Showing posts with label kondri. Show all posts
Showing posts with label kondri. Show all posts

Sunday, December 6, 2009

translit: తెలంగాణ నాయకులారా ఇకనయినా సోయి తెచుకొంద్రి



గత 50 సంవస్తరాలుగా సమస్య తీవ్రమయినప్పుడల్లా దాటావెస్తూ తెలంగాణా వనరులను కొల్లగోట్టుకొని పోతున్నారు.తెలంగానలో
ని అడవులనాన్ని నరుక్యపోయి తీరని నష్టము చేసారు.ఓపెన్ కాస్ట్ ఘనుల పేరుతొ వేలాదిఎకరాల్ భూమిని మానవ మనుగడకు అక్కరకు రాకుండా విధ్వసం చేశారు.గోదావరి లాంటి జీవనడులను ప్రవహించ కుండ చేసారు.తెలంగాణా యువకులకు చెంద వలిసిన వేలాది ఉద్యోగాలు వారికి కాకుండా పోయాయి.ఈ విధ్వంసాన్ని చట్టం ముసుగులో
గత 50సంవస్తరాలుగా కొనసాగిస్తున్నారు.తెలంగాణా బిడ్డలు కూల్పోయింది ఈ గడ్డ పయి జరిగిన వినాశనాన్ని తవ్విపోసుకుంట పొతేనురెండ్లయి నా సరిపోదు.తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం కాంక్షతెలంగాణా ప్రజల్లో ఇంట అనిచివెత తర్వాత కూడా ఎంత ఉవ్వెత్తున ఎగసి పడుతున్నదోతేట
తెల్లం అయింది.ప్ర్రజల వలన ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రజా ప్రభుత్వం ఇంకా అణిచి వేయగాలమన్న భ్రమల్లూ నుండి బయటికి వచ్చి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించాలి.

హైద్రాబాద్ తెలంగానడా కాదా అనే విషయం పెద్దసమస్య గాదు.చరిత్ర తెలిసిన మేధావులు 500ఎండ్లనుడి నుండి హైదరాబాద్ లూ ఏమి జరిగింది ఎలా అభివృద్ధి జరిగింది అలాగే ఈ 50ఏండ్ల నుండి ఎవరు ఎన్ని పెట్టుబడులు పెట్టారు ఎంత లాభం పిండుకున్నారు కట్టిన పన్నులు పొందిన సౌకర్యాలు అన్నిలెక్కలు వేయాలి.తెలంగాణా ద్వారా సమకురిన రెవిన్యూ ఎంత అలాగే ఇక్కడ పెట్టిన ఖర్చు ఎంత?తవ్వుక పోబడ్డ ఖనిజ సంపద ఎంత?అన్ని బేరీజు వేయడం జరుగుతుంది.


ఇక మా ప్రాంతం వారికి నష్టం జరిగితే సహించేది లేదని ఆంధ్ర నాయకులుఅంటున్నారు.


తెలంగాణా ప్రజలకు నష్టం జరుగుతున్నదని లక్షలాది ప్రజలు రోడ్ల పయికి వచ్చి లాతి దెబ్బలు తింటూ వందలాది ప్రజలు ప్రాణాలు అర్పిస్తూ ఉంటె ఇక్కడి నీరో చక్రవర్తులకు చలనం రావడం లేదు.తమ స్వంత ప్రయోజనాలే తప్ప అశేష ప్రజా రాసుల తిప్పలు పట్టించుకోని మీరు ఎప్పటి వలెనె కోట్లు ఖర్చు చేసి గెలుస్తా మను కొంటె అది మీ భ్రమే అవుతుంది.ఇప్పటికయిన ప్రజలను చుడండి సోయి తెచుకోండి ప్రజల పక్షాన నిలిచి కేంద్రం మేడలు వంచి తెలంగాణా రాష్ట్ర సాధనకు పాటు పదండి.వీరగొని పెంటయ్య.కరీంనగర్.(ప్రస్తుతము సన్నివేల్ అమెరిక)