Sunday, February 7, 2010

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం న్యాయమైన హక్కు.

మాయ మాటలు చెప్పుతూ తాము అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తుల విలువలు తగ్గి పోకుండా వీరిని కావచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఆంధ్ర ప్రాంతపు దళిత మేధావులు ,రచయితలు, కవులు ఆ తప్పుడు వాదనలను కొట్టిపారేసినారు.అయినప్పటికిని సమస్యల లోతుల్లోకి వెళ్ళి తరిచి చూస్తే వాళ్ళ వాదనలోని దొల్లా తనం ఇట్టే అర్థం అయిపోతుంది .
1)హైద్రాబాద్ లో ని తమ తమ ఆస్తులకు రక్షణ ఉండదనేది ఒక భయం.ప్రాథమిక హక్కుల్లోనే ఆస్తి హక్కు ఉంది.ఎవరైనా మన దేశంలో ఎక్కడైనా ఆస్తి కలిగి ఉండవచ్చు.బెంగుళూరులో తమకు ఆస్తులు ఉన్నవారు ఉన్నారు.హైద్రాబాద్ లో ఉన్నవారు ఉంటారు.వారి ఆస్తులను ఎవరుకూడ గుంజుకోని పోజాలరు.ఇది అనవసరమైన భయమే దప్ప ఇందులో ఏమాత్రం సత్యం లేదు.
2)రానున్న రోజుల్లో ఆంధ్ర పిల్లలకు విద్యా,ఉపాదీ అవకాశాలు ఉండవు అని.తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకున్న పిల్లలకు అది వాళ్ళ హక్కు అవుతుంది.అందుకే గదా ఈ పోరాటాలు అన్నీ కూడా.కనుక అటువంటి భయాలు అవసరం లేదు.
3)ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కృష్ణ,గోదావరి నీళ్ళను ఆంధ్రకు రానివ్వరు అప్పుడు ఆంధ్ర భూములు అన్నీ కూడా బీడు భూములు అవుతాయి అని.ఇది కూడా సామాన్య రైతులను మభ్య పెట్టడానికే.నదీ జలాల పంపిణీ ఒక శాస్త్రీయ పద్దతిలో ఎవరు ఎన్ని నీళ్లు ఉపయోగించు కోవాలో మన దగ్గర ఇదివరకే చాలా స్పష్టమయిన రాత కోతలతో ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎవరు ఉల్లంఘించినా చట్ట సమ్మతం కాదు.నీళ్ళను గదిలో వేసుకొని తాళం వేసుకునేటివి గాదు .కనుక ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని నీళ్ళు పోవాలో అన్ని పోతాయి. ఎవరు వాటిని ఆపలేరు.
అన్ని ఇలాగ న్యాయంగా జరిగే అవకాశం ఉంటే మా నేతలు అబద్దలు ఎందుకు చెబుతారు అనే ఆలోచన కొందరికి రావచ్చు.అదే మా బాధ కూడా. ఇంత వరదాక మాకు దక్క వలసిన వనరులను, అవకాశాలను కొందరు స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులుగా మర్చుకున్నారు .అలాంటి వాళ్ళ కోసమే సమయిక్య ఆంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారు.సామాన్య ఆంధ్ర సోదరులతో మాకు ఎలాంటి తగాదా లేదు.మేము దౌర్జన్యం చేసే వాళ్ళం గాదు.మా అన్ని జిల్లాల్లో ఎన్నో గుంటూరు పల్లెలు,శ్రీరామ్ నగర్ లు ఉన్నాయి.ఇంత ఉద్యమం జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక్క సమస్య లేకుండా వాళ్ళు మేము సమయిక్యంగా జీవిస్తున్నాము.వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ మాతో పాటు ఉద్యమిస్తున్నారు.
కనుక ఆంధ్రా సోదరులరా మా న్యాయమయిన హక్కుకు మీరు అడ్డు తగులకండి.ప్రజాస్వామిక వాదులు ఎవరైనా ఎప్పుడైనా lusers వైపే నిలిచిన ఉదంతాలు ఉన్నాయి .మేము కోల్పోయిన వాళ్ళం మాకు ఉద్యమం చేయాల్సిన అవసరం, నైతికత ఉన్నాయి.కాదు మీరు మతోనే ఉండాలని శాశించడం అనాయితికం.మాది రాజ్యాంగ బద్దమయిన హక్కు.సమయిక్యత అని చెప్పేవాళ్లది ఇంకా మా నోటి కాడి బుక్క మాకు దక్కకుండా గుంజుకొనే కుటిల యుక్తి

1 comment:

  1. "మాది మాకు కావాలి" అంటుంది తెలంగాణా వాదం.
    "మాది మాకే కావాలి మీది కూడా మాకే కావాలి" అంటోంది సీమాంధ్ర సమైక్య వాదం.
    మీరు రాసిన పాయిం ట్లు సమైక్యాంధ్ర వాదులకు తెలియనివి కావు.
    దొంగతనం వృత్తిగా చేసుకున్న వాడికి "దొంగ తనము చేయరాదు" అని నీతులు చెబితే ఫలితం ఉంటుందా.
    సామాన్య సీమాంధ్ర ప్రజానీకానికి ఈ బలవంతపు పోలీసు జులుం మీద ఆధార పడే సమైక్యత వల్ల ఒనగూడే అదనపు ప్రయోజనం ఏమీ లేదు.
    కేవలం అధికార పార్టీ అండదండలతో, కబ్జాలతో తెలంగాణలో అక్రమ ఆస్తులు పెంచుకున్న పిడికెడు పెట్టుబడి దార్లకే ఈ రౌడీ సమైక్యత కావాలి.
    కానీ తెలంగాణా లో రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజా చైతన్యం కారణంగా ఈ బూటకపు సమైక్యత ఇక ఎంతో కాలం సాగదు గాక సాగదు.

    ReplyDelete