Tuesday, July 6, 2010

ఎవరి సంపదను ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు ఎవరికి సొమ్ములు ఇస్తున్నారు?

ధా రాజా తథా ప్రజా అనేది పాత సామెత ఇప్పుడు యథాప్రజా తథా రాజా అంటూ ఒక ఎలక్ట్రానిక్ ఛానెల్ చర్చ నిర్వహిస్తున్నది.
ఆ చర్చలో మాట్లాడుతున్న నాయకులు ఎన్నికలల్లో ప్రజలు ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు కనుక అధికారం
లోనికి వచ్చిన తర్వాత మాకూ తీసుకోక తప్పడం లేదు అంటూ అది అంతా ప్రజల తప్పే అని అంటున్నారు. ఈ చర్చ ను గమనిస్తూ
ఉంటే రాజకీయ నాయకుల అవినీతికి ఈ చానల్ ఒక లెజిట్మెసి కల్పించినట్లు గా ఉన్నది. అవినీతిని సార్వజనీ కరణ చేస్తూ
అక్రమ సంపాదన తప్పు కాదు,అవకాశం దొరికినపుడు ఎవరైనా సంపాదించుకుంటారు,అలా సంపాదిస్తేనే కదా ఎవరైనా మళ్ళీ
అధికారం లోకి వచ్చేది అని ఒక నూతన కాకపోయినా ఆదర్షాలకు భిన్నంగా ఇదే ఈ కాలపు ఆదర్శం అని చెప్తున్నారు.
చిన్నా చితకా అధికారులు ఏమో కానీ ఒక మోస్తరు అధికారం అంటే తన అధికారం వలన ప్రజలకు చీమ కాలంత మేలు జరిగినా
ఆయనకు అదనపు సంపాదన వచ్చి తీరుతున్నది.చిన్న గుమాస్తా నుండి ఐ ఏ ఎస్ అధికారి వరకు,హోమ్ గార్డ్ నుండి డి జి పి
వరకు,గ్రామ సర్పంచి నుండి ముఖ్య మంత్రుల వరకు లక్షల కోట్ల సంపాదన కూడ బెట్టుకుంటున్నట్లు వాటిని విదేశీ బ్యాంకులల్లో
దాచుకుంటున్నట్లు ఆయా వ్యక్తుల ప్రత్యర్తుల విమర్శలల్లో వింటున్నాము. వాళ్ళే మన పాలకులు. వాల్లనే ఆరాధిస్తూ మళ్ళీ మళ్ళీ
వాళ్ళే కావాలని ఓట్లు వేసి ఎన్నుకుంటున్నాము. వాళ్ళ ఆస్తులను అధికారాలను కాపాడదానికి మనకున్న రక్షణ వ్యవస్తాను
అడ్డం పెడుతున్నాము. చట్టాలను రూపొందించే అధికారాలను కట్టబెడుతున్నాము. కనుక తమకు సంక్రమిస్తున్న అధికారాలను
సుస్తిరం చేసుకోవడానికి రాజకీయ నాయకులు,వారి తర్వాత వారి వారసులు అధికారం కోసం ఏమయినా చేస్తున్నారు.
ఆ మద్యన ఒక పాంప్లెట్ చూసాను. వై యస్ రాజా రెడ్డి మంచి ఒడ్డు పొడుగు ఉన్న పహిల్వాన్ అనీ,కడప జిల్లాలోని ఒక ముగ్గు
రాళ్ల క్వారీ యజమాని వద్ద కులీలను అజమాయిషీ చేయడానికి నియమించబడి కొంత కాలానికి అక్కడ లభిస్తున్న లాభాలను
చూసి క్వారి యజమానిని భౌతికంగా తొలగించి తానే క్వారిలను ఆక్రమించుకున్నాడని రాశారు. ఆ తర్వాత ఆయన కుమారులు
అప్పటికే క్వారీల ద్వారా లభించిన లాభాల పెట్టుబడితో శాసన సభకు గెలిచిన రాజశేఖర్ రెడ్డి పైన అసెంబ్లీ వద్దనే హత్యా
ప్రయత్నం కూడా చేసినట్లు ఆ పాంప్లెట్ లో రాశారు. దాని పైన ఎవరు కూడా కౌంటర్ చేయలేదు కూడా. అంటే రాజ్యాధికారం
ద్వారా ఒక కుటుంబానికి కేవలం ఒక్క తరం లోనే రెండో తరానికి ముఖ్య పదవిని కొనుక్కోగలిగినంతటి సంపద సంపాదించుకునే
అవకాశం లభించింది.ఆ ముఖ్యమంత్రి పదవి దక్కక పోయే సరికి ఆ యువ రాజు ఊరూ వాడా ఎలా ఏకం చేస్తున్నాడో
చూస్తున్నాము.
మన రాజ్యాంగం ప్రకారం ,లభించిన రాజ్యాధికారం తోటి దేశం లో ఉన్న సహజ వనరులు,ఉత్పత్తి అవుతున్న సంపద అంతా
ప్రజలందరికి సమానంగా పంచవలసిన బాధ్యతను విస్మరించి సహజ వనరులను,సంపదలను వాళ్ళే వ్యక్తిగత ఆస్తులుగా
మార్చుకుంటున్నారు. ఆ అధికారం తోటే ప్రజల డబ్బులతోటే పోషించ బడుతున్న రక్షణ యంత్రంగాన్ని తమకు,తమ ఆస్తులకు
రక్షణగా వాడుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని ఎవరయినా గొంతెత్తిటే ఆ గొంతుకలను ఉత్తరిస్తున్నారు.
మహాత్మా గాంధీ వాళ్ళు నిత్యం జపించే వ్యక్తి. ఆయనే ఒక సారి ఏమన్నాడంటే నీ కనీస అవసరాలకు మించి నీ వద్ద ఒక్క
రూపాయి ఉన్నా అది నీ పక్కవానికి చెందవలసినదే. అంటే నీ జేబులో ఉన్న రూపాయి వాని జేబులోనుండి నీవు దొంగిలించినదే అని అన్నాడు
అక్రమంగా సంపాదించిన ఈ అవినీతి సొమ్ము అంతా ఎవరికి చెందాలి? ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజలు త్యాగమూర్తులా? లేక
సకల సౌఖ్యాలు ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధుల?

No comments:

Post a Comment