Monday, March 26, 2012

ప్రభుత్వమా ఎంత దయలేని దానవే !
గోదావరి నది పైన కరీంనగర్ జిల్లాలో రామగుండము మండలం ఎల్లంపల్లి వద్ద శ్రీపాద ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఇది తెలంగాణా లో కట్టబడుతున్నది కనుక తెలంగాణా ప్రజలకు మేలు చేసేదని భ్రమ పడు తున్నారు కొందరు. ఈ ప్రాజెక్ట్ 20 టియంసి ల నీళ్ళ సామర్థ్యం తో నిర్మిస్తున్నారు.
7 . 5 టియంసి ల నీళ్ళు రామగుండం ఎన్టిపిసి కి పోతాయి. మన నీళ్ళు మన బొగ్గు తో ఇక్కడ తయారౌతున్న 2600 మేఘవాట్ల విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్
వాటా 700 మేఘావాట్లు అయితే తెలంగాణాకు దక్కేది మాత్రం కేవలం 150 టిఎంసి లే. ఇక మంథని కి ఒక 2 .5 టిఎంసి లు ఇస్తుంటే మిగిలన 10 టిఎంసిల
నీల్లు మొత్తంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే గోదావరికి ఉపనది అయిన మంజీరా నుండి 30 టిఎంసిల నీళ్ళు హైదరాబాద్ కు ఎత్తుకేల్తూ మెదక్ , నిజామాబాద్ జిల్లాల రైతులను ఎండబెడుతున్నారు. అంతర్జాతీయ నది నీటి ఒప్పందం ప్రకారం ఒక నది పరీవాహక ప్రాంతానికి మరొక నది నీళ్ళు తరలించకూడదు.. కాని ఇక్కడ గొదావరినదీ జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి నిరాటంకంగా తీసుకొని పోతున్నారు. ప్రస్తుతం మనకు ఈ 10 టియంసిలే
కనిపిస్తున్నాయి కాని రేపు మొత్తంగా 20 టిఎంసి లకు 20 టిఎంసి లు ఎత్తుకొని పోతారు.
ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు 215 కిలోమీటర్ల దూరం చాలా పెద్దపెద్ద పైపుల ద్వారా లోయర్ మానేరు ద్యాములో ఉన్నన్ని తమకు ఒక నీటి చుక్క ఇవ్వకుండా తరలించుక పోతూ ఉంటె ఈ ప్రజలు చూస్తూ ఉండాల్సిందే. ఈ ప్రాజెక్ట్ వలన రామగుండం మండలానికి చెందిన ముర్మురు, ఎల్లం పల్లి, పోట్యాల,
మద్దిర్యాల, ఉండెడ, కొత్తపేట, వెమునూరు, చేగ్యాం, రామునూరు, ముత్తునూరు, మొక్కట్రావుపెట్ మరియు వెల్గతోఉకు కు చెందిన నాటి శాతవాహనుల
రాజధాని అయిన కోటిలింగాల ముంపుకు గురిఅవుతాయి.వీరికి చెందిన దాదాపు 10 వేల ఎకరాల భూమి మరో రెండు వేల నివాస గృహాలు లాగేసు కుంటున్నారు.అలాగే ఎలాంటి భూమి జాగా లేకపోయినా రెక్కల కష్టం జేసుఒని బతుకుతున్న వివిధ కుల వృత్తుల వారికి వారు ఎవరిపైనా అయితే ఆధార
పడి జీవేస్తున్నారో వాళ్ళను నిరాశ్రయులను చేయడం ద్వారా వీళ్ళూ జీవనోపాధి కోల్పోతున్నారు. తాటి, ఈత వనాలు, మామిడి, సీతాఫలాల, చెట్లను చంపెస్తున్నందున గౌడ, తెనుగు, ముదిరాజ్, గొల్ల కుర్మా కులాల వృత్తుల వాళ్ళు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. అయితే వీరందరికీ పునారావాసం
కల్పించే సమయం లో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో జివో 68 లో చెప్పింది. ప్రాజెక్ట్ వలన ఆయా ప్రాంతాల ప్రజల సమస్త జీవనోపాధిని లాగేసు కుంటున్నాము
అనే సానుభూతి మాటలు చెబుతూనే ఆచరణలో తిరకాసు పెడుతున్నది.
ఈ గ్రామాలన్నీ సింగరేణి బొగ్గు గనులకు సమీపంగా ఉన్నాయి.బతుకు దెరువు కోసం కొందరు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్లకు ఆయా గ్రామాలల్లో ఇండ్లు వ్యవసాయ భూములు ఉన్నాయ్. తాత్కాలికంగా పనిజేసే చోట ఉన్నప్పటికిని వాళ్ళ భూముల సేద్యం జేసుకోవడానికి తలిదండ్రులను చూసుకొవాదానికి వస్తుపొతూ ఉంటారు.అయితే పెద్దపల్లి రెవెన్యు అధికారులు మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదని పునరావాస లబ్ది చెల్లించ నిరాకరిస్తున్నారు.
వాళ్ళ భూములు ,వాళ్ళ ఇండ్లు, వాళ్ళ సమస్త బతుకు దెరువు మరేవరికోసమో త్యాగం చేయండని బలవంతగా నిరాశ్రయులను చేస్తున్నారు. వాళ్ళ తాత
ముత్తాతల నుండి వాళ్లకు అన్నం బెడుతున్న భూమి, పెండ్లిళ్ళు పేరంటాలు చేస్తున్న భూమి, చస్తే వాళ్ళ శవాలను బొందబెట్టుకోవడానికి కడుపు తెరుస్తున్న
నేల తల్లి. ఇప్పటికి ఉద్యోగ రీత్యా ఎక్కడ ఉన్నా ఎక్కడ చనిపోయినా శవాలని తీసుక వచ్చి ఆయా గామాలల్లోనే ఖననం చేసుకుంటారు. అయినా మీరు శాశ్వత నివాసస్తులు కారు మీకు పునరావాస లబ్ది లభించదు అంటూ మిక్కిలి నిర్దయగా వ్యవహరిస్తున్నారు రెవెన్యు అధికారులు.
వాళ్ళ పేరుతొ రెవెన్యు రేకార్డులల్లో భూములు ఉంటాయి,పంచాయితీ రికార్డులల్లో ఇండ్లు ఉంటాయి, ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటాయి, రేషన్ కార్డులు ఉంటాయి అయినా మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదంటున్నారు. ఒక వ్యక్తీ ఆస్తి ఎక్కడైనా కలిగి ఉండడం ప్రాథమికమైన హక్కు, అలాగే జీవించి ఉండడం కూడా
ప్రాథమిక హక్కే! అయినపుడు ఈ అధికారులు ప్రజల ప్రాథమిక హక్కులు అయిన ఆస్తి హక్కు, జీవించే హక్కులను కాల రాయడం లేదా? ప్రజల ఉప్పుదిని
బ్రతుకుతున్న ఈ ప్రభుత్వానికి , అధికారులకు ప్రజల హక్కులను కాపాడాలన్న స్పృహ లేకుండా పోతున్నది.
వందల ఏండ్ల నుండి ఈ గ్రామాలు ఉన్నాయి, గ్రామాలను ఒరుసుకొని గోదావరి నది పారుతున్నది.అయిన ఈ గ్రామాలకు ఒక్కనాడు గోదావరి నీళ్ళ రుచిని
ప్రభుత్వాలు చూపించ లేదు. ప్రజలు వాళ్లకు వాళ్ళు కలుగ జేసుకున్న నీటి వనరులు దప్ప ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాల రాశి ఏమి లేదు. వందల సంవస్తరాల నుండి కలో గంజో దాగి కలిసి మెలిసి జీవేస్తున్న ప్రజలను ఒక్క కలం పోటుతో ఉళ్లు విడిచి వెళ్లి పోమ్మంటుంటే తుపాకి దెబ్బకు పక్షుల గుంపు చెదిరిపోయినట్టు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రజలకు సానిభుతితో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్నారు.
ఈ గ్రామాలన్నీ ఒక నాడు ప్రజాపోరాటాల ఒరవడిలో ఎరుపెక్కిన చైతన్య వంతమైన గ్రామాలే. మా కాలి కింది దుమ్ము లాంటి వారురా మీరు అంటే ఆ దుమ్మే
వారి కండ్లల్లో ఎగిసి పడిన మట్టి ఇది. ప్రజా రాజకీయాలు నేర్పిన ఎందరో విప్లవ వీరులు నడయాడిన నేల ఇది. అన్నలె గనుక ఉండి ఉంటె మనకు ఈ దుస్తితి
దాపురించి ఉండి ఉండేదా అనుకొంటున్నారు వాళ్ళ సామూహ చర్చల్లో, ఓ ప్రభుత్వమా! సమస్య నీవే సృస్తిస్తావు, పరిష్కారం కోసం వస్తే నీకు దిక్కున్న చోట
చెప్పుకోమని వెక్కిరిస్తావు, ప్రజలను పోరాటాల వైపు ఎగదోస్తావు, ఆ తర్వాత ఆ ప్రజల పైననే తుపాకి ఎక్కుబెడుతావు.
తన ప్రజలను ఆ ప్రజల ప్రభుత్వమే కాల్చి చంపడం ప్రజాస్వామిక పాలన కాదు అని సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించినా ఈ అధికారులకు తలకేక్కనపుడు
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ వేదుక్కోవాలో ఆలోచించే వైపు ప్రభుత్వాలే నేట్టివేస్తున్నాయి .
పెంటయ్య. వీరగొని.

Friday, March 9, 2012

granait kvarees.

రాళ్ళు కావు అవి - రాతి పుటలు మరి !
ప్రజల మేలు కోసమే జీవిస్తున్నం అను మాయ మాటలు జెప్పి ప్రజలిచ్చిన ఓట్ల తో అధికారం లోకి వచ్చిన రాజకీయ నాయకులు ప్రజాప్రయోజనాలకు పూర్తీ
వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు చెందవలసిన ప్రక్రుతి సహజ సిద్ధమైన వనరులను అన్నింటిని టోకున గంప గుత్తా గా కొద్దిమంది సంపన్నులకు
అమ్ముకుంటున్నారు. ప్రజా వ్యతిరేకమైన పాలనా పాపం బద్దలై ఐదు రాష్ట్రాల్లో వారి అధికారం పేకమేడల్లా కూలిపోతున్న సందర్భం ఇది. ఐన ఇక్కడ
కరీంనగర్ జిల్లాలో రాజ్యం నిర్భీతిగా తన విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉంది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి లో ఎల్లమ్మ గుట్ట ను గ్రానైట్ క్వారీ యజమానులు
దసరా పండుగ నాడు యాత మాంసాన్ని కోసి పోగులేసుకున్న చందంగా ఖండ ఖండాలుగా ఖండించిన గండ శిలలను తరలించుక పోవడానికి రహదారి వేస్తున్నారు.రోడ్డుకు అడ్డం వచ్చిన అతి ప్రాచీనమైన మానవ నాగరికత ఆనవాళ్ళు అయిన బృహత్ శిలాయుగపు సమాధులను కూలదొస్తున్న దృశ్యాలను పరిశీలకులు గా వెళ్ళిన భూమి రక్షణ సంఘం బాధ్యులు మాడన కుమారస్వామి, మార్వాడి సుదర్శన్, తోటపల్లి జగన్మోహన్ రావు, మరియు తెలంగాణా ఐక్య కార్యాచరణ కమిటి కన్వీనర్ వీరగొని పెంటయ్య గమనించి నారు.
పొట్లపల్లి ఐదు వేల ఏండ్ల కిందనే ఆరు చదరపు మైళ్ళ విస్తీర్ణం తో నాగరికత విలసిల్లిన మహానగరం అని బయటి ప్రపంచానికి ఇంకా తెలియదు.ఊరికి ఉత్తరంగా
ఎత్తైన ఎల్లమ్మ గుట్ట. గుట్ట పైకి ఎక్కితే అక్కడ ఒక చతుర్ముఖ మంటపం ఆనవాళ్ళు, ఆ మంటపం తూర్పు ముఖం లో రాతి యుగపు ఆయుదాలయిన గోద్దన్లు రాతి గదలను బండ పై నూరిన ఆనవాళ్ళు. గుట్ట శిఖరం నుండి తూర్పు వైపు కొంచం కిందకు వస్తే గండు శిలల రాశి మధ్యన ఒక సొరంగం,ఆ సొరంగం గుహలో
ఆదిమానవులు నివసించిన ఆనవాళ్ళు. వాళ్ళు గీసిన ,చెక్కిన బొమ్మలు రాతి గోడల పైన సజీవంగా దర్శనమిస్తున్నాయి. గుట్ట మొదట్లోనే ఏ అజ్ఞాత శిల్పో
చెక్కిన అందమైన ఎల్లమ్మ శిల్పం ఉన్నది. అది దాటి కొంచం ముందుకు పొతే ఆ మధ్యన ఎప్పుడో దమ్మక్క ,సారలమ్మలకోసం గద్దెలు నిర్మించడానికి తవ్విన
పునాదులల్లో బయటపడ్డ పదుల సంఖ్యలో లభించిన అందమైన నాగాదేవతా శిల్పాలు ఉన్నాయి. స్తానికుల ను అడిగినపుడు గ్రామం లో ఎక్కడ తవ్విన ఈ నాగాదేవతా శిల్పాలు విరివి గా లభిస్తాయి అని ఆది కాలం లో ఎక్కడ జనమేజయునిలాంటి వారెవ్వరో సర్పయాగం చేసినాడట అంటున్నారు. అంటే నాగ జాతి
మూలవాసులకు మరో జాతితో జరిగిన యుద్ధం లో నాగజాతి వారు పెద్ద సంఖ్యలో మరణించి ఉండవచ్చు.గిరిజన సాంప్రదాయం ప్రకారం వారి జాతి నాయకుల
చిహ్నాలను రాళ్ళ పైన చెక్కుకొని ఉండవచ్చును. ఒక ఎల్లమ్మ, ఒక నాగదేవత లాంటి ప్రతిమలను చూస్తుంటే మాతృస్వామిక వ్యవస్థ పరిడవిల్లిన జాడలు ఇక్కడ
కనిపిస్తున్నాయి,
పొట్లపల్లి నుండి దేవక్క పల్లి దాకా వందల సంఖ్యలో విస్తరించి ఉన్న బృహత్ శిలయుగపు సమాధులను గమనించినపుడు ఎక్కడ క్రీస్తు పూర్వం మూడు వేల
ఏండ్ల కిందటనే ఒక గొప్ప నాగరిక సమాజం నడయాడిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సమీపం లోఉన్న మాల గూడెం గుహలో అజంతా , ఎల్లోరా చిత్రాలను
బోలిన రంగులతో వేసిన బొమ్మలున్నాయి. బౌద్ధ మతం కూడా గొప్పగానే విలసిల్లిన జాడలు తెలిపే బౌద్ధ శిల్పాలు కూడా అనేకంగా ఉన్నాయి.
పోట్లపల్లికి ఈశాన్య దిశలో పడి కిలో మీటర్ల దూరంలో బయ్యన్న గుట్టల శ్రేణిని ఆనుకొని దొనబండ గుట్ట ,మూడు రోకండ్ల గుట్ట , బాపనాయనగుట్ట, ను కలుపుకొని మహ్మదాపురం గుట్టల శ్రేణులు ఉన్నాయి. ఆగ్నేయ దిశలో మన్నేగుట్ట ,మీర్జాపురం గుట్టల శ్రేణులు ఉన్నాయి. ఎత్తయిన ఈ గుట్టల శ్రేణుల పైన
దట్టమైన అడవుల మూలంగా లభించిన పుష్కలమైన జల సంపదతో ఈ నేల విలసిల్లిందని చెప్పడానికి ఎల్లమ్మ గుట్ట సమీపాన్నే తూర్పు వైపు ఉన్న ఎడెడ్ల
వాగు ఒక సాక్షం. ఇది ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోనే అత్యల్ప వర్షా పాతం గల ప్రాంతం, కాని ఆనాడు ఈ ఎడెడ్ల వాగు దాటేతందుకు ఏడు ఎడ్లను జతలుగా కట్టి
దాటుతుంటే ఒకనాడు ఆ ఏడు ఎడ్లు కూడా వాగు ఉధృతికి కొట్టుకొని పోయినాయట. అందుకే ఆ వాగుకు ఆ పేరు స్తిరపడిపోయిందట.
ఈనాడు అణుబాంబు కలిగి ఉండడం ఎంత సాంకేతిక విప్లవమో ఆనాడు ఇనుము తయారి అంటే విప్లవకరం. పోట్లపల్లిలో ఇనుము వండిన చిట్లం విస్తారంగా
కనిపిస్తున్నది. అంటే అక్కడ ఉత్పత్తి చేయబడిన ఇనుము ఆయుధాలకు, వ్యవసాయ పనిముట్లకోసం దేశవిదేశాలకు ఎగుమతి చేయబడి పొట్లపల్లి మహానగరం
ఆనాటు కాస్మోపాలిటాన్ నాగరికతకు చిహ్నంగా విలసిల్లినదనడానికి గుర్తుగా ఒక పురుషుడు ఆవును తీసుకొని పోతుంటే స్తీ తన బాలునితో వెంట వస్తున్న
శిల్పం దొరికింది. ఇది మెసపటోమియా చిత్రాన్ని పోలియిన్నది.
క్రీస్తు పూర్వం 200 నుండి క్రేస్తుశకం 200 మధ్యకాలం లోనే మనుధర్మ శాస్త్రం భారత, రామాయణ రచనా కాలం అని చెప్పబడుతోంది.అంటే పొట్లపల్లి కి
ఇంతకంటే గూడా ప్రాచీనమైన చరిత్ర ఉన్నట్లే, క్రీస్తు పూర్వం 1300 నుండి 1200 మధ్యకాలం లో మన దేశానికి ఆర్యులు ఆగమనం జరిగితే ఇక్కడ అంతకు ముందే నాగరికత విలసిల్లిన ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ఆదిమ సమాజం నుండి , శాతవాహన, కాకతీయుల దాకా ఒక సజీవ స్రవంతి లా సాగిన మానవేతిహాస
నాగరికతకు చిహ్నమైన అలనాటి మాహానగరమైన పోట్లపల్లిని కబళించడానికి ఇనుపకోరల గ్రానైట్ రాక్షసి కాలుమోపింది.
అయితే ఏంటి ? సహజ వనరులు వాడుకో కూడదా? అభువ్రుద్ది జరుగ వద్దా? అంటున్నారు కొందరు.
ఎల్లమ్మ గుట్ట 200 ఎకరాలు విస్తరించి ఉన్నది. గుట్టపైకి ఎక్కితే చుట్టూ మూడు వేల ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉన్నది. గుట్ట ఓవర్ హెడ్ ట్యాంక్ అయినందున మార్చి ఏప్రెల్ నెలలోని మండుటెండల్లో కూడా చుట్టూ పచ్చని వరిపోలాలు ఉన్నాయి.రెండు కుంటలు రెండు చెరువులు ఉన్నాయి, వర్షాకాలం
లో ఇవినిండుతే రెండు పాటలకు ధోకా ఉండదు. గుట్ట పైన నూట యాభయి దాక గుడ్డేలుగులు( ఎలుగుబంట్లు), వెయ్యికి పైగా కోతులు, నెమల్లు, జింకలు,
ఎదుపందులు ,అడవి పందులు ఉన్నాయి. గ్రానైట్ బ్లాస్టింగులతో ఇవన్ని అయితే చనిపోవాలి లేదంటే జనం లోకి పోయి జనాన్ని అయిన చంపుతాయి.
గుట్ట చుట్టూ పదివేల తాడి చెట్లు ఉన్నాయి. మామిడి, బత్తాయి తోటలు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఇవన్ని దాదాపు పది వేల మంది జనాభాకు జీవనోపాధి
కల్పిస్తున్నాయి.
ఇప్పుడు అ గట్టాను ధ్వంసం చేస్తే భూగర్భ జలాలు అడుగంటి పోయి వ్యవసాయం వట్టిపోయి , తాటి, మామిడి, బత్తాయి తోటలు ఎండిపోయి పదివేల మంది
జీవనోపాధి పోయి రోడ్డున పాడుతారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే జూసిన ఈ క్వారీ ద్వారా ఏటా యాభై లక్షల రాయల్టీ వస్తుందనుకొన్న ఓ 20 ఏండ్లకు 10 కోట్ల
ఆదాయం వస్తుంది కాబోలు. కాని ఈ 20 ఎండ్లల్లో 10 నుండి 20 వేల మంది శాశ్వతంగా నిరాశ్రయులై పోతున్న దానితో పోలిస్తే ఈ 10 కోట్లు ఈ మూలకు?
నిన్నటికి నిన్న జస్టిస్ జి.ఎస్. సంఘ్వి, జస్టిస్ ఏ.కే . గంగూలి లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం నోయిడా ప్రాంతం లోని పేదల భూములు గుంజుకొని పెద్దలకు
పందేరం చేస్తున్న విధానం కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న చందంగా ఉందని అభిబర్నించింది .అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టీస్ ఎల్. నరసింహారెడ్డి ఎమ్మార్
భూముల కేసులో ఎపి ఐ ఐ సి ద్వారా రైతుల భూములు కొల్లగొట్టి ఎమ్మార్ సంస్తకు కట్టబెట్టడం మిక్కిలి అనైతిక హేయమయిన చర్య అని అభివర్ణించింది.
పోట్లపల్లిలో ఉన్న గ్రానైట్ సహజ sampada prajalandari ummadi aasti. staanika ప్రజల upaadhi avakaashaalanu ధ్వంసం chesi , అతి pracheena itihaasa charitranu parishodhanalaku ఆనవాళ్ళు lekundaa chesi ikkadi ప్రజల jeevinche hakkunu kaala raasi
kevalam videshi avasaraalakosam , koddi మంది bada kantraktarlu marinni కోట్లు ఈ రాళ్ళ నుండి pindukovadaaniki palakulu
చేస్తున్న అతి kruramaina చర్య ఇది.
ikkadi prajalu ఈ గ్రానైట్ kvareeni nilipi veyaalani dimand chestunnaru. తన raajyaadhikaaram తో paalakulu kvaareeni
nadipistaamani mondi గా ముందుకు velite praja poraataala mundu paalakulu paraajitulu kaaka tappadu.
పెంటయ్య. వీరగొని.
కరీంనగర్.

Wednesday, February 15, 2012

What happens if Education privatizes?

ఏ వ్యవస్తకయినా దాని మనుగడకంటూ ఒక ఆర్ధిక వ్యవస్థ ఉంటుంది. దాని ఆర్ధిక వ్యవస్తను కాపాడుకోవడానికి ఒక సాంస్కృతిక వ్యవస్తను ఏర్పాటు చేసుకుంటుంది ఆ వ్యవస్థ. ప్రస్తుతం మన దేశానిది పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్థ. అయితే ఆ ఆర్ధిక వ్యవస్థ దాని పునాది అనుకుంటే దాన్ని కాపాడుకోవడానికి ఉపరితలామ్శాలు అయిన విద్య, కట్టు, బొట్టు లాంటివి ఉంటాయి. పునాది చెడి పోకుండా ఉపరితలామ్శాలు పైన ఉండి కాపాడుతాయి, అలాగే ఉపరితలాంశాలను అవిపడిపోకుండా పునాది కాపాడుతుంది. అంటే ఒక దానిని ఒకటి పరస్పరం కాపాడుకుంటూ వాటి మనుగడను కొనసాగిస్తాయి. ఇక్కడ ఉన్నట్టి ఆర్ధిక వ్యవస్థ సరయ్యిందే అని చెప్పడానికి విద్య వ్యవస్థ పని జేస్తుంది. అలాగే ఇలాంటి విద్యా వ్యవస్థ
అయితేనే ఈ ఆర్ధిక విధానం కొనసాగా గలుగుతుంది అని రాజ్యం తన విధానంగా చెబుతుంది. ఇక్కడ కొంత మంది విద్యా వేత్తలు మన దేశం లో
విద్యా వ్యవస్థ ప్రయివే టీకరిన్చబడుతున్నది, తద్వారా పెట్టుబడి దారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విద్య వ్యవస్తను రూపొందిస్తారు, దాంతో
రేపు వ్యవస్తలోని విలువలే తలకిందులు అవుతాయి అని ఆవేదన చెందుతున్నారు.
జాతీయ విద్యావిధానాన్ని పర్యవేక్షిస్తున్న కపిల్ సిబాల్, మేము ఎలాంటి విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాన్నో పార్లమెంటులో చర్చిస్తాము విద్యా వేత్తలతో ,ఉపాధ్యాయులతో చర్చించ వలసిన అవసరమే లేదు అంటున్నాడు. మన పార్లమెంటులో దాదాపు 300 మంది సభ్యలు పెట్టుబడి దారులే ఉన్నారు. వాళ్ళ పెట్టుబడులు రెట్టింపు జేసుకోవడానికి విద్య ప్రయివెటీకరించబడవల్సిందే అంటారు. దానితో వాళ్లకు లాభాలు వస్తాయి. స్తూల జాతీయాదాయం పెంరిగింది అని మన ఆర్ధిక వేత్తలు లెక్కలు చెబుతారు. విద్య ప్రయివేటీకరించవడితే అసలు ఏమవుతుంది? ఎవరికీ ఏమి నష్టం జరుగుతుంది? వాళ్ళ మాటల్లో చెప్పాల్సి వస్తే మంచి నాణ్యమైన చదువు దొరుకుతుంది గదా?
కాని మనం ఇప్పుడే ప్రాథమిక విద్య లోనే చూస్తున్నాము, ఒక్కో విద్యార్థి లక్ష నుండి రెండున్నర లక్షల దాకా ఒక సంవస్తరానికే చెల్లించ వలసి వస్తున్నది.ఆ విధమైన పాఠాశాలలో చదివిన విద్యార్థి మన వీధి బడిలోని విద్యార్థిని తన తోటి విద్యార్థిగా తోటి మానవునిగా గుర్తిస్తాడ? దేశ పౌరులందరూ సమానమే అనే భావన ఆ పిల్లోడిలో రావడానికి ఈ కార్పొరేటు బడులు దోహద పడుతాయా? రాజ్యాంగం లో అందరు సమానమే , అందరికి సమాన హక్కులే అని రాసుకున్నాము. కాని నిన్నటికి నిన్న ఐ ఏ ఎస్సు లు మేము అందరి లాంటివాళ్ళం కాదు మాకు ప్రత్యేకమైన
హాక్కులు ఉన్నాయి అన్నారా? అంతెందుకు ప్రజలవద్ద గొల్లూడ గొట్టి పైసా పైసా పోకుండా పన్నులు వసూలు జేసున సోమ్ముల్లో నుండి మంత్రులు , ఏమ్మేల్లెలు,కోట్ల కొద్ది అక్రమంగా కొల్లగోట్టితే తమ తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు కాని తమ వర్గం వారి పైన ఈగ వాలనివ్వడం లేదుకదా? ఇప్పుడే ఈ విధంగా ఉన్నప్పుడు రేపు రేపు ఈ కార్పొరేటు బడులలో, కాలేజి లలో చదువుకొని వచ్చే విద్యావంతులైన పౌరులు ఎట్లా వ్యవహరిస్తారో ఉహించ వచ్చు. బ్రిటిషర్ల ఏలుబడి లో సంస్థానాదీశులకే ఓటు హక్కులు ఉన్నట్లు గా ఈ కులీనులైన విద్యాదికులకే అన్ని హక్కులు అన్ని అవకాశాలు ఉండే ప్రమాదం ఉంటుంది. ఏమి , ఉండకూడదా? ఎందుకు ఉండకుడదో చెప్పుమని అడిగే పౌరులు కూడా బయల్దేరుతారు. కాని అప్పుడు ఏమి జరుగుతుంది అంటే సమాజం లో అశాంతి నెలకొంటుంది. సమానా హక్కుల కోసం సమాన అవకాశాల కోసం అసమాన సమూహాల మధ్యన సంఘర్షణ మొదలవుతుంది. సమాజం మొత్తంగా అశాంతికి ఆలవాలం అవుతుంది.
అప్పటికి ఈనాటి చిదంబరం వారసులు, వీళ్ళంతా వామ పక్ష తీవ్రవాదులు మనం ఎంతో కస్టపడి కూడబెట్టుకున్న ఆస్తులల్లో వాటా అడుగుతున్నారు కనుక వీళ్ళను జైళ్ళల్లో తోసేద్దాం అంటారో లేక ఏకంగా మానవ రహిత విమానాల తోటి బాంబింగ్ జేసి కాల్చి చంపుతామంటారో కాలమే చెప్పాలి.
పెంటయ్య.వీరగొని.
కరీంనగ

Saturday, February 4, 2012

I A S lu evari pakshamo telchukovaali.

ఐ ఏ ఎస్ లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధ ఆవేదన వెళ్ళగక్కిన తీరు చూసిన తర్వాత సామాన్య జనాలు గూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నపుడు ఈ అధికారులే అది తమ
బాధ్యత కానట్లు తిక్క తిక్క జవాబులు ఇచ్చి అడ్డమైన ప్రశ్నలు వేసి అవమాన పరచిన సంఘటనలు వాళ్లకు జ్ఞాపకం వచ్చినాయో లేదో?
1 ) మేముమాత్రమే అవినీతికి పాల్పడ్డామ?
2 )రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడడం లేదా?
3 ) పెద్ద చేపలను వదిలి వేసి చిన్న చేపల ను పట్టుకుంటున్నారు.
4 ) సి బి ఐ విచారణ మర్యాద గా లేదు.
5 ) క్యాబినెట్ ది సంబందిత మంత్రి దే బాధ్యత.
6 ) కోడ్ అఫ్ కండక్ట్ ప్రకారం సి బి ఐ విచారించడం లేదు.
7 ) కోట్లు లంచాలు తిన్న వారిని వదిలేసి మా వెంట పడుతున్నారు.
చెంద్ర బాబు నాయుడు , రాజశేఖర్ రెడ్డి లు అసెంబ్లీ లో ఒకరి అవినీతిని మరొకరి ఆడిపోసుకున్నట్టు ఇప్పుడు ఐ ఏ ఎస్ లు క్యాబినెట్ ను ఆడిపోసుకుంటున్నారు.
అంటే మాది అవినీతి లేదు అని మాట వరుసకు కూడ అనలేనంతటి అవినీతి లో ఐ ఏ ఎస్ లు కూరుక పోయినారు. ముందు రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించి
ఆ తర్వాత మమ్ములను ప్రశ్నించండి అంటున్నారు.ఎంత దిగ జారి పోయినారు గదా ఈ అధికారులు.
ఒక ఉపాధి హామీ రోజు కూలి ని నీవు 120 రూపాయలు తీసుకొని ఇదేనా చేసిన పని అంటే తవ్వని మట్టిని ఎత్తి పోసినట్టు ట్రాక్టర్ కు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి ,
చేయని పనిని రికార్డ్ చేసి వేలకు వేలు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి , అందరికి అక్కరకు వచ్చే భూములను ఓపెన్ కాస్త పేరిట తవ్వి వేయడం ఎట్లా అభివృద్ది , గుట్టలను
కొండలను కూల్చి వేసి కొనరికి గ్రానైట్ జిగేల్ లు కొందరికి దుమ్ము ధూలి, హేమటైటు, దోలమైటు , క్వారీలు తవ్వి అలివిగాని కాలుష్యం అభివృద్ధా అంటే నన్ను నువ్వు అడుగకు
నిన్ను నేను అడుగ . ఇద్దరం గలిసి ఉకున్నోని కాళ్ళ కింద నెల తవ్వుక పోదాం . ఇక అవినీతిని ఎవ్వరు కూడా ప్రశ్నించ వద్దు అంటున్నారు.
ఐ ఏ ఎస్ ల ను అడుగనంత వరకు రాజకీయ నాయకుల గురించి వారు ఎప్పుడు మాట్లాడ లేదు. క్యాబినెట్ లో రాజకీయ నాయకులు చేస్తున్న ఎన్నో నీతి బాహ్యమైన చర్యలను సమర్థిస్తూ ప్రశ్నించే ప్రజల నోళ్లను ఎందరో ఐ పి ఎస్ లు ఎందరో ఐ ఏ ఎస్ లు ముయించినారు. ఒకరి అవినీతిని ఒకరు చట్టాల పేరుతొ నిబంధనల పేరుతొ సమర్థించిన వారే. కాని ఇంత బాహాటంగా జరుగుతున్నా అవినీతిని ఏదో తు తు మంత్రంగా నన్నా చల్లార్చకుంటే రేపు ప్రజలల్లోకి ఏ మొఖం పెట్టుకొని పోగలం అనుకొన్న రాజకీయ నాయకులు అసలు దొంగలను వదిలి వేస్తూ అంతకాగిన వాళ్ళను కొందరినన్నా కొంచెం మందలిద్దాం అని చిన్న ప్రయత్నం చేస్తే మా బంగారుకన్నం లో వేలుబెడితే
మేము కుత్తమా అంటున్నారు.
అయ్యా ! మా పోరగాండ్లు మా తెలంగాణా మాకు కావాన్నని జై తెలంగాణా అంటే జైళ్లల్ల బెడితిరి, మా బిడ్డలను యునివర్సిటీ రూములల్లకు జొరబడి గొడ్లను బాదినట్టు బాదితిరి.
మా గ్రామాల్ల పోరగాండ్లు ఈ దొంగా రాజకీయ నాయకుల బండారం బయటబెడితే ఎన్కౌంటర్ చేసి పారేస్తిరి . విచారణ కమిటీల ముందు కు వచ్చి తమ పోరాగాన్డ్లను ఎవ్వరు చంపినారో చెబుతాం అంటే గూడా చెప్పనివ్వ కుండా అడ్డుబడితిరి. మీకు కోడ్ అఫ్ కండక్ట్ లు ఉన్నట్టే మాకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఉన్నదంటే మీకు దిక్కున్న
చోట చెప్పుకో అంటిరి. ఒక నాడు రాజులు దొరలూ జమీందారులు పార్లమెంటులోకి వచ్చి వాళ్లకు అనుకూలమైన చట్టాలు చేసుకున్నారు.ఇప్పుడు కాంట్రాక్టర్లు , వ్యాపారస్తులు
గుండాలు , ఖునికోరులు ఎన్నిక కాబడి వాళ్లకు అనుకూలంగా చట్టాలు జేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తాము చేస్తున్న చట్టాల ద్వారా తమ వర్గానికి లబ్ది
చేకూర్చాలని చూస్తున్నారు. గొప్ప గొప్ప చదువులు చదివి న ఐ ఏ ఎస్ లు ఐ పి ఎస్ లు ఏ ప్రజల ఉప్పుదిని తాము బ్రతుకుతున్నారో ఆ ప్రజల పక్షాన నిలబడు తారో
లేక ప్రజల కష్టార్జితం తో బాటు గా వాళ్లకు చెందవలసిన వనరులను అన్నింటిని గంప గుత్తాగా కొల్ల గోడుతున్న రాజకీయ నాయకుల వైపు నిలుస్తారో నిర్నయిన్చుకోవాల్సిన
సమయం ఆసన్న మైంది.
వాళ్ళు యూదులకొసమ్ వచ్చిండ్రు. నేను యూదును కాదు కనుక అడ్డుజెప్పలేదు. వాళ్ళు కమ్యునిస్టుల కోసం వచ్చిండ్రు, నేను కమ్యునిస్టును కాను కనుక అడ్డుజెప్పలేదు.
వాళ్ళు మిలిటెంట్ల కోసం వచ్చిండ్రు . నేను మిలితెన్టును కాను కనుక అడ్డుజెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు నీ కోసం వచ్చిండ్రు.. ఇప్పుడైనా అడ్డుజేప్పకుంటే ఇంకా నీవు ఎవరికోసం బతుకుతవు నీ బతుకు వృధా యే కదా?
పెంటయ్య. వీరగొని.
కరీంనగర్.

Thursday, February 2, 2012

dikku leni prajalu okkatavutunnaru.

రాజ్యం - దాని స్వభావం,

ప్రతి దినం వార్త పత్రికలల్లో వందల , వేల కోట్ల రూపాయల కుమ్బకోనాల గురించిన వార్తలు... అందుకు కారణమైన వ్యక్తుల ను విచారిస్తున్నట్టు మరియు అరెస్టులు
చేస్తున్నట్టుగా చదువుతున్నాము. అలాగే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపైన ఒకరు నీవు ఇన్ని కోట్ల ప్రజాధనం దిగామింగావంటే , నీవేమి తక్కువ తిన్నావా
నీవు ఇన్ని కోట్లు తినలేదా అంటూ ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష అనే తేడా లేకుండా అంతా ప్రజలు పన్నుల రూపం లో కడుతున్న
సొమ్ములు మరియు ప్రజలకు దక్కవలసిన కోట్లాది రూపాయల వనరులు కొందరే బొక్కి కుచుంటున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం డబ్బు సంపాదించడం నేరం కాదని
ఒక వైపు చెబుతూనే మరో వైపు సక్రమంగా సంపాదించాలని చెప్పబడుతున్నది. ప్రజలందరికి చెందవలసిన సంపదను ఇట్లా కొందరే కోట్ల కొద్ది ప్రోగుజేసుకోవడం , సంపద
అంతా అందరికి సమానంగా పంచవలసిన బాధ్యత కలిగిన రాజ్యం కొందరికే సంపద దోచిపెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మానవులు ప్రక్రుతి నుండే అన్నీ నేర్చుకున్నారని చెప్పే ఒక మేధావి ఏమంటాడంటే , మొక్కలు ,వృక్షాలు ,తాము భూమి ,సూర్యుడు,గాలి ఆధారంగా సంపాదించిన సంపదను
అవి తమకు అవసరమైన మేరకు ఉపయోగించుకొంగా మిగిల ఆహారాన్ని గింజల రూపం లో , గడ్డల రూపం లో, తమ వేర్లల్లో ఆకుల్లో, కాండం లో దాచుకుంటున్నాయి.
అలాగే జంతువులూ కూడా తాము వేటాడిన మాంసాన్ని తినే కాడికి తినగా మిగిలిన దాన్ని దాచిపెట్టుకొని అవసరమైనపుడు తింటున్నాయి. అలాగే మానవుడు కూడా
తాను సంపాదించిన సంపద కూడబెట్టుకొని ఆ సంపదనే పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించడమే గాకుండా ఆ పెట్టుబడి తో శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ది పరిచి
అధిక మరియు నాణ్యమైన ఉత్పత్తిని సాధించడానికి దోహద పడుతున్నాడని అని వాదిస్తున్నాడు.
అది ప్రక్రుతి నియమం . దాన్ని అందరం అంగీకరిస్తాము. అయితే ప్రకృతిని ఏ శక్తి నియంత్రించడం లేదు. కాని మానవ సమూహాలను నియంత్రించడానికి రాజ్యం ఉన్నది.
రాజ్యం లో ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించడానికి వీలు లేదు. దానికి ఒక ఆర్డర్ ఉన్నది.ఆ మానవ సమాజం ఎట్లా వ్యవహరించాలని మౌఖికంగా అనుకుంటారో
లేక రాజ్యాంగం లో రాసుకుంటారో అట్లానే వ్యవహరించాలి . అట్లా వ్యవహరించక ఉల్లంఘించిన వాళ్ళను రాజ్యం తన బలగాలతో నియంత్రించ వలసి ఉంటుంది.అయితే రాజ్యం
అనేదానికి వర్గ స్వభావం ఉంటుంది. అది తన వర్గానికి లబ్ది చేకూర్చిపెట్టె విధంగా వ్యవహరిస్తూనే ఆ పని అంతా తమ వర్గం కాని వారి క్షేమం కోసమే అలా చేస్తున్నానని
నమ్మించ వలసిన బాధ్యతా కూడా అది స్వీకరిస్తుంది.ఎట్లా అంటే ఒక అడవిలో ఒక యాభై పులులు ఉన్నాయనుకొందాం.. అవి విచ్చల విడిగా ఒక క్రమం ,పద్దతి లేకుండా
వేటాడినట్లు అయితే అడవిలో ఉన్న లేళ్ళు అన్నీ ఆనతి కాలం లోనే అంతరించి పోతాయి.అప్పుడు అన్ని ఆకలి తో నక నక లాడి చనిపోవాల్సి ఉంటుంది. కనుక అవి ఏమని
కట్టుబాటుచేసుకున్నాయి ఆటా అంటే, మనం ఈ విధంగా ఎవరికీ తోచినట్టు వాళ్ళు వేటాడి తింటే కొద్ది రోజులకే మనకు తిండి దొరుకని పరిస్తితి వస్తుంది కనుక ఓ పులిరాజు లాలా
మీకు ప్రతి రోజు ఒక్కొక్కరికి ఒక లేడి చొప్పున తినడానికి మేము ఏర్పాటు జేస్తాము. మీరు హాయిగా తింటూ ఉండండి . తల గాక ఎవరైనా మనం చేసుకున్న ఈ నియమాన్ని
ఉల్లంఘించి నట్లు అయితే మన సివ్నగి సేనలతో వాళ్లకు బుద్ద్ది చెప్పించ బడుతుంది అనుకోన్న్నాయి ఒప్పందం చేసుకొన్నాయి. ఇక రోజు ప్రతి పులి రాజుకు ఒక్కొక్క లేడి
పిల్ల ఆహారం గా పోయే టట్టు చూడ వలసిన బాధ్యతా సింహాల రాజు పైన పడ్డది.
సింహాల రాజు ఆ మరునాడే లేడి జాతినంతటిని సమావేశ పరిచింది. ఓ నా ప్రియమైన లేడి సోదరి సోదరులారా! మీకు జరుగుతున్నా అన్యాయం అంతా ఇంత కాదు.
అది తలచుకుంటూ ఉంటె నా కడుపు తరుక్క పోతూ ఉంది.ఇట్లా అయితే మీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మీ జాతి అంతరించి పోయే ప్రమాదం ఉంది. మిమ్ములను
కాపాడడం కేవలం నా వకననే సాధ్యం అవుతుంది. అన్నది.అందుకు లేడి జాతి అంతా సింహ రాజుకు ప్రణమిల్లి మహా రాజ ఎలాగైనా మీరే మమ్ములను రక్షించాలని
వేడుకున్నాయి. తాము చేసుకున్న కుటిల ఒప్పందం బయట పడకుండా సింహ రాజు లేడి జన ఉద్దారకుడువలె ఒక ఫోజు పెట్టి , నేను మీకోసం లేడీజీవ ఉద్ధారక
పథకం ప్రవేశ పెడుతున్నానని ప్రకటించగానే లేడి జాతిమొత్తం జయ హో సింహ రాజా అని నినాదాలు ఇచ్చింది .ఆ పథకం ఎట్లా ఉంటుందో చెబుతున్నా వినండి ,
అంటూ వివరించడం ప్రారంభించింది . రేపటి నుండి మిమ్ములను ఏ సింహం గూడా వేట ఆడకుండా చూసే బాధ్యత నాది .మీకు నేను రక్షణ గా ఉండి మీవైపు ఏ క్రూర మృగం కూడా కన్నెత్తి చూడ కుండా చేసే బాధ్యత నేను వహిస్తున్నాను , అనంగానే సంతోషం తో చప్పట్లు కొట్టినాయి లేళ్ళు.మీరు చీకు చింత లేకుండా హాయిగా కాపురాలు చేసుకోవడం వలన మీ సంతానం అభివృద్ది అవుతుంది. అభివృద్ది చెందిన మీలోనుండి కొందరిని మాత్రం రోజుకు ప్రతి సింహానికి ఒక్క లేడి చొప్పున కప్పం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నది.
అయ్యో అని బాధపడ్డా చేసేది ఏమి లేక తలాడించి వెళ్లి వచ్చినాయి.సింహ రాజులు , సింహ రాజులు కల్సి లేళ్ళను పంచుకు తిన్నట్టు రాజకీయ పార్టీలు,రాజకీయ పార్టీలు అన్ని
కలసి ప్రజలకు చెందవలసిన సంపద అంత దోచుక తినున్నాయి .
సంపద సృష్టి కర్తలం మా సంపద మాకే చెందాలంటున్న వాళ్ళు ,జాన్ మిర్డల్ ప్రఖ్యాత అంతర్జాతీయ రచయిత రాసినట్టుగా దిక్కు లేని ప్రజలంతా ఒక్కటవుతున్నారు.
.
పెంటయ్య,
కరీంనగర్.

Saturday, January 28, 2012

గోదావరినది పైన కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి వద్ద శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 9 గ్రామాలు
కరీంనగర్ జిల్లాలో 9 గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నపుడు ఆ ప్రాజెక్ట్ వలన సంభవించే
పర్యావరణ విఘాతం,గురించి ప్రజలకు జరిగే జీవనోపాధి నష్టం గురించి స్పష్టంగా తెలియ జెప్పి ప్రజాభిప్రాయ సేకరణ జరుగాలి. ప్రజలకు ఇవ్వజూపె
నష్టపరిహారం గురించి గూడా తెలియజేప్పవలసిన బాధ్యతా ప్రభుత్వానిదే . సమాచారహక్కు ప్రకారం ప్రభుత్వానిది పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అద్యక్షులు జీవన్ కుమార్ మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు. కుక్కల గూడూర్
గ్రామాన్ని దర్శించినారు. ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఈ గ్రామం పాక్షికంగా ముంపుకు గురి అవుతున్నది. సర్వే జేసినా అధికారులు వ్యవసాయ భూములను నిర్మాణాలను సర్వే జేసి వ్యవసాయ భూములకు A క్యాటగిరికి 1.5 లక్ష లు నిర్నయిన్చినారట. నిర్మాణాలను కొలిచి ఒక్కొక్క చోట సగం ఇల్లు, ఒక బాత్ రూము వరకు మాత్రం తీసుకుంటాము మిగతాది మేము తీసుకోము అంతవరదాక నీళ్ళు రావు అంటూ అధికారులు బుకాయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నష్టపరిహారం తీసుకోవాలని పోలీసులతో బెదిరిస్తున్నారని ప్రజలు ఎంతో బేలగా బాధగా చెప్తున్నారు.
నిన్న గణతంత్ర దినోత్సవం నాడు భారత ప్రథమ పౌరురాలు tv లో ప్రసంగిస్తూ మన ప్రజలను మన ప్రజాప్రతినిధులను మనం నమ్మకుంటే ఎలా
అని మాట్లాడి నారు. మరి ఇక్కడ మన ప్రజల న్యాయమైన హక్కులను కాపాడవలసిన పోలీసులు ప్రభుత్వ అధికారుల మాటల ప్రకారం ఎందుకు అలా భయపెడుతున్నారో అర్థం కాదు. అంటే ప్రభుత్వం తమకు వేతనం చెల్లిస్తున్నది కనుక ప్రభుత్వం ఏది చెబితే దాన్ని పాటిస్తాం అని వాళ్ళు
అనుకోవడం సరిగాదు. ఉద్యోగులు ఎవరైనా వాళ్ళు వెతనరూపమ్ లో పొందుతున్న ప్రతి పైసా ప్రజల కస్తార్జితమే. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండే
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వేతనం తీసుకొనేది అన్న స్పృహ ప్రతి ఉద్యోగికి ఉండాలి.
అల్లాగే rehabilitation and resettlement act ప్రకారం గ్రామం లో కొంత భాగాన్ని ప్రభుత్వం తన అవసరం కోసం తీసుకొని తక్కిన భాగం తనకు అవసరం లేదని వదలి వేయడానికి వీలులేదు . ఎందుకంటే తర తరాలనుండి ఆ ఊరి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు. వారిని కొందరిని అక్కడే ఉంచి కొందరిని వేరే చోటికి వేల్లిపోమ్మనడం న్యాయం కాదని ప్రభుత్వ పాలసీఏ చెపుతాఉన్నది. ఆ ఉరి మొత్తం ప్రజలందరికి అనువైన ప్రదేశం చూసి అక్కడ వారికి పునరావాసం కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వానిది. కేవలం భూమి ఇల్లు ఉన్న వారికి మాత్రమె నష్ట పరిహారం ఇస్తాం మిగతా వారికి ఇవ్వం అంటే కూడా కుదురాదు. చేతి వృత్తులు చేసుకునే వారికి దినసరి కూలీలకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
అందుకు గాను ముందుగా ప్రభుత్వం ఒక సంప్రదింపుల కమిటీ వేయాలి , ఆ కమిటీ లో ప్రాజెక్ట్ వలన బాధిత వ్యక్తీ , సర్పంచు, mla ఉండాలి .వీరు ఎవ్వరు లేకుండా నష్ట పరిహారం నిర్ధారించి తీసుకోవాలని పోలీసులను పెట్టి ఒత్తిడి చేయడం ప్రజాస్వామికం కాదు. అన్ని వ్యవస్తల ను నిర్వీర్యం చేసి ప్రజలకు ఆయా వ్యవస్తల పట్ల నమ్మకం లేకుండా చేస్తే ప్రజల్లో అశాంతి పెరుగుతుంది, అందు వలన వ్యవస్తలో హార్మని లేకుండా పోయి అలజడులు లేస్తాయి ,యానాం లో రిజెయిన్ సమస్త కార్మికులను పీడించి వేధించి వేధించి ఏమి సాధించింది.వందలాది కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గి పాలు అయినాయి, ఆ సమస్త వైస్ చేర్మన్ అసువులు బాసినాడు. ఏ సంపద అయితే కార్మికులకు దక్కకుండా తానొక్కడే అనుభావిస్తానని అనుకొంటే
అతడే లేకుండా పోయినాడు. అంటే వ్యవస్తాలను కాపాడుకోకుంటే ఎంత మంది మార్బలం ఉన్న గూడా ఇవ్వాళ యానాం లో రిజెయిన్ సంస్త ఆస్తులు బుగ్గిపాలు అయినట్టే తమకే చెందాలి తాము మాత్రమె అనుభవించాలి అని అనుకుంటున్న ఈ సంపద వాళ్లకు దక్కకుండానే పోయే
పరిస్తుతులు ఏర్పడుతాయి.
పెంటయ్య. వీరగొని.
అడ్వకేట్, కరీంనగర్.

Friday, January 27, 2012

sanghatita poraataale sharanyam.

యానం లో వేతనాలకోరకు యాజమాన్యం తో పోరాటం జేస్తున్న కార్మికుల పైన పోలీసులు కాల్పులుజరిపి కార్మిక నాయకుణ్ణి చంపివేసినారు.
పరిస్తితిని చక్కదిద్దేకోరకు అదనపు బలగాలను సంఘటన స్థలి కి పంపినారట. పోయిన పోలీసులు ఎవరికీ మద్దతుగా వెళ్లినట్టు? ముందుగా పోయిన
పోలీసులు కాల్పులు జరుపడం ఎవరికీ రక్షణ కల్పించే కొరకు జరిపినట్టు. ఇంతవరుకు ఎక్కడయినా పోలీసుల కాల్పుల్లో కార్మికులు రైతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి కాని ఎక్కడైనా రైతులో లేక కార్మికుల చేతిలో యజమానులో మరే పెట్టుబడి దారో కాల్చి చంపబడిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. మరి అంత ఖచ్చితమయిన ఆధారాలు ఉన్న కూడా పదే పదే ఈ పోలీసు ప్రభువులు పేద రైతులను , కార్మికులను ఎందుకు కాల్చి చంపుతున్నారో సామాన్యులకు అర్థం కాని విషయం. ఇక్కడ యానం లో ఆ కంపని యజమానికి ఏమైనా ఆర్ధిక నష్టం జరిగితే జరిగి ఉండ వచ్చుగాని చనిపోయిన కార్మిక సోదరుడు అయితే తన కుటుంబ సభ్యులకోసం తిరిగి రాడు. కార్మికుల చమట తో సంపాదించుకున్న ఆస్తి కాలిపోతే మల్లి ఆ కార్మికులే ఆ సంపద అంత సంపాదించే పెడుతారు.
పది పదిహేను రోజుల కింద చెంద్రబాబు రాష్ట్రాన్ని లక్ష కోట్లకు ముంచిన నాయకుని బొమ్మలను ఎక్కడబడితే అక్కడబెడితే కులగోట్టబాడుతాయి అని హేచ్చరించినాడు. దానికి ప్రతిగా ఆ పార్టి నాయకుని ప్రతినిధి మీ ఎన్టీ ఆర్ బొమ్మలు ఉండవు అంటాడు. మా నాయకుని బొమ్మల జోలికి వస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం జేస్తాము అంటారు.కాని ఈ రెండు విగ్రహాలు నిక్షేపంగా ఉంటాయి . ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.అంబేద్కర్ బొమ్మలు కూల్చబడుతున్నయి. దానికి నిరసనగా కేవలం దళిత సంఘాల వాళ్ళు మాత్రమె ఆందోళన చేస్తున్నారుగాని అంబేద్కర్ భారత దేశం మొత్తానికి నాయకుడు కనుక అందరం కలిసి దోషులను శిక్షించే విధంగా కృషి చేస్తాం అనే అన్య వర్గాల వారు కరువైనారు. గణతంత్ర దినోత్సవం నాడు కూడా అంబేద్కర్ బొమ్మ కూల్చబదిన్ది . దోషులను ఎంతటి వారైనా కతినంగా శిఖిస్తాము అని సర్కారు హుంకరిస్తుంది కాని ఏమీ జరుగదు.
ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి కానివ్వండి,అయన జలగం వెంగల రావు కానివ్వండి, ఎన్టి రామ రావు గానివ్వండి, చెంద్రబాబు గానివ్వండి, వైఎస్సార్ గానివ్వండి ముఖ్య మంత్రులుగా పనిజేసిన ఈ పెద్దమనుషులు పదవుల్లోకి వచ్చేటందుకు డబ్బ్లు ఖర్చు చేసిన వాళ్ళే.మళ్ళీ అధికారం లోకి రావడానికి సంపాదించిన వాళ్ళే. తాము మాత్రమె గాకుండా తమ తరతరాలు తిన్న ఒడువని ఆస్తులు సంపాదిస్తారు,తమ సంతానాలు తిరిగి రాజ్యాధికారం లోకి రావడానికి అవసరమైన ఆర్ధిక, రాజకీయ నేపథ్యం ఏర్పాటు చేసి పెడుతారు. ఏ మావోయిస్టులో చెప్పింది గాదు స్వయంగా జాతిపిత గాన్ధిమహాత్ముడే చెప్పిన దేమంటే నీ జేబులో నీ కనీసావసారాలకు మించి ఒక్క రూపాయి ఉన్న అది పక్కవానికి చెందవలసినదే , వాని జేబులో ఉండవలసిన దాన్ని నీవు కాజేసి నట్టే అని అన్నాడు. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుని వద్ద తరతరాలు తిన్న తరుగని ఆస్తి ఉంటది వాళ్ళు అపర అన్నహజారేలవలె ఫోజులు పెడుతున్నారు,మేమే అభివృద్ది చేసినం అంటే మేమే చేసినం అని సొంత డబ్బా వాయించుకుంటున్నారు. పైన తెలిపిన నాయకులు తాము సంపాదించుకున్నది మాత్రమె గాకుండా... మీరు సంపాదించుకున్నది అంతా ప్రజలకు చెంద వలసినదే దాన్ని మేము మీ నుండి కక్కిస్తాము అని నిలదీసిన వేలాది మంది విప్లవ యోధులను చంపించినారు.
అట్లా వాళ్ళు కోట్లు సంపాదించిన నాడుగాని , ప్రశ్నించిన వాళ్ళను చంపివేసిన నాడుగాని ఏ ఒక్కరు ఆ ప్రశ్నించిన వాళ్ళ పక్షాన నిలువక పోగా అట్లా ప్రశ్నించడం నేరము గదా అన్నారు. అట్లా ప్రశ్నించిన ఏ ఒక్కరికి గూడా స్వంత ఇల్లు లేదు.సెంటు భూమి లేదు. బ్యాంకు లో వాళ్లకు అంటూ ఒక్క పైసా బ్యాలెన్సు లేదు. కాని వాళ్ళంతా వేల సంఖ్యలో ప్రజల కోసం ప్రాణాలు సమర్పించినారు. అయినప్పటికీ వాళ్ళ చర్యలను తీవ్రవాద చర్యలు అన్నారు. ప్రజలకు చెందవలసిన వేల , లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ స్వంత ఆస్తులుగా మార్చుకున్న వాళ్ళపట్ల చట్టం తనపని తాను చెసుక పోతుంది అంటారు. ఆ చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కాదుగదా వాళ్ళ జ్ఞాపకార్థం నిర్మించుకున్న స్తూపాలను అవి ఎంత ప్రతిస్తాత్మకం అయినవి అయినా రాతో రాత్ కూల్చివెయబడుతాయి . అరె మావోని ఘోరి అయినా కట్టుకున్టం అంటే ఒప్పుకోబడదు. సాటి మనుషులను చంపినా , వాళ్ళ జ్ఞాపక చిహ్నాలను అలనాటి పిండారీల వలె పేల్చి వేసినా సభ్య సమాజం లో స్పందన ఉండదు.
లక్షలాది ఆదివాసులను నిర్వాసితులను జేసి పోలవరం కడుతామంటే వద్దనే వాళ్ళు కరువౌతారు. వేలాది మంది మత్స కార్మికులకు అన్నం బెట్టె బేల భూములను మల్టినేషనల్ కంపనిలకు అప్పగిస్తామంటే వద్దన్నవాల్లను కాల్చి చంపుతారు. ఆదిలాబాడునుండి ఖమ్మం వరకు లక్షలాది హెక్టార్ల బంగారం పండే సారవంతమైన భూమిని ఓపెన్ కాస్టుల పేరుతొ మరుభూమిగా మార్చి ప్రజలను పక్షుల వలె వలసలకు పంపితే అడ్డుజేప్పిన వాళ్ళను అభువ్రుద్ది నిరోధకులు అని నిందిస్తారు. కోట్ల సంవస్తారాలక్రితం రూపొందిన గుట్టలు ప్రజలకు ఓవర్ హెడ్ తుంకులు అయి వన్య ప్రాణులకూ గృహాలై రక్షణ ఇస్తుంటాయి.ఎవరి ప్రయోజనం కోసమో అవన్నీ ధ్వంసం చేయబడుతాయి , కాని కాదనే వారుండరు. ఇది వర్గాసమాజం దీన్ని అంతం జేయలంటారు కాని అనిచివేయబడుతున్న తెలంగాణా ప్రజలు ప్రత్యెక రాష్ట్రం కోరితే మటుకు అడ్డుజేబుతారు. తెలంగాణ ప్రత్యెక రాష్ట్రం కావాల్సిన్దేనంటారు కాని ఎస్సి వర్గీకరణ మాత్రం వద్దంటారు. నిజంగా నే సంపద అంతా అందరికి సమానంగా పంచాబడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న వాళ్ళంతా తమ తమ భేషజాలు , స్వార్థ ప్రయోజనాలు పక్కనబెట్టి సమిష్టిగా ఉద్యమించవలసిన తక్షణ అవసారాన్ని గుర్తించవలసిన అవసరం బడుగు బలహీన వర్గాల పైననే ఉన్నది.అట్లా సంగటిత పోరాటాలకు ముందుకు రాకుంటే?
ఇవ్వాళ మన నాయకుల విగ్రహాలు కూల్చివెస్తున్నరని , యానం లాంటి చోట మన తోటి కార్మికులను కాల్చి చంపుతున్నారని మొత్తుకొంటే వేట రుచి మరిగిన ఈ మృగారాజులకు వేరు వేరు జేసి వేటాడడం లో ఉన్న ఆ మృగయావినోదం రెట్టింపు అవుతుందే గాని భీతిపడబోవు.
పెంటయ్య.వీరగొని.
అడ్వకేట్
కరీంనగర్,