Wednesday, August 27, 2014

                                                                  చెట్టు !

                                                  నల్లటి దృఢమైన మొదలుతో 

                                                  తలలో సతత హరిత పత్రాల గుచ్ఛం 

                                                  అది తలెత్తి ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నది !

                                                          
                                                          వాడు పొద్దున్నే తన ఛాతీ పైనుండి ఎగబాకీ 

                                                          తలలోని గెలల తడిమి తడిమీ తరిగి తరిగీ 

                                                          కారిన రసాన్ని లోట్టి నిండా పట్టి తెస్తడు.
.
                                                         
                                                          రసమేనా అది ?

                                                          నల్లని దేహం నుండి కారిన తెల్లని రక్తమా ?

                                                          బొట్టు బొట్టు స్రవించి లోట్టి నిండా నిండి నట్టు 

                                                          చుక్క చుక్కా స్వేదం ఎవని బొక్కసాన్ని నింపుతోంది?


                                            చెట్టుకు తెలుసు, 

                                            ప్రతి దినం ఉదయం వాడు 

                                            తన ఛాతీ మీదుగా ఎందుకెక్కుతాడో .?

                                            ఇంకా ఇది కూడా తెలుసు ,

                                            మేర కత్తి తో సన్నటి కోతలు కోసీ కోసీ 

                                            తన దేహం లోని రసాన్నెందుకు పిండుతున్నాడో?


                                                           రోజూ ఉదయం వాడు దించేది 

                                                           చెట్టు శ్రోణితమే గాదు 

                                                           లోట్టి నిండుగా కోపాన్ని గూడా !


                                           వాని కత్తి వేటుకు నేల రాలిన 

                                           ఆకులను  ఆకలైన చేతులు ఏరుకొని ,
                                              
                                           అల్లుతున్నయ్ ఆయుధాలకు ఒరలను .


                                                             వాడు పిండి తెస్తున్నది మొగిలో ఊరిన రసమే గాదు 

                                                             తన రక్త మాంసాల్లోని జవసత్వాల తో బాటు 

                                                             తన నిండు జీవితం లో కరిగి పోయిన కాలాన్ని గూడా!

                                          
                                           చెట్టుకు తెలుసు !

                                           మందందరి కోసం మధువు దించి పోస్తూనే 

                                           తన కోసం వాడు చుక్క చుక్క కోపాన్ని తాగుతూ 

                                           నిండిన బుంగా నురగలు గక్కినట్టు 

                                           వనరుల ధ్వంసకుల పైకురికే పోరైతడని .

                        
                                                                 ప్రతి రోజూ చెట్టు వాణ్ని గురించి ఆలోచిస్తూనే ఉంది !

                                                                 వాడు వీపు కాయలు గాసి మాసి పోయిన

                                                                మనిషి మాత్రమేగాదు, నల్లటి తాటిమాను మాత్రమేగాదు 

                                                                 మండువాల్లోని  మనుషులను  దండు గట్టించిన 

                                                                 సర్వాయి పాపని  తమ్ములైన

                                                                 ఖైరి గంగారాం బుర్ర చిన్ను వారసుడా ? అని !




                                                                          వీరగోని  పెంటయ్య ,

                                                                             9908116990 

Saturday, August 16, 2014

సర్వాయి పాపన్న తాత్వికత !

      క్రీ|| శ || 1649 లో ఇంగ్లండు లో మొదటి చార్లెస్  ను ఆలివర్ క్రమ్ వెల్ ఉరి దీసి ఇంగ్లీశ్ నిరంకుశ రాచరి-

కత్వానికి సమాధి కట్టడం జరిగింది. రాచరిక , భూస్వామ్య విధానాలతో వారికి  కొమ్ముకాసిన మతకర్తల తో 

విసిగి పోయిన ఫ్రాన్స్ ప్రజల మనో భావాలకు పదును పెట్టడానికి ఆ సమాజం నుండి మతం అజ్ఞానానికి 

మోసానికి మూలం అంటూ వాల్టెయర్ ముందుకు వస్తే రూసో మరో అడుగు ముందుకు వేసి " మానవులు 

అందరు పుట్టుకతో సామానులు,కానీ ఈ సమాజం వ్యక్తిగత ఆస్తి హక్కు నొకదాన్ని తెచ్చి అసమానతలు 

సృస్టించడం వల్లే , యజమాని-- దాసుడు, జ్ఞాని --అజ్ఞాని, పేద -- ధనిక వర్గాలుగా విభజింప బడ్డారు అన్నాడు 

ఇక్కడ భారత దేశం లో ఆనాటికి బ్రాహ్మణీయ సాంప్రదాయ తర తరాల ఛాందస వాద నలను పూర్వ పరమ్ 

జేస్తూ కబీర్, గురునానక్, తుకారాం,సామ్ దేవ్, సంత్ రోహి దాస్, లాంటి వారి సాంఘిక మత తిరుగు బాట్ల కు 

కోన సాగింపుగా సర్వాయి పాపన్న తెలంగాణ లో తెరమీదికి వచ్చినాడు.

     ఆనాటికి సామాన్యులకు ప్రతీక  అయిన  వీర శైవాన్ని పాపన్న కుటుంబం ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

కులీనుల వలెనే తాము మత ఆచారాలు ఆచరిస్తున్నప్పటికినీ  అగ్ర కులాలకు లభిస్తున్న ఆదరణ తమకు 

దొరుకని తీరు గమనించిన పాపన్న మతం పైన తిరుగు బాటు చేసిండు. ఆనాటికి దక్కను లో ఒక వెలుగు 

వెలుగుతున్న మరాఠా సర్ధార్ శివాజీ, బీజా పూర్ మరియు గోలకొండ నవాబు తానీషా కలిసి మొఘలుల 

అధికారాన్ని ధిక్కరించే ప్రయత్నం లో ఉన్నారని గ్రహించిన ఔరంగా జీబ్ వారికంటే తానే ముందుగా 

గోల్కొండ పైన దండయాత్ర జెసి అక్కన్న, మాదన్నలను చంపివేసి తానేశాను ఖైదు లో వేశాడు.గోల్కొండ 

మిగతా నాలుగు సంస్తానాలు గుల్బర్గా, బీదర్, అహ్మద్ నగర్ బేరార్ లతో నిత్యం గర్శన జరుగుతున్న 

కారణంగా సైనిక పదాతి దళాలు నిరంతరం గ్రామాల మీదుగా ప్రయాణం చేస్తుండడం వలన కల్లు 

మండువాల్లో కల్లు అమ్ముకునే  పాపన్న లాంటి విచక్షణా పరులకు ఆధిపత్యం కోసం జరుగున్న పోరాటాలు

అర్థం కాసాగినాయి. 

యుద్ధ అవసరాల కోసం ప్రజల పైన వేస్తున్న పన్నులు , అవి కట్ట లేక. తీవ్ర అసంతృప్తి తో ఉన్న ప్రజలు 

 అవకాశం ఉంటే తిరుగు బాటుకు సిద్ధంగా ఉన్నట్లుగా పాపన్న గమనించి నట్లు తెలుస్తోంది.

.      తండ్రి లేని పాపన్నకు పితృస్వామిక ఆధిపత్యం లేనందున కొంత స్వతంత్ర భావనలతో పెరిగి ఉంటాడు.

అందుకే సైనిక పదాతి దళాలు తన గ్రామం గుండా పోతున్నప్పుడు వారు కల్లు పోయుమని ఇబ్బంది 

పెట్టడం , పోయకుంటే కొట్టడం, ప్రజల వద్ద ఉన్న కోళ్ళు గొర్రెలను బలవంతంగా లాక్కు వెళ్ళడం చూసిన 

పాపన్న వాళ్ళ దౌర్జన్యానికి చరమ గీతం పాడాలనుకున్నాడు. వారి రాజకీయాధికారాన్ని ఓడించాలను 

కున్నాడు . రాజ్యాధికారం సాధించాలంటే సంత సైన్యం అవసరాన్ని గుర్తించాడు. దానికి అవసరమైన 

సొమ్ము ను తన ఇంటి నుండే సమకూరిస్తే విశ్వస నీయత పెరుగుతుంది అనుకున్నాడు. అందుకే తన తల్లి 

తన భవిష్యత్ కోసం దాచి పెట్టిన సొమ్ము తోనే తన మొదటి ఆయుధాన్ని సమకూర్చుకున్నాడు. ఆయన 

నిజాయితీ, పేదలను ప్రేమించే గుణం, ఆధి పత్యాన్ని, అణిచి వేతను సహించ లేని లక్షణం పాపన్నను 

మొఘల్ సామ్రాజ్యాధి పత్యానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగు బాటుకు ప్రోత్సహించింది. షాపురం ,

(పాపన్న ఖిలా కట్టిన తర్వాత ఖిలాషపురం అయింది.) తాడికొండ, సర్వాయి పేట,ధూల్ మిట్ట లో పాపన్న 

కట్టిన కోటలు చూస్తే తన పరిమితమైన ఆర్థిక వనరులతో అంతటి కోటలు ఎట్లా కట్టగలిగినాడో ఆశ్చర్యం

వేస్తుంది. పాపన్న కోటలో లేనప్పుడు తాటికొండ ఫోర్ట్ పైన దిలావర్ ఖాన్ దాడి జెసి పాపన్న ఖజానా లెక్కల

పుస్తకాన్ని స్వాధీన పర్చుకొని  నాలుగు రోజుల పాటు చూస్తే గాని అవి ఒడువ లేదట. అంటే తనకు ఎంత 

ఆర్థిక నిబద్ధత ఉందో అర్థం జేసుకోవచ్చు .అలాగే బంది పోటు, దారిదోపిడి గాడని దోపిడీ వర్గాల 

ప్రతినిధులు కొందరు బహదూర్ షా తో మొర బెట్టుకుంటే 20 వేల సైన్యాన్ని ఇచ్చి యూసుఫ్ ఖాన్ ను 

పాపన్నను చంపి రమ్మని పంపిస్తే , పాపన్న తాను అతని తో తలపడకుండానే తన సైన్యాధి కరిని పంపి 

మార్గ మధ్యం లోనే యూసుఫ్ ఖాన్ ను మట్టు బెట్ట గలిగాడంటే పాపన్న యెంతటి యుద్ధ కుశలుడో 

అర్థం జేసుకోవచ్చు. 

          పాపన్న సర్వాయి పేట లో ఎత్తయిన గుట్టల పైన నిర్మించిన తన కోట పైకి వెళ్ళే టప్పుడు, కోట

 నుండి బయటకు వెళ్ళేటప్పుడు  ఆయన తన ఆరాధ్య దైవం బయ్యన్న కు  మొక్కి వెళ్ళేవాడట . 

ఎవరీ బయ్యన్న? ఒక దిగంబర మూర్తి. కుడి వైపు నాలుగు చేతులు ఎడమ వైపు నాలాగు చేతులు 

ఉన్నాయి . ఢమరుకం, యమపాశం, గద, కమలం, కుడి వైపు చేతుల్లో ఉంటే ఎడమ వైపు చేతుల్లో 

శూలం, విల్లు , సర్పం, నరుకబడిన శత్రువు తల ఉన్నాయి. కుక్క &, బుద్ధుడు పద్మాసనం లో ఉన్నాడు. 

ప్రకృతిని ఆరాధించే వాడని, మజీద్, మందిర మతాలను త్రోసిరాజని బౌద్ధం ఆచరించే వాడని అర్థం .

అవుతున్నది. దిగంబరత్వం నిరాడంబరతను తెలుపుతుంటే తన వర్గ శత్రు నిర్మూలతలో ఆయుధాల 

ఉపయోగం తెలిపే విధంగా ఉందా విగ్రహం. ప్రపంచం లోనే అంత పెద్ధ భైరవ మూర్తి మరెక్కడా లేదు అని 

తెలుస్తోంది. ప్రస్తుతం శష్ట్రీయంగా ఎంతో అభివృద్ధి చెందిన సామాజిక శాస్త్రం  మార్క్సిస్ట్ తత్వశాష్ట్రాన్ని  క్రీ||పూ||

535--475 లో హెరాక్లిటస్, 460--370 లో డెమోక్రట్స , క్రీ || పూ|| 4వ శతాబ్ధం లో సోక్రటీస్ , అతని 

శిష్యులు ప్లేటో ప్రశిష్యుడు అరిస్టాటిల్, ఆ తర్వాత పాపన్న కాలపు బర్కెలే దాకా ఎందరో తత్వ వేత్తలు  

పరిపుస్టమ్ జేస్తే పాపన్న ఆచరణ కూడా ఈ వాదానికి తన కంట్రీబూషన్ అందించినాడని చెప్పడానికి 

ఇంకా శాష్ట్రీయమైన చరిత్ర పరిశోధన  పాపన్న కంటెక్స్ లో జరుగాల్సి ఉంది.

Thursday, August 14, 2014

సర్వాయి పాపన్న జయంతిని దళిత బహుజనులందరు  పండుగలా జరుపుకోవాల్సిన అవసరం

 ఏమిటి? అన్న విషయాన్ని ఇప్పటికైనా మనం లోతుగా ఆలోచించాలి.

.   1650 ఆగస్ట్ 18 న పాపన్న పుట్టిన నాటికి మనకు ఇంకా ఒక జ్యోతి బా ఫూలే గానీ ఒక బాబా సాహెబ్ 

అంబేడ్కర్ .గానీ జన్మించ లేదు. అలాగే ఫూలే వలె గానీ అంబేడ్కర్ వలె గానీ చదువుకున్న వాడు గాదు. 

కానీ ఆనాడు  బడుగు బలహీన వర్గాల హక్కుల ను అనగదొక్కు తున్న వైదిక, మహ్మదీయ మతాలను 

త్రోసి రాజని దళితులను  ఎల్లమ్మ, పోచమ్మ గుడుల్లో పూజార్లు గా నియమించినట్లు పాపన్న  చరిత్ర లో

  ఉంది. నేడు 21 వ శతాబ్ధం లో జరుగుతున్న వర్గ పోరును పాపన్న 17 వ శతాబ్ధం లోనే చేసి చూపించిన

 వైతాళికుడు. ఆనాటికి మార్క్సిసమ్. గానీ మావో ఇజామ్ గానీ లేని ఒక ఫ్యూడల్ వ్యవస్త రాజ్యమేలు 

తున్న  

కాలం. దళిత బహుజనులకు ఆస్తి కలిగి ఉండే హక్కు గానీ, ఆయుధాలు ధరించి యుద్ధ  యోధులు గా 

జీవితాలు గడిపేపరిస్తితి గాని లేని కాలం లో ,సర్వాయి పాపన్న హాసన్, హుసేన్,తుర్క ఇమామ్, దూదేకుల పీర్,

 కోత్వాల్ మీర్ సాహెబ్ , అనే అయిదుగురు ముస్లిములను, హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి 

మానన్న,కుమ్మరి గోవిందు, మేదరి ఎంకన్న యెరుకల సిట్టేలు జక్కుల పెరుమాళ్ళు యేనాది పాసేల్ , 

లాంటి 20,000 మంది దళిత బహు జనులతో దండు కట్ట గలిగినాడు.అదీ కేవలం వరంగల్ , కరీంనగర్, 

నల్గొండ, మరియు మేదక్ జిల్లాల నుండే,  ప్రబుత్వ మాటల్లోనే వామ పక్ష తీవ్రవాద ఉద్యమాల సైన్యం అన్నీ

 రాష్ట్రాలల్లో కలిసి30 సంవస్తారాల తర్వాత  40 వేలు ఉన్నదట. అంటే ఆనాటి ప్రజల దయనీయమైన జీవన 

స్తితిగతులతో బాటుగా పాపన్న నాయకత్వ లక్షణాలను గూడా మనం పరిగణించాలి .

            ఆయన టిప్పు సుల్తాన్ వలెనో  , ఝాన్సీ లక్ష్మి బాయి వలేనో , లేదా తొలి స్వాతంత్ర ఉద్యమం లో 

పోరాడిన రాజుల , చక్రవర్తుల  వలె నో  తన రాజ్యం దక్కించు కోవడానికి పోరాడిన వాడు కాదు . ఆయనకు

 రాజ్యమే లేదు. కేవలం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సంపదలో  వారికి దక్క వల్సిన వాటా 

కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టినాడు. కానీ చరిత్ర లో ఆయనకు దక్క వల్సిన చోటు దక్క లేదు. తమ 

తమ మూలాలను పెకిలించి వేస్తున్నాడని కసి తో రగలి పోయిన వైదిక,మహ్మదీయ మతాల సైనికాధి కార్లు 

చరిత్ర కారులు పాపన్న ఆనవాళ్లను చెరిపెసే ప్రయత్నం చేసినారు. ఆయన బ్రెస్ట్ సైజ్ ఫోటో అయిన లండన్ 

లో ఉన్నది కనుక ఆ మాత్రమైన ఆ చిత్రం మిగిలింది . 1710 లో ఆయన మరణించి నట్లు చెబుతున్నారు .

ఆయన మరణించిన తర్వాత దాదాపు 165 సంవస్తారాలకు 1874  లో J A బోయేల్ కర్ణాటక రాష్ట్రం లోని 

బళ్ళారి లో ఒక జాన పద గాయకుని నోట విన్న పాటను ఆయన ఆంగ్లం లో రాసుకున్నాడు. దాన్ని 1909 

లో రికార్డు లోకి ఎక్కించాడు.తిరిగి 1974 లో జెన్ రొగేర్ గుంటూరు లో విన్న పాట ను రికార్డ్ చేశారట. 

ఆయన పుట్టింది వరంగల్ జిల్లా ఘనపురం మండలం ఖిలాషపురం. ఆయన నడయాడిన నేల నేటి 

తెలంగాణ పోరు గడ్డ. అన్ని సంవస్తారాల తర్వాత ఒక పరాయి దేశస్తుడు పరాయి ప్రాంతం లో ఏదో విని ఏదో 

రాస్తే దాన్ని మనం పాపన్న చరిత్ర గా ఎలా స్వీకరిస్తాం? 

   ఇవ్వాళ మన తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకం లో చేర్చాలన్న

డిమాండ్ చాలా  బలంగా వస్తున్నది . అవును తప్పకుండా చేర్చవల్సిందే. యూరప్ లోని ఆలివర్ క్రామ్ వెల్  
.వలె మన పాపన్న భారతీయ తొలి తెలుగు ప్రజాస్వామిక విప్లవ వీరుడు. ఆయన చరిత్రను శాస్త్రీయంగా 

పరిశోధించి తవ్వి తీసి భావి తరాలకు అందించ వల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం స్వీకరించాలి.

       కల్లు గీసుకొని, పసుల గాసు కొని బతికిన పాపన్న కు అత్యంత బల శాలి అయిన మొఘల్ 

సామ్రాజ్యాన్నే ఎదిరించాలన్న ధైర్యం ఎట్లా వచ్చింది? ఆనాడు తెలంగాణ మాత్రమే గాకుండా మొత్తం దక్కన్ 

ప్రాంతపు ఆర్థిక సామాజిక పరిస్తితి పాపన్నను పోరు బాట వైపు ఎలా పురి కొల్పింది? తెలంగాణ లోఆనాటికి 

భూమి తో బాటు ఆర్థిక వనరులన్నింటి పైనా పెత్తనం మరియు ఆయుధాలు తిప్ప గలిగిన అధికారం గల 

 వెలమ, రెడ్డి కులాల పెత్తందార్లు పాపన్న జయించిన కోట ను విదేశీయు లైనప్పటికినీ తమ మతం గానీ 

ముస్లిం  రాజు లకే మళ్ళీ ఎందుకు అప్పగించాలను కొన్నారు ? ఆనాడు తాము వలచిన స్త్రీలను 

బలవంతంతంగా అయినా పెళ్లి జేసుకొనే అవకాశం ఉన్నప్పటికినీ పాపన్న తాను కోరుకున్న స్త్రీని తనకిచ్చి 

పెళ్లి జేయిమని అడిగినాడే గానీ బలవంత పెట్టని సంస్కారం కలిగిన పాపన్నను స్త్రీల పైనా అఘాయిత్యాలు 

చేసినాడని చేసిన దుష్ప్రచారం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో, అవి ఇప్పటికీ ఎలా ఆచరణలో

 పెడుతున్నారో, ఆనాటి ఖాజీ ఇనాయత్ షా నుండి నేటి కర్ర పెత్తనం  చేస్తున్న అధికార వర్గాల దాకా ప్రజా 

ఉద్యమాలను బలహీన పర్చడానికి ఎలా బరిదేగిస్తున్నారో పరిశీలించాల్సి ఉంది.

     ఆనాడు పాపన్న జేసిన పోరాటం యొక్క కొనసాగింపే  ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ఉద్యమాలు 

అన్న అవగాహనతో పరిశోధన జేస్తే వర్తమాన ఉద్యమాలకు ఎంతో మేలు జరగడం తో బాటుగా తన రక్తం తో 

తెలంగాణ గడ్డను ఎరుపెక్కించిన పాపన్నకు ఇప్పిటికైనా ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము. 

                                                                                                                 వీరగొని పెంటయ్య 

                                                                                          విశ్రాంత విద్యా పర్యవేక్షణ అధికారి .