Saturday, February 4, 2012

I A S lu evari pakshamo telchukovaali.

ఐ ఏ ఎస్ లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధ ఆవేదన వెళ్ళగక్కిన తీరు చూసిన తర్వాత సామాన్య జనాలు గూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నపుడు ఈ అధికారులే అది తమ
బాధ్యత కానట్లు తిక్క తిక్క జవాబులు ఇచ్చి అడ్డమైన ప్రశ్నలు వేసి అవమాన పరచిన సంఘటనలు వాళ్లకు జ్ఞాపకం వచ్చినాయో లేదో?
1 ) మేముమాత్రమే అవినీతికి పాల్పడ్డామ?
2 )రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడడం లేదా?
3 ) పెద్ద చేపలను వదిలి వేసి చిన్న చేపల ను పట్టుకుంటున్నారు.
4 ) సి బి ఐ విచారణ మర్యాద గా లేదు.
5 ) క్యాబినెట్ ది సంబందిత మంత్రి దే బాధ్యత.
6 ) కోడ్ అఫ్ కండక్ట్ ప్రకారం సి బి ఐ విచారించడం లేదు.
7 ) కోట్లు లంచాలు తిన్న వారిని వదిలేసి మా వెంట పడుతున్నారు.
చెంద్ర బాబు నాయుడు , రాజశేఖర్ రెడ్డి లు అసెంబ్లీ లో ఒకరి అవినీతిని మరొకరి ఆడిపోసుకున్నట్టు ఇప్పుడు ఐ ఏ ఎస్ లు క్యాబినెట్ ను ఆడిపోసుకుంటున్నారు.
అంటే మాది అవినీతి లేదు అని మాట వరుసకు కూడ అనలేనంతటి అవినీతి లో ఐ ఏ ఎస్ లు కూరుక పోయినారు. ముందు రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించి
ఆ తర్వాత మమ్ములను ప్రశ్నించండి అంటున్నారు.ఎంత దిగ జారి పోయినారు గదా ఈ అధికారులు.
ఒక ఉపాధి హామీ రోజు కూలి ని నీవు 120 రూపాయలు తీసుకొని ఇదేనా చేసిన పని అంటే తవ్వని మట్టిని ఎత్తి పోసినట్టు ట్రాక్టర్ కు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి ,
చేయని పనిని రికార్డ్ చేసి వేలకు వేలు డబ్బులు తీసుకోవడం ఏమి నీతి , అందరికి అక్కరకు వచ్చే భూములను ఓపెన్ కాస్త పేరిట తవ్వి వేయడం ఎట్లా అభివృద్ది , గుట్టలను
కొండలను కూల్చి వేసి కొనరికి గ్రానైట్ జిగేల్ లు కొందరికి దుమ్ము ధూలి, హేమటైటు, దోలమైటు , క్వారీలు తవ్వి అలివిగాని కాలుష్యం అభివృద్ధా అంటే నన్ను నువ్వు అడుగకు
నిన్ను నేను అడుగ . ఇద్దరం గలిసి ఉకున్నోని కాళ్ళ కింద నెల తవ్వుక పోదాం . ఇక అవినీతిని ఎవ్వరు కూడా ప్రశ్నించ వద్దు అంటున్నారు.
ఐ ఏ ఎస్ ల ను అడుగనంత వరకు రాజకీయ నాయకుల గురించి వారు ఎప్పుడు మాట్లాడ లేదు. క్యాబినెట్ లో రాజకీయ నాయకులు చేస్తున్న ఎన్నో నీతి బాహ్యమైన చర్యలను సమర్థిస్తూ ప్రశ్నించే ప్రజల నోళ్లను ఎందరో ఐ పి ఎస్ లు ఎందరో ఐ ఏ ఎస్ లు ముయించినారు. ఒకరి అవినీతిని ఒకరు చట్టాల పేరుతొ నిబంధనల పేరుతొ సమర్థించిన వారే. కాని ఇంత బాహాటంగా జరుగుతున్నా అవినీతిని ఏదో తు తు మంత్రంగా నన్నా చల్లార్చకుంటే రేపు ప్రజలల్లోకి ఏ మొఖం పెట్టుకొని పోగలం అనుకొన్న రాజకీయ నాయకులు అసలు దొంగలను వదిలి వేస్తూ అంతకాగిన వాళ్ళను కొందరినన్నా కొంచెం మందలిద్దాం అని చిన్న ప్రయత్నం చేస్తే మా బంగారుకన్నం లో వేలుబెడితే
మేము కుత్తమా అంటున్నారు.
అయ్యా ! మా పోరగాండ్లు మా తెలంగాణా మాకు కావాన్నని జై తెలంగాణా అంటే జైళ్లల్ల బెడితిరి, మా బిడ్డలను యునివర్సిటీ రూములల్లకు జొరబడి గొడ్లను బాదినట్టు బాదితిరి.
మా గ్రామాల్ల పోరగాండ్లు ఈ దొంగా రాజకీయ నాయకుల బండారం బయటబెడితే ఎన్కౌంటర్ చేసి పారేస్తిరి . విచారణ కమిటీల ముందు కు వచ్చి తమ పోరాగాన్డ్లను ఎవ్వరు చంపినారో చెబుతాం అంటే గూడా చెప్పనివ్వ కుండా అడ్డుబడితిరి. మీకు కోడ్ అఫ్ కండక్ట్ లు ఉన్నట్టే మాకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఉన్నదంటే మీకు దిక్కున్న
చోట చెప్పుకో అంటిరి. ఒక నాడు రాజులు దొరలూ జమీందారులు పార్లమెంటులోకి వచ్చి వాళ్లకు అనుకూలమైన చట్టాలు చేసుకున్నారు.ఇప్పుడు కాంట్రాక్టర్లు , వ్యాపారస్తులు
గుండాలు , ఖునికోరులు ఎన్నిక కాబడి వాళ్లకు అనుకూలంగా చట్టాలు జేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తాము చేస్తున్న చట్టాల ద్వారా తమ వర్గానికి లబ్ది
చేకూర్చాలని చూస్తున్నారు. గొప్ప గొప్ప చదువులు చదివి న ఐ ఏ ఎస్ లు ఐ పి ఎస్ లు ఏ ప్రజల ఉప్పుదిని తాము బ్రతుకుతున్నారో ఆ ప్రజల పక్షాన నిలబడు తారో
లేక ప్రజల కష్టార్జితం తో బాటు గా వాళ్లకు చెందవలసిన వనరులను అన్నింటిని గంప గుత్తాగా కొల్ల గోడుతున్న రాజకీయ నాయకుల వైపు నిలుస్తారో నిర్నయిన్చుకోవాల్సిన
సమయం ఆసన్న మైంది.
వాళ్ళు యూదులకొసమ్ వచ్చిండ్రు. నేను యూదును కాదు కనుక అడ్డుజెప్పలేదు. వాళ్ళు కమ్యునిస్టుల కోసం వచ్చిండ్రు, నేను కమ్యునిస్టును కాను కనుక అడ్డుజెప్పలేదు.
వాళ్ళు మిలిటెంట్ల కోసం వచ్చిండ్రు . నేను మిలితెన్టును కాను కనుక అడ్డుజెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు నీ కోసం వచ్చిండ్రు.. ఇప్పుడైనా అడ్డుజేప్పకుంటే ఇంకా నీవు ఎవరికోసం బతుకుతవు నీ బతుకు వృధా యే కదా?
పెంటయ్య. వీరగొని.
కరీంనగర్.

No comments:

Post a Comment