Sunday, January 3, 2010

నిజాయితీగా ఆలోచించండి!

ఉస్మానియా లో విధ్యార్తులు అంతా పెద్ద సంఖ్యలో ఉరద్యమించి తెలంగాణ అనేది ప్రజల ఆకాంక్ష.అది ఏ ఒక్కరో అనుకుంటున్నది కాదు అని తెలియ చెప్పినా కూడా కొంతమంది ఆంధ్ర మిత్రులు అసలు తెలంగాణకు అన్యాయమే జరుగలేదని సమయిక్యంగా ఉందాం ,సమయిక్యగా ఉంటే ఉండండి లేదంటే మీ సంగతి చూస్తాం అని తుపాకీ చూపిస్తున్నారు.ప్రతి ఆంధ్ర మిత్రున్ని మీకు మీరే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి మీరు ఎప్పుడూ కూడా ఏ ఒక్క తెలంగాణ వాని గురించి తక్కువ చేసి మాట్లాడ లేదా అసలు మా బాధల గురించి మా అవమానాల గురించి ఎపుడైన ఆలోచించారా .మాకు ఏ అన్యాయం జరుగలేదని అంటున్నారంటేనే మమ్ములను అవమాన పరిచినట్లే.మీరు చరిత్రను చూడ ఇస్టమ్ లేకనే ఇలా మాట్లాడు తున్నారు.మేము అంటున్నాం ఇక మేము ఎంత మాత్రం మీతో ఇమడలెము .మా బ్రతుకు మేము బ్రతుకుటము అంటే లేదు మీరు మాతోనే ఉండాలనడం ఏ ప్రజాస్వామిక సూత్రల కు అనుగునమో ఆంధ్ర మేధావులు చెప్పాలి.

2 comments:

  1. ఏమి ఆలోచించాలండీ? సంక్రాంతికి ఊర్లకి వెళ్ళే సీమాంధ్ర వాస్తవ్యుల్ని మళ్ళీ హైదరాబాదులో అడుగుపెట్టనీయమని ఓ పక్క విద్యార్ధి గర్జనలో వక్తలు చెబుతూంటే....? ఇదేనా తెలంగాణా సంస్కృతి? నా స్వంత రాష్ట్రంలో నేను ఉన్నానా అని ప్రతీ తెలుగు వాడు బాధ పడే రోజును తీసుకొస్తున్నారు. చరిత్ర చదవక్కరలేదు. ఇలాటి ప్రవర్తనని చూస్తుంటే ఎంత హేయంగా ఉంది? తెలంగాణా కి జై అనకుంటే పార్టీ కార్యాలయాల్ని తగులబెడతారా? అవునులే - అక్కడ మాట్లాడేది విద్యార్ధులైతె కదా? పూర్తి స్థాయిలో మావోయిస్టులు చేరిపోయిన ఆ ఉద్యమం ఇక ఎలా సాగుతుందో ఉస్మానియా యూనివర్సిటీ చెప్పకనే చెబుతోంది. తెలంగాణా పై కాస్తో కూస్తో ఉన్న సానుభూతిని కూడా పోగొట్టుకుంటే - ప్రత్యేక రాష్ట్రం సంగతి అటుంచండి , ముందు మొత్తం జాతికే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. విజ్ఞత ఉన్నవారు ఎవ్వరైనా ఇలాటి మాటలని ఖండిస్తారు. కనీసం ఒక్క తెలంగాణా వాది అయినా ఇలాటి మాటలని ఖండించారా? మీకు సమైక్య వాదుల మంచితనం చేతకాని తనంగా కనిపించవచ్చేమో. చరిత్ర కాదు - వర్తమానంలో ఎవ్వరు వదురుతున్నదీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. వేర్పాటు వాదంతో నష్టమే కానీ లాభంలేదు. తెలంగాణా అనే పదానికి అర్ధం - తెలుగు వారు నివసించే ప్రాంతము అని. 1739 వరకూ ఈ 10 జిల్లాలు, రాయలసీమ, కోస్తా జిల్లాలు కూడా నిజాం ఏలుబడిలో ఉన్నాయి. ఆ నిజాం బ్రిటీషువారికి కొన్ని జిల్లాలు ఇచ్చివేశాక మిగిలిన 10 జిల్లాలు నిజాం తన ఏలుబడిలో ఉంచుకున్నంత మాత్రాన - మీరు తెలుగు వారు కాకుండా పోరు. నిజాం పాలనలో ఉన్న మహారాష్ట్రీయులు, కన్నడిగులు - వారి వారి రాష్ట్రాలలో మమేకం అయ్యారు - మరి ఆ జిల్లాలని కూడా ప్రస్తుత ప్రత్యేక తెలంగాణా లో ఎందుకు చేర్చట్లేదు? వారు మాత్రం నిజాం పాలనలో అణగదొక్కబడలేదా? చరిత్ర లో ఒక కోణాన్ని కాదు, అన్ని విషయాలనీ విశ్లేషించాలి. తెలంగాణా వారిని ఎవ్వరూ అవమానించలేదు. తెలంగాణా వాస్తవ్యుల్లో సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ వేర్పాటు వాదంతో పిచ్చి గా మాట్లాడే మూర్ఖులకి భయపడి బయట పడట్లేదు. దయచేసి మీరు కాస్త తెలివిగా అలోచించండి. కేవలం అభివృధ్ధి జరగలేదని ప్రతీవారూ ఒక రాష్ట్రాన్ని కోరితే - ప్రతీ జిల్లా ఒక రాష్ట్రం అవుతుంది. అది మన దేశానికి ఎంత నష్టమో అలోచించండి. పదవులకై ప్రాకులాడే రాజకీయనాయకుల మాటలు నమ్మి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కాగానే అదెదో భూతల స్వర్గం అవుతుందని భ్రమ పడకండి. కే.సీ.ఆర్ లాటి కుక్కల్ని తరిమి తరిమి కొట్టండి !!

    ReplyDelete
  2. http://veeragonis.blogspot.com/2010/01/blog-post_17.html

    ReplyDelete