Wednesday, March 3, 2010

చట్టాలు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి?

చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్ట్ కు వెళ్ళడం జరిగింది,3వ అదనపు సెస్సియన్ కోర్ట్ లో కూచున్నాను.జడ్జ్ ఆదేశం మేరకు ఐదుగురు ముద్దాయిలను ప్రవేశ పెట్టారు.అభియోగం ఏమిటంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ ఫారం లోని కాపర్ వైర్ దొంగిలించారు.ఎలక్ట్రి సిటీ అధికారులు,పోలీస్ అధికారులు కోర్ట్ కు వచ్చినారు.వాంగ్మూలం ఇచ్చారు.బహుశా శిక్ష కూడా పదే అవకాశం ఉన్నట్లే అనిపించింది.ఆ ఆరుగురు కలిసి దొంగలించిన సొత్తు మహా అయితే ఐదు వేల రూపాయల విలువ చేస్తుంది కావచ్చు.భారత శిక్షా స్మృతిలో ఎవరు తప్పు చేసిన శిక్ష పడవలసినదే.
బార్ అసోసియేషన్ లో స్క్రోలింగ్ లో హైద్రాబాద్ సెంట్రల్ షాప్ 2.80 కోట్ల పన్ను కట్టనందున షాప్ మూసివేశారు.అంతే.ఉద్దేశ పూర్వకంగా అన్నీ కోట్ల రూపాయలు సంవస్తారాల తరబడి కట్టక పోతే సింపుల్ గా దుకాణానికి తాళం వేశారు.రెండు సంధార్భాలలో న్యాయం సమంగా పాటించబడినట్లు అనిపించ లేదు.
అలాగే మరో సంఘటన కూడా నాకు చాలా బాధ కలిగించింది.కరీంనగర్ పక్కన్నే బద్దిపల్లి అని ఒక గ్రామం ఉంది.కరీంనగర్ చుట్టుపక్కల అన్నీ గుట్టలు ఉన్నాయి. చాలావరకు ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే.ఇంతవరదక ఆ భూముల్లో గ్రామస్తులు పశువులను గడ్డి మేపుకునే వారు.శీతకాలం లో గుట్టలపైనా కాసె సీతాఫలం పండ్లను కోసుకొని తినేవారు.ఇండ్ల నిర్మాణానికి అవసరమైన బండ రాళ్లను పగుల గొట్టి తెచ్చుకునే వాళ్ళు.ఆ గుత్తలు ఆ గ్రామస్తుల సమిస్టీ ఆస్తి గా పరిగ నించే వాళ్ళు.కానీ ఆ బండ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు అని తేలడం ప్రస్తుతం ఆ ఊరికి శాపం అయింది.అధికార,ప్రతిపక్ష నాయకమన్యుల అనుచరగణలు తమకున్న పరపతిని ఉపయోగించుకొని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి పొంది చుట్టూ కంచే వేశారు.పెద్ద పెద్ద పోక్లైన్ లతో తవ్విస్తూ గ్రానైట్ ను తరలించుక పోతున్నారు.ఇంతవరదాక ఆ ఊరి సమిస్టి సంపద గా ఉన్న ఆ గుట్టలు కొద్ది మందికి సంపదగా మారిపోయింది.సరే అది కూడా అభివృద్ది యే గదా అంటారేమో.కానీ ఆ ఊరి పశువులకు తిరిగేదానికి జాగా లేకుండా పోయింది.రేప్ రేపు ఇండ్లూ కట్టుకోవడానికి బండ రాళ్ళు కరువై పొనున్నాయి.అన్నిటికంటే ఆ గ్రామం లో ఈ గుట్టలను పెకిలించి తవ్వి తీయడం మూలాన భూగర్భ జలాలు అడుగంటి తగు నీరు సాగు నీరుకు కరువు వచ్చే పరిస్థితి దాపురించింది.అవి గ్రానైట్ రాళ్ళు కావడం ఆ ఊరి ప్రజలు చేసుకున్న పాపమా?సరే ప్రకృతి వనరులను వాడుకోవడం వల్లనే కదా అభివృధి అనియంటే మరి ఆ గ్రామ ప్రజ్లకు దక్కుతున్నది ఏమీలేదుకదా?ఇది ఎవరి అభివృధి అవుతున్నది అబు ఆ గ్రామస్తులు అడుగుతున్నారు కానీ వారికి జవాబు చెప్పేవాళ్లే ఎవరు కనినిపించడం లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.
ఎవరి సంపద ఎవరి జేబుల్లోకి వెల్లుతున్నది,ఎవరు దొంగలు ఎవరు దోపిడీలు చేస్తున్నారు ఎవరు జైళ్ళలోకి వెళ్లాలి.మన చట్టాలు ఎవరిని జైళ్ళలోకి పెంపుతున్నాయి.మన అధికారులు మన పోలీస్ లు ఎవరికి రక్షణగా నిలుస్తున్నాయి ఆలోచిస్తే రాజ్యం స్వభావం ఇంతేకదా అనిపిస్తున్నది.

No comments:

Post a Comment