Thursday, August 14, 2014

సర్వాయి పాపన్న జయంతిని దళిత బహుజనులందరు  పండుగలా జరుపుకోవాల్సిన అవసరం

 ఏమిటి? అన్న విషయాన్ని ఇప్పటికైనా మనం లోతుగా ఆలోచించాలి.

.   1650 ఆగస్ట్ 18 న పాపన్న పుట్టిన నాటికి మనకు ఇంకా ఒక జ్యోతి బా ఫూలే గానీ ఒక బాబా సాహెబ్ 

అంబేడ్కర్ .గానీ జన్మించ లేదు. అలాగే ఫూలే వలె గానీ అంబేడ్కర్ వలె గానీ చదువుకున్న వాడు గాదు. 

కానీ ఆనాడు  బడుగు బలహీన వర్గాల హక్కుల ను అనగదొక్కు తున్న వైదిక, మహ్మదీయ మతాలను 

త్రోసి రాజని దళితులను  ఎల్లమ్మ, పోచమ్మ గుడుల్లో పూజార్లు గా నియమించినట్లు పాపన్న  చరిత్ర లో

  ఉంది. నేడు 21 వ శతాబ్ధం లో జరుగుతున్న వర్గ పోరును పాపన్న 17 వ శతాబ్ధం లోనే చేసి చూపించిన

 వైతాళికుడు. ఆనాటికి మార్క్సిసమ్. గానీ మావో ఇజామ్ గానీ లేని ఒక ఫ్యూడల్ వ్యవస్త రాజ్యమేలు 

తున్న  

కాలం. దళిత బహుజనులకు ఆస్తి కలిగి ఉండే హక్కు గానీ, ఆయుధాలు ధరించి యుద్ధ  యోధులు గా 

జీవితాలు గడిపేపరిస్తితి గాని లేని కాలం లో ,సర్వాయి పాపన్న హాసన్, హుసేన్,తుర్క ఇమామ్, దూదేకుల పీర్,

 కోత్వాల్ మీర్ సాహెబ్ , అనే అయిదుగురు ముస్లిములను, హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి 

మానన్న,కుమ్మరి గోవిందు, మేదరి ఎంకన్న యెరుకల సిట్టేలు జక్కుల పెరుమాళ్ళు యేనాది పాసేల్ , 

లాంటి 20,000 మంది దళిత బహు జనులతో దండు కట్ట గలిగినాడు.అదీ కేవలం వరంగల్ , కరీంనగర్, 

నల్గొండ, మరియు మేదక్ జిల్లాల నుండే,  ప్రబుత్వ మాటల్లోనే వామ పక్ష తీవ్రవాద ఉద్యమాల సైన్యం అన్నీ

 రాష్ట్రాలల్లో కలిసి30 సంవస్తారాల తర్వాత  40 వేలు ఉన్నదట. అంటే ఆనాటి ప్రజల దయనీయమైన జీవన 

స్తితిగతులతో బాటుగా పాపన్న నాయకత్వ లక్షణాలను గూడా మనం పరిగణించాలి .

            ఆయన టిప్పు సుల్తాన్ వలెనో  , ఝాన్సీ లక్ష్మి బాయి వలేనో , లేదా తొలి స్వాతంత్ర ఉద్యమం లో 

పోరాడిన రాజుల , చక్రవర్తుల  వలె నో  తన రాజ్యం దక్కించు కోవడానికి పోరాడిన వాడు కాదు . ఆయనకు

 రాజ్యమే లేదు. కేవలం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సంపదలో  వారికి దక్క వల్సిన వాటా 

కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టినాడు. కానీ చరిత్ర లో ఆయనకు దక్క వల్సిన చోటు దక్క లేదు. తమ 

తమ మూలాలను పెకిలించి వేస్తున్నాడని కసి తో రగలి పోయిన వైదిక,మహ్మదీయ మతాల సైనికాధి కార్లు 

చరిత్ర కారులు పాపన్న ఆనవాళ్లను చెరిపెసే ప్రయత్నం చేసినారు. ఆయన బ్రెస్ట్ సైజ్ ఫోటో అయిన లండన్ 

లో ఉన్నది కనుక ఆ మాత్రమైన ఆ చిత్రం మిగిలింది . 1710 లో ఆయన మరణించి నట్లు చెబుతున్నారు .

ఆయన మరణించిన తర్వాత దాదాపు 165 సంవస్తారాలకు 1874  లో J A బోయేల్ కర్ణాటక రాష్ట్రం లోని 

బళ్ళారి లో ఒక జాన పద గాయకుని నోట విన్న పాటను ఆయన ఆంగ్లం లో రాసుకున్నాడు. దాన్ని 1909 

లో రికార్డు లోకి ఎక్కించాడు.తిరిగి 1974 లో జెన్ రొగేర్ గుంటూరు లో విన్న పాట ను రికార్డ్ చేశారట. 

ఆయన పుట్టింది వరంగల్ జిల్లా ఘనపురం మండలం ఖిలాషపురం. ఆయన నడయాడిన నేల నేటి 

తెలంగాణ పోరు గడ్డ. అన్ని సంవస్తారాల తర్వాత ఒక పరాయి దేశస్తుడు పరాయి ప్రాంతం లో ఏదో విని ఏదో 

రాస్తే దాన్ని మనం పాపన్న చరిత్ర గా ఎలా స్వీకరిస్తాం? 

   ఇవ్వాళ మన తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకం లో చేర్చాలన్న

డిమాండ్ చాలా  బలంగా వస్తున్నది . అవును తప్పకుండా చేర్చవల్సిందే. యూరప్ లోని ఆలివర్ క్రామ్ వెల్  
.వలె మన పాపన్న భారతీయ తొలి తెలుగు ప్రజాస్వామిక విప్లవ వీరుడు. ఆయన చరిత్రను శాస్త్రీయంగా 

పరిశోధించి తవ్వి తీసి భావి తరాలకు అందించ వల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం స్వీకరించాలి.

       కల్లు గీసుకొని, పసుల గాసు కొని బతికిన పాపన్న కు అత్యంత బల శాలి అయిన మొఘల్ 

సామ్రాజ్యాన్నే ఎదిరించాలన్న ధైర్యం ఎట్లా వచ్చింది? ఆనాడు తెలంగాణ మాత్రమే గాకుండా మొత్తం దక్కన్ 

ప్రాంతపు ఆర్థిక సామాజిక పరిస్తితి పాపన్నను పోరు బాట వైపు ఎలా పురి కొల్పింది? తెలంగాణ లోఆనాటికి 

భూమి తో బాటు ఆర్థిక వనరులన్నింటి పైనా పెత్తనం మరియు ఆయుధాలు తిప్ప గలిగిన అధికారం గల 

 వెలమ, రెడ్డి కులాల పెత్తందార్లు పాపన్న జయించిన కోట ను విదేశీయు లైనప్పటికినీ తమ మతం గానీ 

ముస్లిం  రాజు లకే మళ్ళీ ఎందుకు అప్పగించాలను కొన్నారు ? ఆనాడు తాము వలచిన స్త్రీలను 

బలవంతంతంగా అయినా పెళ్లి జేసుకొనే అవకాశం ఉన్నప్పటికినీ పాపన్న తాను కోరుకున్న స్త్రీని తనకిచ్చి 

పెళ్లి జేయిమని అడిగినాడే గానీ బలవంత పెట్టని సంస్కారం కలిగిన పాపన్నను స్త్రీల పైనా అఘాయిత్యాలు 

చేసినాడని చేసిన దుష్ప్రచారం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో, అవి ఇప్పటికీ ఎలా ఆచరణలో

 పెడుతున్నారో, ఆనాటి ఖాజీ ఇనాయత్ షా నుండి నేటి కర్ర పెత్తనం  చేస్తున్న అధికార వర్గాల దాకా ప్రజా 

ఉద్యమాలను బలహీన పర్చడానికి ఎలా బరిదేగిస్తున్నారో పరిశీలించాల్సి ఉంది.

     ఆనాడు పాపన్న జేసిన పోరాటం యొక్క కొనసాగింపే  ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ఉద్యమాలు 

అన్న అవగాహనతో పరిశోధన జేస్తే వర్తమాన ఉద్యమాలకు ఎంతో మేలు జరగడం తో బాటుగా తన రక్తం తో 

తెలంగాణ గడ్డను ఎరుపెక్కించిన పాపన్నకు ఇప్పిటికైనా ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము. 

                                                                                                                 వీరగొని పెంటయ్య 

                                                                                          విశ్రాంత విద్యా పర్యవేక్షణ అధికారి .  

No comments:

Post a Comment