ఆరుద్ర పురుగులు.
మానేటి జలాశయమా - మది నిలిచిన జ్ఞాపకమా!
మబ్బసలె కానరాని - మహా గడ్డు రోజులల్లా
మానేరు పారేటట్టు - మడులన్ని నిండే టట్టు మహా కుంభ వృష్టి కురియు
పుడమంత తడిసి ముద్దయి - చిగురించు చెట్టు చేను
అని మరి మరి జెప్పిండ్రా - ఎన్నెల్లో అన్నలంతా
అయితాదె బాపు అంటే -అనుమాన మెందు కనిరి.
ఆ ఆశ తోనే యువత - ఆలోచన పరులంతా
అడుగడుగు కలుపుకొని - కడలోలె కదిలినారు
శ్రీకాకులిజయ నగరం - జైతాల జైత్ర యాత్ర
కరినగరు కదన రంగం - పడిలేసే పాలమూరు
ప్రజా బిడ్డ లెంత మందో - ప్రాణాలు ఇచ్చినారు
తుఫాను రాక పాయె - కరువేమో పోకపాయే
రాబందు లన్ని జేరే - రాకాసి పాలనాయే
దూడల మూతి గట్టి - ఆవుల పాలు పిండి
కొండాలు పిండిజేసి - గ్రానైట్ క్వారీల్ దవ్వి
ఓపెను కాస్టులంటూ - భూమంత దవ్వి పోసీ
ప్రాజెక్టులంటూ గట్టి - నీళ్ళన్ని దొంగిలించి
నిను నిండ ముంచినొల్లను - నిలువునా పాతరేస్తం
అధికారమివ్వు మంటూ - నీ ఓటు దొబ్బి నోడు
అధికార మొచ్చినంక - అవతలి వైపు జేరే
దిగ్భ్రాంతి నొంది నోళ్ళు - లోకాన్ని జదువనోల్లు
మల మలా మాడినారు - వురి కొయ్య నురికి నారు.
అవివేకమైన యువతా - అది పిరికీ తనము కొడుకా
నిను గన్న పేగు కోసి - కారమూ జల్లి పోతవ
దుర్మార్గ మాత్రు ద్రోహి - ఇదార త్యాగమంటే
తొడగొట్టి దండు గట్టు - అందరిని కూడ గట్టు
బోధనా మొదలుబెట్టు - దోపిడీ పీడన లేని
ప్రజా రాజ్యమోచ్చేదాక - కడ దాక బరిలే నిలువు
అన్నార్హులలిసినోల్లు - అంగలార్సు డాపుండయ్య
రోకండ్లు వలిగే టట్టు - రోహిణి ఎండలుంటే
కప్పలు,ఎర్రలన్ని - కనిపించ కుండ పొతయ్
ఆయిటీ బూనినంక - వానేట్ల గురిస్తట్ల
తల దాసుకున్న కప్పల్ - తెప్పలుగ వచ్చి చేరు
ఎండ్రి కాయల్ మండ్ర గబ్బల్ - ఎదురెక్కి వస్తయన్న
ఆరుద్ర పురుగు లొచ్చు - అడివంత అండగుండు .
వీరగొని పెంటయ్య.
కరీంనగర్ .
No comments:
Post a Comment