Tuesday, January 19, 2010

తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ఘనుల తవ్వకాన్నే నిలిపివేయాలి

తడిచర్ల బొగ్గు ఘనులను సింగరేణి కి కాకుండా రాయలసీమ బాడ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టే కుట్ర చేస్తున్నది.ఒ సి పి 3 ,extensian ,తడిచర్ల ఓపెన్ కాస్ట్ ఘనులను వ్యతిరేకిస్తూ మానవ హక్కుల వేదిక, తెలంగాణ అయిక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో స్థానిక ప్రజలు ఉద్యమించారు.ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ దాదాపు 500 మీటర్ల లోతు తవ్వడం వలన భూగర్భ జలాలు అడుగంటి పొయి ఈ భూగోళం ఉన్నంతా వరకు తెలంగాణలోని ఈ భూమి దేనికి పనికి రాని మరుభూమి గా మారిపోనున్నదని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది.
undar ground mines అయితే లోపల బొగ్గు తవ్వి తీసుకున్నా గూడ పయిన వ్యవసాయం చేసుకోవచ్చు ఇండ్లు కట్టుకోవచ్చు.ఉపరితలం లోని భూమిని మానవ మనుగడకు ఉపయోగించుకొనవచ్చు.కానీ ఓపెన్ కాస్ట్ మైన్స్ ల వలన ఏర్పడిన ఆ పెద్ద పెద్ద బావి బొండలు మంషులకు ఎప్పటికీ పనికి రాకుండా పోతాయి.500 మీటర్ల లోతున ఉండేతటువంటి మట్టి పొరలు రాతి పొరలు అన్నీ పెకిలించ బాదుతాయి కనుక పయిన పదే వర్షం నీరు అంతా 500 మీటర్ల లోతులోకివెళ్ళి పోతుంది అప్పుడు ఇక భూమి పయిన గడ్డి పోచ గూడా మొలువని దయనీయమయిన పరిస్థితి ఉంటుంది .అలాగే ఈ బావుల పక్కలనుండి ప్రవహిస్తున్న గోదావరి, మనేరు నదుల ప్రవాహ గతి మారిపోతుంది .వెయిల సంవస్తారాల మానవ చరిత్ర కు ఆనవాళ్లు లేకుండా పోయే పరిస్థితి.తడిచర్ల పక్కన కాపురం అనే పల్లెను ఆనుకొని కాకతీయుల కాలం నాటి కోట ఒకటి ఉంది అది ఇపుడు మాయం అవుతునది.మానేరు నది సమీపంగా ఉన్నందున బోరు బావులు వేసుకొని ప్రజలు వ్యవసాయం చేసుకొంటు అతి మెలయిన ఎర్ర మిరుప కాయలు పండిస్తున్నారు.ఇక ఆ పంట ఉండదు.మానేరు ను అణు కొని జయిన గుళ్ళు ఉన్నాయి.ఆ గుడుల్లో ఉన్న లింగం పయిన పూసిన విభూతి,కుంకుమ ఇప్పటికీ ఈ రోజే అలంకరించినట్లుగా ఉంది అజంతా చిత్రాల్లో వాడిన రంగులవలే ఉన్నాయి .అదంతా కంటికి కనారాణిదయి పోతుంది.ఆంధ్ర లో చిన్న్ చిన్న జ్ఞాపకాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక్కడ మాత్రం మానవేతిహాసం లోనే మహాద్భుతం అయిన సంఘటనలను మాయం చేస్తూ అదంతా అభివృద్దే నమ్మన్డీ అంటున్నారు.
తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ఘనుల్లో ప్రస్తుత1400 హెక్టార్ల భూమిని తవ్విపోస్తామ్ అని ప్రణాళికలు రూపొందించారు.ఈ 1400 హెక్టార్లలో 700 లు ప్రభుత్వ భూమి తక్కినది ప్రజలది.ఈ ప్రజల్లో కూడా కొందరు భూస్వాములు ఇప్పటికే పట్టానాలల్లో ఆస్తులు కలిగి సుఖవంతమయిన జీవితం గడుపుతున్నవారు ఈ పరిణామాన్ని సరే ప్రభుత్వం కోరుతున్నది కనుక మా భూములు ఇస్తాం అంటున్నారు.కానీ తడిచర్ల,కాపురం,చిన్న తూండ్ల ,పెద్దతూండ్ల,నాయకం పల్లె రేగడియపల్లే,హరిజన వాడ,తెనుగుపల్లే లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు ఈ బావులను వ్యతిరేకిస్తున్నారు.అక్కడ మేము ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో రాయ పోశమ్ అనే ఒక సామాన్య చిన్న రైతు ఆ సభలో మాట్లాడుతూ,అయ్యా,మా భూములను సర్కారు గుంజుకుంటదట కదా?అందుకు ప్రతిఫలంగా మాకు డబ్బులు ఇస్తాదట కదా .కానీ ఈ భూముల ఆధారం తోనే మా తాతలు బతికిండ్రు,మా అయ్యలు బతికిండ్రు,మేమూ బతుకుతున్నాం,మా కొడుకులు,బిడ్డలను సాడుకుంటున్నం .మా తాతలనాటినుండి మా కొడుకుల దాకా పెండ్లిల్లు పెరంటాళ్లు,చదువులు,ఛావులు,బతుకులు అన్నీ అయితున్నాయి .మా భూములకు,జరాలు రాలేదు,రోగాలు రాలేదు,కాన్సరు రాలేదు ఎయిడ్స్ రాలేదు.కానీ ఇప్పుడేమో మా భూముల బొగ్గు ఉన్నదని దానికి కాన్సరూ అంటగట్టి మమ్ములను ఖాళీ చేసి పొమ్మంటే మీరిచ్చే డబ్బులు ఎన్ని రోజులౌ వస్తాయి,మేము ఎన్ని రోజులు బతుకుతాము, ఆతర్వాత మా బతుకులు ఏమీ గావాలే మాములను ఎవరు చూస్తారు?అని ప్రశ్నిస్తున్నాడు .
మరొక సామాన్య కులీ బిడ్డ మాట్లాడుతూ,అయ్యా ,భూములున్నోళ్లయితే వాళ్ళకు ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి గావచ్చు,ఎన్నో కొన్ని రోజులు బతుకుతారు గావచ్చు కానీ ఏ భూములు లేక పోయినా ఇన్నాళ్లు ఈ భూముల పయిన కులో నాలో చేసుకొని బతికినమ్.ఏమీ దొరుకని నాడు అడివిలకుబోయి కాయో గడ్డో తెచ్చుకొని తిని బతికినమ్.మమ్ములను ఇప్పుడు ఎల్లి పొమ్మంటే మేము ఎక్కడ బతుకాలే ఇది ఎవ్వల కోసం చేస్తిన్నది ఈ సర్కార్ అని నీల దీసి అడిగిండు.
వీళ్లంతా చెప్పినట్లు గానే ఇవ్వాళ ఎక్కడో రాయల సీమలో ఉన్న బాడ కాంట్రాక్టరు మరింతగా బలిసేతందూకు తెలంగంలో బంగారం పండే భూములను వాళ్ళ కోసం పందెరమ్ పెదుతామని అంటూంటే తెలంగాణ ప్రజలు ఎత్తి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు.
ఒక వైపు ఇంత కొట్లాట జరుగుతుంటే మొన్నటికి మొన్న పంచాయతీ రాజు బద్జట్ లో తెలంగాణకు మొండి చేయి చూపిన సంగతి చూసాము.ఇప్పటికిప్పుడు మరోసారి పంటల భీమాలో 805 కోట్లకు గాను అనంత పూర్ కు 600 కోట్లు,కడపకు 120 కోట్లు ఖర్చు పెట్టుకున్నారంటే మామూలు రోజులల్లో తెలంగాణకు దక్కింది ఎంతో అవతలి వాళ్ళు బొక్కింది ఎంతో అర్థం చేసుకోవచ్చు.
మరో విషయం,ఈ ఓపన్ కాస్ట్ గణుల్లో ఒక్కొక్క సారి 100 టన్నుల పేలుడు పదార్థామోకేయ సారి బ్లాస్ట్ చేస్తారు.దానితో 8 నుండి 12 కిలో మీటర్ల దూరం వరకు భూమి గజ గజ వణికి పోయి ఇండ్ల గోడలు పగిలి పోతాయి పయిన పెట్టుకున్న వస్తువులు ఆహార పదార్థాలు కింద పడుతాయి .ఇంటి గోడలు కూలి పోతాయి.15 నుండి 20 కి.మీ.వ్యాసార్థం లోని బావులల్లో నీళ్ళు ఉండక ప్రజలకు తాగు నీరు సాగు నీరుకు ఇబ్బంది అవుతుంది.
పవర్ జనరేషన్ కు మన దగ్గర లభించే సూర్య రశ్మి,గాలి(విండ్)వాడుకుంటే పర్యావరణం బాగా ఉంటుంది.ప్రజలకు పునరావాసం బాధ తప్పుతుంది.స్టానికంగా లభించే వనరులతో స్థానిక ప్రజలు లబ్ధి పొందలే గాని స్టానికంగా వనరులు కలిగి ఉండడం స్థానిక ప్రజలకు శాపం కాగూడదు గదా?ఆంధ్ర ,రాయలసీమ,పెట్టుబడి దార్ల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగా తమ సర్వస్టమ్ కోల్పోతున్నారో,భవిష్యత్ తరాలకోసం తెలంగాణలో ఏమీ లేకుండా అంటే కనీసం నిలువడానికి భూమి కూడా లేకుండా చేస్తుంటే ఎలా సహించగలరు.
అందుకే తాడిచర్ల గానులను సింగరేణికి లీజుకు ఇవ్వడం గాదు,ఓపన్ కాస్ట్ గనుల తవ్వకాన్నే నిలిపివేయాలి.

No comments:

Post a Comment