Saturday, July 24, 2010

మా తల్లి భూదేవి

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము!

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము
లక్షల సంవస్తారాలు మంచు దుప్పటిల మగ్గి
బడబాగ్నిగ బద్దలయ్యి పురిటి నొప్పులెన్నోతీసి
గాలి నీరు గుట్ట చెట్టు ప్రజలను ప్రసవిస్తివమ్మ

మహిమగల్లా నీదు మన్నులానుంచెల్లి
నీళ్ళు నిప్పులే గాదు అన్న పానాదులను
అడుగకుంటిచ్చినవు ఆదికాలము నుండి

నీ ఎద పైన కాలూని ఎదిగినవి వృక్షాలు
పూలు పండులే గాదు కొమ్మరెమ్మలే గాదు
ఔషధీ యుక్తమగు ఆకులలములు ఇచ్చి
సల్లంగా సాదినవు ఎల్ల జనులను తల్లి

పుడమి తల్లలనాడు పుక్కిలుంచుమిసిన
గండుశిల కొండలు బండ రాళ్లన్నియు
మేఘాల పిండినవి నీ కడుపు నింపినవి
వడగాలి సుడిగాలి అధిక ఉష్ణోగ్రతల
అడ్డు నిలిచాపినవి అందరూ బతుకుటకు.

కానీ........... తల్లీ............

తల్లి వీపును చీల్చి తల్లినే చంపేటి
తేలు పిల్లల తీరు తేలినము మేమంత
అడవులను నరికినము బోడులను చేసినము
సంద్రాల నిండుగా విషమునూ నింపినము

ఐరనూ ఓరనీ సున్నాపురాయని
గ్రానైటు క్వారియని ఓపనూ కాస్టుయని
తల్లి నీ కడుపునూ పెళ్లగించితిమమ్మ
అయిలూ లాగేసి బొగ్గునూ తవ్వేసి
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

రేడియము థోరియము ఆటమూ బాంబులతో
మా బొందలను మేమే తవ్వుకుంటున్నాము
కూర్చున్న కొమ్మనే నరుకుకుంటున్నాము
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

Tuesday, July 6, 2010

ఎవరి సంపదను ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు ఎవరికి సొమ్ములు ఇస్తున్నారు?

ధా రాజా తథా ప్రజా అనేది పాత సామెత ఇప్పుడు యథాప్రజా తథా రాజా అంటూ ఒక ఎలక్ట్రానిక్ ఛానెల్ చర్చ నిర్వహిస్తున్నది.
ఆ చర్చలో మాట్లాడుతున్న నాయకులు ఎన్నికలల్లో ప్రజలు ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు కనుక అధికారం
లోనికి వచ్చిన తర్వాత మాకూ తీసుకోక తప్పడం లేదు అంటూ అది అంతా ప్రజల తప్పే అని అంటున్నారు. ఈ చర్చ ను గమనిస్తూ
ఉంటే రాజకీయ నాయకుల అవినీతికి ఈ చానల్ ఒక లెజిట్మెసి కల్పించినట్లు గా ఉన్నది. అవినీతిని సార్వజనీ కరణ చేస్తూ
అక్రమ సంపాదన తప్పు కాదు,అవకాశం దొరికినపుడు ఎవరైనా సంపాదించుకుంటారు,అలా సంపాదిస్తేనే కదా ఎవరైనా మళ్ళీ
అధికారం లోకి వచ్చేది అని ఒక నూతన కాకపోయినా ఆదర్షాలకు భిన్నంగా ఇదే ఈ కాలపు ఆదర్శం అని చెప్తున్నారు.
చిన్నా చితకా అధికారులు ఏమో కానీ ఒక మోస్తరు అధికారం అంటే తన అధికారం వలన ప్రజలకు చీమ కాలంత మేలు జరిగినా
ఆయనకు అదనపు సంపాదన వచ్చి తీరుతున్నది.చిన్న గుమాస్తా నుండి ఐ ఏ ఎస్ అధికారి వరకు,హోమ్ గార్డ్ నుండి డి జి పి
వరకు,గ్రామ సర్పంచి నుండి ముఖ్య మంత్రుల వరకు లక్షల కోట్ల సంపాదన కూడ బెట్టుకుంటున్నట్లు వాటిని విదేశీ బ్యాంకులల్లో
దాచుకుంటున్నట్లు ఆయా వ్యక్తుల ప్రత్యర్తుల విమర్శలల్లో వింటున్నాము. వాళ్ళే మన పాలకులు. వాల్లనే ఆరాధిస్తూ మళ్ళీ మళ్ళీ
వాళ్ళే కావాలని ఓట్లు వేసి ఎన్నుకుంటున్నాము. వాళ్ళ ఆస్తులను అధికారాలను కాపాడదానికి మనకున్న రక్షణ వ్యవస్తాను
అడ్డం పెడుతున్నాము. చట్టాలను రూపొందించే అధికారాలను కట్టబెడుతున్నాము. కనుక తమకు సంక్రమిస్తున్న అధికారాలను
సుస్తిరం చేసుకోవడానికి రాజకీయ నాయకులు,వారి తర్వాత వారి వారసులు అధికారం కోసం ఏమయినా చేస్తున్నారు.
ఆ మద్యన ఒక పాంప్లెట్ చూసాను. వై యస్ రాజా రెడ్డి మంచి ఒడ్డు పొడుగు ఉన్న పహిల్వాన్ అనీ,కడప జిల్లాలోని ఒక ముగ్గు
రాళ్ల క్వారీ యజమాని వద్ద కులీలను అజమాయిషీ చేయడానికి నియమించబడి కొంత కాలానికి అక్కడ లభిస్తున్న లాభాలను
చూసి క్వారి యజమానిని భౌతికంగా తొలగించి తానే క్వారిలను ఆక్రమించుకున్నాడని రాశారు. ఆ తర్వాత ఆయన కుమారులు
అప్పటికే క్వారీల ద్వారా లభించిన లాభాల పెట్టుబడితో శాసన సభకు గెలిచిన రాజశేఖర్ రెడ్డి పైన అసెంబ్లీ వద్దనే హత్యా
ప్రయత్నం కూడా చేసినట్లు ఆ పాంప్లెట్ లో రాశారు. దాని పైన ఎవరు కూడా కౌంటర్ చేయలేదు కూడా. అంటే రాజ్యాధికారం
ద్వారా ఒక కుటుంబానికి కేవలం ఒక్క తరం లోనే రెండో తరానికి ముఖ్య పదవిని కొనుక్కోగలిగినంతటి సంపద సంపాదించుకునే
అవకాశం లభించింది.ఆ ముఖ్యమంత్రి పదవి దక్కక పోయే సరికి ఆ యువ రాజు ఊరూ వాడా ఎలా ఏకం చేస్తున్నాడో
చూస్తున్నాము.
మన రాజ్యాంగం ప్రకారం ,లభించిన రాజ్యాధికారం తోటి దేశం లో ఉన్న సహజ వనరులు,ఉత్పత్తి అవుతున్న సంపద అంతా
ప్రజలందరికి సమానంగా పంచవలసిన బాధ్యతను విస్మరించి సహజ వనరులను,సంపదలను వాళ్ళే వ్యక్తిగత ఆస్తులుగా
మార్చుకుంటున్నారు. ఆ అధికారం తోటే ప్రజల డబ్బులతోటే పోషించ బడుతున్న రక్షణ యంత్రంగాన్ని తమకు,తమ ఆస్తులకు
రక్షణగా వాడుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని ఎవరయినా గొంతెత్తిటే ఆ గొంతుకలను ఉత్తరిస్తున్నారు.
మహాత్మా గాంధీ వాళ్ళు నిత్యం జపించే వ్యక్తి. ఆయనే ఒక సారి ఏమన్నాడంటే నీ కనీస అవసరాలకు మించి నీ వద్ద ఒక్క
రూపాయి ఉన్నా అది నీ పక్కవానికి చెందవలసినదే. అంటే నీ జేబులో ఉన్న రూపాయి వాని జేబులోనుండి నీవు దొంగిలించినదే అని అన్నాడు
అక్రమంగా సంపాదించిన ఈ అవినీతి సొమ్ము అంతా ఎవరికి చెందాలి? ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజలు త్యాగమూర్తులా? లేక
సకల సౌఖ్యాలు ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధుల?

పెట్రోల్ ధరల పెంపు బందులు.

పెట్రోల్ ఉత్పత్తుల పెంపు పైన దేశవ్యాప్తంగా బంధు జరిగింది.ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉన్నది అనడానికి అనేక ఉదాహరణలు
ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజల ఇస్టమ్ మేరకే పరిపాలించాలి మరి. ఒకవైపు ప్రజలంతా పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తుంటే
ప్రభుత్వం మాత్రంససేమిరా అంటున్నది. అంతేగాకుండా భరత్ ఝన్ ఝన్వాలా లాంటి ప్రజా వ్యతిరేక మేధావులు ప్రభుత్వ
పాలసీలను సమర్థిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. మరో పాలక మేధావి ఇందర్ మల్హోత్రా రాజీవ్ గాంధీ చేసిన ఏకైక మంచి
పని భోపాల్ లో ఎం ఐ సి గాస్ లీక్ కు కారణమైన అందర్శన్ ను విడిచి పెట్టదమేనని కితాబు ఇస్తాడు. ఇంతటి ప్రజా వ్యతిరేకమైన
వ్యాసాలను మన పత్రికలు ప్రచురిస్తాయి.
బందు వలన 13 వేల కోట్లు నస్టమ్ జరిగిందట.ఇది జాతికి నస్టమట.కనుక బంధు జరుపవలసింది కాదని కొందరి వాదన.సరే వాదన
కొరకు ఒప్పుకుందాం. కానీ ప్రజల అభీస్టానికి వ్యతిరేకంగా పెంచబడిన ధరల వలన ఎన్ని లక్షల కోట్ల నస్టమ్ వాటిల్లనుందో ఈ
మేధావులు చెప్పరు. పైన చెప్పిన 13 వేలు ప్రజల నస్టమ్ కాదు అవి వాస్తవానికి ప్రజలకు మిగిలినాయి. కానీ ధరవరల పెరుగు
దలతో నస్టమ్ వాటిల్లేది ప్రజలకు. లాభాలు వచ్చేది పెట్టుబడి దార్లకు.
భరత్ ఝన్ ఝన్వాలా మాటల్లోనే మనం ఉపయోగిస్తున్నపెట్రోల్ లో దిగుమతి చేసుకుంటున్నది 80% మన దేశం లోనే లభిస్తున్నది
20%.మరి మన దేశం లోనే లభిస్తున్న 20% పెట్రోల్ పైన గూడ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. అది వివక్షత గాదా? ఈ డబ్బులు
ఎవరి ఖతాలోనికి పోతున్నాయో ఎందుకు లెక్కలు చెప్పరు? దరలు పెంచకుంటేనట ప్రభుత్వాలు ఆ ధరలు భరించడానికి
అదనంగా కరెన్సీ ముద్రించ వలసి ఉంటుందట? ఎంత అడ్డగోలు లెక్కలు చెప్తున్నారు ఈ మేధావులు? కరెన్సీ ఎలా ముద్రుస్తారు?
దేశం లో ఉత్పత్తి కానున్న సకల వస్తువులు సరుకులుగా మారి మార్కెట్ లోనికి వస్తే వాటిని మారకం చేసుకోవడానికి అవసరమైన
మేరకు కరెన్సీ ఉత్పత్తి చేస్తుంది ఏ దేశమైనా. ప్రభుత్వ నిర్వాహణ కొరకు సరుకుల పైన పన్నులు వేస్తాయి ప్రభుత్వాలు. అలా
కాకుండా ఇస్టమ్ వచ్చిన విధంగా కరెన్సీ ముద్రించుకుంటూ పోతే ఆ కరెన్సీ కి విలువే ఉండదు. ఇంతటి నగ్న సత్యాలను
సైతం అబద్దాలతో దేశ ఆర్థిక విధానాలను కూడా వక్రీకరించి రాస్తుంటే పత్రికలు ప్రచురిస్తాయి . ఈ పద్దతికి భిన్నంగా కరెన్సీ
ముద్రించరా అని అంటే ముద్రిస్తారు కానీ ఈలాంటి పరిస్తీతుల్లో కాదు. అట్లా ఇస్టమ్ వచ్చిన విధంగా ముద్రించుకుంటే ఇక
ఇన్ని దేశాలనుండి ఇంతేసి అప్పులు ఎందుకు మనకు?
సరే ఇక ఈ పెట్రోల్ ధరల ను ఎవరు ఎలా నిర్ణయిస్తారు? వాస్తవానికి గాలి,నీరు ఎలా సహజ సిద్దంగా లభిస్తున్నాయో పెట్రోల్
కూడా అంటే సహజసిడ్డంగా లభిస్తున్నది. నీళ్ళు బాటిల్లాలో,గాలి పంఖా బిగించిన తర్వాత సరుకులు అయినట్లుగా పెట్రోల్ కు
మానవ శ్రమ జోడించిన తర్వాత సరుకు అయింది. ఆ సరుకుకు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన డిమాండ్ మేరకు రేట్లను
పెంచుతూ పోతున్నారు.అసలు ఏదైనా ఒక సరుకుకు రేటు ఎలా నిర్ణయించాలి?
ఉదాహరణకు ఒక కుండ రేటును ఎట్లా నింర్ణయించాలి? ఒక పది బండ్ల మట్టి ని తేవడానికి అయిన బండి కిరాయి, ఒక ఇద్దరు
మనుషులతో మట్టిని మెత్తగా నలుగ కొట్టేడానికి.మరో నలుగురు మనుషులతో నీళ్ళు పోయించి మెత్తగా తొక్కించడానికి,
రెండు రోజులు కుమ్మరి కుండాలను ఆనడానికి,ఒక రోజు వాటి అడుగులు మూయడానికి. ఒక నాలుగు బండ్ల కట్టేలా ఖరీదు,
ఈవెగాక ఇంకా ఏమయినా ఖర్చులు అయి ఉంటే మార్కెట్ రేటు ప్రకారం లెక్క వేసి ఆ కుమ్మరి వాము నుండి తీసిన కుండల్లో
నుండి పలిగి పోగా మిగిలిన ఒ ముప్పయి కుండలు ఉన్నాయి అనుకుంటే అయిన ఖర్చు ఒ 600 రూపాయలు అనుకుంటే ఒక్కక్క
కుండకు 20 రూపాయల ధర నిర్ణయించాలి. కానీ జరుగుతునది ఏమిటి? పరిశ్రమాధిపతి వస్తువు ఎంతకూ తయారు అయింది అన్నది
కాకుండా తనకు ఎంత లాభం కావాలో అంతకు ధర నిర్ణయిస్తున్నాడు.దీన్ని నియంత్రించ వలసిన ప్రభుత్వాలు విదిల్చ బడుతున్న
ఎంగిల్లి మెతుకులకు ఆశపడుతూ ఎవరు ఏ తీరుగా రేట్లు నిర్ణయించుకున్నా మాట్లాడకుండా పైగా వాటి పైన మరింత పన్నులు
వేసి ప్రజల కొనుగోలు శక్తి తో పరాచికాలు ఆడుతున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్తాలో ప్రజల అభిస్టమ్ మేరకు ప్రభుత్వాలు నడుచుకోకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రజలు చూసుకుంటారు.
ఇవ్వాళ బంధులతో ప్రభుత్వాలల్లో చలనం రాకుంటే ఇంతకంటే మెరుగైన పోరాట రూపాలను ప్రజలు తమ ఆచరణాలద్వారా
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాట రూపలల్లోనుండి వెతుక్కుంటారు,పోల్చి చూసుకుంటారు.

Wednesday, June 30, 2010

ఉపాధి హామీ ఒక పెద్ద మాయ

ఊపాధి హామీ పథకం అమలు తీరులో అనేక అవినీతి జరుగుతున్నట్లుగా సోసియల్ ఆడిట్ లో తేలడంతో బాటుగా మీడియా లో కూడా ఎన్నో నిజాలు
బయటకు వస్తున్న కూడా అది ఎందుకు కొనసాగుతున్నదో కొంచం లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు అర్థం అవుతున్నాయి

ప్రత్యక్షంగా గమనించిన ఒక సంఘటన చెపుతాను.
ఒక రోజు కూలి మరో సహచరునితో అంటున్న విషయం ఇది.

ఆరేయ్ మనం తీసుకుంటున్న డానికంటే సర్పంచ్ తీసుకుంటున్నది ఎన్నో రెట్లు ఎక్కువ తెలుసా?
అట్లా ఎట్లా?
మనం పొద్దటి నుండి పొయ్యే దాకా ఎంతపని చేసినమో టెక్నికల్ అసిస్టెంట్ అనే అతడు లెక్క తీస్తాడు.
తీస్తే?
మనకు 100 రూపాయలు ఇవ్వాలంటే మనం చేసినంత పనికే లెక్క తీస్తీ సరిపోదు.
మరి?
మనం ఉదయం 7 నుండి 11 గంటలదాకా పనిజేస్తే ఇన్ని కూబిక్ మీటర్ల మట్టి తీస్తేనే మనకు 100 రూపాయాలు ఇవ్వాల్సి ఉంటుంది.కానీ ఇక్కడ
జరుగుతున్నది ఏమంటే మనం 8 గంటల్కు వచ్చి 11 గంటలకు వెళ్ళి పోతున్నాము.ఈ రెండు గంటలు కూడా సరిగ్గా వంగి పనిచేసింది లేదు.
ఆడుతుపాడుతూ మనం చేస్తున్న పనికి వాళ్ళు 100 రూపాయలు ఇస్తే మనం సంతోష పడుతున్నాము.కానీ మనం తీయవలిసినంత మట్టి
తీసినట్టు ఆ మట్టిని వాళ్ళు ట్రాక్టర్ల తోటి చేరవేసినట్టు రాసుకొని వెయిల రూపాయలు అప్పనంగా తీసుకుంటున్నారు.
అక్కడే ఉన్న మరో మిత్రుడు అవునురా మనం ఏమిచేయకుండానే 100 రూపాయలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మాత్రం చేతులు మూసుకొనే
ఉండరు కదా? అంటూ అది గట్లనే నడుస్తాధి గాని మనకెందుకురా.ఎట్లా బతికేటోడు గట్లనే బతుకుతడు అన్నడు.
ఇది దేనికి సంకేతం?
కూలీలతోటి చిన్న తప్పు చేయించి పడ్డ పెద్ద తప్పులను ప్రశ్నించకుండా ప్రజల నోరుమూయించడమే.
మరో కుట్ర ఏమిటంటే ఈ ఉపాధి హామీ పథకం తో వ్యవసాయ పనులకు కూలీలు దొరుకాక చిన్న చిన్న రైతులు వ్యవసాయాన్ని వదలి పట్టణాలకు
వలసలు వస్తున్నారు. క్రమంగా ఇక్కడి వ్యవసాయాన్ని దెబ్బ తీసి ఈ భూముల్లో ఉన్న ఖనిజ వనరులను అన్నింటిని సంపన్న దేశాలు దోచుకుని పోయే
కుట్రలో ఒక భాగమే ఈ పథకాల వెనుక ఉన్న సదుద్దేశం.అమెరికా ప్లానింగ్ సలహా దారు జాన్ డెజ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా
అమలు పర్చాలని తద్వారా పేదరికం పోతుంది అంటున్నాడు.భారత పాలకులు సైతం వీలయినత వేగంగా దేశం లో ఉన్న ఖనిజ సంపదను సంపన్నులకు
దోచిపెట్టేదానికి పోటీ పడుతున్నారు.
మేధావులు,విజ్ఞులు అయిన దేశభక్తులు భావి తరాలకోసం మన వనరులను తరలిపోకుండా కాపాడుకోవాలని గుర్తుంచ వలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది

Monday, June 28, 2010

విలువల తో కూడిన విద్యా

ఈ రోజు ఒక సదస్సు కు హాజరైతే విలువలతో కూడిన విద్యా ఆవశ్యకత అనే అంశం పైన చర్చ జారింగింది.అయితే విలువల కు నిర్వచనం ఏమిటి?
ఒక్కొక్క సమాజంలో ఒకో విలువ ను జనం ఆమోదించారు.ఆదిమ సమాజం లో ,గణా లల్లో ,రాచరిక .గణతంత్ర,ప్రజాస్వామ్య,పెట్టుబడి దారి,
ఇలా ఒక్కో సమాజం లో విలువలకు నిర్వచనం వేరు వేరు గా ఉంటూ వచ్చాయి. కానీ అంతిమంగా మనిషిని మనిషిగా గుర్తించి,అందరికీ ఉన్న
వనరులు సమానంగా దక్కలనేది ప్రధానం.
అయితే సడసూ లో పాల్గొన్న వాళ్ళు వివిధవృత్తుల్లో ఉన్నవాళ్ల అవినీతి గురించి వాళ్ళు తమ తమ బాధ్యతలను ఎలా విస్మటిస్తున్నారో చెప్పుకొచ్చారు.ఒక రోజుకులి పనికి ఆహార పతాకం లో ఎలా పని ఎగ్గొడుతున్నాడో,సూపర్విసార్లు ,ఇంజనీర్లు,ప్రజాప్రతినిధులు ఇలా ప్రతిస్తాయిలో ఎలా అవినీతి జరుగుతున్నదో ఉదాహరణల్తో బాటుగా ఉపన్యసించారు.
దానికి పరిష్కారంగా భారత రామాయణాలను చదువుకొని అలా ప్రవర్తించాలని సలహాలను ఇచ్చారూ.భారత రామాయణాల కాలం ఈ కాల్మ్ ఒక్కటి కాకపోయినా అంతకంటే వారికి వేరే ప్రత్యమ్న్యాయమ్ ఏమీ కనిపించలేదు.
ప్రస్తుత సమాజం లో మానవ శ్రమ,వస్తు ఉత్పత్తి,వస్తు వినిమయం సమాజాల అవసరాలకు అనుగుణంగా కాకుండా మార్కెట్టులో డిమాండ్ ను బట్టి వచ్చే లాభాలను దృస్తీలో పెట్టుకొని జరుగుతున్నది.వస్తువు తయారీ అమ్మకం కొనడం అనేవి లాభాలతో కూడుకున్న వ్యవహారం.లాభాలు అంటే అక్కడ ఇక లాభ్ నీటే ఉంటుంది తప్ప మరోటి ఉండదు, అలాంటప్పుడు ఏమీ నీటి.ఏమీ విలువలు అమలులో ఉంటాయో పెద్దగా ఆశించ లెము.గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరివేసి నట్లు.
మన ఆర్థిక వేత్తలు రాజకీయ నాయకులు చెప్పుతున్నట్టుగా పెట్టుబడులు భాతీగ వస్తీనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు ణఋ. పెట్టుబడులు అంటేనే లాభాలు,లాభాలు అంటేనే అవినీతి,మరి అలంతాప్పుడు ఏమీ విలువలుయను మనం ఆశించ వచ్చునో చూడాల్సి ఉంది.
ఏ సమాజాని కయినా ఆర్థిక వ్యవస్తా పునాది అనుకుంటే ఆ పునదిని కాపాడదానికి పైకప్పు అంటే ఉపరితల అంశాలయిన విద్యా సంస్కృతి కళలు అన్నీ కలిసి పునదిని కపాదుతాయి.పైకప్పు పునాదిని కాపాడుతుంటే పునాది ఉపరితలాన్ని పడిపోకుండా కాపాడినట్లే ప్రస్తుత వ్యవస్తాలౌ ఉన్న చట్ట సభలు ,న్యాయస్తానలు,రాజ్యాంగం ,మీడియా అన్నీ ఒక దానితో ఒకటి సహకరించుకొని ఈ వ్యవస్తాను ఇలాగే కొనసాగడానికి పరస్పరం సహకరించుకొంటు ఉంటాయి.
మరి పరిష్కార మార్గాలు లేనే లేవా?

ఈ దోపిడీ పునాదులను కూల్చకుండా ఏవిలువలను ఆశించలేము.

Saturday, April 10, 2010

తరలిపోతున్న వనరులను కాపాడుకుందాం కదలి రండి.

శిలలు ఈ భూమి మీద ఎప్పుడి ఏర్పడినయో ఆలోచిస్తే ఈ పుడమి తల్లి పురిటి నొప్పుల సమయంలో ఎగజిమ్మిన లావా చల్లబడి ఘనీభవించి ఏర్పడిన

గండశిలలు ఇప్పుడు గుత్తేదార్లకు కొంగు బంగారం అవుతున్నది.మాది కరీంనగర్ జిల్లాలో తూర్పున ఉన్న పాత మహాదేవపూర్ తాలూకా.అక్కడ అడవికి

గుట్టలకు అవినాభావ సంభందం. గుట్టలు ఉన్నాయి అంటే అడవి ఉంటుంది అన్నమాటే. మా చిన్నతనం లో వేములవాడకు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చే

వాళ్ళం. రామగిరి ఖిల్లా గుట్టలు దాటిన తర్వాత సుల్తానాబాద్ నుండి వచ్చే గుట్టలను మేము బోడ గుట్టలు అని పిలిచే వాళ్ళం ఎందుకంటే ఆ గుట్టల పైన

చెట్లు ఉండేటివి కాదు. అప్పుడు మాకు ఆ గుట్టల పట్ల చిన్న చూపు ఉండేటిది.ఎందుకంటే మా అనుభవం లో గుట్టలు అంటే చెట్లు ఉండాల్సిందే. సుల్తానాబాద్

గర్రెపల్లి.ఎలగందల.నుండి వేములవాడ దాకా అన్నీ గుట్టలే.ఈ గుట్టల వయస్సు 2,500 మిలియన్ సంవస్తారాలు అంటున్నారు తెలిసినవారు.

అయితే ఇప్పుడు తెలుసుకుంటే ఈ గుత్తలు సామాన్యమైనవి కాదు అని తెలుస్తున్నది. వర్షాలు పడినప్పుడు ఈ గుట్టలు ఒంటెలవలే కడుపు

నీళ్ళు త్రాగి మెల్ల మెల్లగా ఆ నీటిని భూమిలోనికి ఇంజెక్ట్ చేస్తాయట. అందుకనే గుట్ట కింద ఉండే ఊళ్లకు నీటి కొరత ఉండదు అని తెలిసినపుడు ఆవురా

ఈ గుట్టలు మానవుల క్షేమం కోసం స్పాంజ్ ముద్దలు అయి నీళ్ళను నింపుకొని మానవుల పాలిటి మరో కాసారం అవుతున్నది కదా? అన్నట్టు రామగిరి

ఖిల్లా గుట్ట కింద ఒక గ్రామం ఉంది దాని పేరు కాసారం. అంటే సముద్రం అన్న మాట. అలాగే ఈ గుట్టలనుడి భూమిలోనికి వచ్కిన నీళ్ళు మనం పైకి

తోడుకున్నపుడు చాలా తీయగా ఉంటున్నాయి.ఎందుకంటే ఆ నీటిలో సల్ఫెట్ లు,ఫాస్ఫెట్ లు ఉండవు.ఎందుకంటే బండరాళ్ల గుండా వచ్చే ఆ నీరు చాలా

ఫిల్టర్ అవుగుండి కనుక. అలాగే గొడుగుకు పైన నల్లగుడ్డ ఎందుకు పెట్టికుంటాం అంటే అది ఉత్తమ ఉష్ణవాహకం కనుక. అలాగే ఈ గండ శిలాలు కూడా

వాతావరణం లోని వేడిని గ్రహించి మనకు చల్లదనాన్ని ఆందిస్తున్నది. ఆకాశం లోని మేఘాలను అడ్డుకొని వర్షాలు పడేటట్లు చేస్తున్నాయి.వేసవి కాలంలో

వీస్తున్న వేడి వడ గాలులను అడ్డుకోని ప్రజలను అగ్నిగుండాల వడ గాలుల నుండి కాపాడుతున్నాయి. సుడి గాలుల నిండి ఎగసిపడిన దుమ్ము,ధూళిల

నుండి మానవ జాతిని కాపాడుతున్నవి ఈ బండ రాళ్ళు అని తెలిసి నపుడు గుండెలే లేని ఈ నల్ల రాతి బండలకు మనుషులంటే ఇంత ప్రేమ,

మనుషుల పట్ల ఇంత దయ జాలి ఎలా వచ్చాయో కదా అని ఆశ్చర్యం కాలుగాక మానదు.
1) మేఘాలను అడ్డుకోని వర్షాలు కురిపిస్తున్నాయి.
2)వర్షించిన నీటిని పుడమి తల్లి కడుపార తాగే విధంగా సరా సరి దాని కడుపులోకే పంపు చేస్తున్నది.
3)ఆ నీటిని కూడా పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసి మనుషులు తాగడానికి అనువుగా చేసి పెడుతున్నాయి.
4)వేడి తాపాన్ని అపుతున్నాయి.
5)దుమ్ము ధూళి నుండి రక్షణ ఇస్తున్నాయి.
6)తనపైనా చెట్లను పెరుగనిచ్చి సీత ఫంలాలు.మామిడి,రేగు, లాంటి ఫలాలను ఇస్తూ మానవుల క్షుద్బాధ ను తీరుస్తున్నాయి.
7) గడ్డి గాదం తనపైనా పెరుగనిచ్చి పశు,పక్షాదులకు ఆకలిని తీరుస్తున్నాయి,
8) తమ దేహలను ముక్కలు ముక్కలుగా చేసుకొని మనకు ఇండ్ల పునాదులు అవుతున్నాయి,గోడలు,పైకప్పులు,చలువ రాతి గచులు అవుతున్నాయి.
9) నెమళ్లకు,గుడ్డేలుగులకు నిలువ నీడై ఇండ్ల యి వాటికి రక్షణ ఇస్తున్నాయి.
10) ఆస్తికులకు దేవత శిల్పాలయి సాంత్వన ఇస్తున్నాయి.

ఇలా ఒక్కటేమిటి మానవ మనుగడకు మానవులకంటే ఎక్కువ దోహద పడుతున్నవి ఈ గుండెలు లేని బండ రాల్లే.హృదయం ఉన్నదని చెప్పుకుంటున్న

మనుషులు ఏమీ చేస్తున్నారు అంటే......

ఈ బండ రాళ్లను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తూ వానలు కురువకుండా అడ్డుపడుతున్నారు

తామే విపరీతమయిన వేడి సెగలు సృస్టిస్తూ చల్ల బరిచే గుట్టలను నిర్మూలిస్తున్నారు.

దుమ్ము ధూళి నుండి కాపాడే రక్షణ వలయాన్ని ధ్వంసం చేస్తున్నారు.

ఉన్న చెట్లను నరికి వేస్తూ ఇకనుండి చెట్లు పెరిగే వ్యవస్థ లేకుండా చేస్తున్నారు.

పశుపక్షాదులకు నిలువ నీడ లేకుండా చేసి అవి గ్రామాలల్లోకి వస్తే కాల్చి చంపి ఎకలాజికల్ సమతుల్యతను నాశనం చేస్తున్నారు.

నిజానికి ఈ విధ్వంసం అంతా చేస్తున్నది సామాన్య ప్రజానీకమేనా? ఎంత మాత్రం కాదు.డబ్బు,రాజకీయ అధికారం ఉండి, రాజ్యాంగం

మీద ప్రమాణం చేసి ఈ ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరుస్తామని ప్రజలకు,పర్యావరణానికి రక్షణ కల్పిస్తామని మాయ మాటలు చెప్పి మన ఓట్ల

తోనే అధికారం లోకి వచ్చి ఆ అధికారం ద్వారా సంక్రమించిన అధికారంతో అడిగిన వాళ్ళ నోర్లు మూయిస్తున్నారు. అలనాడు హిరణ్యాక్షుడు సంపద

అంతా తన సొంతమే కావాలనుకొని భూమిని చాప తీరుగా చుట్టుకొని పోయి సముద్రం లోని దాక్కోన్టే తినడానికి కందమూలాలు లభించని వరాహ

సమూహం హిరణ్యాక్షుని వధించి భూమిని కాపడి నట్లు అధర్వులు కోల్పోతున్న బక్క జనులంట సంఘటిత పది పోరాటలకు దిగి ఈ భూమిని

కాపాడకుంటే ఈ రాక్షస సమూహం సామాన్య ప్రజలకు ఈ భూమి పైన ఏమీ మిగులకుండా బొక్కెస్తారు.

సహజ వనరులు ఎక్కడ ఉన్నా అక్కడి స్థానిక ప్రజలకు వాటి ఫలాలు దక్కాలి.కానీ ఎక్కడి వాల్లో వచ్చి ఇక్కడిది అంతా ఎప్పటికీ

లేకుండా ,ఇక్కడి సామాన్యులకు ఏమాత్రం దక్కకుండా దోచుకొని పోతుంటే చూస్తూ ఉంటూ మేము ప్రజలకోసమే ఉన్నము అని మాయ మాటలు

చెపుతున్న రాజకీయ నాయకుల మాటలు ప్రజలు ఇక నమ్మే పరిస్తీతిలో లేరు. స్టానికులకు దక్కకుండా తరలి పోతున్న వనరులను

కాపాడుకుందాం కదలి రండి.ఉద్యమం లో భాగస్వాములు కండి.