Saturday, April 10, 2010

తరలిపోతున్న వనరులను కాపాడుకుందాం కదలి రండి.

శిలలు ఈ భూమి మీద ఎప్పుడి ఏర్పడినయో ఆలోచిస్తే ఈ పుడమి తల్లి పురిటి నొప్పుల సమయంలో ఎగజిమ్మిన లావా చల్లబడి ఘనీభవించి ఏర్పడిన

గండశిలలు ఇప్పుడు గుత్తేదార్లకు కొంగు బంగారం అవుతున్నది.మాది కరీంనగర్ జిల్లాలో తూర్పున ఉన్న పాత మహాదేవపూర్ తాలూకా.అక్కడ అడవికి

గుట్టలకు అవినాభావ సంభందం. గుట్టలు ఉన్నాయి అంటే అడవి ఉంటుంది అన్నమాటే. మా చిన్నతనం లో వేములవాడకు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చే

వాళ్ళం. రామగిరి ఖిల్లా గుట్టలు దాటిన తర్వాత సుల్తానాబాద్ నుండి వచ్చే గుట్టలను మేము బోడ గుట్టలు అని పిలిచే వాళ్ళం ఎందుకంటే ఆ గుట్టల పైన

చెట్లు ఉండేటివి కాదు. అప్పుడు మాకు ఆ గుట్టల పట్ల చిన్న చూపు ఉండేటిది.ఎందుకంటే మా అనుభవం లో గుట్టలు అంటే చెట్లు ఉండాల్సిందే. సుల్తానాబాద్

గర్రెపల్లి.ఎలగందల.నుండి వేములవాడ దాకా అన్నీ గుట్టలే.ఈ గుట్టల వయస్సు 2,500 మిలియన్ సంవస్తారాలు అంటున్నారు తెలిసినవారు.

అయితే ఇప్పుడు తెలుసుకుంటే ఈ గుత్తలు సామాన్యమైనవి కాదు అని తెలుస్తున్నది. వర్షాలు పడినప్పుడు ఈ గుట్టలు ఒంటెలవలే కడుపు

నీళ్ళు త్రాగి మెల్ల మెల్లగా ఆ నీటిని భూమిలోనికి ఇంజెక్ట్ చేస్తాయట. అందుకనే గుట్ట కింద ఉండే ఊళ్లకు నీటి కొరత ఉండదు అని తెలిసినపుడు ఆవురా

ఈ గుట్టలు మానవుల క్షేమం కోసం స్పాంజ్ ముద్దలు అయి నీళ్ళను నింపుకొని మానవుల పాలిటి మరో కాసారం అవుతున్నది కదా? అన్నట్టు రామగిరి

ఖిల్లా గుట్ట కింద ఒక గ్రామం ఉంది దాని పేరు కాసారం. అంటే సముద్రం అన్న మాట. అలాగే ఈ గుట్టలనుడి భూమిలోనికి వచ్కిన నీళ్ళు మనం పైకి

తోడుకున్నపుడు చాలా తీయగా ఉంటున్నాయి.ఎందుకంటే ఆ నీటిలో సల్ఫెట్ లు,ఫాస్ఫెట్ లు ఉండవు.ఎందుకంటే బండరాళ్ల గుండా వచ్చే ఆ నీరు చాలా

ఫిల్టర్ అవుగుండి కనుక. అలాగే గొడుగుకు పైన నల్లగుడ్డ ఎందుకు పెట్టికుంటాం అంటే అది ఉత్తమ ఉష్ణవాహకం కనుక. అలాగే ఈ గండ శిలాలు కూడా

వాతావరణం లోని వేడిని గ్రహించి మనకు చల్లదనాన్ని ఆందిస్తున్నది. ఆకాశం లోని మేఘాలను అడ్డుకొని వర్షాలు పడేటట్లు చేస్తున్నాయి.వేసవి కాలంలో

వీస్తున్న వేడి వడ గాలులను అడ్డుకోని ప్రజలను అగ్నిగుండాల వడ గాలుల నుండి కాపాడుతున్నాయి. సుడి గాలుల నిండి ఎగసిపడిన దుమ్ము,ధూళిల

నుండి మానవ జాతిని కాపాడుతున్నవి ఈ బండ రాళ్ళు అని తెలిసి నపుడు గుండెలే లేని ఈ నల్ల రాతి బండలకు మనుషులంటే ఇంత ప్రేమ,

మనుషుల పట్ల ఇంత దయ జాలి ఎలా వచ్చాయో కదా అని ఆశ్చర్యం కాలుగాక మానదు.
1) మేఘాలను అడ్డుకోని వర్షాలు కురిపిస్తున్నాయి.
2)వర్షించిన నీటిని పుడమి తల్లి కడుపార తాగే విధంగా సరా సరి దాని కడుపులోకే పంపు చేస్తున్నది.
3)ఆ నీటిని కూడా పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసి మనుషులు తాగడానికి అనువుగా చేసి పెడుతున్నాయి.
4)వేడి తాపాన్ని అపుతున్నాయి.
5)దుమ్ము ధూళి నుండి రక్షణ ఇస్తున్నాయి.
6)తనపైనా చెట్లను పెరుగనిచ్చి సీత ఫంలాలు.మామిడి,రేగు, లాంటి ఫలాలను ఇస్తూ మానవుల క్షుద్బాధ ను తీరుస్తున్నాయి.
7) గడ్డి గాదం తనపైనా పెరుగనిచ్చి పశు,పక్షాదులకు ఆకలిని తీరుస్తున్నాయి,
8) తమ దేహలను ముక్కలు ముక్కలుగా చేసుకొని మనకు ఇండ్ల పునాదులు అవుతున్నాయి,గోడలు,పైకప్పులు,చలువ రాతి గచులు అవుతున్నాయి.
9) నెమళ్లకు,గుడ్డేలుగులకు నిలువ నీడై ఇండ్ల యి వాటికి రక్షణ ఇస్తున్నాయి.
10) ఆస్తికులకు దేవత శిల్పాలయి సాంత్వన ఇస్తున్నాయి.

ఇలా ఒక్కటేమిటి మానవ మనుగడకు మానవులకంటే ఎక్కువ దోహద పడుతున్నవి ఈ గుండెలు లేని బండ రాల్లే.హృదయం ఉన్నదని చెప్పుకుంటున్న

మనుషులు ఏమీ చేస్తున్నారు అంటే......

ఈ బండ రాళ్లను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తూ వానలు కురువకుండా అడ్డుపడుతున్నారు

తామే విపరీతమయిన వేడి సెగలు సృస్టిస్తూ చల్ల బరిచే గుట్టలను నిర్మూలిస్తున్నారు.

దుమ్ము ధూళి నుండి కాపాడే రక్షణ వలయాన్ని ధ్వంసం చేస్తున్నారు.

ఉన్న చెట్లను నరికి వేస్తూ ఇకనుండి చెట్లు పెరిగే వ్యవస్థ లేకుండా చేస్తున్నారు.

పశుపక్షాదులకు నిలువ నీడ లేకుండా చేసి అవి గ్రామాలల్లోకి వస్తే కాల్చి చంపి ఎకలాజికల్ సమతుల్యతను నాశనం చేస్తున్నారు.

నిజానికి ఈ విధ్వంసం అంతా చేస్తున్నది సామాన్య ప్రజానీకమేనా? ఎంత మాత్రం కాదు.డబ్బు,రాజకీయ అధికారం ఉండి, రాజ్యాంగం

మీద ప్రమాణం చేసి ఈ ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరుస్తామని ప్రజలకు,పర్యావరణానికి రక్షణ కల్పిస్తామని మాయ మాటలు చెప్పి మన ఓట్ల

తోనే అధికారం లోకి వచ్చి ఆ అధికారం ద్వారా సంక్రమించిన అధికారంతో అడిగిన వాళ్ళ నోర్లు మూయిస్తున్నారు. అలనాడు హిరణ్యాక్షుడు సంపద

అంతా తన సొంతమే కావాలనుకొని భూమిని చాప తీరుగా చుట్టుకొని పోయి సముద్రం లోని దాక్కోన్టే తినడానికి కందమూలాలు లభించని వరాహ

సమూహం హిరణ్యాక్షుని వధించి భూమిని కాపడి నట్లు అధర్వులు కోల్పోతున్న బక్క జనులంట సంఘటిత పది పోరాటలకు దిగి ఈ భూమిని

కాపాడకుంటే ఈ రాక్షస సమూహం సామాన్య ప్రజలకు ఈ భూమి పైన ఏమీ మిగులకుండా బొక్కెస్తారు.

సహజ వనరులు ఎక్కడ ఉన్నా అక్కడి స్థానిక ప్రజలకు వాటి ఫలాలు దక్కాలి.కానీ ఎక్కడి వాల్లో వచ్చి ఇక్కడిది అంతా ఎప్పటికీ

లేకుండా ,ఇక్కడి సామాన్యులకు ఏమాత్రం దక్కకుండా దోచుకొని పోతుంటే చూస్తూ ఉంటూ మేము ప్రజలకోసమే ఉన్నము అని మాయ మాటలు

చెపుతున్న రాజకీయ నాయకుల మాటలు ప్రజలు ఇక నమ్మే పరిస్తీతిలో లేరు. స్టానికులకు దక్కకుండా తరలి పోతున్న వనరులను

కాపాడుకుందాం కదలి రండి.ఉద్యమం లో భాగస్వాములు కండి.

Wednesday, April 7, 2010

దేవాదుల-నీళ్ళు-నిధులు-దాని మతలబు.

గోదావరి నదికి ప్రాణహిత,ఇంద్రావతి రెండు పెద్ద నదులు కలిసిన తర్వాత ఆనాడు ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ కడుదాం అనుకుంటే అది ఇప్పుడుకాస్తా

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం తుపాకుల గూడెం గ్రామపంచాయతి లోని గంగారామ్ గ్రామం వద్ద జువ్వాడి చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల

పథకం పేరుతో సోనియమ్మ మార్చి 14,2008 నాడు ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.మొదటి విడతలో ఒక్కొక్క మోటార్ సామర్థ్యం 8.5 మేఘావాట్ట్

విద్యుత్ శక్తి అవసరముతో రెండు మోటర్లు నడుస్తున్నాయి.రెండవ ఫేస్ లో 12.5 మేఘావాట్ట్ సామర్థ్యం తో రెండు మోటార్లు నడుస్తాయత.ఇక్కడ నీటి

మట్టం సముద్రమట్టం నుండి 70 మీటర్ల ఎత్తున ఉంది.అయితే ఇక్కడి నుండి 287 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తారట.ఇప్పటి లెక్కల ప్రకారం పైప్ లైన్

పొడవు 138.9 కిలోమీటర్లు.ఆయకట్టు 78 లక్షల ఎకరాలు.(సరే ఇప్పటికీ ఒక్క ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వలేదు అదివేరే సంగతి)ఈ ప్రాజెక్ట్ అంచనా

వ్యయం 1844 కోట్లు.ఇది లిఫ్ట్ చేసే నీళ్ళు కేవలం 5.18 టి ఎం సి లు మాత్రమే.అవసరమైన విద్యుత్తు ప్రస్తుతం రెండు ఫేస్ లకు కలిసి 42 మేఘవాట్ట్స్

శక్తిగల మోటార్లను నడిపెటంతటి విద్యుత్తు కావాలి.

ప్రాజెక్ట్ ఇంటెక్ నుండి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న రెడ్డిపల్లి అనే గ్రామం వాళ్ళు ఇప్పటికీ 4 కిలోమీటర్ల దూరం లో ఉన్న

కనుకునూరు నుండి నీళ్ళు మోసుకొని తెచ్చుకుంటారు. ఈ దేవాదుల ప్రాజెక్ట్ వాళ్ళకు నీళ్ళు తగడానికి కూడా ఇవ్వదు కానీ 140 కిలోమీటర్ల దూరం

లోని పట్టణానికి మాత్రం నీళ్ళు ఇస్తుంది.మేము కొందరం అడ్వకేట్లము దేవాదులను చూద్దాం అని అక్కడికి 4 మార్చ్ నాడు వెళ్ళినము.ప్రాజెక్ట్ కు నీళ్ళు

గోదావరి నది నుండి అందడం లేదు.ఇక్కడ నది ఉత్తరం నుండి దక్షణం ప్రవహిస్తూ దేవాదుల సైట్ వద్ద మలుపు తిరిగి తూర్పు వైపు ప్రవహిస్తున్నది

ఎత్తిపోతల కొరకు మోటార్లు బిగించిన వద్ద కు నీళ్ళు రావడానికి ఒక కాలువ తీశారు.ప్రస్తుతం ఆ కాలువలోనికి నది నీళ్ళు రావడం లేదు ఇక్కడ నదికి

అడ్డుకట్ట లాంటిది ఏమీ లేదు.నది నిండుగా నీళ్ళు వస్తేనే మోటర్లకు అందేవిధంగా నీళ్ళు వస్తాయి.అంటే వర్షాలు పుష్కలంగా పడ్డ సమయం లో నే

ప్రాజెక్ట్ లో నీళ్ళు ఉంటాయన్న మాట.వార్హాభావ పరిస్థితి ఉంటే నీళ్లు మోటర్లకు అండవు.వర్షాలు సక్రమంగా పది చాలినంత విద్యుత్తు ఇవ్వగలిగేతే

1844 కోట్ల రూపాయలతో జువ్వాది చొక్కరావు ప్రాజెక్ట్ అందించే నీళ్ళు 5.18 టి ఎం సి లు.జల యజ్ఞం పేరుతో తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న

నిధులు నీళ్ళు దాని మతలబు.

Tuesday, March 23, 2010

దొంగే,దొంగా దొంగా అని అరిచినట్లు.

ఈరోజు పత్రికలల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి అని పెద్ద పెద్ద వాళ్ళు అంతా గొప్పగా ప్రకటనలు ఇచ్చారు .అది చూసిన తర్వాత ఒక ఆవేదనతో లోతట్టు ప్రాంతాలల్లో ప్రజలు నీళ్ళు మాత్రమే గాదు ప్రతిది ఎంత పొదుపుగా వాడుకుంటారో ఈ పెద్దమనుషులకు తెలుసునా అని అనిపించింది.
ఉన్న ఊరిపక్కనుండే ఒక నాటి జీవనదులు పారుతున్నా.ఊరిలో మాత్రం బావుల్లో,బోరు బావుల్లో చుక్కనీరు దొరుకదు .అరమైలు ,మైలు దూరం నడిచి కున్డెడు నీళ్ళు నెత్తి మీద చుట్ట బట్ట పెట్టుకోని కింద కాళ్ళు చుర్రు చుర్రు మని కాలుతుంటే పైన కుండ బరువుతో బాటు ఎండ వేడి కొర్రాయి తీరు కాలుస్తుంటే అపురూపంగా తెచ్చుకున్న నీళ్ళు ఎంత భద్రంగా దాచుకొని వాడుకుంటారో చూసిన వాళ్ళకు తెలుస్తుంది.అవసరం అయితేనే గిలాసేడు నీళ్ళు తాగుతారు.ఆరోగ్యానికి మంచిది మంతెన సత్యనారాయ న రాజు చెప్పినాడు అని లీటర్ల కొద్ది నీళ్ళు తాగరు,
ఇక స్నానం అంటారా ఇంత ఉడుకపోతలో గూడ రోజూ స్నానం చేయడానికి వాళ్ళు సాహసించరు.నాగరికులు ఆనుకొనే వాళ్ళు రెండు పుటల స్నానం చేయందే వారికి నిద్ర పట్టదు ,వాళ్ళకు ఉండే బట్టలు మహా అయితే రెండు జతలు.వాటిని నీళ్ళల్లో పిండుకొని ఆరేసుకుంటారు.సబ్బు పెట్టి ఆ సబ్బు అంతా పోయే దాకా నీళ్ళల్లో పిండడం ఉండదు.నాగరికుల స్నానాలకు టబ్బులు నిండాలి వాటి నిండా సబ్బు నురగ ,ఆ నురగ పోయేదాక శుబ్రమయిన నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళకు స్నానం చేసినట్లు.వాల్ల బట్టలు ఉతికి చలువ చేసేవరకు ఎన్ని నీళ్ళయిన ఖర్చు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అవి కొనుక్కునే కొనుగోలు శక్తి ఉంది. ఆలాంటి వాళ్ళకు మన రాజ్యాంగం అన్నీ అందుబాటులో ఉంచుతుంది.అది ఎట్లా?సహజ వనరులు కేవలం వాళ్ళ స్వోంతమా అని అన్నవా?నీవు మావోయిస్టువు అంటారు.వాస్తవానికి ఈ నాగరికులు ఇట్లాగే ఈ వనరులను విచ్చలవిడిగా వాడుతూ పోతూ ఉంటే వాళ్లకుయ మరియు రానున్న తరాలకు సహజవనరులు అనేవి మన దగ్గర మిగిలి ఉండవు.నాగరికులు ఆదర్శంగా చెప్పుకుంటున్న అమెరికా తన సహజ వనరులను తన వాటిని అలస్కా లాంటి చోట అట్టీ నిలువ చేసుకుంటున్నది.సరే మనలాంటి వారికి అమెరికా ఆదర్శం కాదు గాని,ఎవరయితే వనరులను విచ్చలవిడిగా వాడుకుంటున్నారో వాళ్ళే పొదు పు గురించి చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది.

Monday, March 22, 2010

ఆలస్యం చేస్తే అంతా అయిపోతుంది.

కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను వేరు చేస్తూ ప్రవహించే నది గోదావరి.మహారాస్ట్రా లోని నా సిక్ వద్దపుట్టిన ఈ నది అదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం,ఉభయ గోదావరి జిల్లాలగుండ ప్రవహించి సముద్రంలో కలుస్తున్నది .జీవధారము నీరము అన్నట్లుగా ఈనది ప్రవహిస్తున్నమేరపాడిపంటలతో నేల పరవశించింది .ప్రజలు ఆనందంగా జీవించేవాళ్లు .నదిని ఆనుకొని ఉన్నగ్రామాలకు ఈ నీరు పెద్ద వనరు .పశువులకు పంటలకు పక్షులకు ఇట్లా మనుషుల మనుగడకు మానవెతిహాస నిర్మాణానికి ఈ నదినీళ్లకు అవినాభావ సంభందము ఉన్నది.
నా అనుభవంలోని ఒక సన్నివేశం ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆదిలాబాద్ జిల్లా జైపురం మండలం ను అనుకోని ప్రవహిస్తున్న నది ఒడ్డు పల్లెల్లో ఎట్లా ఉండేదో నేను ప్రత్యక్షంగా చూసిన సంగతులు ఏమిటంటే ఈ నది వాళ్ళ తాత ముత్తాతల నుండి జీవ నదిగా చూస్తున్నారు.వర్షాకాలం లో నే కాకుండా అన్నీకాలాలో నదినిండా నీళ్ళు ఆనీళ్ళల్లో స్నానాలు ఈతలు ఆటలు చేపలు రొయ్యలు అన్నీ ఆనందగా అనుభవించిన జ్ఞాపకాలు. ఎండాకాలం లో నదిలోనీళ్ళు కొంతా తక్కువగా ఉంటున్నాందున ఎండకు నీళ్ళు వేడిగా అయ్యేటివి అయితే రొయ్యలు నీళ్లమడుగుల్లో లోతుకు వెళ్ళి బండల వెంట చల్లగా విశ్రాంతి తీసుకొనేటివి.ఈతగాళ్లు నీళ్ళల్లోకి మునిగి బండల వెంట ఉన్న రొయ్యలను పట్టుకొని తెచ్చేవాళ్లు.ఎండాకాలం చేపలు,రొయ్యలు తిన్నన్ని దొరికేటివి .
మరి ఇపుడు ఏమయ్యింది?అసలు గోదావరిలో నీళ్లే లేవు మొత్తం ఎండిపోయింది.అంతకు ముందు ఎప్పుడన్న ప్రవాహం ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పటిలాగా మొత్తానికి మడుగులు కూడా ఎండిపోయిన సందర్భాలు అసలు లేవు.గోదావారిలో చెక్ బాల్ తో 20 ఫీట్ల లోతు బొర్లు వేస్తే నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఒద్దెంబడి గ్రామాలల్లో కరంటూ ఉంటేనే నీళ్ళు కనిపిస్తాయి.ఒక వైపు వర్షాలు లేవు మరోవైపు గోదావరిలోని ఇసుక తోడుకొని పోతున్నారు మరో వైపు ఆదిలాబాద్.కరీంనగర్,వరంగల్.ఖమ్మం జిల్లాలల్లో ఓపన్ కాస్ట్ ఘనులపేరుతో 500 మీటర్ల లోతుల్లోనుండి బొగ్గుతీసే పేరుతో భూమి పొరలను పెల్లగిస్తున్నారు.భూగర్భ జలాలు మొత్తానికే అడుగంటి పోయినాయి.తా గడానికి గుక్కెడు నీళ్ళు దొరుకని పరిస్థితి.ఇది ఏమీ అభివృధి ఎవరి అభివృధి ఆవిరికోసం ఈ అభివృధో అసలు అర్థం కావడం లేదు.అభివృధి పేరుతో ఇసుక,బొగ్గు తరలించుక పోతున్నారు,ప్రజలను వాళ్ళ భూములల్లోనుండి తరిమి వేస్తున్నారు తాగడానికి కూడా నీళ్ళు దొరుకని పరిస్థితి.మానవ మనుగడకే ప్రమాదం ముంచుకొని వస్తున్నది .ఇది పాలకులు సృస్టిస్తున్న విపరీత పరిస్థితి .దీన్ని విజ్ఞులయిన వాళ్లు అంతా ఎదిరించాలి

Wednesday, March 3, 2010

చట్టాలు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి?

చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్ట్ కు వెళ్ళడం జరిగింది,3వ అదనపు సెస్సియన్ కోర్ట్ లో కూచున్నాను.జడ్జ్ ఆదేశం మేరకు ఐదుగురు ముద్దాయిలను ప్రవేశ పెట్టారు.అభియోగం ఏమిటంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ ఫారం లోని కాపర్ వైర్ దొంగిలించారు.ఎలక్ట్రి సిటీ అధికారులు,పోలీస్ అధికారులు కోర్ట్ కు వచ్చినారు.వాంగ్మూలం ఇచ్చారు.బహుశా శిక్ష కూడా పదే అవకాశం ఉన్నట్లే అనిపించింది.ఆ ఆరుగురు కలిసి దొంగలించిన సొత్తు మహా అయితే ఐదు వేల రూపాయల విలువ చేస్తుంది కావచ్చు.భారత శిక్షా స్మృతిలో ఎవరు తప్పు చేసిన శిక్ష పడవలసినదే.
బార్ అసోసియేషన్ లో స్క్రోలింగ్ లో హైద్రాబాద్ సెంట్రల్ షాప్ 2.80 కోట్ల పన్ను కట్టనందున షాప్ మూసివేశారు.అంతే.ఉద్దేశ పూర్వకంగా అన్నీ కోట్ల రూపాయలు సంవస్తారాల తరబడి కట్టక పోతే సింపుల్ గా దుకాణానికి తాళం వేశారు.రెండు సంధార్భాలలో న్యాయం సమంగా పాటించబడినట్లు అనిపించ లేదు.
అలాగే మరో సంఘటన కూడా నాకు చాలా బాధ కలిగించింది.కరీంనగర్ పక్కన్నే బద్దిపల్లి అని ఒక గ్రామం ఉంది.కరీంనగర్ చుట్టుపక్కల అన్నీ గుట్టలు ఉన్నాయి. చాలావరకు ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే.ఇంతవరదక ఆ భూముల్లో గ్రామస్తులు పశువులను గడ్డి మేపుకునే వారు.శీతకాలం లో గుట్టలపైనా కాసె సీతాఫలం పండ్లను కోసుకొని తినేవారు.ఇండ్ల నిర్మాణానికి అవసరమైన బండ రాళ్లను పగుల గొట్టి తెచ్చుకునే వాళ్ళు.ఆ గుత్తలు ఆ గ్రామస్తుల సమిస్టీ ఆస్తి గా పరిగ నించే వాళ్ళు.కానీ ఆ బండ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు అని తేలడం ప్రస్తుతం ఆ ఊరికి శాపం అయింది.అధికార,ప్రతిపక్ష నాయకమన్యుల అనుచరగణలు తమకున్న పరపతిని ఉపయోగించుకొని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి పొంది చుట్టూ కంచే వేశారు.పెద్ద పెద్ద పోక్లైన్ లతో తవ్విస్తూ గ్రానైట్ ను తరలించుక పోతున్నారు.ఇంతవరదాక ఆ ఊరి సమిస్టి సంపద గా ఉన్న ఆ గుట్టలు కొద్ది మందికి సంపదగా మారిపోయింది.సరే అది కూడా అభివృద్ది యే గదా అంటారేమో.కానీ ఆ ఊరి పశువులకు తిరిగేదానికి జాగా లేకుండా పోయింది.రేప్ రేపు ఇండ్లూ కట్టుకోవడానికి బండ రాళ్ళు కరువై పొనున్నాయి.అన్నిటికంటే ఆ గ్రామం లో ఈ గుట్టలను పెకిలించి తవ్వి తీయడం మూలాన భూగర్భ జలాలు అడుగంటి తగు నీరు సాగు నీరుకు కరువు వచ్చే పరిస్థితి దాపురించింది.అవి గ్రానైట్ రాళ్ళు కావడం ఆ ఊరి ప్రజలు చేసుకున్న పాపమా?సరే ప్రకృతి వనరులను వాడుకోవడం వల్లనే కదా అభివృధి అనియంటే మరి ఆ గ్రామ ప్రజ్లకు దక్కుతున్నది ఏమీలేదుకదా?ఇది ఎవరి అభివృధి అవుతున్నది అబు ఆ గ్రామస్తులు అడుగుతున్నారు కానీ వారికి జవాబు చెప్పేవాళ్లే ఎవరు కనినిపించడం లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.
ఎవరి సంపద ఎవరి జేబుల్లోకి వెల్లుతున్నది,ఎవరు దొంగలు ఎవరు దోపిడీలు చేస్తున్నారు ఎవరు జైళ్ళలోకి వెళ్లాలి.మన చట్టాలు ఎవరిని జైళ్ళలోకి పెంపుతున్నాయి.మన అధికారులు మన పోలీస్ లు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి ఆలోచిస్తే రాజ్యం స్వభావం ఇంతేకదా అనిపిస్తున్నది.

Wednesday, February 17, 2010

నేదునూరు పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృధికేనా?

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం లోని నేదునూరు గ్రామమలో 14 ఫిబ్రవరి నాడు ముఖ్యమంత్రి రోశయ్య విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ కు శంకు స్థాపన చేశారు.గోదావరి బేసిన్ లో నుండి సరఫరా అయ్యే గ్యాస్ ఆధారంగా ఈ ప్రాజెక్టు నడుస్తుందని చెప్పుతున్నారు.కానీ శంకు స్టాపన రోజుననే ప్రజారాజ్యం నేత హరిరామ జోగయ్య తెలంగానీయులకు భయపడి మన గ్యాస్ తో తెలంగాణలో ప్రాజెక్ట్ పెడుతున్నారని పత్రికలకు ఎక్కినాడు.మన బొగ్గుతో విజయవాడలో నడుస్తున్న థర్మల్ కేంద్రం మాట చెప్పడు,ఎన్ టి పి సి నుండి తెలంగాణ నీల్లతో,బొగ్గుతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు కడపకు,విజయవాడకు,హైద్రాబాదుకు 440 కే వి లైనలు వెళ్తుంటేసరే మంచిదే అనుకుంటాడు.
కానీ నిజంగానే నేదునూరు ప్రాజెక్ట్ తెలంగాణ ప్రయోజనాలకెన?నీటిని నిలువ జేయడానికి,ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రస్తుతం 440 ఎకరాల భూమిని స్వదీన పర్చుకున్నారు.మా 440 ఎకరాల పంట భూమి నీటి పాలు అయ్యింది.తర్వాత ఇక గ్యాస్ విషయానికి వద్దామ్ .గోదావరి బేసిన్ నుండి గ్యాస్ పైప్ వేసి గ్యాస్ సరఫరా చేయడం చాలా ఖర్చు తో కూడుకున్నది,సమీపానగల సింగరేణి నుండి బొగ్గుతో నడుపుకోవడం చవుక అనే వాదన ఇప్పటికే మొదలయ్యింది.అంటే అక్కడనుండి గ్యాస్ రాదు.మన నీళ్ళు మన బొగ్గుతో తయారయ్యే విద్యుత్తుతో మన ప్రాణహిత నడినుండి నీళ్ళు లిఫ్ట్ చేసుకొనిపోవడానికి ఉపయోగిస్తారు.ఒకవైపు తెలంగాణ పోరాటం ఉదృతంగా ఉంది ఇప్పుడు వద్దు అని అన్నా కూడా రోశయ్య ఎందుకు వేగిరంగా వచ్చి శంకు స్టాపించాడో మనం అర్థం చేసుకోవాలి.
ఈ ప్రాజెక్టులో బొగ్గులేదా ,వాళ్ళు అంటున్నట్లుగా గ్యాసే మండించినా మన కరీంనగర్ పరిసరాలల్లో ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతలకంటే రెట్టింపు చేస్తారు.రోగాలతో చచ్చేది మనం.పర్యావరణం మనది నాశనం అవుతుంది ఫలితం మాత్రం వాల్లకు .మన బొగ్గు,మన నీల్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తాడు మన ప్రానహిత నీళ్లే ఎత్తుకపోతాడు.ఇది మన అభివృద్దే అంటాడు.ఎలా నమ్మమంటారో చెప్పండి?

త్రాగు నీళ్ళకొరకు తెలంగాణలో గిరిజనుల వలసలు

అది ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం నుండి 25 కిలోమేటర్ల దూరంలో బాబే ఝరి దాటిన తర్వాత ఉన్న జోడేఘాట్.ఆ పేరు వింటేనే ఒక

జలదరింపు,ఆ పేరు వింటేనే ఒక పూనకం,ఆ పేరు వింటేనే ఒక త్యాగం ఒక బలిదానం.రోడ్ సౌకర్యం లేదు.బస్ గాని ఆటో గాని లేదు.సెప్టెంబర్ ఒకటి

కొమురమ్ భీమ్ అమరుడైన రోజు గుర్తుగా అక్కడ ఒక సభ జరుపుతారు,ఆ రోజు అధికారులకు నాయకులకు జోడే ఘాట్ జ్ఞ్యాపకం వస్తుంది.ఆ రోజు అక్కడి

ప్రజల విజ్ఞప్తి ఏమిటంటే మాకు గొంతు తడుపుకోవడాని ఇన్ని నీళ్ళు,మాఉరికి మీరు రావడానికి ఒక తొవ్వ ఇది వాళ్ళు గత యాభై సంవస్తారాల నుండి

కోరుతూనే ఉన్నారు నాయకులు అధికారులు హామీలు ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.
ఒక ఆటో కిరాయికి తీసుకొనే ఆ గుట్టల మీదుగా బండల మీదుగా పెద్ద దుమ్ములో కొమురమ్ భీము నేలకొరిగిన ఆ స్థలాన్ని చూడాలన్న తలంపుతో

వెలుతున్నాం. నెత్తిపైనమూటలతో కాలినడకన వస్తున్న జనం మా పరిస్థితి ఇప్పటి కి కూడా ఇలా ఉంది చూడండి అన్నట్లుగా మా వైపు అమాయకంగా

చూస్తున్నారు.ఆ చూపులు మేము పొందుతున్న సౌకర్యాలను నిలదీస్తున్నట్లుగా అనిపించాయి.ఎత్తయిన రాతి గుట్టలు,కిందికి చూస్తే ఒళ్ళు జలదరించే విధంగా

ఉన్న లోయలు కలపకు ఏమాత్రం పనికి రానందున వదలి వేయబడ్డ అందుగు,తపిశి,దుంపిడి,కొడిష.విషముస్టీ,కారెంగా ,తునికి ఇప్ప చెట్లు మాత్రం

పలుచగా ఉన్నాయి,జోడేఘాటులో ఆ గ్రామ పెద్దమనిషి కొమురమ్ భీమ్ మేనల్లుడు అయిన పెందురి సోము మమ్ములను చూసి ఎదురుగా వచ్చి రామ్

రామ్ అంటూ విష్ చేసినాడు.అన్నము లేదు కొన్ని మధురంబములున్నవి త్రావుమన్న అని అలనాడు రంతి దేవుడు అన్నట్లుగా సోము మాకు తాము

ఎంతో ప్రియంగా దాచుకున్న మంచినీళ్లు ఇచ్చాడు.మంచం మీద కూచున్న తర్వాత తమ సమస్యలు ఏకరువు పెట్టినాడు.
ఆ గ్రామం లో గొండు ,కోలామ్ లు కలిసి 40 కుటుంబాలలో 260 జనాభా ఉన్నారు.గుట్టల పైన అక్కడక్కడ సమానంగా ఉన్న భూమిలో జొన్నలు,కందులు,మక్కలు,పెసలు
పత్తి పండించుకొని పొట్టపోసుకుంటున్నారు.మేకలు కోళ్ళు సాదుతారు.గుట్ట కింద ఆడదస్నాపూర్ అని ఒక గ్రామం ఉంది.మోవాడ్ ఆడదస్నాపూర్ గ్రామాల

మధ్యగా పారుతున్న వాగు మట్టం నుండి జోడేఘాట్ 200 మీటర్ల ఎత్తులో ఉంది.వీళ్లకు రక్షిత మంచినీరు ఆ వాగు నుండి కాకుండా ఆ గుట్టపైన్ బోరు వేసి

8 లక్షలఖర్చుతో రక్షిత మంచినీరుకు టాంక్ అయితే నిర్మించారు .కానీ వాటర్ సోర్స్ లేనందున వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు.జియాలోజికల్ సర్వే

వాళ్ళు బొర్లు వేస్తే నీళ్ళు పదే అవకాశం లేదు అన్నారట.అప్పటికే వేసి ఉన్న బోర్లా ను ఇప్పటికీ మూసివేయనే లేదు.అయితే తమ నీటిసమస్యను ఎప్పటిలాగానే

అందరికీ విన్నవించినారు.రెస్పాన్స్ రానందున రోడ్ పైకి వచ్చి ధర్నా చేశారు. ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి గాని స్థానిక రాజకీయ నాయకులు గాని

స్పందించ లేదు.గత్యంతరం లేని ఆ గిరిజనులు గుట్ట కింద గల ఆడదస్నాపూర్ మోవాడ్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు ఒడ్డున అన్నీ గుడారాలు

వేసుకొనే పిల్లా పాప గొడ్డు గోదా కోళ్ళు కుక్కలు తీసుకొనే ఇండ్లకు తాడుకలు పెట్టి గ్రామానికి గ్రామం వలుస పోయింది.
స్థానిక పత్రికలు వార్తలు రాసినాయి.వార్తలు చూసి వెళ్లిన మానవ హక్కుల వేదిక తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ బా
ధ్యులకు గిరిజనులు చెప్పిన బాధలు

విన్న తర్వాత నాగరికుల అవసరం కోసం ప్రాణహిత నుండి 400 మెటర్ల ఎత్తుకు 400 కిలో మీటర్ల దురానికైన తరలిస్తారు నీటిని కానీ నోరులేని ఈ

గిరిజనులకు కేవలం 2కిలోమేటర్ల నుండి 20 లక్షల ఖర్చుతో నీళ్ళు తరలించ లేక వాళ్ళు వలసలు వెళ్ళే పరిస్థితి కలిపించడం సరియయింది కాదు

అనిపించింది..
ఈ రెండు ప్రజా సంఘాల పక్షాన అధికారులకు ప్రాతినిధ్యం చేసి వెంటనే తాగు నీటి సౌకర్యం కలిగించకపోతే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

చేస్తామని హెచ్చరించినాము.మానవ హక్కుల కమిషన్ కు భయ పడిన అధికారులు జియలాజిస్టులు సాధ్యపడదు అని చెప్పిన ఆ గుట్ట పైననే మరో బోరు

వేశారు.ఆ గిరిజనుల అదృష్టం ఏమో కానీ నీళ్ళు వచ్చినయి.తాత్కాలికంగా సమస్య తీరింది కానీ శాశ్వత ప్రరిష్కారం మాత్రం ఆడదస్నాపూర్ వాగు నుండే

అని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది.
అడవులు అంతరించిపోవడం వలన సంవస్తారానికి సంవస్తారానికి వర్షపాతం తగ్గి పోతున్నది.ఆదిల బాద్ జిల్లా లో ఈ సంవస్తారమ్ 50 శాతం వార్హాపాతం

తగ్గిపోయింది అని ఆధికారిక గణాంకాలే చెబుతున్నాయి.ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే మాసాలల్లో నీటి ఎద్దడి ఎంత అధ్వాన్నంగా ఉందనున్నదో

అధికారులు గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రతి సంవస్తారామ్ కేవలం శుభ్రమయిన మంచినీళ్లు లభించకనే వందలాదీ

అమయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా ఇంత నిర్లక్షం వహిస్తున్నదంటే ఈ ప్రభుత్వాలు ప్రజల చేత,ప్రజల వలన

ప్రజల కొరకు ఉన్న ప్రభుత్వాలేనా అని ప్రజలు నిలదీసే రోజులు ఇంక ఎంతో దూరము లో లేవు.