Wednesday, April 7, 2010

దేవాదుల-నీళ్ళు-నిధులు-దాని మతలబు.

గోదావరి నదికి ప్రాణహిత,ఇంద్రావతి రెండు పెద్ద నదులు కలిసిన తర్వాత ఆనాడు ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ కడుదాం అనుకుంటే అది ఇప్పుడుకాస్తా

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం తుపాకుల గూడెం గ్రామపంచాయతి లోని గంగారామ్ గ్రామం వద్ద జువ్వాడి చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల

పథకం పేరుతో సోనియమ్మ మార్చి 14,2008 నాడు ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.మొదటి విడతలో ఒక్కొక్క మోటార్ సామర్థ్యం 8.5 మేఘావాట్ట్

విద్యుత్ శక్తి అవసరముతో రెండు మోటర్లు నడుస్తున్నాయి.రెండవ ఫేస్ లో 12.5 మేఘావాట్ట్ సామర్థ్యం తో రెండు మోటార్లు నడుస్తాయత.ఇక్కడ నీటి

మట్టం సముద్రమట్టం నుండి 70 మీటర్ల ఎత్తున ఉంది.అయితే ఇక్కడి నుండి 287 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తారట.ఇప్పటి లెక్కల ప్రకారం పైప్ లైన్

పొడవు 138.9 కిలోమీటర్లు.ఆయకట్టు 78 లక్షల ఎకరాలు.(సరే ఇప్పటికీ ఒక్క ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వలేదు అదివేరే సంగతి)ఈ ప్రాజెక్ట్ అంచనా

వ్యయం 1844 కోట్లు.ఇది లిఫ్ట్ చేసే నీళ్ళు కేవలం 5.18 టి ఎం సి లు మాత్రమే.అవసరమైన విద్యుత్తు ప్రస్తుతం రెండు ఫేస్ లకు కలిసి 42 మేఘవాట్ట్స్

శక్తిగల మోటార్లను నడిపెటంతటి విద్యుత్తు కావాలి.

ప్రాజెక్ట్ ఇంటెక్ నుండి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న రెడ్డిపల్లి అనే గ్రామం వాళ్ళు ఇప్పటికీ 4 కిలోమీటర్ల దూరం లో ఉన్న

కనుకునూరు నుండి నీళ్ళు మోసుకొని తెచ్చుకుంటారు. ఈ దేవాదుల ప్రాజెక్ట్ వాళ్ళకు నీళ్ళు తగడానికి కూడా ఇవ్వదు కానీ 140 కిలోమీటర్ల దూరం

లోని పట్టణానికి మాత్రం నీళ్ళు ఇస్తుంది.మేము కొందరం అడ్వకేట్లము దేవాదులను చూద్దాం అని అక్కడికి 4 మార్చ్ నాడు వెళ్ళినము.ప్రాజెక్ట్ కు నీళ్ళు

గోదావరి నది నుండి అందడం లేదు.ఇక్కడ నది ఉత్తరం నుండి దక్షణం ప్రవహిస్తూ దేవాదుల సైట్ వద్ద మలుపు తిరిగి తూర్పు వైపు ప్రవహిస్తున్నది

ఎత్తిపోతల కొరకు మోటార్లు బిగించిన వద్ద కు నీళ్ళు రావడానికి ఒక కాలువ తీశారు.ప్రస్తుతం ఆ కాలువలోనికి నది నీళ్ళు రావడం లేదు ఇక్కడ నదికి

అడ్డుకట్ట లాంటిది ఏమీ లేదు.నది నిండుగా నీళ్ళు వస్తేనే మోటర్లకు అందేవిధంగా నీళ్ళు వస్తాయి.అంటే వర్షాలు పుష్కలంగా పడ్డ సమయం లో నే

ప్రాజెక్ట్ లో నీళ్ళు ఉంటాయన్న మాట.వార్హాభావ పరిస్థితి ఉంటే నీళ్లు మోటర్లకు అండవు.వర్షాలు సక్రమంగా పది చాలినంత విద్యుత్తు ఇవ్వగలిగేతే

1844 కోట్ల రూపాయలతో జువ్వాది చొక్కరావు ప్రాజెక్ట్ అందించే నీళ్ళు 5.18 టి ఎం సి లు.జల యజ్ఞం పేరుతో తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న

నిధులు నీళ్ళు దాని మతలబు.

No comments:

Post a Comment