Monday, March 22, 2010

ఆలస్యం చేస్తే అంతా అయిపోతుంది.

కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను వేరు చేస్తూ ప్రవహించే నది గోదావరి.మహారాస్ట్రా లోని నా సిక్ వద్దపుట్టిన ఈ నది అదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం,ఉభయ గోదావరి జిల్లాలగుండ ప్రవహించి సముద్రంలో కలుస్తున్నది .జీవధారము నీరము అన్నట్లుగా ఈనది ప్రవహిస్తున్నమేరపాడిపంటలతో నేల పరవశించింది .ప్రజలు ఆనందంగా జీవించేవాళ్లు .నదిని ఆనుకొని ఉన్నగ్రామాలకు ఈ నీరు పెద్ద వనరు .పశువులకు పంటలకు పక్షులకు ఇట్లా మనుషుల మనుగడకు మానవెతిహాస నిర్మాణానికి ఈ నదినీళ్లకు అవినాభావ సంభందము ఉన్నది.
నా అనుభవంలోని ఒక సన్నివేశం ఇక్కడ ప్రస్తావిస్తాను. ఆదిలాబాద్ జిల్లా జైపురం మండలం ను అనుకోని ప్రవహిస్తున్న నది ఒడ్డు పల్లెల్లో ఎట్లా ఉండేదో నేను ప్రత్యక్షంగా చూసిన సంగతులు ఏమిటంటే ఈ నది వాళ్ళ తాత ముత్తాతల నుండి జీవ నదిగా చూస్తున్నారు.వర్షాకాలం లో నే కాకుండా అన్నీకాలాలో నదినిండా నీళ్ళు ఆనీళ్ళల్లో స్నానాలు ఈతలు ఆటలు చేపలు రొయ్యలు అన్నీ ఆనందగా అనుభవించిన జ్ఞాపకాలు. ఎండాకాలం లో నదిలోనీళ్ళు కొంతా తక్కువగా ఉంటున్నాందున ఎండకు నీళ్ళు వేడిగా అయ్యేటివి అయితే రొయ్యలు నీళ్లమడుగుల్లో లోతుకు వెళ్ళి బండల వెంట చల్లగా విశ్రాంతి తీసుకొనేటివి.ఈతగాళ్లు నీళ్ళల్లోకి మునిగి బండల వెంట ఉన్న రొయ్యలను పట్టుకొని తెచ్చేవాళ్లు.ఎండాకాలం చేపలు,రొయ్యలు తిన్నన్ని దొరికేటివి .
మరి ఇపుడు ఏమయ్యింది?అసలు గోదావరిలో నీళ్లే లేవు మొత్తం ఎండిపోయింది.అంతకు ముందు ఎప్పుడన్న ప్రవాహం ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పటిలాగా మొత్తానికి మడుగులు కూడా ఎండిపోయిన సందర్భాలు అసలు లేవు.గోదావారిలో చెక్ బాల్ తో 20 ఫీట్ల లోతు బొర్లు వేస్తే నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఒద్దెంబడి గ్రామాలల్లో కరంటూ ఉంటేనే నీళ్ళు కనిపిస్తాయి.ఒక వైపు వర్షాలు లేవు మరోవైపు గోదావరిలోని ఇసుక తోడుకొని పోతున్నారు మరో వైపు ఆదిలాబాద్.కరీంనగర్,వరంగల్.ఖమ్మం జిల్లాలల్లో ఓపన్ కాస్ట్ ఘనులపేరుతో 500 మీటర్ల లోతుల్లోనుండి బొగ్గుతీసే పేరుతో భూమి పొరలను పెల్లగిస్తున్నారు.భూగర్భ జలాలు మొత్తానికే అడుగంటి పోయినాయి.తా గడానికి గుక్కెడు నీళ్ళు దొరుకని పరిస్థితి.ఇది ఏమీ అభివృధి ఎవరి అభివృధి ఆవిరికోసం ఈ అభివృధో అసలు అర్థం కావడం లేదు.అభివృధి పేరుతో ఇసుక,బొగ్గు తరలించుక పోతున్నారు,ప్రజలను వాళ్ళ భూములల్లోనుండి తరిమి వేస్తున్నారు తాగడానికి కూడా నీళ్ళు దొరుకని పరిస్థితి.మానవ మనుగడకే ప్రమాదం ముంచుకొని వస్తున్నది .ఇది పాలకులు సృస్టిస్తున్న విపరీత పరిస్థితి .దీన్ని విజ్ఞులయిన వాళ్లు అంతా ఎదిరించాలి

No comments:

Post a Comment