Sunday, May 1, 2016

ప్రైవేట్ పాఠశాలల సహాయ నిరాకరణ వలన అటు టెట్ ఇటు ఎంసెట్ రెండు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొందరు టైమ్ దొరికిందని సంతోష పడితే కొందరు ప్రభుత్వన్ని తిట్టు 

కుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల సమ్మె సమంజశమైందేనా ? అట్లాగే వైద్యులు కూడా తమ పైన కేసులు పెడుతున్నారని కూడా సమ్మె జేస్తున్నాయి. ఈ రెండు అంశాలను కేవలం ప్రభుత్వ 

పైన కొందరికి సహజంగా ఉండే గుడ్డి వ్యతిరేకతతో చూడాలా  లేక ఇందులో సహజంగా ఉండే అసంబద్ద తను ప్రశ్నిద్దామా ఒక సారి పరిశీలిద్దాం .  

   1985 సెప్టెంబర్ లో పి వి నర్సింహా రావు మానవ వనరుల శాఖామాత్యులు కాగానే 1986 నూతన విద్యావిధానం డాక్యుమెంట్ వహ్చ్కింది. అందులో అసలే ఉపాధ్యులు లేకుండా , 

ఉన్నచోట విషయ బోధకులు లేకుండా, తరగతి గదులు లేకుండా, చివరికి  నల్ల బల్ల చాక్ పీసులు కూడా లేకుండా పాఠశాలలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కండ్లకు కట్టి నట్లు గా ఒక 

డాక్యుమెంట్ తీసుక వచ్చినాడు. దానితో దేశీయ పట్టుబడి దారుల కన్ను విద్యా వ్యాపారం పైన పడ్డది. అదేదో దేశోద్ధారక మైన పని అని బ్యూరోక్రాట్లు , రాజకీయ నాయకులు వాటికి అనేక 

వెసులు బాట్లు ఇచ్చి ప్రైవేట్ విద్యా సంస్తలను ప్రోస్తహించారు  రాజకీయ నాయకులే తమ అనుయాయుల చేత విద్యా సంస్తలను పెట్టించారు. పీవీ గారి బంధువులవే కరీంనగర్ లో రెండు 

మూడు ప్రైవేట్ విద్యా సంస్తలు ఇప్పటికీ ఉన్నాయి. అట్లా ముఖ్యంగా ఆనాటి ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో  పెట్టు బడి దార్లు, పోగాగు బేరం, చేపల బేరం , రియల్ ఎస్టేట్ వ్యాపారం, సినిమా 

వ్యాపారం , ల  ద్వారా సిధ్ధించిన లాభాలను విద్యా వ్యాపారం పెట్టుబడి పెడితే అంతకంటే గూడా  విద్యా వ్యాపారం లో ఇబ్బడి ముబ్బడి గా లాభాలు సంపాదించ వచ్చు అన్న అత్యాశతో  తో 

విద్యా రంగా లో చొరబడి ఇవ్వాళ పిల్లల తలిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఒకరిని పరుగెత్త కుండా ఆపి మరొకరు ఎంత బాగా పరుగిడు తున్నారో చూడండాని చెప్పిన చందంగా , ప్రభుత్వ 

పాఠశాలల్లో చాలా కాలం దాకా పిల్లల సంఖ్యకు సరిపోయినంత మంది ఉపాధ్యాయులను నియమించక, పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ పాఠశాలలను నీరుగార్చి ప్రైవేట్ విద్యారంగాన్ని 

పరుగెత్తించింది రాజకీయ నాయకులే, అందులో వారి స్వార్థం ఏమిటంటే వారి అనుయాయులకు లాభాల పంట పండాలా, రేపు వారికి దండిగా ఎలక్షన్ల ఫండ్ రావాల. 

ఇట్లా ప్రారంభ మైన ప్రైవేట్ పాఠశాలల యజమానులు వారి పాఠశాలల్లో పనిజేస్తున్న ఉపాధ్యాయులను కట్టు బానిసల కంటే కడహీనంగా శారీరకంగా ,మానసికంగా, ఆఖరుకు లైంగికంగా సైతం 

వేధింపులకు గురి జేసిన సంఘటనలు కోకొల్లలు గా ఉన్నాయి. 1991 లో కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో అప్పటి ఎమ్మెల్లే గారికి  పాఠశాల ఉండేది. ఇప్పుడు ఉద్యమ కారులమ్ అని 

చెప్పుకుంటున్న వారికి సైతం ప్రైవేట్ పాఠ శాల ఉండేది, బొగ్గు దందా జేసె వారు, ఎఫ్ సి ఇ మూత బడితే ఉద్యోగాలు కోల్పోయిన వారూ , సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగాలు 

పెట్టిస్తామనే బ్రోకర్ దందా జేసె వారూ, నిరుద్యోగులు,ఇలా చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు పెట్టి నారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులు పెట్టె వేదనలకు ఉపాధ్యాయులు పడే గోస చూడ లేక 

అప్పటి జిల్లా కలెక్టర్ ఐ వి సుబ్బ రావు గారు గోదావరి ఖని వెళ్ళి ఒక రాత్రంతా ప్రైవేట్ పాఠశాల యజమానులతో చర్చలు జరిపి ఇరు వర్గాలకు అంగీకారమైన  ఒప్పందం జరిపించినారు. అప్పటి 

రాజకీయ నాయకులు ప్రతి పక్షం ,అధికార పక్షం అన్న తేడా లేకుండా యాజమానుల వైపు నిలిచి అధికారుల పైన ఒత్తిడి జెసి యాజమానుల లాభం కోసం నిలిస్తే ,కామ్రేడ్ ఆకుల భూమయ్య, 

మరియు సికాస  నాయకత్వం లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పొరాడి తమ హక్కులు కాపాడు కోగలిగినారు. 
ఇంతింతయ్ వటుడింతయ్ అన్నట్లు గా పాఠశాలలు కళాశాలలు గా మారి క్రమాన్ని మనం చూడ వచ్చు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేలపు గింజ ఆరి చేతుల బెట్టి సత్తు 

పిండి సాంతం బుక్కిన విధంగాతన అవినీతిని ప్రజలు ప్రశ్నించ కుండా ఉండే కొరకు ఫీస్ రీఎంబర్స్ మెంట్ అనీ ఆరోగ్యశ్రీ పథకం అని ప్రవేశ పెట్టి  అదేదో ప్రజల బాగుకోసమే  అని ప్రజలు భ్రమ 

చెందే విధంగా ప్రచారం జెసినాడు . ఎంతగా అంటే ఆయన  చచ్చిన తర్వాత కూడా అది నిజమే కదా అని ప్రజలు భ్రమించే  విధంగా మాయ జెసి పోయాడు. ఇప్పటికీ ఈవెన్ వామ పక్ష విద్యార్థి 

సంఘాలు, బి సి సంఘాలు  సైతం ఫీస్ రీఎంబర్స్ మెంట్ కోసం పోరాటాలు జేసె పరిస్తితి. ఆరోగ్య శ్రీ పథకం ప్రైవేట్ దావఖానాలకు లాభాలు పంచి పెడితే ఫీస్ రీఎంబెర్స్ మెంట్ ప్రైవేట్ 

విద్యాలయాలను పోషిస్తున్నాయి. ఇవి రెండు కూడా రేపు ఎన్నికల ఫండ్ దండిగా ఇచ్చి తమకు  అనుకూలంగా ఉండే వారినే గెలిపించుకొనే స్తాయికి నేడు వెళ్ళినాయి. ఈ ఫీస్ రీఎంబర్స్ 

మెంట్ డబ్బులతో ప్రభుత్వ విద్యాలయాలను బాగు పర్చితే అందరికీ ప్రయోజనం అలాగే ఆరోగ్య శ్రీ కి ఇచ్చే డబ్బులతో ప్రభుత్వ వైద్య శాలలను బాగు పరిస్తే అందరికీ ప్రయోజనం. కానీ మా 

తరగతి గదుల లభ్యతను, సానిటేషన్ ను, ఆట స్తలాన్ని, మా ఫీస్ స్ట్రక్చర్ ను, ఉపాధ్యాయ్ల అర్హతను , దొంగ సర్టిఫికట్ల దందాను , దొంగ ఎలిజిబిలిటీ సర్టిఫికట్లను ప్రశ్నించ కూడదు అంటూ 

వారూ సమ్మెకు దిగితే వారి సమ్మె ను సమర్తించే సంఘాలను, రాజకీయ నాయకులను చూసి ప్రజలు ఏమనుకుంటారో ఒక సారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు 

ఎంత ఫీస్ అయినా తీసుకుంటాయి, బాధితుల ప్రాణభయం వారి పెట్టుబడి, చావు తో బేరాలు చేస్తారు,  ఆరోగ్యంగా వచ్చిన వారిని కోసి పంపుతారు దాన్నే వాళ్ళు ఆపరేషన్ అంటారు. కనుక 

వాళ్ళు దోచుకొనే స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తున్నది కనుక ప్రభుత్వ విధానాన్ని ఖండించ వల్సిందే అంటే అది ఎవరి ప్రయోజనాన్ని నెరవేరుస్తున్నదో ఆలోచించాల్సిన అవసరం లేదా ?

      చైతన్య వంతమైన ప్రజలు ప్రస్తుతం ఈ ప్రైవేట్ సంస్తలు చేస్తున్న దోపిడిని ప్రశ్నించాలే, తొండ ముదిరి ఊసరవెల్లి అయింది,  వాటి తోకలను ప్రజా ప్రయోజనాల రీత్యా తప్పకుండా  కత్తెరించ 

వల్సిందే . వాళ్ళకు ఇస్తున్న వెసులు బాటును పబ్లిక్ సెక్టారు ఇచ్చి పబ్లిక్ సెక్టారు ను ప్రజల అవసరాలకు తగ్గట్టుగా , నాణ్యమైన విధంగా అభివృద్ధి పర్చాలని ప్రభుత్వం తో ఉద్యమం 

చేయాల్సిన అవసరాన్ని సైతం గుర్తించాల్సిన బాధ్యత గూడా ఉద్యమ కారుల పైననే ఉంది.