మానేటి జలాశయమా
మది జిలికిన ఆశయమా !
సీమాంధ్ర పాలకూలే
శ్రీమంత మంత దోచి
తెలగాణ ముంచిరాని
ప్రజలంత ఏకమయ్యీ
ప్రాణాలు ఒడ్డి పోరి
సీమాంధ్ర పెత్తనాన్ని
ఓడించి గెలిచినారు .
తెచ్చింది మేమే నంటే
ఇచ్చింది మేమే నంటూ
పోటీలు బడుతు వచ్చి
ఉదరా గొట్టుతుండ్రు
మాకంటే మాకే ఓటని
పడి పడీ మొక్కుతుండ్రు !
గిరిజనుల ఉసురు దీసే
పోలవరం ఆపకుండా
పొలాలు , సంపదంతా
పజల పరమ్ జెయ్యకుండా
పదవులు ఎక్కిణాంక
పంపకాలకు పన్నాగం
పారేటి నీళ్ళ తోటి
వీచేటి గాలి కలిపి
భూమిలో ఉన్న ఖనిజం
పైనున్న చెట్టు గుట్ట
గుండు గుత్త అమ్మేటొల్లు
వీర్ని నమ్ము డెట్ల వారి !
మది జిలికిన ఆశయమా !
సీమాంధ్ర పాలకూలే
శ్రీమంత మంత దోచి
తెలగాణ ముంచిరాని
ప్రజలంత ఏకమయ్యీ
ప్రాణాలు ఒడ్డి పోరి
సీమాంధ్ర పెత్తనాన్ని
ఓడించి గెలిచినారు .
తెచ్చింది మేమే నంటే
ఇచ్చింది మేమే నంటూ
పోటీలు బడుతు వచ్చి
ఉదరా గొట్టుతుండ్రు
మాకంటే మాకే ఓటని
పడి పడీ మొక్కుతుండ్రు !
గిరిజనుల ఉసురు దీసే
పోలవరం ఆపకుండా
పొలాలు , సంపదంతా
పజల పరమ్ జెయ్యకుండా
పదవులు ఎక్కిణాంక
పంపకాలకు పన్నాగం
పారేటి నీళ్ళ తోటి
వీచేటి గాలి కలిపి
భూమిలో ఉన్న ఖనిజం
పైనున్న చెట్టు గుట్ట
గుండు గుత్త అమ్మేటొల్లు
వీర్ని నమ్ము డెట్ల వారి !
No comments:
Post a Comment