Sunday, December 5, 2010

చల్గల్ గడి -గుడి గా మారుస్తామంటున్న ప్రజలు.

తెలంగాణలో గడీలు ఆనాడు నిర్భందాలకు నిలయాలు. దొరలమాటలను,అధికారాలను ధిక్కరించడం కాదుగాదా కేవలం ప్రశ్నించినా కూడా పాపమే అయినరోజులను ఈ నాడు పాడుపడిన గడిల శిథిలాలలో ప్రజలు నెమరు వేసుకుంటున్నారు.అది కరీంనగర్ జిల్లా
ఈ జిల్లాలో మొత్తం 7 గడీలు ఉన్నాయి.బండలింగాపూర్,భీమారం,చల్గల్,ఇటిక్యాల,నేరెళ్ళ,రాజారం,మద్దునూర్ లల్లో ఈ గడీలు ఉన్నాయి.1978 లో జగిత్యాల జైత్రయాత్ర నాటికి ఈ గదీలన్నీ దాదాపుగా తామరాజశాన్ని కొనసాగిస్తూ ఉన్నెవే.ప్రజల చైతన్యాన్ని అంచనా వేసిన కొందరు తెలివైన దొరలు గడీలని విడిచి హైద్రాబాద్ లాంటి చోట భూములు కొనుక్కొని పారిశ్రామిక వేత్తలుగా తమ రూపాలను మార్చుకున్నారు.కేవలం ప్రజలతో ఘర్షణ పడి గడి విడిచింది కేవలం మద్దునూరి రాజేశ్వరావు దొర మాత్రమే.దొరలు గడీలను విడిచి పట్టణాలకు పోయినా గడీలను మాత్రం అమ్మకుండా గడీ పాలనలోని వ్యవసాయ భూములను మాత్రం అమ్ముకొన్నారు.దొరలు అమ్ముకున్న ఆ భూములతోనే పట్నం లో లింగాపుర్భావనమ్(హిమాయత్నగర్)నేరెళ్ళబాపూది నేరెళ్ళ భవనం.ఇంకా అనేక పరిశ్రమలు స్టాపించుకోవడానికి ఇక్కడి గడిల భూములన్నీ ఇందనం అయినాయి.

ఈ గడిల అమ్మకం మాత్రం కేవలం 5 సంవస్తారాలనుండి ప్రారంభం అయింది.ఇప్పటికే నేరెళ్ళగడి పూర్తిగా అమ్మితే రాజారం గడి మాత్రం పాక్షికంగా అమ్ముకుంటే ఇటిక్యాల గడిని సత్యనారాయణ రావు దొర వారసులు ఊరికి ఉచితంగానే వదిలి పెట్టినారు.కానీ జగిత్యాల పక్కనే ఉన్న చెలగాల్ గడిని దొరవరసులు ఒక కోటి డెబ్బై లక్షలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నట్లు ప్రజలకు తెల్సిందట.

నిజాం నవాబుల పాలన రాజుతోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ఒక గడి,జగిత్యాల పట్టణం లో ఒక టవర్ గడియారం నిర్మించాలని కోరినారాట .ఆనాటి చల్గల్ దొర జువ్వాడి ధర్మ జగపతి రావు నిజాము ప్రభువు కోరిన విధంగా ఆ నిర్మాణాలు చేస్తూనే చల్గల్ లో కూడా తనకంటూ ఒక గడి నిర్మించుకున్నాడట.ఈ జువ్వాడి జగపతి రావు ధర్మపురి మండలం లోని తిమ్మాపూర్ అనే గ్రామం నుండి చేల్గల్ కు ఇల్లరికం వచ్చినాడట. ఈయన కరుడుగట్టిన దోరే అయిన ఈయనకు ధర్మ జగపతి రావు అనే పేరు ఎందుకు వచ్చిందట అంటే ఈ దొర దర్శనానికి వచ్చే సామాన్యులకు అప్పుడప్పుడు దర్శనం ఇచ్చే వాడట. ఇతని దర్శనం కోసం జనం రోజుల తరబడి గడి ముందు వేచి ఉండే వారట. దొర బయటికి వచ్చినప్పుడు దర్శనం కోసం వేచి ఉన్న ప్రజలకు తల ఒక పైసా దానం ఇచ్చే వాడట. ఆ పైసా దానం చేసినందుకే ప్రజ్లలు ఎంతో దాతృత్వం తో ధర్మ ప్రభువు అనే బిరుదాన్ని అయంకు దానం చేశారు.ధర్మ జగపతిర రావు కొడుకు రాజగోపాల రావు.గడిపై ఇతని పేరే ఉంది.రాజగోపాల రావు కొడుకులు కృష్ణ భూపాల రావు,డా.రాంభూపాల రావు.రాంభూపాల రావు హైద్రాబాద్ లోని సత్య కిడ్నీ సెంటర్ యజమాని,ఆయన మరణాంతరం ఆయన కూతురు సత్య కిడ్నీ సెంటర్ చూసుకుంటున్నది.కృష్ణ భూపాల రావు మాత్రం జీవించి ఉన్నాడు.ఇతనికి ఇద్దరు బిడ్డలు. ప్రస్తుతం కృష్ణ భూపాల రావు గడిని అమ్మకానికి పెట్టినాడు.

ప్రజల వాదన ఏమంటే గడికి చెందిన 700 ఎకరాల సస్యశ్యామల మైన భూములను అమ్ముకుంటే మేమి అడ్డం తిరుగలేదు.మారెక్కల కస్టమ్ తో కట్టబడిన ఈ గడిని మేమే కంటికి రెప్పల ఇన్నాళ్ళు కాపాడుకున్నాము ఈ గడి ని గ్రామానికి విడిచి పెడితే దొరకు ఏమి నస్టమ్ అంటున్నారు. కానీ దొర అది మా ఆస్తి మేము ఎందుకు వదిలి పెడుతము అని అమ్మకానికి పెట్టినాడు.ఏమి దైవ మాయోగాని రియాయల్టర్లు భూమిని చదును చేస్తుంటే అందులోనుండి పురాతన శిల్పాలు,విగ్రహాలు తవ్వకాల్లో నుండి బయట పడ్డాయి,ఇంకేముంది ప్రజలంతా గడిని గుడి గా మారుద్దామ్ అంటూ ఏక కంటమ్ తో ఉన్నారు.రియల్టర్ దొరకు ఫిర్యాదు అయ్యాడు.దొర పోలీసు బలగాలతోనవంబర్ 5నా చల్గల్ కు వచ్చినాడు.దొర కారు కూడా దిగకుండానే ప్రజలంతా ఆయన్ని అడ్డుకున్నారు.గడిని అమ్మేది లేదని ఖరఖండిగా తెగేసి చెప్పినారు.తోపులాట జరిగింది.పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రజలు తమ చేతికి అందిన రాళ్ళు రప్పలతో పోలీసులపైనా తిరుగుబాటు చేస్తూ తమ పైన లాఠీ చార్జ్ చేసిన పోలీసులను ఒక కిలోమేటర్ దూరం తరిమి వేసినారు. తర్వాత పోలీసులు గాల్లోకు ఫైరింగ్ చేసినారు.ప్రజలు అప్పటికి చెల్లాచెదురు అయినారు కానీ తెల్లవారి గడీ మొత్తం గ్రామస్తులచే నిండి పోయింది.గడి ప్రస్తుతం ప్రజల అధీనం లో ఉంది.

ఈ గడిలు ఉన్న ప్రతి గ్రామం లోని ప్రజలు అంటున్నదేమిటంటే మేము గత 50 సంవస్తారాలుగా ఈ దొరలు అమ్ముతున్నా భూములు కొనడానికే మా రెక్కల కస్టమ్ అంతా ధరబోస్తున్నాము.మంచి బట్ట కట్టింది లేదు మంచి బువ్వ తిన్నది లేదు. అన్నాడు మాతాతలు,అయ్యలు దొరల వద్ద వెట్టి చాకిరు చేసి బతికితే మేము ఇప్పుడు ఆ దొరల భూములు కొనుక్కోవడానికి మా రెండు తరాల కుటుంబాలు అరువ చాకిరీ చేసి వాళ్ళ పెట్టుబడులు మరింతగా పెంచుకోవడానికి మేము మరింత చాకిరీ చేయ వలసి వస్తున్నదని వాపోతున్నారు.

భూమా,పెట్టుబడా ఎడైతే ఏమి అది పెరుగడానికి మానవ శ్రమే ఆధారం అనేది చల్గల్ ప్రజలు మరోసారి ప్రపంచ ప్రజల దృస్టికి తీసుకొనే వచ్చినారు.

No comments:

Post a Comment