Tuesday, March 23, 2010

దొంగే,దొంగా దొంగా అని అరిచినట్లు.

ఈరోజు పత్రికలల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి అని పెద్ద పెద్ద వాళ్ళు అంతా గొప్పగా ప్రకటనలు ఇచ్చారు .అది చూసిన తర్వాత ఒక ఆవేదనతో లోతట్టు ప్రాంతాలల్లో ప్రజలు నీళ్ళు మాత్రమే గాదు ప్రతిది ఎంత పొదుపుగా వాడుకుంటారో ఈ పెద్దమనుషులకు తెలుసునా అని అనిపించింది.
ఉన్న ఊరిపక్కనుండే ఒక నాటి జీవనదులు పారుతున్నా.ఊరిలో మాత్రం బావుల్లో,బోరు బావుల్లో చుక్కనీరు దొరుకదు .అరమైలు ,మైలు దూరం నడిచి కున్డెడు నీళ్ళు నెత్తి మీద చుట్ట బట్ట పెట్టుకోని కింద కాళ్ళు చుర్రు చుర్రు మని కాలుతుంటే పైన కుండ బరువుతో బాటు ఎండ వేడి కొర్రాయి తీరు కాలుస్తుంటే అపురూపంగా తెచ్చుకున్న నీళ్ళు ఎంత భద్రంగా దాచుకొని వాడుకుంటారో చూసిన వాళ్ళకు తెలుస్తుంది.అవసరం అయితేనే గిలాసేడు నీళ్ళు తాగుతారు.ఆరోగ్యానికి మంచిది మంతెన సత్యనారాయ న రాజు చెప్పినాడు అని లీటర్ల కొద్ది నీళ్ళు తాగరు,
ఇక స్నానం అంటారా ఇంత ఉడుకపోతలో గూడ రోజూ స్నానం చేయడానికి వాళ్ళు సాహసించరు.నాగరికులు ఆనుకొనే వాళ్ళు రెండు పుటల స్నానం చేయందే వారికి నిద్ర పట్టదు ,వాళ్ళకు ఉండే బట్టలు మహా అయితే రెండు జతలు.వాటిని నీళ్ళల్లో పిండుకొని ఆరేసుకుంటారు.సబ్బు పెట్టి ఆ సబ్బు అంతా పోయే దాకా నీళ్ళల్లో పిండడం ఉండదు.నాగరికుల స్నానాలకు టబ్బులు నిండాలి వాటి నిండా సబ్బు నురగ ,ఆ నురగ పోయేదాక శుబ్రమయిన నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళకు స్నానం చేసినట్లు.వాల్ల బట్టలు ఉతికి చలువ చేసేవరకు ఎన్ని నీళ్ళయిన ఖర్చు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అవి కొనుక్కునే కొనుగోలు శక్తి ఉంది. ఆలాంటి వాళ్ళకు మన రాజ్యాంగం అన్నీ అందుబాటులో ఉంచుతుంది.అది ఎట్లా?సహజ వనరులు కేవలం వాళ్ళ స్వోంతమా అని అన్నవా?నీవు మావోయిస్టువు అంటారు.వాస్తవానికి ఈ నాగరికులు ఇట్లాగే ఈ వనరులను విచ్చలవిడిగా వాడుతూ పోతూ ఉంటే వాళ్లకుయ మరియు రానున్న తరాలకు సహజవనరులు అనేవి మన దగ్గర మిగిలి ఉండవు.నాగరికులు ఆదర్శంగా చెప్పుకుంటున్న అమెరికా తన సహజ వనరులను తన వాటిని అలస్కా లాంటి చోట అట్టీ నిలువ చేసుకుంటున్నది.సరే మనలాంటి వారికి అమెరికా ఆదర్శం కాదు గాని,ఎవరయితే వనరులను విచ్చలవిడిగా వాడుకుంటున్నారో వాళ్ళే పొదు పు గురించి చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది.

No comments:

Post a Comment