Saturday, August 16, 2014

సర్వాయి పాపన్న తాత్వికత !

      క్రీ|| శ || 1649 లో ఇంగ్లండు లో మొదటి చార్లెస్  ను ఆలివర్ క్రమ్ వెల్ ఉరి దీసి ఇంగ్లీశ్ నిరంకుశ రాచరి-

కత్వానికి సమాధి కట్టడం జరిగింది. రాచరిక , భూస్వామ్య విధానాలతో వారికి  కొమ్ముకాసిన మతకర్తల తో 

విసిగి పోయిన ఫ్రాన్స్ ప్రజల మనో భావాలకు పదును పెట్టడానికి ఆ సమాజం నుండి మతం అజ్ఞానానికి 

మోసానికి మూలం అంటూ వాల్టెయర్ ముందుకు వస్తే రూసో మరో అడుగు ముందుకు వేసి " మానవులు 

అందరు పుట్టుకతో సామానులు,కానీ ఈ సమాజం వ్యక్తిగత ఆస్తి హక్కు నొకదాన్ని తెచ్చి అసమానతలు 

సృస్టించడం వల్లే , యజమాని-- దాసుడు, జ్ఞాని --అజ్ఞాని, పేద -- ధనిక వర్గాలుగా విభజింప బడ్డారు అన్నాడు 

ఇక్కడ భారత దేశం లో ఆనాటికి బ్రాహ్మణీయ సాంప్రదాయ తర తరాల ఛాందస వాద నలను పూర్వ పరమ్ 

జేస్తూ కబీర్, గురునానక్, తుకారాం,సామ్ దేవ్, సంత్ రోహి దాస్, లాంటి వారి సాంఘిక మత తిరుగు బాట్ల కు 

కోన సాగింపుగా సర్వాయి పాపన్న తెలంగాణ లో తెరమీదికి వచ్చినాడు.

     ఆనాటికి సామాన్యులకు ప్రతీక  అయిన  వీర శైవాన్ని పాపన్న కుటుంబం ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

కులీనుల వలెనే తాము మత ఆచారాలు ఆచరిస్తున్నప్పటికినీ  అగ్ర కులాలకు లభిస్తున్న ఆదరణ తమకు 

దొరుకని తీరు గమనించిన పాపన్న మతం పైన తిరుగు బాటు చేసిండు. ఆనాటికి దక్కను లో ఒక వెలుగు 

వెలుగుతున్న మరాఠా సర్ధార్ శివాజీ, బీజా పూర్ మరియు గోలకొండ నవాబు తానీషా కలిసి మొఘలుల 

అధికారాన్ని ధిక్కరించే ప్రయత్నం లో ఉన్నారని గ్రహించిన ఔరంగా జీబ్ వారికంటే తానే ముందుగా 

గోల్కొండ పైన దండయాత్ర జెసి అక్కన్న, మాదన్నలను చంపివేసి తానేశాను ఖైదు లో వేశాడు.గోల్కొండ 

మిగతా నాలుగు సంస్తానాలు గుల్బర్గా, బీదర్, అహ్మద్ నగర్ బేరార్ లతో నిత్యం గర్శన జరుగుతున్న 

కారణంగా సైనిక పదాతి దళాలు నిరంతరం గ్రామాల మీదుగా ప్రయాణం చేస్తుండడం వలన కల్లు 

మండువాల్లో కల్లు అమ్ముకునే  పాపన్న లాంటి విచక్షణా పరులకు ఆధిపత్యం కోసం జరుగున్న పోరాటాలు

అర్థం కాసాగినాయి. 

యుద్ధ అవసరాల కోసం ప్రజల పైన వేస్తున్న పన్నులు , అవి కట్ట లేక. తీవ్ర అసంతృప్తి తో ఉన్న ప్రజలు 

 అవకాశం ఉంటే తిరుగు బాటుకు సిద్ధంగా ఉన్నట్లుగా పాపన్న గమనించి నట్లు తెలుస్తోంది.

.      తండ్రి లేని పాపన్నకు పితృస్వామిక ఆధిపత్యం లేనందున కొంత స్వతంత్ర భావనలతో పెరిగి ఉంటాడు.

అందుకే సైనిక పదాతి దళాలు తన గ్రామం గుండా పోతున్నప్పుడు వారు కల్లు పోయుమని ఇబ్బంది 

పెట్టడం , పోయకుంటే కొట్టడం, ప్రజల వద్ద ఉన్న కోళ్ళు గొర్రెలను బలవంతంగా లాక్కు వెళ్ళడం చూసిన 

పాపన్న వాళ్ళ దౌర్జన్యానికి చరమ గీతం పాడాలనుకున్నాడు. వారి రాజకీయాధికారాన్ని ఓడించాలను 

కున్నాడు . రాజ్యాధికారం సాధించాలంటే సంత సైన్యం అవసరాన్ని గుర్తించాడు. దానికి అవసరమైన 

సొమ్ము ను తన ఇంటి నుండే సమకూరిస్తే విశ్వస నీయత పెరుగుతుంది అనుకున్నాడు. అందుకే తన తల్లి 

తన భవిష్యత్ కోసం దాచి పెట్టిన సొమ్ము తోనే తన మొదటి ఆయుధాన్ని సమకూర్చుకున్నాడు. ఆయన 

నిజాయితీ, పేదలను ప్రేమించే గుణం, ఆధి పత్యాన్ని, అణిచి వేతను సహించ లేని లక్షణం పాపన్నను 

మొఘల్ సామ్రాజ్యాధి పత్యానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగు బాటుకు ప్రోత్సహించింది. షాపురం ,

(పాపన్న ఖిలా కట్టిన తర్వాత ఖిలాషపురం అయింది.) తాడికొండ, సర్వాయి పేట,ధూల్ మిట్ట లో పాపన్న 

కట్టిన కోటలు చూస్తే తన పరిమితమైన ఆర్థిక వనరులతో అంతటి కోటలు ఎట్లా కట్టగలిగినాడో ఆశ్చర్యం

వేస్తుంది. పాపన్న కోటలో లేనప్పుడు తాటికొండ ఫోర్ట్ పైన దిలావర్ ఖాన్ దాడి జెసి పాపన్న ఖజానా లెక్కల

పుస్తకాన్ని స్వాధీన పర్చుకొని  నాలుగు రోజుల పాటు చూస్తే గాని అవి ఒడువ లేదట. అంటే తనకు ఎంత 

ఆర్థిక నిబద్ధత ఉందో అర్థం జేసుకోవచ్చు .అలాగే బంది పోటు, దారిదోపిడి గాడని దోపిడీ వర్గాల 

ప్రతినిధులు కొందరు బహదూర్ షా తో మొర బెట్టుకుంటే 20 వేల సైన్యాన్ని ఇచ్చి యూసుఫ్ ఖాన్ ను 

పాపన్నను చంపి రమ్మని పంపిస్తే , పాపన్న తాను అతని తో తలపడకుండానే తన సైన్యాధి కరిని పంపి 

మార్గ మధ్యం లోనే యూసుఫ్ ఖాన్ ను మట్టు బెట్ట గలిగాడంటే పాపన్న యెంతటి యుద్ధ కుశలుడో 

అర్థం జేసుకోవచ్చు. 

          పాపన్న సర్వాయి పేట లో ఎత్తయిన గుట్టల పైన నిర్మించిన తన కోట పైకి వెళ్ళే టప్పుడు, కోట

 నుండి బయటకు వెళ్ళేటప్పుడు  ఆయన తన ఆరాధ్య దైవం బయ్యన్న కు  మొక్కి వెళ్ళేవాడట . 

ఎవరీ బయ్యన్న? ఒక దిగంబర మూర్తి. కుడి వైపు నాలుగు చేతులు ఎడమ వైపు నాలాగు చేతులు 

ఉన్నాయి . ఢమరుకం, యమపాశం, గద, కమలం, కుడి వైపు చేతుల్లో ఉంటే ఎడమ వైపు చేతుల్లో 

శూలం, విల్లు , సర్పం, నరుకబడిన శత్రువు తల ఉన్నాయి. కుక్క &, బుద్ధుడు పద్మాసనం లో ఉన్నాడు. 

ప్రకృతిని ఆరాధించే వాడని, మజీద్, మందిర మతాలను త్రోసిరాజని బౌద్ధం ఆచరించే వాడని అర్థం .

అవుతున్నది. దిగంబరత్వం నిరాడంబరతను తెలుపుతుంటే తన వర్గ శత్రు నిర్మూలతలో ఆయుధాల 

ఉపయోగం తెలిపే విధంగా ఉందా విగ్రహం. ప్రపంచం లోనే అంత పెద్ధ భైరవ మూర్తి మరెక్కడా లేదు అని 

తెలుస్తోంది. ప్రస్తుతం శష్ట్రీయంగా ఎంతో అభివృద్ధి చెందిన సామాజిక శాస్త్రం  మార్క్సిస్ట్ తత్వశాష్ట్రాన్ని  క్రీ||పూ||

535--475 లో హెరాక్లిటస్, 460--370 లో డెమోక్రట్స , క్రీ || పూ|| 4వ శతాబ్ధం లో సోక్రటీస్ , అతని 

శిష్యులు ప్లేటో ప్రశిష్యుడు అరిస్టాటిల్, ఆ తర్వాత పాపన్న కాలపు బర్కెలే దాకా ఎందరో తత్వ వేత్తలు  

పరిపుస్టమ్ జేస్తే పాపన్న ఆచరణ కూడా ఈ వాదానికి తన కంట్రీబూషన్ అందించినాడని చెప్పడానికి 

ఇంకా శాష్ట్రీయమైన చరిత్ర పరిశోధన  పాపన్న కంటెక్స్ లో జరుగాల్సి ఉంది.

1 comment:

  1. very nice write-up saw the movie "sarvaayi paapanna" as jaggaayya in it.I thought It was a fiction then.now I knew that he is a historical person,OK!

    ReplyDelete