Sunday, January 17, 2010

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగేది కాదు

నా సైటు రివ్యూ చేయండి

జనవరి 5 నాడు చిదంబరం గారు అఖిలపక్ష సమావేశం లో తెలంగాణ రాష్ట్ర చరిత్ర,పెద్దమనుషుల ఒప్పందం ఆరుసూత్రాల పథకం,ఆరువందల పది జి ఒ నుండి తెలంగాణలో ముల్కీ నిబందనలు,వాటి అమలుకొసం తెలంగాణ ప్రజలు జరౌపుతున్న పోరాటం దారబోసిన రక్తపు ఏరుల గురించి వివరిస్తూనే డిసెంబర్ 7 నాడు అన్నీ పార్టీలు తెలంగాణకు తాము అనుకూలం అని ఆమోదం తెలిపి నందున్నే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రంభిస్తున్నామని తెలిపినారు .అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అందరం కలిసి కాపాడకుంటే అవతలి పక్షం ఉ పయోగించుకుంటుంది అనికూడా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశాహ్ ఏర్పడ్డానాటినుండే చేసుకున్న ఒప్పందాలను ఎలా ఉల్లంఘించారో తెలుపుతూ టన్నులకొద్ది వ్యాసాలు వచ్చాయి.తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారో స్పస్టంగా చెప్పుకున్నాం.మరి సమయిక్య ఆంధ్ర అనేవాళ్లూ ఎందుకు కలిసే ఉండాలని అంటున్నారో స్పస్టంగా చెప్పండి.అన్నీ వివరించను గాని ఒక్క ఉదాహరణ చెప్తాను.ఆదిలాబాద్,కరీంనగర్ ,వరంగల్ ,ఖమ్మం ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది హెక్టారులల్లో ఓపెన్ కాస్ట్ గనులు తవ్వి ఆ బొగ్గు ఆంధ్ర ప్రాంతపు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లల్లో ఉపయోగిస్తున్నారు.తెలంగాణలోనే భూములు ఇక ఎన్నటికి అక్కరకు రాకుండా చేస్తున్నారు.కరీంనగర్ లోని నూస్తులపూర్గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టు కు గాస్ ఇవ్వబడదు అని చె ప్పినారు.కనుక మేం ఇక ఎంతమాత్రం ఆంధ్ర ప్రాంత ఆధిపత్య ధోరణి పాలనలో అణిగి మణిగి ఉండలేమని ఉద్యమిస్తున్నారు.ప్రజల అభిస్తాన్ని గౌరవించ వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగం లో రా సుకోబడింది.కానీపార్లమెంటరీ ప్రజాస్వామ్అన్నీ పాటిస్తున్నామని పైకి చెప్పుకుంటున్న పార్టీలన్నీ ఏమీ చేసింది చిదంబరం గారె స్వయంగా తెలియజేసి మనం ఈ విధంగా వ్యవహరిస్తే ఏమీ జరుగుతుందోగూడ తెలిపినా రు.
అయితే ఆయన పార్టీ తో సహా అన్నిపార్టీలు ఎక్కడికక్కడ అధికారం హస్తగతం చేసుకోవడానికి చదరంగం ఆడుతున్నాయి.ఏ ప్రభుత్వమయిన తాను నస్తపోవడానికి ఎందుకూపూనుకుంటుంది అని ఒకరు అమాయకంగా అడుగు తున్నారు.ప్రభుత్వాలు వ్యాపారం చేసున్నాయా ?అధికారం కలిగి ఉండడం లాభం,అధికారం కోల్పోవడం నస్టమా?అధికారాన్ని కలిగి ఉన్దిప్రజలను పాలించడమే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రధాన ధ్యేయం కాదని ఎన్నోసార్లు నిర్వచించు కొనిఅశేష ప్రజానీకం సంక్షేమం,వారి అభిస్టమ్ మేరకేనడుచు కోవడం ప్రజాస్వామిక వ్యవస్థ ప్రథమ కర్తవ్యమని చెప్పబడింది.ప్రభుత్వాలు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,తమ తమ అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తూ ప్రజల కాస్త నస్టాల గురించి వారి భావావేశాల గురుంచి గాని అలోచించడం లేదు.కానీ తెలంగాణ రాష్ట్రం గురించి తపించే యువకులు ఇప్పటికే వందకు పైగా తమ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తే తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం ప్రజలే ఇచ్చిన పదవులను గూడా వదలదానికి సిద్దంగా లేని పరిస్థితి.
ఈ రోజు తెలంగాణ పల్లె పల్లెన గడప గడపన అబాల గోపాలం పసి పాపల నుండి పండు ముదుసలి వరకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తున్నారు.అది ప్రజాస్వామిక వ్యవస్థలో వారు కలిగి ఉన్న హక్కు.మా నిధులన్నీ మాకు ఖర్చు చేసి ఉంటే మాకూ చాలినన్ని పాఠశాలలు,కాలేజీలు,ఆసుపత్రులు ఉండేవి కదా అని ప్రశ్నిస్తున్నారు.మా నీళ్ళు మాకూ ఇచ్చి ఉంటే ఎన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవి ఎంత సంపద ప్రోగు పడేది అని ప్రశ్నిశ్నిస్తున్నారు .మా ఉద్యోగాలు మావి మాకూ లభించి ఉంటే ఇప్పటికీ ఎన్ని తరాలు సంపద్వంతం అయ్యేవో లెక్కలు తేల్చండి అంటూ కోల్పోయిన జనం నిలదీస్తున్నారు.కొందరు పెదమనుషులు తలకిందుల లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు 610 జి ఒ పై గీర్ గ్లాని కమిస్సియన్ అడిగిన లెక్కలకు మసిబూసి మారేడుకాయ చేసి నట్లే చేస్తాం అనుకుంటున్నారేమో కానీ మేము అలా కుడురానివ్వం.మా లెక్కలు మా వద్ద ఉన్నాయి.
అధికారం లోకి వస్తున్న ప్రభుత్వాలు ఇన్ని సంవస్తారాలనుండి భూమి సమస్యను గాని పేదరిక నిర్మూలన గాని నిరుద్యోగ సమస్యను గాని నిత్యావసర ధరల నియంత్రణ గాని కడకు ప్రజలందరికి రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని స్వార్థ చింతనలో సంపద పోగేసుకోవడం లో తల మునుకలై ఉంటున్నారు.అవన్నీ చాలా పెద్ద సమస్యలని అంటారేమో .మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగం లో అవకాశం ఉండి ,పెద్దమనుషుల ఒప్పందంలో ఉండి,అన్నీ పార్టీలు తమకు అభ్యంతరం లేదని చెప్పి,నెహ్రూ నుండి సోనియమ్మ దాకా అంతా తెలంగాకు న్యాయం చేస్తామని చెప్పి ఇంతకు ముందేన్నాడు లేని విధంగా ప్రజలందరూ చిన్నాపెద్దా ముక్తకంఠం తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కదం తొక్కి కదలుతుంటే గూడ ప్రభుత్వాలు,పార్టీలు అధికార రాజకీయ క్రీడలు ఆడుతున్నాయేగని ప్రజావామ్యయుతంగా ఆలోచించడం లేదు .ఇలా అయితే ప్రజాస్వామ్య వ్యవస్తాపై ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏమీ జరుగనున్నదో చిదంబరం గారె చాలా స్పస్తంగా చెప్పినారు .
ఇక హైద్రాబాద్ లో పెట్టుబడులు పెట్టినకొందరు ఆంధ్ర పెద్దమనుషులు తమ ఆస్తుల విలువలు తగ్గిపోతాయన్న ఆరాటంలోసామాన్య ప్రజలకు లేనిపోని భయాలు కలుగా జేస్తున్నారు.నది జలాల ఒప్పందాల మేరకు ఆంధ్ర,రాయల సీమలకు ఎన్ని నీళ్ళు పోవలో అన్నీ నీళ్ళు పోతాయి .ఎవరూ అడ్డుకోజాలరు.అలాగే హైద్రాబాద్లో నివసిస్తున్న వార్కి ఎలాంటి అభద్రతా భావం ఉండవల్సిన అవసరం లేదు .మరాఠీలు ,కన్నడిగులు ,మలయలీలు,తమిళులు,సిక్కులు,ఇలా ఎందరో హైద్రాబాద్ లో నిశ్చింతగా ఆస్తులు కలిగి ప్రశాంతంగా 1948కి ముందు1956 తర్వాత జీవిస్తున్నారు.రాజ్యాంగ విహితంగా లభించిన ఆస్తి హక్కు మేరకు హాయ్ఈగా జీవించవచ్చు.
కానీ కొందరు ఆంధ్ర మిత్రులు అతిగా స్పందిస్తున్నారు.3జనవరి నాటి విద్యార్థి గర్జనకు స్పందనగా వీరగోని’ఎస్ అనే బ్లాగ్ లో నిజాయితీగా ఆలోచించండి అని రాసినడానికి విరజాజి అనే ఒక సోదరిచాలా ఘాటుగా స్పందించారు.తెలంగాణను అడ్డుకునే వారు సంక్రాంతికి వారి ఇండ్లకు వెళ్లితే వచ్చేటపుడు మేమూ అడ్డుకుంటామ్ రానివ్వము అని ఆవేశం తో ఒక విద్యార్థి అన్నదానికి అమెగారు ఒ యు లో జమ అయ్యింది విద్యార్థులే కాదని అంటూ,తనకు ఇంతవరదాక తెలంగాణ అంటే కాస్తో కూస్తో ఉన్న సానుభూతి ఇలా వదురుతున్నందున లేకుండా పోయిందట.తెలంగాణలో చాలా మంది సమయిక్య రాష్ట్రన్నే కోరుకుంటున్నారట,వేర్పాటువాదం తో పిచ్చిగా మాట్లాడే మూర్ఖులకు భయపడి వారు బయట పడటం లేదట.(తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తు ఆంధ్ర ప్రాంత కవులు ,రచయితలు,మేధావులు చెప్పిన అభిప్రాయాలు ఆంధ్ర జ్యోతి దినా పత్రికలో చూడవచ్చు),తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న నాయకులను కుక్కలని తిడుతూ ఆ కుక్కలను తరిమి కొట్టండి అని పిలుపునిచ్చారు.(veeragoni’sబ్లాగ్ లో నిజాయితీగా ఆలోచించండి అన్న దానికి విరజాజి గారి రెస్పోంస్ చదువండి)
మేము ఇంతకాలం సహించినవి ఇక ఎంత మాత్రం సహించలేనివి ఇలాంటి వ్యవహారాలనే.తెలంగాణ ప్రజల పోరాటాలను,వారి భావోద్వేగాలను ఒక ఆడ కూతురు సైతం ఇంతగా అవమాన పర్చగలిగినంతటి స్వాతిశయం,అహంకారం కలిగి ఉంటూ ఇంకా మేము కలిసి ఉంటాము,సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని అంటే తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు.అందుకే ఇక మేం ఎంతమాత్రం ఆంధ్ర తో కలిసి ఉందా జాల లేమని తెలంగాణ ప్రజలు తెగించి పోరాటలకు సిద్దమయినారు .పొగరు తలకెక్కిన తలబిరుసు తనం తో కొందరు,అధికార,ధన అహంభావంకే తో కొందరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోగలమని భావిస్తున్నారు.అందులో భాగంగానే లాబీయింగ్ చేస్తున్న కొందరు ఇప్పటికే 1200 కోట్లు ఇవ్వవలసిన వారికి ఇచ్చామని ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చే ప్రశ్నేలేదని.వారి అంతరంగిక చర్చలో అనుకున్టున్నట్లు తెలుస్తున్నది.
కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వారికి ఉన్న ధనబలం తో కొద్దికాలం ఆపగలిగితే ఆపగలుగుతారోమో కావచ్చు గాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శాశ్వతంగా ఎవరు అడ్డుకోజాలలేరు.తెలంగాణ పల్లెల్లో కదులుతున్న జనం, వారంతా రోడ్డు పైకి వచ్చి మా తెలంగాణ రాష్ట్రం మాది మాకు కావాలే,ఎవరెన్ని మాటలు చెప్పినా మేం ఊరుకోమ్ .మమ్ములను మోసం చేయాలని అనుకుంటున్న వారిని ఇక మేము సహించం అని అంటూ కొమురమ్ భీములై,సమ్మక్క సారలమ్మలై కదులుతున్నారు.

2 comments:

  1. నాతెలంగాణా నాతెలంగాణాయాస అంటున్నారు యాసలుఎలావచ్చాయొతెలుసుకోండి తెలంగాణావాదులు53సం”లువరకేవెనుకకువెళ్తున్నారుమొదలుతెలుసుకోండి, ఒకప్పుడుఈరాష్ట్రాలు,దేశాలులేవు.అప్పుడుచిన్నతండాలు,గూడేలులాంటివివుండేవి ఆసమయంలో ప్రక్కప్రాంతప్రజలు (వేరేబాషప్రజలు ) వచ్చి ఇక్కడి వారితోకలసిజీవించినపుడు తెలుగుసరిగాపలుకలేక యాసగామాట్లాడేవారు, అలాయాసగామాట్లడెవారు ఎక్కువగాఉండుటంవలన ఇక్కడ ఉండేతెలుగువారు తక్కువ గాఉండటంవలన వారితొపాటు యాసగామట్లాడవలసివచ్చింది (అంటేవేరేప్రాంతప్రజలు,వేరేబాషమాట్లాడెవారు)అంటేతెలంగాణాఎప్పుడోవలసలమయమయిపోయింది,ఇప్పుడుతెలంగాణాలోఉన్నవారూందరూవలసవచ్చినవారే.ఈరాజకీయనాయకులు అందరికి రక్షణకల్పిస్తామంటున్నారుకాష్మీరులోని పండిట్లను కాష్మీరునుండిబయటకుతరిమితేఇంతవరకువారినివారి ఇండ్లకుపంపించలేకపోఇంది ,ఇప్పుడుకొత్తగా అటువంటిగొడవలయితే వారినిసరిచేయటానికియెంతసమయంపడుతుంది.నాకు అనిపిస్తుంది మనకుగాంధీ ద్వారాకాకుండా సుబాస్చెంద్రబోస్ ద్వారాస్వరాజ్యంవచ్చిఉంటేఆబాగుండేదనిపిస్తుంది ఎందుకంటేచెత్తరాజకీయనాయకులు ఉండరు,ఇప్పటిఊసరవెల్లిరాజకీయనాయకులనుచూస్తే గాంధీగారుకూడాఇలానేఅనుకుంటారనుకొంటున్నాను

    ReplyDelete
  2. వెంకటేశ్వరావ్ గారు యాస గురించి తెలిపారు.ధన్యవాదాలు.నేనూ అదే అంటున్నాను.చరిత్ర చదువలి.రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సె గంగా,సింహ సేనాపతి,మహశ్వేతాదేవి రాసిన ఎవరిదీ అడవి,యశ్పాల్ రాసిన సింహావలోకనం చదివియా ఎక్కడ కూడా అధిపత్యాన్ని,అణిచివేతను సహించ లేక పోరాటాలు చేశారు తెలంగాణ లో కూడా అదే జరుగుతున్నది స్వాగతించండి.ఇది ఎవరో రాజకీయ నాయకులు కావాలని చేస్తున్నది కాదు.ఇది ప్రజల ఆకాంక్ష.మీరన్నట్టు సుభాష్ చంద్రబోస్ కంటే గూడ,భగత్ సింగ్ ద్వారే వస్తే ఇంకా బాగుండేది.కానీ జరిగి పోయింది కదా.

    ReplyDelete