Saturday, August 4, 2018

తాటి ఈత నీరా శీతల పానీయం గా అభివృధ్ధి పర్చాలి!


తెలంగాణ రాష్ట్రం లో మేము గీతా వృత్తిచేసే సామాజిక వర్గానికి ప్రతినిధులం అని స్వయం ప్రకటిత పెద్దమనుషులు ఇద్దరీలో ఒకరు , ఇక నుండి యువకులు ఎవ్వరూ కూడా గీతా వృత్తిని చేయకుండి అని ఫత్వా జారీ చేశారు. చేయరు సరే, మరి ఆ సామాహిక వర్గానికి చెందిన విద్యాధికులైన వేలాధి యువకులకు వారి సర్కారు లో ఏమైనా ఉద్యోగావకాశాలు కల్పిస్తారా? అలా కాకుంటే వాళ్ళు ఎలా బతుకాలి మరి ? యువతకు వాళ్ళ వాళ్ళ అర్హతమేరకు ఉద్యోగ ఉపాధి చూపించే తాహతు లేదూ, వాడు చేసుకునే పని వాణ్ని చేసుకొనివ్వకుండా ఉచిత సలహా ఇస్తారు. చేసుకొనివ్వరు, ఎలా బతకాలి వాళ్ళంతా ఒక్కడు చెప్పడు.
ఇక మరో పెద్దమనిషేమో సమాజం లో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు జరుగుతున్నై ఓ టాస్క్ పోర్స్ అధికారులారా మీరు వాల్ల వెంటపడండి , చిన్న చిన్న తప్పిదాలు చేస్తున్న కల్తీ కల్లు కారకులను వదిలేయండి అని ఉచిత సలహా ఇస్తాడు, ఆయన ఒక చట్ట సభకు అధినేత. అటువంటి స్తానమ్ లో ఉండి అలా మాట్లాడ వచ్చా?
నిజంగానే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సేవ చేయాలని అనుకుంటే వాళ్ళు మాట్లాడ దానికి ఇంతకంటే అక్కరకు వచ్చే మంచి విషయాలు లేనే లేవా? ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే ఎవరిదో దిస్టీ తగిలి గీతా వృత్తి ఇవాళ ఆ వృత్తిదారులకు అన్నం పెట్టలేని నిర్భాగ్యురాలు అయిందట.ఎంత మాయకత్వం నటిస్తున్నారు? కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని మల్టీ నేషనల్ బ్రెవెరీస్ కంపనీలకు లైసెన్సులు ఇచ్చి పల్లెలకు మద్యం మంచినీళ్ళకంటే సులభంగా అందుబాటులో ఉంచి అది త్రాగడం నాగరికత అని బాకాలు ఊదీ, రాజకీయనాయకులే బ్రాందీ బీరు షాపుల గుత్తేదార్ల అవతారం ఎత్తి పల్లె పల్లె కు వాడ వాడ కు బెల్ట్ షాపులు తెరిచి, మహిళా సంఘాల వాళ్ళు మా సంసారాలు కూలి పోతున్నాయి మద్యం వద్దన్నా కూడా పోలీస్ బలగాల పహరాలో బ్రాందీ బీరు షాపులు వర్ధిల్లుతున్నది తెలియనంతటి అమాయకత్వ నటనను ఎవరు నమ్ముతారనుకుంటారో వాళ్ళకే తెలియాలి.
అయితే నిజంగానే వాళ్ళకు ఏమీ తెలియక అలా మాట్లాడినారనుకుంటున్నారా? హరికీస్ కాదు. వాళ్ళకు అన్నీ తెలుసు. కానీ గొర్రెలను నమ్మించాలి కదా ? . మూల విరాట్టుకు బలి యివ్వాలాయే మరి. అందుకని చెవులల్ల నీళ్ళు పోసి తలవూపించి , జడుత ఇచ్చిందని ప్రకటించుకొని తలుకాయ కోసుకునుడు , కింది మెట్టునుండి పై మెట్టుకు ఎగబాకడానికి రూపాంతరం చెందే క్రమం లో ఉన్న కుల రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
పెట్టుబడి రాకాసి అన్నివృత్తులను దిగమింగి వాళ్ళ చేతులు విరుస్తున్నది. సంక్షేమ రాజ్యానికి పాలకులం అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు కనీసం వాళ్ళ ఉనికి కోసం అయినా చేతివృత్తుల వారికి మేలు చేస్తున్నాము అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
బ్రాందీ, విస్కీలు ఇప్పటికే ప్రకృతి సహజసిద్దమైన, అవుషధీయుక్తమైన కల్లును దెబ్బకొట్టినాయీ. దానికి తోడు గీతి వృత్తిని భ్రస్టు పట్టించే ఆ సామాజిక వర్గానికే చెందిన నయాపెట్టుబడి దార్లు కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడుతూ మొత్తం గీతా వృత్తినే మెడ నరుకే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు.
గీతా కార్మికులకు ఇక మిగిలిందల్లా నీరా ఒక్కటే. కనీసం మల్టీనేషనల్ కంపనీల కూల్ డ్రింక్స్ ను అయినా అరికట్టి ,వాటి స్తానమ్ లో నీరాను సాఫ్ట్ డ్రింక్ గా అభివృధ్ధి పరిచి ఒక చెరుకు రసం లా, ఒక కొబ్బరి నీళ్ళ వలె, ఒక ఫ్రూట్ జ్యూస్ వలె స్వేచ్చా మార్కెట్ లో ఎలాంటి లైసెన్సుల గొడవ లేకుండా అమ్ముకొనే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే గీతకార్మికులకు ఉపాధి దొరుకుతుంది అలాగే ప్రజలకు ప్రకృతి సహజసిద్ధమైన కల్తీ లేని మినరల్స్, విటామీన్స్ కలిసిన శీతల పానీయం దొరుకుతుంది.
రాజకీయ నాయకులు దీనికోసం ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ పస లేని పిస మాటలు మాట్లాడితే జనం లో చులకన అవుతారు.