Wednesday, September 5, 2018

చరిత్ర అధ్యయనం యొక్క ఆవశ్యకత.

                                    

ఈ రోజు ఉదయం ఆస్ట్రేలియా నుండి ;మా సుబ్బా  రావ్ సార్ చిన్న కొడుకు సుజిత్ బిల్లా మాకు పంపిన టీచర్స్ డే గ్రీటింగ్ మెసేజ్ విన్న తర్వాత నా అవహానన కొంత మిత్రులతో షేర్ చేసుకోవాలనిపించింది. మాహానుభావుడు మా ఆకుల  భూమయ్య సార్ ఉండంగా ఏ విషయం లో అయినా సరే ఏదైనా సందేహం వస్తే ఫోన్ లో అయినా మాకు విషయం అర్థం చేయించడానికి ఎంత సేపైనా మాట్లాడి విషయాన్ని కూలంకషంగా చర్చ చేసే వాడు. కానీ ఆయన తర్వాత అంతటి అవగాహన ఉన్న వ్యక్తి మాకు మరొకరు పరిచయం లేకుండా పోయారు.


మనుషుల జీవన విధానానికి, వనరుల వినియోగానికి, శ్రమయుక్తమైన ఉత్పత్తి నుండి సులభతర ఉత్పత్తికి మారే క్రమం లో అభివృధ్ధి అయిన సాంకేతికత, విద్య,  అందులో మనుషుల నాగరికతలు, సంస్కృతులు, చరిత్రతో ముడిపడి యున్న క్రమానుగత సంబంధం గురించి నాకున్న అవగాహన మేరకు కొంత మాట్లాడుకుందాం.


నాగరికతలు అంటే మనుషులు నగరాలను నిర్మించుకొని జీవించే విధానం. ఒక నాగరికత గుంరించి మాట్లాడుకోవాలంటే దాని భౌగోళికత, అది మనుగడలో ఉన్న కాలం, ఉపయోగించిన భాష, లిపి, సైన్స్ ఆండ్ టెక్నాలజీ అంటే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, కొత్త కొత్త పనిముట్లను ఆవిష్కరించుకోవడం.మతము, ఫిలాసఫీ, సంస్కృతి అంటే పండుగలు, సంగీత సాహిత్యాలు, ఆటపాటలు, కుటుంబ జీవన విధానం, కర్మకాండలు, ఇవ్వన్ని నిర్వహించుకోవడానికి ఉత్పత్తి, (వ్యవసాయం, పశుపోషణ) , మారకం, అధికారం, అంటే రాజు, లేదా గణ పతి, లేదా కుటుంబ యజమాని. తగవులు కొట్లాటాలు, యుధ్ధాలు, వాటి నియమ  నిబంధనలు అంటే చట్టాలు అన్న మాట.


క్రీ.పూ. 10,500 నుండి క్రీ. పూ. 4500-2000 కాలం దాకా నియో లిథిక్.(కొత్త రాతి యుగం)  ఏరా అంటారు.ఈ కాలం లోనే వ్యవసాయం ప్రారంభం అయింది. క్రీ. పూ. 2900 నుండి క్రీ. పూ. 1150 వరకు కంచు యుగం, క్రీ.పూ. 1100 నుండి ఇనుప యుగం ప్రారంభం అయింది. అంటే కొత్తరాతి యుగం అంతరించిపోయి ఒకే సారి కంచుయుగం వచ్చినట్టు కాదు.ఎందుకంటే ఇప్పటికీ మనం పప్పు రుబ్బుకోవడానికి రాతి పోత్రాన్ని వాడుతున్నాం, ఒక క్రమానుగతంగా పాత పనిముట్ల స్తానమ్ లో ఆధునికమైన పనిముట్లు వస్తాయన్నా మాట. ఇప్పటికీ అదే విధానం అమలవుతున్న విషయం మనం గమనించవచ్చు.


క్రీ.పూ. 4500 నుండి ఈజిప్ట్ లో సుమేరియన్ నాగరికత వెళ్లివిరింది. ప్రజలు ఆకాడియన్ భాష మాట్లాడే వారు, క్రీ పూ.2300 కాలం లో వారికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఆకాడియన్ రాజు. మనం చరిత్రలో చదువుతున్న అనేక రాజ్యాల పాలన వలెనే సుమేరియన్ నాగరికత కాలం లో రాచరిక వ్యవస్త పాలన నడిచింది. ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కర్మ కాండలో ఈజిప్ట్ మమ్మీల ను గమనిస్తాము. అంటే అప్పటికే మనిషి చనిపోతే మళ్ళీ పుడుతాదన్న విశ్వాసం ఉన్నట్లు తెలుస్తున్నది.


క్రీ. పూ. 3100 కాలం లో టైగ్రిస్ , ఇఫ్రాటస్ నదుల మధ్యగల సారవంతమైన  భూభాగాన్ని ఈ రెండు నదుల నీళ్ళు సస్యశ్యామలం చేయడం వలన ఇక్కడ్ మెసపుటోమియా నాగరికత విలసిల్లింది. ప్రస్తుతం ఉన్న ఇరాక్, ఇరాన్ బార్డర్, సౌదీ అరేబియా, టర్కీ, సిరియా భూభాగం నాటి ప్రాచీన మెసపుటోమియా నాగరికత విలసిల్లిన నేల. ఇక్కడ ఆకాడియన్ భాష మాటల్ల్దేవారని, దానికి లిపి లిటరేచర్ కూడా ఉండేదని వికె పీడియా వారి సమాచారం.


క్రీ. పూ. 3300 నుండి 1300 వరకు సింధు, జీలం, చీనాబ్, రాబి, బియాస్, సట్లెజ్ అను ఆరు నదుల పరీవాహక ప్రాంతం లో సింధు నాగరికత వెళ్ళి విరిసినట్లు 1920 లో బ్రిటిష్ ప్రభ్త్వమ్ వారు జరిపించిన తవ్వకాల్లో మన ములవాసుల , మన పూర్వీకుల ఆనవాళ్ళు లభించినాయి.


క్రీ.పూ. 2003 నుండి క్రీ. పూ. 539 మధ్యలో బాబిలోనియన్ నాగరికత ఇరాక్ లో ఉండేది. ఆకడియన్స్, అమరోటియన్స్,బాబిలోనియన్స్ వలసల వలన ఈ బాబిలోనియన్ నాగరికత ఏర్పడింది.


క్రీ.పూ. 1200 నుండి క్రీ. పూ. 600 వరకు సింధు నాగరికత స్థానం లో ఆర్యులు తెచ్చిన వేదిక్ ఏరా వచ్చింది. ఈ కాలం లో రాజులు , పురోహితులు,యజ్ఞయాగాదులు, క్రతువులు నిర్వహించిన ఫలితంగా వ్యవాసాయానికి పనికి వచ్చే పశువులను బలులు ఇచ్చినట్లు వాఋ రాసుకున్న వేదాల వలన తెలుస్తున్నది.


క్రీ.పూ 600 నుండి క్రీ. ష. 1 వ శతాబ్దం వరకు భారత దేశం లో జీవహింస కు వ్యతిరేకంగా బౌధ్ధ మతం ప్రజల జీవన విధానం అయింది. ఈ కాలం నుండే భారత దేశం లో బౌధ్ధ మత వ్యాప్తి కోసం మొట్టమొదటి సారిగా శాశ్వత నిర్మాణాలైన ఆరామాలు నిర్మించబడ్డాయి.


క్రీ. ష. 1 వ శతాబ్దం తర్వాత బౌధ్ధ మతావలంబుడైన అశోక చక్రవర్తి మునిమనుమడు బృహద్రతుణ్ణి అతని సర్వ సైన్యాధ్యక్షుడైన మెసపటోమియా నాగరికతకు చెందిన ఆర్య వంశజు రాలైన వనితా పుత్రుడైన పుష్యమిత్ర సంఘుడు సంహరించి హిందూ మతాన్ని స్టాపించినాడు.


క్రీ. పూ. 1200 శతాబ్దం లో యూరప్ ఖండం లో మైనో యాన్ , మైసినియాన్ నాగరికతలు వచ్చినాయి.


రాచరిక వ్యవస్తాలో పాలకుల వలన బాధలు పడిన సామాన్య ప్రజలు అనేక తిరుగుబాట్లు చేసి చనిపోయి తమ రక్తాన్ని ఎరులై పారించి నారు. ఈ క్రమం లో ఇంగ్లాండు లో ఒకటవ, రెండవ సివిల్ వార్స్ తర్వాత 1649 లో ఆలివర్ క్రామ్ వెల్ అను అతి సామాన్యుని నాయకత్వం లో ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ 1 ను చంపివేసి ఈ భూమి పైన మొట్టమొదటి సారిగా రాచరిక వ్యవస్తా స్తానమ్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్తా ఆవిర్భవించింది.


క్రీ పూ. 10500 లోని నియో లిథిక్ కాలం అంటే కొత్తరాతి యుగం  కాలం తర్వాత వచ్చిన సింధు నాగరికత అంటే క్రీ.పూ 3300 కాలం నుండి 1947 లేదా 1952 సార్వత్రిక ఎన్నికల దాకా అంటే 5250  సంవస్తారాల కాలం పాటు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ భారత దేశం లో రాచరిక పాలనయే నడిచింది. సింధు నాగరికత కాలం నాటికి ఈ దేశం లో కుల ప్రస్తావన లేకుండే అని. వైదిక కాలం లో కూడా లేకుండే అని ఒకరు, లేదు నారద  , పరాశర స్మృతుల కాలం లోనే శిక్షా స్మృతులల్లో శూద్రుల ప్రస్తావన ఉందని ఒకరు అంటున్నారు. కాకుంటే క్రీ. శ. ఒకటవ శతాబ్దం తర్వాత నుండి క్రీ. ష. 5 వ శతాబ్దం లోని గుప్తుల కాలం నాటి కైతే మను స్మృతి స్తిరపడి శూద్ర కుల వ్య్వస్త బలపడి ప్రతి క్లులానికి ఒక పని అప్పగించబడి ఆ కులం వాళ్ళు ఆ పని చేయవల్సిందే , చేయనంటే ధర్మం తప్పిన వారీగా కుల భ్రస్తులు గా శిక్షించ బడే శిక్షా స్మృతి ఏర్పడింది. సరే ఈ కుల వ్యవస్తా ద్వారా ఎంత అవస్తాలు అవమానాలు జరిగినాయో ఇక్కడ చర్చనీయ అంశం కాదు.


ప్రపంచ వ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని సంపద కూడబెట్టిన యూరప్ ఖండం లోని ఇంగ్లాండ్. జర్మనీ , ఫ్రాన్స్ , ఇటలీ. లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా  వనరులు కలిగియున్న దేశాలనుండి కొల్లగొట్టిన సంపదలను పారిశ్రామిక ఉత్పత్తులు గా మార్చి మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని 1760 నుండి -1820- 1840 దాకా పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం ఫలితంగా అధికమైన  ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ కావాల్సి వచ్చింది. ఆ మార్కెట్ ను పంచుకొనే క్రమం లో వచ్చిన తగాదాల ఫలితంగా 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుధ్ధం , 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుధ్ధాలు వచ్చినాయి.


సామాన్య ప్రజలనుండి పన్నుల రూపం లో జమచేసిన సంపద ఒకవైపు, ఆ సంపదతో పెంచిపోషించుకుంటున్న రిసర్వ్ సైనిక బలగాల బలం మరో వైపు సంతరించుకున్న సంపన్న రాజ్యాలు ప్రపంచదేశాలను తమ కాలనీలుగా మార్చుకొనే క్రమం ప్రారంభమైంది. అంటే సంపద్వంతమైన, సైనిక బలవంతమైన సామ్రాజ్యాలకు వలసరాజ్యాల అవసరం పడ్డది.అట్లా ప్రపంచదేశాలను తమ వలసలుగా మార్చుకున్న తర్వాత దోచుకున్న వనరులతో పరిశ్రమలు స్తాపించి వస్తూత్పత్తి చేయడానికి పెట్టుబడి అవసరమైంది. ఈ పెట్టుబడి ఇండస్ట్రియల్ క్యాప్టలిజం , అగ్రేరియన్ క్యాప్టలిజం, మార్కంటెలిజం . మోనోపాలి క్యాప్టలిజం. వెల్ఫేర్ క్యాప్టలిజం కార్పొరేటిజం, ఇలా దాని విశ్వరూపం విస్తరించుకున్నది. అయితే ఈ పెట్టుబడి  అనే భావన వెనుక ఉన్న పెద్దమనుషుల చరిత్ర చూద్దాం.


క్యాప్టలిజం యొక్క ఎథికల్ ప్రొఫెన్సి ఇలా ఉంది. జుడాయిజం అన్న మతం మూలాలనుండి క్రిస్టియానిటి , క్రిస్టియానిటీ లోనుండి క్యాతెలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఈ  రెండు గ్రూపుల నుండి రెండు చీలికలు, ఒకటి మాయా మంత్ర తంత్రాల విశ్వాసాలను తగ్గించే వర్గం ఒకటి , ఆర్థిక నీతి సూత్రాలను ఆచరిస్తామనే వర్గం ఒకటి. ఆర్హిక నీతి సూత్ర వాదుల నుండి స్పిరిట్ ఆఫ్ క్యాప్టలిజం వాదులు వస్తారు. వీరూ నిరంకుశుద్యోగ వర్గం కలిసి శ్రమ దోపిడి చేసిన ఫలితంగా  ఏర్పడ్డదే పెట్టుబడి. ఆ విధంగా బ్రిటిష్ వలస దోపిడి ప్రసాదించిన పెట్టుబడి ఇప్పుడు ఇక్కడి జాతీయవాదుల ఆరాధ్య దేవత అయి కూచున్నది. దాని ఫలితమే ఒక్క శాతం మంది దగ్గర ఎనభై శాతం సంపద పోగై ఉన్నది. ఈ సంపద అందరికీ సమానంగా పంచబడాలే అని మొట్టమొదటి సారి చెప్పినవాడు మార్క్స్. ఇట్లా అంటే అన్న వాళ్ళది విదేశీ జ్ఞానం అనో దేశ భక్తి లేని వాళ్ళు అనో నిందిస్తున్నారు.


భారత్ దేశం లో పురాణ పురుషుడు శ్రీ కృష్ణుడు ఒక తత్వవేత్త, ఈయన,  చేయించేది , చేసేది అంతా నేనే, నీవు నిమత్త మాతృడవ్, కర్మ చేయి ఫలితం ఆశించకూ. అంతా నేను చూసుకుంటా అని బోధించినట్లు పురాణాలు చెపుతున్నాయి. ఇక పురాణ కాలం తర్వాత మన దేశం లో చర్చ అంతా పునర్జన్మ , కర్మ సిద్ధాంతం, ఆత్మ,పరమాత్మ, ద్వైతం, కాదు కాదు, అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ రెండు కాదు ఒకటే , విశిస్తాద్వైతం, ఆది శంకరా చార్యులు, మద్వైతాచార్యులు, శైవం ,వీరశైవం, వైష్ణవం, భక్తి ఉద్యమాలు, ఇలా ఉపరితల అంశాల పైననే విపరీతమైన చర్చ జరిగింది. కానీ సమాజాలకు ఆధారమైన పునాది ఐన ఆర్థిక విధానాల పైన చర్చ జరుగలేదు. చానుక్యుని అర్థశాస్త్రం కూడా రాచరిక అర్థశాస్త్రమే అయింది కానీ ప్రజల ఆర్థిక సమస్యల పైన కౌటిల్యుని అర్థ శాస్త్రం మాట్లాడ లేదు.


క్రీ పూ. 469- 399 వరకు నివసించిన  గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ వాదించు,ప్రశ్నించు,నిరకుశత్వాన్ని నిలదీయుమని ప్రజలకు బోధించాడు. క్రీ.పూ. 428-348 వరకు నివసించిన ప్లాటో అధిభౌతిక వాదం గురించి ప్రపంచానికి వివరించాడు. ఈ పరంపరలో అరిస్టాటిల్. ఆదమ్ స్మిత్ , జీన్ పాల్ సార్టే, నికోలస్ మాక్వెల్లి , బెర్కెలే, లాంటి తత్వవేత్తలందరు ఉన్న ప్రపంచాన్ని , ప్రపంచం ఈ విధంగా ఉందని వారి వారి పద్దతులల్లో విశదీకరిస్తే , తలక్ళిందులగా ఉన్న ఈ ప్రపంచాన్ని , సరిగా మార్చడం ఎలాగో వివరించన వాడు మార్క్స్..

 

Tuesday, September 4, 2018

ఉపాద్యాయ దినోత్సవం !

                                               

తావి లేని పూవు ఎలాగో  ప్రజా ప్రాయోజితం లేని విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయ వృత్తి కూడా అలాగే ఉంది ఈనాడు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఆయాస్తానిక భౌగోళిక పరిస్తితులను బట్టి గుంపుకు, కుదురుకు, గణానికి ఒక భాషను ఏర్పాటుజేసుకొని , వారి వారి దైనందిన జీవితాల్లో వారి భావాలను వ్యక్తం జేసుకోవడానికి భాష ఉపయోగపడింది. వారి సామాజిక భద్రతకు, వారి సాంస్కృతిక జీవనవిధాన ఆచరణకు భాష ఉపయోగపడింది. మనిషి గుంపులు గా, గణాలుగా ఉన్న నాటికి ఆహార సంపాదన, శత్రుదాడి నుండి రక్షణయే ప్రధానంగా జరిగేది. గణ జీవన విధానం కంటే అంతకంటే పెద్దనైన  రాజ్య జీవన విధానం ఒకింత రక్షణగా ఉండగలదన్న విశ్వాసం తో ఆనాటి మానవులు రాజ్యాల నిర్మాణం కు ముందుకు వచ్చినారు. అందుకు సైనిక బలగం, యుధ్ధ విద్యల, బౌధ్ధిక విద్యల అవసరం ఏర్పడింది. అప్పటికే ప్రకృతి ధర్మాలపైనా ఒకింత అవగాహన కలిగి యున్న గణ పెద్దలు నదికి ఏటవాలుగా వెళ్ళితే వేట లభిస్తుందనీ, నీటి లభ్యత దొరుకుతుందని చెప్పడం , అది వారికి ఎలా తెలుస్తున్నదో అర్థం కానీ గణ సభ్యులు , అన్నపానీయాల రేవు తెలుపుతున్నారన్న కృతజ్ఞతతో వారిని గౌరవించడం వలన వారు అప్పటికే పూజారి వర్గంగా గుర్తింపబడియుంటారు .ఇది అన్నీ సమాజాలల్లో, అన్నీ నాగరికతలల్లో ఏక కాలం లో కాకపోయినా క్రమానుగతంగా జరిగి ఉంటాయి.
ప్జ్రపంచ వ్యాప్తంగా ఓడిన గణాలు , యుధ్ధం లో  గెలిచిన గనాలకో , రాజ్యాలకో దాసులు గా లేదా బానిసలుగా లొంగి బతుకవలసిన పరిస్తితులే. ప్రాణాలు కాపాడుకోవాలంటే మరో గత్యంతరం లేని పరిస్తితులు, అయితే భారత దేశం లో మాత్రం అప్పటికే ఇక్కడ సింధు నాగరికత, హరప్పో మహోంజొదారో నాగరికతలు వెళ్లివిరిసిన ఈ నెల పైకి యూరోషియా ప్రాంతం నుండి వచ్చిన ఆర్య తెగల తో జరిగిన యుధ్ధాలలో ఓడిపోయిన స్తానిక మూలవాసులను గెలిచిన ఆర్య తెగలు దాసులుగా చేసుకున్నారు. ఓడిన మూలవాసులను దశ్యులు, ద్రావిడులు అని కూడా అన్నట్లుగా చరిత్ర చెపుతున్నది. ఇప్పుడు కొందరు అదంతా తప్పు ఆర్యులు ఇక్కడి ములవాసులే అంటున్నారు. కానీ ఆర్యులు మూల వాసులే అయితే ఈ ద్రావిడులు లేదా దశ్యులు లేదా ఇప్పుడున్న శూద్రులు ఎవరంటే , గజం మిథ్య ఫలాయణం మిథ్య అంటున్నారు. ఈ వాదనజేసేవారి వద్ద జవాబు లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బానిస వ్యవస్తా ఏర్పడితే భారత దేశం లో మాత్రం బానిస వ్యవస్తాకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ శూద్రకుల వ్యవస్తను ఆనాటి విజేతలు సృస్టించారు.

చారిత్రిక ఆధారాలను బట్టి ఆది వేదం అయిన ఋగ్వేదం క్రీ. పూ. 15 వ శతాబ్దం కాలం అంటున్నారు. అప్పటి నుండి ప్రారంభమయిన వేద విద్యలు క్రీ. పూ. 5 శతాబ్దం లో బుద్ధుడు వచ్చి బౌద్ధ మతాన్ని వ్యాప్తి జేసె దాకా వేదాలు అపౌరుశేయాలు వాటిని మహిళలు, శూద్రులు ఉచ్చరించకూడదన్న బ్రాహ్మణవాదుల  విధానాలతో విద్య శూద్రులకు అందకుండా పోయింది. మళ్ళీ క్రీ. శ. ఒకటవ శతాబ్దం లో భారత దేశం నుండి బౌధ్ధాన్ని తరిమి వేసిన తర్వాత వేద కాలం కాస్త హైందవ మతంగా లేదా హైందవ ధర్మంగా మారి యాజ్ఞ వల్క స్మృతి మనుస్మృతి అనే కొత్త కోరలతో శూద్రులను అట్టడుగుకు అణగదొక్కి చదువు కాదుకదా కనీసం గౌరవంగా జీవించే పరిస్తితులు కూడా లేకుండా చేసింది హైందవ ధర్మం.

ఎప్పటిదాకా అంటే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఫ్రీ ఆండ్ కంపల్సరీ ఎదుకేషన్ అనేది మానవుల హక్కు అని 1870 లో చట్టం తెచ్చిన  నేపథ్యం లో 24 సెప్టెంబర్ 1873 లో సత్యశోధక సమాజ్ ఏర్పాటు జేసి శూద్రులు కూడా అందరూ చదువుకోవాలే అనే ఉద్యమం మహాత్మా జ్యోతి బా ఫూలే లేవనెత్తేదాకా శూద్రులందరికి విద్యా అందుబాటులో లేకుండేది అన్నవిషయం మరిచి పోకూడదు.(1835 లో మెకాలే ఎదుకేషన్ చట్టం వచ్చినా అది కొందరు అగ్రవర్ణాల వారికే పరిమితమైంది) . సావిత్రి బాయి ఫూలే కు జ్యోతి బా చదువు నేర్పించి మహిళలకు చదువులు చెప్పించే దాకా భారతదేశం లో శూద్ర జాతికి, మహిళలకు  విద్య అందుబాటులో లేకుండేది . ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలంటే మొట్టమొదటి బహుజనుల విద్యాప్రదాత సావిత్రిబాయి ఫూలే జన్మ దినం అయిన 3 జనవరి ఉపాధ్యాయ దినోత్సవం కావాలి. కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవం కావడం వెనుక ఏ భావజాల ప్రభావం , ప్రయోజనం ఉందో మనం అర్థం చేసుకోవాలి.

భారత దేశ స్వాతంత్ర సంగ్రామం గురించి చదివితే ఆనాడు డా: భీమ్ రావ్ అంబేడ్కర్ ఎవరి నుండి ఎవరికి స్వాతంత్రం కోసం సంగ్రామం జరుగుతున్నది? మా స్వాతంత్రం కోసం జరుగని పోరాటం కోసం మేమేందుకు పాల్గొని పోరాడాలి అని ప్రశ్నించినప్పుడు , ప్రాణాలర్పించేది, రక్తాన్ని ఎరులై పారించే తెగువ కలిగిన బహుజనులు లేకుండా బ్రిటిష్ వాళ్ళ పైన గెలువ జాలమని భావించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ రచనను తప్పని సరి పరిస్తితుల్లో ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమ చరిత్రలను ఔపోశనం బట్టిన అంబేడ్కర్ గారికి ఆ బాధ్యత అప్పగించి కూడా ఎన్ని అడ్డంకులు కల్పించారో అంబేడ్కర్ రచనలు చదివితే అర్థం అవుతాయి. ( అశేష దళిత బహుజనుల రక్తార్పణల పునాదుల పైన అంబేడ్కర్ రాజ్యాంగ ఫలితంగా చదువరులైన కొందరు దళిత బహుజన విద్యావేత్తలు తమ పూర్వీకులను చదువు సంపదలనుండి దూరం జెసి తమ వెనుకబాటు తనానికి అసలైన కారకులను వదిలేసి గత చరిత్రను అవమానాలను మరిచిపోయి వారినే తలకెత్తుకొని పూజిస్తున్నారు).  

డా: అంబేడ్కర్ , భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 27 A పొందుపరిచిన 6-14 సంవస్తారాల పిల్లలందరికి నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పిన ఫలితంగా రాజ్యాంగం అమలులోనికి వచ్చిన 26 జనవరి 1950 నుండే భారత దేశం లో దళిత బహుజనులందరికీ ఉచితంగా చదువుకొనే అవకాశం వచ్చింది. ఆ గొప్ప అవకాశాన్ని భారత ప్రభుత్వం ద్వారా తమకు ఉచితంగా అందించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతా పూర్వకంగా  ఆనాటి విద్యార్థి లోకం తరఫున ప్రభుత్వాలు ఉపాధ్యాయ దినోత్సవాలు జరిపించింది. అది ఇప్పుడు ఒక ఆనవాయితీ గా మారింది. ప్రభుత్వాల చిత్తశుధ్ధి లేని , బాధ్యత లేని పరిపాలనా విధానాలకు తోడు కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అంకిత భావం విడనాడి బిల్ అండ్ బెల్ సిధ్ద్ధాంతాన్ని తలకెక్కించుకున్న ఫలితంగా నేడు ప్రజలల్లో ప్రభుత్వ ఉచిత విద్యపట్ల విశ్వాసం లేకుండా పోయింది. భారత దేశం లో మొదటి నుండి ఉత్పత్తితో , ఆధునిక సాంకేతికతతో సంబందం లేకుండా సాంప్రదాయ వాద విద్యా విధానం అమలు లో ఉన్నప్పటికినీ సేవా రంగం లో కొంతకాలం దాకా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విద్యా సంస్కరణలను , కరికులం లో జరుగుతున్న ఆధునికతను గమనించ కుండా , అయితే విదేశీ విద్యను యథాతధంగా అమలు చేయడం,లేదా ఏకంగా ఇప్పుడైతే విదేశీ విశ్వవిద్యాలయాలనే ఆహ్వానించడం, ఇంకా కాదంటే క్రీ. పూ. 1500 ఏండ్లనాటి కాలం చెల్లిన విషయాలను అత్యంత ఆధునికాలని నూతన విద్యా విధానం పేరుతో ప్రజలకు ఎక్కించాలని పూనుకోవడం వలన ప్రభుత్వ ఉచిత విద్య ప్రజల్లో మరింత చులకనై పోతున్నది. ఇలాంటి పరిస్తితుల్లో తమకు ఉపాధిని ఇవ్వని , ఉద్యోగం ఇవ్వని సమాజం లో గౌరవం ఇవ్వని విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుల పట్ల కూడా విద్యార్థులకు తద్వారా విద్యార్థుల తలిదండ్రులకు గౌరవం లేకుకుండా పోతున్నది. ఇక ప్రైవేట్ ఉపాధ్యాయుల గౌరవ మర్యాదల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.

Saturday, August 4, 2018

తాటి ఈత నీరా శీతల పానీయం గా అభివృధ్ధి పర్చాలి!


తెలంగాణ రాష్ట్రం లో మేము గీతా వృత్తిచేసే సామాజిక వర్గానికి ప్రతినిధులం అని స్వయం ప్రకటిత పెద్దమనుషులు ఇద్దరీలో ఒకరు , ఇక నుండి యువకులు ఎవ్వరూ కూడా గీతా వృత్తిని చేయకుండి అని ఫత్వా జారీ చేశారు. చేయరు సరే, మరి ఆ సామాహిక వర్గానికి చెందిన విద్యాధికులైన వేలాధి యువకులకు వారి సర్కారు లో ఏమైనా ఉద్యోగావకాశాలు కల్పిస్తారా? అలా కాకుంటే వాళ్ళు ఎలా బతుకాలి మరి ? యువతకు వాళ్ళ వాళ్ళ అర్హతమేరకు ఉద్యోగ ఉపాధి చూపించే తాహతు లేదూ, వాడు చేసుకునే పని వాణ్ని చేసుకొనివ్వకుండా ఉచిత సలహా ఇస్తారు. చేసుకొనివ్వరు, ఎలా బతకాలి వాళ్ళంతా ఒక్కడు చెప్పడు.
ఇక మరో పెద్దమనిషేమో సమాజం లో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు జరుగుతున్నై ఓ టాస్క్ పోర్స్ అధికారులారా మీరు వాల్ల వెంటపడండి , చిన్న చిన్న తప్పిదాలు చేస్తున్న కల్తీ కల్లు కారకులను వదిలేయండి అని ఉచిత సలహా ఇస్తాడు, ఆయన ఒక చట్ట సభకు అధినేత. అటువంటి స్తానమ్ లో ఉండి అలా మాట్లాడ వచ్చా?
నిజంగానే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సేవ చేయాలని అనుకుంటే వాళ్ళు మాట్లాడ దానికి ఇంతకంటే అక్కరకు వచ్చే మంచి విషయాలు లేనే లేవా? ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే ఎవరిదో దిస్టీ తగిలి గీతా వృత్తి ఇవాళ ఆ వృత్తిదారులకు అన్నం పెట్టలేని నిర్భాగ్యురాలు అయిందట.ఎంత మాయకత్వం నటిస్తున్నారు? కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని మల్టీ నేషనల్ బ్రెవెరీస్ కంపనీలకు లైసెన్సులు ఇచ్చి పల్లెలకు మద్యం మంచినీళ్ళకంటే సులభంగా అందుబాటులో ఉంచి అది త్రాగడం నాగరికత అని బాకాలు ఊదీ, రాజకీయనాయకులే బ్రాందీ బీరు షాపుల గుత్తేదార్ల అవతారం ఎత్తి పల్లె పల్లె కు వాడ వాడ కు బెల్ట్ షాపులు తెరిచి, మహిళా సంఘాల వాళ్ళు మా సంసారాలు కూలి పోతున్నాయి మద్యం వద్దన్నా కూడా పోలీస్ బలగాల పహరాలో బ్రాందీ బీరు షాపులు వర్ధిల్లుతున్నది తెలియనంతటి అమాయకత్వ నటనను ఎవరు నమ్ముతారనుకుంటారో వాళ్ళకే తెలియాలి.
అయితే నిజంగానే వాళ్ళకు ఏమీ తెలియక అలా మాట్లాడినారనుకుంటున్నారా? హరికీస్ కాదు. వాళ్ళకు అన్నీ తెలుసు. కానీ గొర్రెలను నమ్మించాలి కదా ? . మూల విరాట్టుకు బలి యివ్వాలాయే మరి. అందుకని చెవులల్ల నీళ్ళు పోసి తలవూపించి , జడుత ఇచ్చిందని ప్రకటించుకొని తలుకాయ కోసుకునుడు , కింది మెట్టునుండి పై మెట్టుకు ఎగబాకడానికి రూపాంతరం చెందే క్రమం లో ఉన్న కుల రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
పెట్టుబడి రాకాసి అన్నివృత్తులను దిగమింగి వాళ్ళ చేతులు విరుస్తున్నది. సంక్షేమ రాజ్యానికి పాలకులం అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు కనీసం వాళ్ళ ఉనికి కోసం అయినా చేతివృత్తుల వారికి మేలు చేస్తున్నాము అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
బ్రాందీ, విస్కీలు ఇప్పటికే ప్రకృతి సహజసిద్దమైన, అవుషధీయుక్తమైన కల్లును దెబ్బకొట్టినాయీ. దానికి తోడు గీతి వృత్తిని భ్రస్టు పట్టించే ఆ సామాజిక వర్గానికే చెందిన నయాపెట్టుబడి దార్లు కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడుతూ మొత్తం గీతా వృత్తినే మెడ నరుకే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు.
గీతా కార్మికులకు ఇక మిగిలిందల్లా నీరా ఒక్కటే. కనీసం మల్టీనేషనల్ కంపనీల కూల్ డ్రింక్స్ ను అయినా అరికట్టి ,వాటి స్తానమ్ లో నీరాను సాఫ్ట్ డ్రింక్ గా అభివృధ్ధి పరిచి ఒక చెరుకు రసం లా, ఒక కొబ్బరి నీళ్ళ వలె, ఒక ఫ్రూట్ జ్యూస్ వలె స్వేచ్చా మార్కెట్ లో ఎలాంటి లైసెన్సుల గొడవ లేకుండా అమ్ముకొనే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే గీతకార్మికులకు ఉపాధి దొరుకుతుంది అలాగే ప్రజలకు ప్రకృతి సహజసిద్ధమైన కల్తీ లేని మినరల్స్, విటామీన్స్ కలిసిన శీతల పానీయం దొరుకుతుంది.
రాజకీయ నాయకులు దీనికోసం ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ పస లేని పిస మాటలు మాట్లాడితే జనం లో చులకన అవుతారు.

Thursday, December 21, 2017

మనుసుల మాట 19 .

                                           

ఇప్పటికీ సరిగ్గా 16 సంవస్తారాల క్రితం అది , ఇదే డిసెంబర్ 2001 ల నేను మలహార్ మండలం లో ఏం ఈ వో గా పనిజేస్తున్నాను.  చంద్రబాబు సర్కారుల పోలీస్ అధికారం అప్రతిహతంగా  అగ్గై మండుతున్న కాలం.  కొయ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రె పల్లె అనే చిన్నపల్లెటూరు. ఆ పల్లెటూరుకు చెందిన కొందరు యువకులు విప్లవాల బాట వీడి ప్రభుత్వానికి లొంగి పోయారు. మీ చిరకాల కోర్కె ఏదైనా ఉంటే చెప్పండి అన్నారట అప్పటి పోలీస్ ఎస్ పి,  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే వాళ్ళు అప్పుడు, చిన్నప్పుడు  మేము చదువు కోవడానికి మా ఊరిలో బడి లేనందున మేము సమీపాన ఉన్న గంగారం పోవాల్సి వఃచ్చేది, అంత దూరం పోలేక మేము బడికి బందు అయితే అప్పుడు గంగారం లో పనిజేస్తున్న రాజయ్య సార్ రాత్రి పూట వచ్చి మాకు చదువు చెప్పేది. మా ఊర్లో బడి ఉండి ఉంటే మేము కూడా బాగా చదువుకొనే వాళ్ళం , ఉద్యమం లోకి పోకపొయ్యేవాళ్లం అని వాళ్ళు అన్నారట. ఇప్పటికీ మా ఊరిలో బడి లేదు కనుక మా ఊరికి బడి కావాలని అన్నారట.

ఇంకేంది రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా,  ఎం ఈ వో ఐన నాకు ఓ లెటర్ వచ్చింది. గొర్రె పల్లేకు బడి కావాలే అని. ఐతే అప్పటి రూల్స్ ప్రకారం ప్రతి ఆవాసానికి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలనే నిబంధన మేరకు ఒక టీచర్ ను అప్పటికే  మంజురి ఇచ్చారు. కానీ అక్కడ బడి బంగ్లా అప్పటికి మంజూరీ కానందున పిల్లల అవసరం రీత్యా వల్లెమ్కుంట లో ఆ టీచర్ పనిజేస్తున్నాడని,  గొర్రెపల్లే ఆవాసం పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారని నివేదిక ఇచ్చాను. ఇంకేంది ఎస్ పి సాబ్ ఆదేశాల మేరకు అక్కడ బడి పేరుతో ఒక రేకుల షెడ్ వెలిసింది. దాని కి గొర్రెపల్లే ప్రభుత్వ పాఠశాల అన్న  నేమ్ బోర్డ్ తగిలించారు.

దానికి ఒక శుభ ముహూర్తాన ప్రారంభోత్సవ కార్యకారమాన్ని తలపెట్టారు. చుట్టుపక్కల  ప్రతిగ్రామం నుండి ప్రజలను తరలించాలని ,  సర్పంచులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు  పోలీస్ హుకుం వెళ్లింది .వందలాది గా ప్రజలు తరలించబడ్డారు. రేకుల షెడ్ బడి కట్టినదానికంటే నిర్వాహణ ఖర్చు కొన్ని రెట్లు ఎక్కువైందని అక్కడ గోనుక్కోవడం విన్నాను. వచ్చిన సామాన్య ప్రజలకు పులిహోర పోట్లాలు, నీళ్ళ పాకెట్ లు పంచారు. వి ఐ పి లకు మాత్రం కోడి పలావు దావత్ దక్కిందనుకో అది వేరే విషయం.

ప్రభుత్వానికి లొంగిపోయిన ఆ యువకులు వేదికనుండి మాట్లాడుతూ తాము ఎందుకు లొంగి పోవాల్సి వచ్చిందో చెబుతున్న క్రమం లో అన్నలు అడివిలో ఉంటూ ప్రభుత్వ అభివృధ్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నందున మా ప్రాంతం అభివృద్ధి ఆగిపోతున్నదనీ, మాకు రోడ్లు లేనందున మా ప్రాంత ప్రజలు దవఖానాలకు పోలేక పోతున్నారని  ఆ బాధలు చూడలేక, ప్రభుత్వ అభివృధ్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై మేము అడివిబాట వదిలినమ్. అడివిల ఉన్నోళ్ళు ఎంత తొందరగా ఆ బాట విడిచి వస్తే అంతా తొందరగా అభివృధ్ధి జరుగుతదీ అని మాట్లాడిండ్రు. నిర్వాహకులు , ఆహ్వానితులు , ఆ ముచ్చట్లు వాళ్లతోని చెప్పించినోళ్ళు అందరూ చప్పట్లు గొట్టిండ్రు.

ఆనాటి ఈ ముచ్చట ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత నాకు ఎందుకు యాదికచ్చిందంటే , ఇప్పుడే టి వి లో ఒక వార్త వచ్చింది , హైద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో మరో 20 అధునాతన డయాలసిస్ కేంద్రాలను సర్కారు నెలకొల్పిందని. వెంటనే నాకు పాపం ఆ లొంగిపోయిన అమాయకుల ఆవేదన యాదికి వచ్చింది. దవాఖానకు పోయేతందుకు రోడ్లు వచ్చినై , . వైద్యం చేసేతందూకు అధునాతనమైన చికిత్స పద్దతులు వచ్చినై. ఆ నాటికి కిడ్నీల ఫెల్యూర్ అనే మాటే  తెలువని సర్కార్ కామ్రేడ్ లకు అభివృధ్ధి పేరుతో  కిడ్నీల వ్యాధులకు డయాలసిస్ కేంద్రాలు వచ్చినై. రానిదల్లా , లేనిదల్లా అందరికీ అంత్యంత ఆవశ్యకమైన ఆరోగ్యం.  మరి అది ఎందుకు లేకుండా పోయిందంటే? అభివృధ్ధి వచ్చింది కదా? వనరుల విధ్వంసం విజృంభిస్తున్నది,  కాలుష్యం పెరిగి పోయింది , ప్రకృతి అంతరించి పోతున్నది. వాటికి కారకులైన .  కోటీశ్వరుల సంఖ్య దేశం లో పెరుగుతున్నది . . దరిద్రుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో రెట్టింపు అయి రోగుల సంఖ్య కూడా అలివిగాని రీతిలో పెరుగిపోతున్నది.  . అందుకని ప్రాణాంతక వ్యాధుల ఉపశమనానికి దవఖానాలు కూడా అదే నిష్పత్తిలో వస్తున్నాయి. దవఖానాల పెట్టుబడి దార్లకు, కాసుల వర్షాన్ని కురిపిస్తున్నై.  కానీ రానిదల్లా, లేనిదల్లా ,  సామాన్య ప్రజలకు ఆహార భద్రత,  ఆరోగ్య భద్రత, తో బాటుగా రాజ్యాంగ బద్ద హక్కైన ఆరోగ్యంగా ఆనందంగా జీవించే హక్కు.

Tuesday, November 28, 2017

మనుసుల మాట 18.

                                                 


ఈ రోజు ఉదయం  నుండి హైద్రాబాద్ లో ఒక వైపు మెట్రో రైల్ ప్రారంభోస్తవం మరోవైపు ఇవాంక నాయకత్వం లో  ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ను టి వి లో చూస్తూ మెదడు వేడెక్కింది. ఏదైనా ఒక మంచి పాట విని  మనుసును ప్రశాంత పర్చుకుందామని యు ట్యూబ్ ను  ఓపెన్ చేసిన. లతా మంగేష్కర్ పాడిన "యే మేరే వతన్ కీ లోగో " పాట ఎంతో హృద్యంగా అంతకంటే ఎక్కువ గంభీరంగా దేశ సరిహద్దుల్లో దేశ ప్రజల స్వేచ్చా స్వాతంత్రాల రక్షణ  కొరకు తమ ప్రాణాలను అరిస్తున్న అమర జవాన్ ల  కుర్బాణీ ని కీర్తిస్తున్నపాట వింటుంటే నిజంగానే షహిదొంకా యాద్ సే అంఖోమే ఆంసూ ఆయా.

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ

తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దీన్ హై హమ్ సబ్కా "
కింది రెండు లైన్లు ఇవ్వాళ చాలా మందే అన్నారు. ఈ రోజు చాలా శుభదినం అనే అన్నారు అందరూ. ఒకటి కాదు రెండు కాదు 180 దేశాల వ్యాపార ప్రతినిధులు భారత దేశం లో  పెట్టుబడులు పెట్టడానికి వచ్చిండ్రు . . వారికి ఫలకు నామా ప్యాలస్ లో నీతి ఆయోగ్ ద్వారా భారత ప్రజల కస్టార్జిత సొమ్ము తోటి  ఒక్కొక్క భోజనానికి 18000 రూపాయల పెట్టి భోజనాలు కూడా పెట్టిచ్చిండ్రు . . వాళ్ళకు మంచిగా తినవెడితే తాగవెడితే వాళ్ళు ఖుషీ అయి చాలా ఉద్యోగాలు కల్పిస్తారని ప్రజల సొమ్ము దండిగానే ఖర్చు చేసి చాలా ఆశలే కల్పిస్తున్నరు అందరు.  ఉద్యోగాలు వస్తే మంచిదే కానీ గత చరిత్ర అనుభవాలు అందుకు భిన్నంగా ఉన్నయి మరి.

1964-65 లో నేను మంథని హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అమెరికా నుండి ఇద్దరు వ్యవసాయ శాస్త్ర వేత్తలు వచ్చిండ్రు. వాళ్ళు ఇక్కడ మనకు కొత్త కొత్త విత్తనాలు ఇచ్చి ఇక్కడి మన వ్యవసాయాన్ని అభివృధ్ధి చేస్తామని వచ్చిండ్రు అన్నరు , కానీ తీరా వాళ్ళు వెళ్ళు పోయిన తర్వాత తెలిసింది వాళ్ళు మన విత్తనాల జీన్స్ ను ఎత్తుకెళ్లి పోయిండ్రని.

మోన్సాంటో కంపనీ అట్లనే బి టి విత్తనాలను ప్రవేశ పెట్టినప్పుడు కూడా ఇక పంట కు ఢోకా ఉండదు రైతుల ఇండ్లు బంగారు గోడలతోటే కట్టుకుంటరు అని ప్రచారం చేసిండ్రు. కానీ మనం ఇక్కడ రోజూ చూస్తున్నం  రైతుల  మరణాల వార్త లేని రోజు ఉంటలేదు.

చంద్రబాబు హయాం లో జినోమ్ వ్యాలీ తోటి ఇంక ఇక్కడ ఔషధాలు కారు చౌకగా లభిస్తాయని అన్నరు. కానీ తీరా ఇక్కడి భూములు పోయినై, ఉన్న భూములల్లో కూడా భూగర్భ జలాలు కలుషితమై కాలకూట విషపు నీళ్ళ నే తాగునీటికి సాగు నీటికి వాడుకొనవలసిన పరిస్తితులు వచ్చినై.

పరాయి దేశం నుండి వస్తున్న వాళ్ళకు కారు చౌకగా భూములు, నీళ్ళు( ఈ నీళ్ళను వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రజలను అప్పులల్లో ముంచుతున్నరని  ప్రతి పక్షపొల్లు ఇప్పటికే ఆడిపోసుకుంటున్నరు), కరెంటు ఉచితంగా ఇచ్చుకుంట వాళ్ళు విసిరేసే చిన్నా చితకా ఉద్యోగాలను మహాప్రసాదంగా భావిస్తున్న పరిస్తితి. కానీ ఆ భూములకే వీళ్ళకు ఇచ్చినట్లే నీళ్ళు కరెంటు, ఎరువులు, విత్తనాలు ,  ఇస్తే మన రైతులే , వీళ్ళు వెదజీమ్మే కాలుష్యం లేకుండా కాలుష్య రహితంగా ఎందరికో ఉపాధి కల్పించే అవకాశం మన వ్యవసాయం లోనే ఉన్న పరిస్తితిని పాలకులు మరిచి పోతున్నరు.

ఆనాడు ఇక్కడి వనరులు దోచుకొనే పోతున్నరని  300 యేండ్లు కోట్లాడి ఒక్క ఆంగేయులను వెళ్లగొట్టగలిగినం . అదీ ఇప్పుడు , ఒక్కరు  కాదు ఇద్దరు కాదు 180 దేశాల వాళ్ళను రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాం . దానికి ,

" తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దిన్ హై హమారా  

అంటున్నం. కానీ ,

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ  "

అనే పరిస్తితి రాకుండా జాగ్రత్త పడినమా అనేది నా లాంటి సామాన్యుని ప్రశ్న.

.

Monday, November 20, 2017

ఇంటిమీద ఎవుసమ్ 1 .

ఎవుసమ్
ఈ రోజు మిద్దె తోట ల వంకాయ మొక్కలను నాటినం . మిత్రులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు తోట చూడడానికి వచ్చి తాను రాసిన ఇంటి పంట పుస్తకం ఇచ్చిండు.
తోట పెట్టినవ్ సరే ! రేపు రేపు కాయలు గూడా కాస్తాయి గావచ్చు. కానీ నీ తీరుగా ఇంకా పది మంది తోట పెంచాలంటే వారికి స్పూర్తి ఇచ్చే విధంగా నీ అనుభవాలను పది మందికి
పంచి, నీవు ఎందుకు తోటను పెంచాలనే నిర్ణయం తీసుకున్నావో రాయాలని కోరిండు . భూమి నుండి బువ్వదీసే అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు గా , మట్టి పిసికి మట్టి బుక్కిన
మనుషుల సాహ చర్యమ్ కలిగిన కారణాల దృస్ట్యాను , అలాగే కొంత కాలం ఆ పని నుండి దూరమై తిరిగి భూమిపైన కాలూన డానికీ కారణం వివరిస్తూ రాస్తే అది ప్రకృతికి మేలు
జేయడమాత్రమే గాకుండా భూమి తల్లిని కాపాడిన వాళ్ళం కూడా అవుతామని కథా రచయితవు కూడా కనుక నీవు రాయాలని అడిగిండు. అట్లా మొదలయింది ఈ ఎవుసమ్ కథ .
ఇప్పటికీ అరువై ఏండ్ల కిందటి ముచ్చట. అంటే 1 9 5 7 జూన్ మాసం అది. మా ఇంట్ల శిలుకావు అని ఒక ఆవు ఉండేది. డానికీ ఒక కోడె లేగ ఉండేది. దాని పేరు కూడా శిలుకే.
అది పుట్టినప్పుడు మా నాయిన దాని ఊపురానికి తువ్వాల జుట్టి నోటి తోటి పైకి లేపిండట అందుకని అది నడుస్తున్నప్పుడల్లా దాని ఊపురం ఒయ్యారంగా అటుయిటూ ఊగుతుండేది .
ఆ శిలుక కోడె లేగ అన్నా దాని ఊపురంఅటూ ఇటూ ఊగుతుంటే దాని ఉరుకుడు అన్నా నాకు బాగా ఇస్టం ఉండేది.
పాల కోసం ఒక బర్రె ఉండేది. దాని పేరు పాపలి బర్రె. డానికీ ఒక పెయ్య దుడ్డే ఉండేది . ఆ రెండీటీ తో ఆడుకునుడంటే నాకు చాలా ఇస్టమ్ . నేను ఎటుబోతే అవ్వి నా వెంటనే
తిరిగేటియి . ఆటితోటి ఆడుకోవడం ..మా అవ్వ బెట్టే బువ్వ దీనుడు,నా లోకంగా ఉండేది. మాపటీలి పాలకుండ కడుగంగా అవ్వ గీకి పెట్టిన పాలగోకుడు దీనుడు ఇస్టమ్
అసోంటిది మా నాయిన నన్ను బడికి తీసుకొని పోయిండు . ఒక కట్టె పలుక, దాని మీద దిద్దే తందుకు బలుపమ్ ఇచ్చి బల్లే కూసున్ద బెట్టి తన పనికి తను పోయిండు.
నా మనుసంత మాపటీలి అవ్వ గీకి పెట్టె పాలగోకుడు మీద , కొల్లాగ , పెయ్య దుడ్డే మీద.
నరహరి సార్ ఆ ,ఆ లు పెట్టిచ్చిండు పలుక మీద . ఆ, ఆ అనుకుంట దిద్దుమన్నడు .
రెండు మూడు సార్లు దిద్దిన గావచ్చు. నాకు తెలువకుంటనే నా ఇద్దరు దోస్తులు ఎప్పుడో నా మనుసులకు వచ్చి చేరిండ్రు.
ఇగ నా లోకం ల నేను ఉన్న.
ఈపుల సర్రు మని ఒక సరుపు వడ్డది .
అన్నన్న నీయవ్వ ! అనుకుంట ఎనుకకు దిరిగిన .
. చెంప మీద చెళ్లుమని మల్లోటి వడ్డది .
ఏమన్నవురా ? సారు గద్దరాయించిండు .
లాగు దడిసింది . ఏమనలేదు సారు. లాగుడదిసింది అన్న.
చల్ , బేవకూఫ్ , ఇంటికివోయ్యి ఇంకో లాగు దొడుక్కొని రాపో అన్నడు.
కట్టె పలుక భుజమ్మీద పెట్టుకున్న, నీ బడి పీసునా వారేద్దు , ఇంకా నీ బడికి అత్తనా కొడుక అని మనుసుల అనుకుంట ఇంటి దారి వట్టిన .
గలుమ కాడికి వచ్చిన్నో లేదో ఎక్కడికి వోయినవ్ అన్నట్టుగా ఒర్రుకుంట ఉర్కచ్చినయి రెండూ.
ఆ రెండీటీని వట్టుకొని ఎవ్వలకు దొరుక కుంట. జల్లుకచ్చిన మక్కతోట ల జొచ్చిన.
పచ్చటి మక్కతోట , కమ్మటి వాసన. మేము ముగ్గురం అటూ మెసులు తుంటే మక్కా కర్రలకు ఒరుసుకుంటున్నం. మక్క జల్లు కొసలనుంచి పుప్పొడి కుంకుమ తీరుగా
మామీద పడుతుంటే ఇగ దాంట్ల నుంచి బైటికి రా బుద్ది గాలేదు.
నిన్న గట్టిన మోట నీళ్ళకు భూమి మెత్తగ తడిసి ఉన్నది. కుంకుమ తీరుగ మీదబడ్డ పుప్పొడి తోటి కలగలిసి కమ్మటి వాసన .
మన్ను పిస్కు కుంట ఎడ్లను జేసుకుంట, ఎట్లున్నయి ?మీ తీరుగ ఉన్నయా? అని వాటికి జుపుకుంట ఎంతన్న సేపు అట్లనే ఆడుకుంట ఉన్న.
మాపటీలి బర్లచ్చే యేళ్ల అయ్యింది గావచ్చు దుడ్డెబొక్కు ఒర్రుడు షురూ జేసింది.
నాకు గూడ పాలగోకు కుతి లేసుడు మొదలైంది.
నాయిన ఏనంగా జూసిండో . ముసిముసి నవ్వు నవ్వుకుంట అడుగుల అడుగులేసుకుంటా కాలు సప్పుడు గాకుంట మాదగ్గెరికి వచ్చిన సంగతి ఆటలాడుకుంటున్న మేము
గమనించనే లేదు.
నెత్తి మీది బూరు అందుకోని ఆవుదు కాడికి దీసుక పొయ్యి చేతులకంటిన బురుద కడిగి అవ్వకు అప్పజెప్పిండు .
అట్లా మొదలైంది నా ఎడ్లు, ఎవుసమ్ , భూమి సంబంధం కథ.

Thursday, November 16, 2017

గీతా కార్మికుల వెలుగు దివ్వే దేశిని చిన మల్లయ్య.!

                                 

( 20 నవంబర్ 2017 సోమవారం నాడు కరీంనగర్ లో కా: దేశిని చినమల్లయ్య సంస్మరణ సభ సందర్భంగా )

ఒక సామాన్య గీతా కార్మికుడై ఉండీ, కేవలం ఐదవ తరగతి చదువుతోనే  22 సంవస్తరాలు బొమ్మన పెళ్లి గ్రామ సర్పంచ్ గా, 20 సంవస్తరాలు ఇందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా , అదీ ఒక ప్రతిపక్ష పార్టీ అయిన సి పి ఐ నుండి గెలుపొందడం అతని అసామాన్య రాజకీయ చతురతకు , ప్రజా పక్షపాత వ్యక్తిత్వానికి నిదర్శనం.

దేశిని చినమల్లయ్య యుక్తవయస్సు వచ్చేనాటికి పోరాటాల పురిటి గడ్డ హుస్నా బాద్ ప్రాంతం లోని అతని స్వగ్రామం అయిన బొమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న మహ్మదా పూర్ గుట్టల శ్రేణుల్లో  కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కార్యక్రమాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నై. సహజంగానే తాటి చెట్లు ఎక్కడానికి రెక్కలు తప్ప మరో ఆధారం లేని దేశిని , కమ్యూనిస్ట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడు అయినాడు.  .స్తానికునిగా , గీతకార్మినికునిగా మహ్మదా పూర్ గుట్టల శ్రేణి ఆయనకు కొట్టిన పిండి కనుక ,  సాయుధ రైతాంగ గెరిల్లా వీరులకు అన్నపానాదుల కల్పనలో , డెన్ ల నిర్వహణలో , వార్తాహరునిగా  చురుకైన పాత్ర పోషించాడు. తన కనుల ముందే కాకలు తీరిన వీర యోధులు ఒరిగిపోయి , తాను కలల్లుగన్న సమ సమాజ స్వప్నం కూలిపోగా రెక్కలు తెగిన పక్షిలా తిరిగి తన గీతా వృత్తి వైపు రాక తప్పలేదు.

సాయుధ పోరు విరమించిన సి పి ఐ పార్టీ 1952 లో ఎన్నికల బరిలో దిగింది. 1959 లో ఆంధ్రప్రదేశ్ లో పంచాయత్ రాజ్ చట్టం అమలైంది. తదనంతరం  నిజాయితీకి , నిస్వార్థానికి మారుపేరైన దేశిని మల్లయ్యను ప్రజలు బొమ్మనపెళ్లి గ్రామ సర్పంచగా ఎన్నుకున్నారు.  ఆనాటి నుండి 22 సంవస్తరాలు అప్రతిహతంగా సర్పంచ్ గా గ్రామ ప్రజల ఆదరాభిమానాల మేరకు పనిజేశాడు. 1976-77 లో హుస్నాబాద్ సమితి ప్రసిడెంట్ రాంభూపాల్ రెడ్డి , పదవీచ్యుతుడు అయినందున వైస్ ప్రసిడెంట్ గా ఉన్న మల్లయ్య సమితి ప్రసిడెంట్ అయినాడు. ఎమర్జెన్సీ తర్వాత 1978 లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ఇందుర్తి నియోజక వర్గం నుండి ఎమ్మెల్లే గా ఎన్నిక కావడం సామాన్య విషయం కాదు. జాతీయ పార్టీ కాంగ్రెస్, జనతా పార్టే అభ్యర్థులు సంపన్నులు మరియు అగ్రవర్ణాలకు చెందిన వారు అయినప్పటికినీ సి పి ఐ  పార్టీ నుండి  ప్రజల మనిషిగా ఒక సామాన్య గీతా కార్మికుడు తాడి చెట్లు ఎక్కుకుంటూనే ప్రచారం చేసుకొని వచ్చి గెలిచి రావడం ఒక అబ్భురమే ఆనాటికీ ఈనాటికీ.  1985, 1989, 1994 వరుసగా మూడు సార్లు ఇందుర్తి నియోజక వర్గం నుండి వైరి వర్గం ఎంతో బలమైన రాజకీయ ఆర్థిక పునాది కలిగినది అయినప్పటికినీ  ప్రజల మద్దతుతో గెలుపొందాడు. తన నియోజక వర్గ ప్రజలకోసం ఎంతదూరమైనా అలసట లేకుండా బస్సులో, కాలి  నడకన వచ్చి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేవాడు. ప్రస్తుత రాజకీయ అవినీతి ఆడంబరాలకు ఆయన ఆమడ దూరం లో ఉండేవాడు. 1999 లో సి పి ఐ కుల రాజకీయ చదరంగం లో దేశీనికి ఇందుర్తి నుండి టికెట్ ఇవ్వలేదు. పైగా ప్రారంభం లో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని అది సమర్థించలేదు ,  కనుక అనివార్యంగా సి పి ఐ ని విడిచి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం లోకి  ఉరికినాడు. మొన్న 11 నవంబర్ నాడు తన అంతిమ శ్వాశ విడిచేదాక పీడిత ప్రజానీకం గురించే తపించిన నిస్వార్థ జీవి.

1964 ఆగస్టు లో  ఏపీ కోఆపరేటివ్ ఆక్ట్ వచ్చేదాకా తెలంగాణ లో  దొరలు , భూస్వాములు ప్రభుత్వం వద్ద కలాల్ మాములాను హర్రాజ్ పాడుకొని వచ్చి గ్రామాలల్లోని గీతకార్మికులనుండి  మునాఫా తీసుకొని చెట్లు గీయనిచ్చేవాళ్లు. దొరలు , భూస్వాములు అడిగినంత మునాఫా వెల్లదు , ఇవ్వలేమని వేడుకున్నా గూడా చెట్లను స్తానికులకు ఇవ్వకుండా  వేధించేవాళ్లు. వాస్తవానికి తెలంగాణ గీతకార్మికులకు నైజాం పాలన ప్రత్యక్ష పీడనకంటేగూడా స్తానిక దొరల, భూస్వాముల గడీల పీడనే అధికంగా ఉండేది.  

"మా భూమి"  సినిమా లో "దొరా ! మీరుకొట్టిన దెబ్బలకు గౌండ్ల నారిగాడు సచ్చిపోయిండు . " అంటాడు జీతగాడు.
" గడీ గోడ అవుతల బొంద వెట్టుండ్రి " అంటడు దొర. అటువంటి పరిస్తితిలో దేశిన చిన మల్లయ్య, ధర్మ భిక్షాం గారల నేతృత్వం లో ఖమ్మం జిల్లా గార్ల లో గీతా కార్మికులతో పెద్ద మీటింగ్ జరిపి "కల్లు  గీతా కార్మిక సంఘం " ఏర్పాటుజేసి , హర్రాజ్ విధానం రద్దు జెసి కలాల్ మాములాలను కల్లు గీతా కార్మిక సంఘాలకు అప్పగించాలని ఉద్యమించడం జరిగింది.  దేశిని చినమల్లయ్య, ధర్మ భిక్షం గారల నాయకత్వం  మరియు గీతా కార్మికుల సంఘటిత శక్తి కి దిగివచ్చిన ప్రభుత్వం అప్పటినుండి గీసే వాళ్ళకే చెట్లు అన్న హక్కును కలుగ జేసి హర్రాజ్ విధానానికి స్వస్తి పలికింది .

మారిన కాలానికి అనుగుణంగా చెట్లు ఎక్కే సాధనాలు ఆధునీకరించబడని కారంగా గీస్తున్న చెట్ల పైనుండి గీతకార్మికులు పడి చనిపోతుంటే వారికి ప్రభుత్వం నస్టపరిహారమ్ ఇవ్వాలని అసెంబ్లీ లో పోరాడిన ఫలితంగా 5000 రూపాయలతో ప్రారంభమైన ఎక్స్ గ్రేషియా ఇప్పుడు 5 లక్షలకు చేరడానికి ఆద్యుడు దేశిని చినమల్లయ్య.

ప్రభుత్వాలకు ఆనాటి నుండి నేటి వరకు  కల్లు గీతా వృత్తి ఒక ఆదాయ వనరు. వాస్తవానికి వృత్తులన్నీ అడుగంటి పోయి బతుకు దెరువే గగణమై పోతున్న పరిస్తితి లో ఇంకా కల్లు వృత్తి దారులనుండి పన్ను వసూలు చేయడం దారుణం. అలాగే మినరల్సు, విటమినులు పుష్కలంగా కలిగి ఉన్న నీరా ను నిర్ణీబంధంగా స్వేచ్చ మార్కెట్ లో విక్రయానికి అవకాశం ఇచ్చి గీతా కార్మికుల వృత్తిని బలోపేతం చేయాలని ఉద్యమించే శక్తి యుక్తులు కలిగిన మరో దేశిని చినమల్లయ్య లాంటి యువ నాయకత్వం కోసం  గీతా కార్మిక సమాజం ఎదురు చూస్తున్న క్రమం లో,  ఉన్న వయోవృధ్ధ పెద్ద దిక్కు దేశిని చిన మల్లయ్యను , కోల్పోవడం  గీతా కార్మిక లోకానికి తీరని లోటు.