Wednesday, February 17, 2010

నేదునూరు పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృధికేనా?

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం లోని నేదునూరు గ్రామమలో 14 ఫిబ్రవరి నాడు ముఖ్యమంత్రి రోశయ్య విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ కు శంకు స్థాపన చేశారు.గోదావరి బేసిన్ లో నుండి సరఫరా అయ్యే గ్యాస్ ఆధారంగా ఈ ప్రాజెక్టు నడుస్తుందని చెప్పుతున్నారు.కానీ శంకు స్టాపన రోజుననే ప్రజారాజ్యం నేత హరిరామ జోగయ్య తెలంగానీయులకు భయపడి మన గ్యాస్ తో తెలంగాణలో ప్రాజెక్ట్ పెడుతున్నారని పత్రికలకు ఎక్కినాడు.మన బొగ్గుతో విజయవాడలో నడుస్తున్న థర్మల్ కేంద్రం మాట చెప్పడు,ఎన్ టి పి సి నుండి తెలంగాణ నీల్లతో,బొగ్గుతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు కడపకు,విజయవాడకు,హైద్రాబాదుకు 440 కే వి లైనలు వెళ్తుంటేసరే మంచిదే అనుకుంటాడు.
కానీ నిజంగానే నేదునూరు ప్రాజెక్ట్ తెలంగాణ ప్రయోజనాలకెన?నీటిని నిలువ జేయడానికి,ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రస్తుతం 440 ఎకరాల భూమిని స్వదీన పర్చుకున్నారు.మా 440 ఎకరాల పంట భూమి నీటి పాలు అయ్యింది.తర్వాత ఇక గ్యాస్ విషయానికి వద్దామ్ .గోదావరి బేసిన్ నుండి గ్యాస్ పైప్ వేసి గ్యాస్ సరఫరా చేయడం చాలా ఖర్చు తో కూడుకున్నది,సమీపానగల సింగరేణి నుండి బొగ్గుతో నడుపుకోవడం చవుక అనే వాదన ఇప్పటికే మొదలయ్యింది.అంటే అక్కడనుండి గ్యాస్ రాదు.మన నీళ్ళు మన బొగ్గుతో తయారయ్యే విద్యుత్తుతో మన ప్రాణహిత నడినుండి నీళ్ళు లిఫ్ట్ చేసుకొనిపోవడానికి ఉపయోగిస్తారు.ఒకవైపు తెలంగాణ పోరాటం ఉదృతంగా ఉంది ఇప్పుడు వద్దు అని అన్నా కూడా రోశయ్య ఎందుకు వేగిరంగా వచ్చి శంకు స్టాపించాడో మనం అర్థం చేసుకోవాలి.
ఈ ప్రాజెక్టులో బొగ్గులేదా ,వాళ్ళు అంటున్నట్లుగా గ్యాసే మండించినా మన కరీంనగర్ పరిసరాలల్లో ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతలకంటే రెట్టింపు చేస్తారు.రోగాలతో చచ్చేది మనం.పర్యావరణం మనది నాశనం అవుతుంది ఫలితం మాత్రం వాల్లకు .మన బొగ్గు,మన నీల్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తాడు మన ప్రానహిత నీళ్లే ఎత్తుకపోతాడు.ఇది మన అభివృద్దే అంటాడు.ఎలా నమ్మమంటారో చెప్పండి?

2 comments:

  1. నారగోని గారూ...
    నీళ్ళకి మీ నీళ్ళూ మా నీళ్ళూ ఏమిటి..మీ బొగ్గూ..మా బొగ్గూ..తెలంగాణా బొగూ..ప్రతీ దానికీ మీదీ...మాదీ.. ఆంధ్రా బొగ్గూ..ఆ జోగయ్య ఏదో చ్హాదస్తం తో అన్నాడే అనుకోండి మీరుకూడా ఏమి వాదనలండీ...మీ ఇంట్లో మీ నాన్న గారు పెద్దలవటం వలన ఏదైనా చాదస్తపు మాట అంటే మీరు ఇలానే మీదీ మాదీ అని వాదన లేవతీస్తారా...ఒక రాష్ట్రం అవ్వనీయండి...రెండు రాష్ట్రాలు అవ్వనీయండి...మనమంతా ఒక్కటే...

    ReplyDelete
  2. మనమంతా ఒక్కటి ఎలా అవుతామో మాకు అర్థం కావడం లేదండి.610 జి ఓ ప్రకారం వేల ఉద్యగాలు తెలంగాణ వారివి వారికి కాకుండా పోయాయి.గిల్ర్ గ్లాని కొమిటీ చెప్పినా లాభం లేకుండా పోయింది.మేము చేస్తున్న వాదనలోని సత్యా అసత్యాలు మీకు తెలియవని మేము అనుకోవడం లేదు.మీ మాటలన్నీ మమ్ములను మోసం చేయ దానికే.గత 54 స్ంవస్తారాల నుడి ఈ పోరాటం సాగుతూనే ఉన్నది.తెలంగాణ వచ్చేదాకా సాగుతూనే ఉంటుంది.

    ReplyDelete