Saturday, December 19, 2009

అప్రత్యెక తెలంగాణా enduku వద్దు,సమైక్య ఆంధ్ర ఎందుకు ముద్దు?

ప్రి ఆక్యుపేడ్ మైండ్ తో రాజకీయ నాయకులు చెప్తున్నమాయ మాటలకు మోస పోయి చరిత్ర చదువకుండా కొందరు యువకులు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఫసల్ అలీ కమిషన్ తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం లోకలుపాలని చెప్పలేదన్న సంగతిని దయజేసి చదువండి .ఆనాటి ఆంధ్ర నాయకుల ఒత్తిడి వలన ప్రధాని నెహ్రూ సూచనలతో కొన్ని షరతులతో కూడిన ఒప్పందాల మెరకు తెలంగాణను ఆంధ్ర రాష్ట్రం లో కలిపినారు.ఆ షరతులు అమలు పరచి తెలంగాణా ప్రజల భయాలు తొలగించ వలసిన బాధ్యతను ఆంధ్ర పాలకులు పాటించలేదు .సరికదా, అవకాశం ఉన్నచోతల్లా స్వార్థ పురితంగా ఉల్లంఘించారు .ఆంధ్ర పాలకులూ తెలంగాణా ప్రజకే చ లను మోసం చేస్తునరనే విషయాన్ని గమనించి ఇక మేము మీతో వేగలేము అని ఉద్యమాలకు దిగేదాకా వ్యవహరించారు .విశాలాంధ్ర ఏర్పడ్డ మరునాటినుండే ఒప్పందాల అమలు వాయిదా పడ్డ కారణంగా గత యాబై ఏండ్ల నుండి పోరాటాలు సాగుతూనే ఉనాయి.కొందరు అంటున్నట్టుగా కే సి ఆర్ కొసమో చెన్న రెడ్డి కోసమో ప్రజలు ప్రాణాలు ఇవ్వడం లేదు.

సమైక్య ఆంధ్ర ను కోరుకునే వాళ్ళు ఎవరైనా జరిగిన పొరపాట్లను వెంటనే సరిదిద్ది ఇకముందు అలాంటి పొరపాట్లు అసలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగానీయులకు విశ్వాసం కలిగే విధంగా వ్యవహరించకుండా అదే పని గా ప్రత్యెక లంగాణా వాదాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు .ఇట్లా అయితే ఎలా సమయిక్యంగా ఉండగలుగుతాం?సంకుచితంగా,స్వార్తపురితంగా ఆలోచించే సమూహాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఆలోచింప జేస్తూ మానావీయ విలువలనుపెంపొందించడానికి కృషి చేస్తున్న మేధావులు,మెరుగయిన సమాజం కోసం కలలుకంటున్నఈ టెలుగు రచయితలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ధర్మ సమ్మతం అని తెలుపుతూ స్కయ్ బాబా కు ఆంధ్ర జ్యోతి లో ఇంటర్వ్యు ఇచారు.అది వివిధ శీర్హిక లో ప్రచురింప బడింది.

పాణి-కర్నూల్ ,తల్లవజ్జాల పతంజలి శాస్త్రి-రాజమండ్రి, పెద్దబోట్ల సుబ్బరామయ్య -గుంటూరు,అట్టాడ అప్పల నాయుడు-శ్రీకాకుళం,జి స చలం-విజయనగరం,వి వి న మూర్తి -తూర్పు గోదావరి,సిన్గానవేని నారాయణ-అనంతపురం,స్వామీ-అనంతపురం,పాపినేని శివశంకర్ -గుంటూరు అద్దెపల్లి రామ్మోహన్ రావు -తు -గోదావరి,మంచికంటి-ప్రకాశం ,వి ప్రతిమ-నెల్లూర్ కాట్రగడ్డ దయానంద్ -ఒంగోలు వి ఆర్ రాసాని-చిత్తూర్ వీరంతా తెలంగాణా రాష్ట్రం న్యాయమే అని అన్నారు.దేశమంతా ముక్కలు అవుతుంది అన్నదానికి ముప్పల రంగనాయకమ్మ చాల చక్కగా లంగాణది ప్రత్యెక పరిస్తిస్తి అని వివరించారు.

న్ని రాజకీయ పార్టీలు మేము తెలంగాణకు మద్దతు ఇస్తామని తీర్మానం చేసినట్లు కేంద్రానికి పంపితేనే కదా కేంద్రం తెలంగాణకు సై అన్నది .ఇప్పుడు అంతా మాత మారుస్తున్నారు.వాళ్ళంతా తెలంగాణ పైన ఆశ వదులుకొని రేపటి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్పోటి పడుతున్నారు.తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ పజలకు ప్రజాస్వామిక వాదులంతా మద్దతు ఇవ్వాలి.లేదంటే భవిష్యత్తు లో కేవలం భుజ బలం ,ధన బలమే రాజ్యమేలుతుంది .

No comments:

Post a Comment