Monday, September 13, 2010

చెట్లు-గుట్టలు-అవే రేపటికి మన జాడలు !

అన్నారం ఒక చిన్న గ్రామం. చుట్టూ లక్షల సంవస్తారాల నుండి ఆ భూమి పైన జరుగుతున్న
మార్పులను వెయిల సంవస్తారాలనుండి మనుషుల ఆరాట పోరాటాలను గమనిస్తూ గమ్యం
చూపుతున్న పెద్ద పెద్ద నల్లటి బండసరం రాళ్లతో మోదుగ,తునికి,సీతాఫలం,ఉండ్రుగ,వేప చెట్లతో
పచ్చని ఎత్తయిన గుట్టలు , ఆ గుట్టల నడుమ పాటగాడు చెప్పినట్టు భూమికి పచ్చని రంగేసి-
నట్టున్న పచ్చటి పంటపొలాలతో,పల్లె నిజంగానే పాడిపంటల పల్లెసీమే. కరీంనగర్ జిల్లా కేంద్రానికి
సమీపాన ఉండటంతో ఆధునిక వ్యవసాయ పద్దతులు,అక్షరాస్యత,చేతివృత్తులు,అందరికీ చేతి
నిండా పని.
ఉన్నట్టుండి మూడు నెలల క్రితం ఆ వూళ్ళో గ్రానైట్ బాంబు పడింది.ఊరికి ఉత్తరాన ఉన్న ఊర-
గుంట, నాగులమ్మ గుట్టల్లో బ్లాస్టింగ్ చప్పుళ్ళతో ఊరు ఉలిక్కి పడ్డది. సంగతేందని ఆరదీసింది.
కొందరు సంపన్నులైన గుత్తేదార్లు నాగులమ్మ గుట్ట, ఊరగుట్టలోని బండరాళ్లను తవ్వి తీసి
గ్రానైట్ గా మార్చి దేశవిదేశాలకు అమ్ముకోవడానికి అనుమతి తెచ్చుకున్నారని తెలిసింది.
ఆ గుట్టలతో మనకు వచ్చెదేంది పొయ్యేదీందని కొందరు అనడం తోటి అందరూ పెద్దగా ఏమీ
పట్టించుకోలేదు. పుట్టల్లోని చీమలు తెట్టెల్లోని తేనె చిన్నా చిన్న జీవరాసుల తింటూ ఇంతవర-
దాకా , పిల్లాపాపలతో గుట్టల దోనల్లో చీకు చింత లేకుండా జీవిస్తున్న గుడ్డేలుగులు బ్లాస్టింగు
బాంబింగులకు బెదిరి పోయి పట్టపగలే ఊరిమీద పడి దొరికిన వాల్లను దొరికినట్లు నోటితో కొరికి
పంజా తో గాయ పరిచి నాయి. కొరిజీవి మిగిలినా ,కండ్లు కాళ్ళు,చేతులు కోల్పోయిన వారి
గగ్గోలుకు స్పందించి దయార్ద్ర హృదయురాలయిన స్టానిక ఎస్ ఐ ఒక గుడ్డేలుగును తన సర్వీస్
రివాల్వర్ తో కాల్చి చంపి ప్రజల భయాలను పాటా పంచలు చేసింది. గుట్టల్లోని చెట్లలో స్వేచ్చగా
పురివిప్పి నాట్యమాడిన మయూరాలు భయం తో కాపాడుతారనుకొని గ్రామం లోకి వస్తే ఈకలు
పీకి తినగా మిగిలినవాటిని అభయారన్యానికి అప్పగించారు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న
పెద్దమనుషులు ఇంతటి తోనే ఏమయిందిరా కొడుకులాల? మనం ఇట్లానే నోరు మూసుకొని
ఊకుంటే ఈ జంతువుల పక్షుల్లాగే మనం కూడా ఈ పచ్చని పంట పొలాలను , మనలను
నిలబడనిచ్చిన నేలను , నీళ్ళు తాపిన చెర్లను , గుండెల నిండా గాలిని పీల్చుకొనిచ్చిన చెట్టు
చేమా పుట్టా బూసీని వదిలి పెట్టి పొట్ట చేత బట్టుకొని సెంచారం బోకటే ఉంటుందని చెప్పిండ్రు.
మిన్నిరిగి మీదబడే దాకా ఏదీ నమ్మని మన మేధోవంతులు అట్లేట్ల? అని ప్రశ్నించినారు .
సీతాఫలాలు సేకరించి అవసరార్థులకు ఇంతవరదాక అందజేసి పొట్టబోసుకున్న ముదిరాజ్
తెనుగు వాళ్లకు జీవనోపాధి పోతుంది. మేకలు,గొర్రెలు ,పశువులు, ఇకనుండి గుట్టల పయికి
పోయి మేయడానికి గడ్డి ఉండదు.మేత ఉండదు, పెండ , పిడుకలు ఉండవు, ఏరుకొని
తెచ్చుకోవడానికి గుట్టపైన కట్టెలు ఉండవు. ఇవన్నీ ఒక ఎత్తైతే వర్షపాతం తగ్గిపోయి చెరువులు
ఎండిపోయి బుగర్భజలం తగ్గిపోయి ఇంతవరదాక తేనెపట్టులాంటి పొలాలన్నీ బీడు భూములుగా
మారిపోనున్నాయని అందరికీ తెలిసేసరికి ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఉప్పెన లేచి నట్లయింది

No comments:

Post a Comment