Saturday, June 4, 2011

మన విద్యా విధానం ఒక పరిశీలన!

మన విద్యా విధానం ఒక పరిశీలన!
బడులు తెరుస్తున్నారంటేనే బడుగు వర్గాల కు బుగులు బుగులు మొదలయితది . పుస్తకాలు కోనాలి, స్కూల్ బ్యాగులు, ఉనిఫార్మ్ బట్టలు, షూష్ .వీటితోబాటుగా స్కూల్ కు కట్టవల్సిన ఫీసులు అవన్నీ తల్సుకోని ఎట్లనో అనుకుంటూ
మదన పడని మనిషి కనిపించడు. ఇదంతా ఎందుకయ్యా చక్కగా సర్కారు బడిలో చేర్పిస్తే ఈ పుస్తకాల గొడవ ఉనిఫార్మ్స్ ఫీసులు ఏవీ ఉండవు గదా అంటే చూస్తూ చూస్తూ పిల్లలను చెడగొట్టుకొముగదా అంటున్నారు. అంటే సర్కారు
బడుల్లో వేస్తే పిల్లలు ఎక్కడయినా చెడిపోయిన దాఖలాలు ఉన్నాయా అని అంటే గవన్నీ మాకు తెలువయి గాని ఎవాలన్న జూస్తే ఎందుకు గన్నవుర సదివిచ్చుకొను చేతగానోనిన్వి అని అంటరు అంటున్నాడు.ఈ పరిస్తితికి కారణాలు
అడిగితే టీచర్ల మీద సర్కారు, సర్కారుమీద, ఇంకా కాదు పోడంటే తల్లిదండ్రులమీద టీచర్లు నెపం వేస్తున్నారు. ఏ విమర్శలు ఎట్లా ఉన్నగాని చదువులయితే తలిదండ్రులకు పెద్ద భారం అయితే అవుతున్నయి.
రాజ్యాంగం లో రాసుకున్నట్టుగా ప్రతి పౌరునికి విద్యను అందించ వలసిన బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పించుకొని కార్పొరేట్ సంస్తలకు అప్పగించినయన్నది కాదన లేని సత్యం, ప్రస్తుతం ఉన్న మార్కెట్ సూత్రాల ప్రకారం ఎక్కడ
మెరుగయిన సేవలు దొరుకుతే అక్కడ సేవలు పొందడం న్యాయం అనే న్యాయ సూత్రం నడుస్తున్నది. కానీ విద్య అనేది వ్యాపారం కాదు అనే స్పృహ అటు ప్రభుత్వాలకు ఇటు ఉపాధ్యాయులకు కూడా లేకుండా పోయింది.
విద్య సమాజ గతం అయినది. ఒక తరం నుండి మరో తరానికి అంది ఇచ్చే ఒక జ్ఞానం, ఒక నాగరికత, ఒక ఎరుక, ఒక్ జీవన విధానం, అటువంటిది ఇవ్వాళ అంగట్లో అమ్ముకొనే, కొనుక్కునే సరుకుగా మారిపోయింది. అందుకు
కారణం ఒకరి పై ఒకరు నెట్టివేసుకోవడం కాకుండా సమాజ హితం కోరుతూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
విద్య అనేది ఒకనాడు వేట, మల్లయుద్దం ,వీళ్ళంబులతో గురిచూసి కొట్టడం గా ఉండేది. కానీ స్తల కాలాలను అర్థం జేసుకోవడానికి, గత చరిత్రను అధ్యయనం జెసో, గుర్తుజేసుకోనో భవిష్యత్తరాలకు ఎరుకజెప్పడానికి తమ
అనుభవాలను కంటస్తం జేయడామో, లేదా ఏదో ఒక దానిపై రాసి భద్ర పర్చడమో జరిగేది. ఆ రాసిన దానిని చదువడమే విద్య అయి వాళ్ళే సామాజాలకు మార్గ నిర్ధేషకులు గావడం తో రాయడం ,చదువడం అనే ప్రక్రియకు
చాలా ప్రాధాన్యం పెరిగింది. భారత సమాజం లో అప్పటికే చాతుర్వర్ణ వ్యవస్తా ఉదండడం మూలంగా శూద్రులమ్తా పైవర్గాలకు సేవజేసే పనిలో ఉండి విశ్రాంతి దొరుకక, శూద్రులు చదువ గూడదు అనే ఆంక్షల మూలంగా చదువు
నుండి దూరంగా ఉంచ బడితే అప్పటికే ఆవిర్భవించ బడిన పురోహిత వర్గం ముందుగా చదువడం, రాయడం అభ్యసించి ఆతర్వాత గురుకులాలల్లో తమ వారితో బాటుగా క్షత్రియులకు గూడా విద్య నేర్పుంచారు.
ఈ విద్య ప్రజల భాషలో గాకుండా పాలకుల భాషలో ఉండడం మూలాన ప్రజలకు అదంటేనే తమకు అందనిది, అర్థం గానిది అనే భావన. సరే క్రీస్తు పూర్వమే మొదలయిన విదేశీ దాడులు చానిక్యుని కాలం దాకా విరివిగానే
సాగినాయి. అక్కడ కొంత విరామం దొరికినా మధ్య ఆసియా నుండి,అఫ్గానిస్తాన్ నుండి విదేశీ దండయాత్రలు మొదలయినాయి. అప్పుడుకూడా వారిదయిన భాష రాజా భాష అయినందున రాజా శాశనలంటే సామాన్యులకు
అర్థం గాని విషయాలే. ఇక అంతిమంగా వచ్చిన ఆంగ్లేయులు కూడా ఇంగ్లీష్ నే వాళ్ళ పాలన భాష గా వాడుకున్నారు, ఇప్పటికీ అదే విధానం కొనసాగు తున్నందున ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఉంటున్నందున
పజలల్లో ఒక క్రేజీ ఏర్పడింది, ఎట్లాగయిన జెసి ఇంగిష్ మీడియం లో చదివిస్తేనే పిల్లలకు మంచి భ్విష్యత్తు ఉంటుంది అన్న భావన తలిదండ్రుల హృదయాల్లో బలంగా నాటుకొని పోయింది.
ఇక భాష అంటే ఏమిటో చూద్దాం! భాష అంటే కేవలం అచ్చులు,హల్లులు ,వ్యాకరణం, సందులు,సమాసాలు,అలంకారాలు మాత్రమే గాదు. భాష అంటే ఆ ప్రజల జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంబురాలు, ఆటలు
పాటలు అన్నీ అన్న మాట. ఎవరిదైనా వాళ్ళ ఇంటి భాష కానప్పుడు పైన చెప్పుకున్నవన్నీ వాటి అసలు రూపాన్ని కోల్పోతాయి. వర్షం కావాల్సిన మనకు రెన్ రెన్ గో ఎవే పాఠం అయి కూర్చుంటుంది.పిల్లోనికి కన్ఫూషియన్,
ఇట్లా ఎన్నయినా ఉదాహరణలు చెప్పవచ్చు,
మరి ఈ ఆంగ్ల భాషా వ్యామోహం నుండి తలిదండ్రులను తప్పించే ప్రయత్నం ఎలా అన్నది పెద్ద ప్రశ్న. ఈరోజు ఇంగ్లిష్ కార్పొరేట్ కాలేజీ లకు కాదుగానీ రెండు మీడియం ల తో నిర్వహించ బడుతున్న పాఠశాలల యజమానులను
అడిగి చూడండి. ఏ మీడియం నుండి వచ్చిన పిల్లల విషయ పరిజ్ఞానం ఎట్లా ఉందో? విషయ పరిజ్ఞానం మాత్రమే గాదు ఉపాధ్యాయుల పట్ల, తోటి మిత్రుల పట్ల సమాజం పట్ల వారి వైఖరి చాలా పెదసరనరంగా ఉన్నట్లుగా ఆ
పాఠశాలల యజమానులే చెప్తున్నారు. ఇక ఉపాధి అవకాశాల గురించి చూసినా ప్రతి సంవస్తారం 100,000 మంది ఇంజనీర్లు కాలేజీ లనుండి బయటకు వస్తున్నారు అందులోనుండి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎందరు? ఇంకా అందులో
నుండి అమెరికా పోతున్న వాళ్ళు ఎండ్రు? మన చదువులు అన్నీ అమెరికా మార్కెట్ కు ఊడిగం చేయడమేనా? లేక మనకంటూ ఒక్ దేశం ఉన్నది, ఆ దేశం లో కొన్ని వనరులు ఉన్నాయి ఆ వనరులను సక్రమంగా ఉపయోగించు
కొనే నైపుణ్యం మనకు అవసరం అన్న విషయం మన అకాడమిసియన్లకు ఎందుకు పట్టడం లేదు. మన దేశం లో ఈ రోజు ఉత్పత్తి అవుతున్న సరుకులు, అంటే ప్రకృతి వనరులన్నీ సరుకులు గా మార్చుతూ వాళ్ళు అనుభవించే
కాడికి అనుభవించి తక్కిన 400 లక్షల కోట్లు, స్విస్ ,మారిషియస్ బంకుల్లో మడుపు పెట్టుకుంటున్నారే ? ఇంత సంపద సృస్టించ బడుతున్న ఈ దేశానికి తన దంటూ ఒక టెక్నాలజీ తనడంటూ ఒక భాష అవసరం లేకుండా
పోతున్నది గదా? ఒక్ భాష అంటే మళ్ళీ హింది నా తమిలమా? మరో భాష అని కాదు ఎవరి మాతృ భాషలో వాళ్ళకు వీడి బోధించ బడితే విషయ పరిజ్ఞానం కావలసినంత ఉంటుంది. వాళ్ళ వాళ్ళ సంస్కృతిని కాపాడు కున్నట్టు
ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల మోజు పట్ల తలిదండ్రులకు కనువిప్పుకలిగే విధంగా ప్రణాళికలు రూపొందించు కోవాలిసిన బాధ్యత రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం మీదనే ఉండి.
ఎందుకంటే ప్రభుత్వమే జూన్ 13 నుండి ఏదో యాత్ర చేస్తుందట. ఎందుకయ్యా అంటే డ్రాప్ ఔట్ పిల్లలను బడిలో చేర్పిస్తుందట. ఎందుకంటే అది తన బాధ్యత అంట. సరే మంచిదే. చాలా మంది పిల్లలు చదువు పట్ల ఆసక్తి
లేక, ఇంట్లో వసర్తి సరిగా లేక బడి మానేస్తున్నారు. ఈ లోపాలను సారి దిద్ద కుండానే బడి బయటి పిల్లలను బడిలో వేస్తే మళ్ళీ వాళ్ళు బడి బయటకు రావడానికి ఎంతో సేపు పట్టదు.
ప్రధానంగా మరో విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వ బడులను ఎవరుకూడా అవి తమవి, తాము కాపాడుకోవాలి అని అనుకోవడం లేదు. ఆయన ముఖ్యమంత్రా, విద్యాశాఖ మంత్రా. విద్య శాఖ కార్య దర్షా, డైరెక్టరా, జిల్లా
విద్యాధికారా, ప్రధానోపాధ్యాయుడా, తరగతి ఉపాధ్యాయుడా?ఇందులో ఏ ఒక్కరూ కూడా నిజాయితీ గా ఈ బదులు మావి అనుకున్న చోట ప్రజలు ఆ బడులల్లోనే చదివిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు. కానీ మొత్తంగా
విద్యానంతా ప్రైవేట్ పెట్టుబడుడ్డారులకు కట్టబెట్టాలన్న ఆలోచన కలిగిన ప్రభుత్వాలు తమ తప్పును అంగీకరించకుండా ఆకలి అయ్యేవాళ్ళకు అన్నం పెట్టకుండా రెండు బఠానీ గింజలు చేతిలో పెట్టి తామెంత ఔధార్య వంతులో
చూడండి అని ప్రజల ముందుకు వస్తుంటే ముంచుక వస్తున్న ముప్పు అయిన నిరుద్యోగం, నిరక్షరాస్యత, గుణాత్మకమయిన విద్య కొందరికే అందుబాటులోకి వచ్చే ప్రమాదం, విద్యా గాంధానికి నోచుకోకుండా అసాంఘిక
శక్తులుగా మారిపోనున్న ప్రమాదాన్ని విజ్ఞులైన వాళ్లయినా పట్టించుకోకుంటే ఈ సమాజానికి బఃవిష్యత్తు ఉండదు.
వీరగొని పెంటయ్య.
విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.
కరీంనగర్, 9908116990

No comments:

Post a Comment