూ సంపన్న వర్గాల సేవలో తరిస్తారేమో  గాని వ్యవస్తకు జరిగే ఉపకారం ఏమీ ఉండదు 

పెంటయ్య వీరగొని