Saturday, September 7, 2019

చంద్రయాన్ లు ఎవరికోసం ,ఎందుకోసం?

                   చంద్రయాన్ 2 ప్రయోగం ఎవరి కోసం ఎందుకోసం ? 

1969 జులై 20 నాడు అపోలో 11 స్పేస్ ఫ్లైట్ ను అమెరికా రోదసి లోకి ప్రవేశ పెట్టింది. దానికి నాయకత్వం వహించిన నీలార్మ్స్త్రాంగ్ చంద్రుని పైన కాలు మోపి 21.5 కిలోల చంద్ర శిలలు భూమి పైకి తీసుకొని తెచ్చిండు. ఇది చరిత్ర.  అమెరికా లోని టెక్సాస్ స్టేట్ హ్యూస్టన్ నగరం లోని లండన్ బి జాన్సన్ నాసా కేంద్రం లో ప్రదర్శనకు పెట్టిన ఆ చంద్ర శిలలను, నేను 2014 లో ముట్టుకొని చూసి నపుడు, నాకు ఒక అనుమానం వచ్చింది.అప్పటికే అక్కడ మానవ నివాసం సాధ్య పడదని తెలిసినా కూడా  ఎందుకు ఇంత వ్యయ ప్రయాసకు ఓర్చి చంద్రుని పైకి వెళ్ళి ఈ శిలలు సేకరించుక వచ్చారన్నది నా అనుమానం. దానికోసం చరిత్రలోకి కొంచం తొంగి చూద్దాం. 

పరుల సొమ్ము, ఆస్తిపాస్తుల  ఆక్రమణ , వారి పైన ఆధిపత్యం  కోసం యుధ్ధం అవసరం. యుద్ధం కోసం ఆయుధాలు అవసరం. రాతి గొడ్డన్లు, గదలు, విల్లు అమ్ములు, మందుగుండు, తుపాకులు, డైనమేట్స్,   ICBMS అంటే ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిస్సైల్స్ , వాటిని మోసక వెళ్లడానికి యుధ్ధవిమానాలు, రాకెట్లు అవసరం అయినాయి.ఇదీ ఆయుధాల క్రమమ్ నుండి ఎదిగివచ్చిన ఒక పరంపర. 1930 లోనే జర్మనీ దేశం మల్టీ స్టేజెడ్ రాకెట్స్ ను కలిగి ఉంది. అంటే సెప్టెంబర్ 1945 రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసే సరికి ఆ దేశం రోదసి శాస్త్రం లో ఆ 15 ఏండ్ల కాలం లో ఎంత పురోభివృధ్ధి సాధించిందో మన అర్థం చేసుకో వచ్చు. అలా అభివృధ్ధి చెందిన సాంకేతికతను రెండవ ప్రపంచ యుధ్ధం తర్వాత ఒక వైపు అమెరికా మరో వైపు రష్యా చేజిక్కించుకుంది. ఆపరేషన్ పేపర్ క్లిప్ పేరుతో అమెరికా రాకెట్ టెక్నాలజీ ని రహస్యంగా తరలించుకు పోయింది. అందులో 1,600 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు ఉండగా 100v 2 రాకెట్ ఆపరేషన్ రహస్య పత్రాలు ఉన్నాయి. మిట్టెల్ వర్క్ సైట్ నుండి రష్యా v2 బలాస్టిక్ మిసైల్స్, v1 ఫ్లయింగ్ బాంబ్స్ తయారీ టెక్నాలజీ తీసుకు వెళ్లింది. ఆ రెండు దేశాలు జర్మనీ నుండి తస్కరించుకొని తెచ్చుకున్న టెక్నాలజీ ని అభివృధ్ధి పరుచుకొని తమ అవసరాలకోసం వాడుకొనే క్రమం ప్రారంభం అయింది.  

1945 తర్వాత నుండి 1991 USSR అంతరించేదాకా ఆ రెండు,( అమెరిక రష్య)  పవర్ గ్రూప్ ల ఆధిపత్య పోట్లాటను చరిత్రలో అందరం చదువుకున్నాం. అయితే యుధ్ధ తంత్రాల రచనలో మేము ఆధిపత్యం లో ఉన్నాం అంటే మేము ఉన్నాము అని ప్రపంచానికి తెలియ జేసె కొరకు అమెరికా రష్యాలు పడ్డ పోటీలో వాటికి  రోదసి లోకి వెళ్ళడం ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. ఆ క్రమం లో నవంబర్ 3, 1957 లో మాస్కో లోని వీధి కుక్క లైకా ను రష్యా రోదసిలోకి పంపింది. 1959 లో లునా 1, 1961 యూరీ గగారిన్,ఆ తర్వాత ఘోర్మాణ్ టైటాన్, వాలెంటీనా వ్లాడిమీరొవ్ణ ను రోదసి లోకి పంపింది. 1963 లో రష్యా స్టేట్ డ్యూమా సభ్యురాలు భూమి చుట్టూ రోదసి లో 48 సార్లు , దాదాపు మూడు రోజులు రోదసి లో గడిపింది. 1964 లో వాస్కోల్ 1 అని ఒకరికంటే ఎక్కువ మందిని రోదసిలోకి మోసుకు పొగలిగిన వ్యోమ నౌకను, లియోనోవా అనే ఒక స్పేస్ వాక్ ను రష్యా వారు ప్రయోగించారు. మధ్య యుగాలల్లో దక్షిణ భారత దేశం లో చోళులు , పాండ్యుల పరిపాలన కాలం లో ఒకరికంటే ఒకరం గొప్పవాళ్లం అని నిరూపించుకోవడానికి ఆలయాలు కట్టినట్లు చరిత్ర.    అలా వచ్చిందే భారత దేశానికి శిల్పకళా వారసత్వ సంపద అయిన బృహదాలయం. అదే విధంగా 1968 లోనే అమెరికా రోదసి క్యాప్టెన్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపైకి పంపి మీరు కుక్కలను పి‌ఐ‌ఎల్లులను పంపితే మేము ఏకంగా మనుషులనే పంపగలుగుతాము చూడండి అని ప్రపంచానికి ఛాటి చెప్పింది. ఆయన చంద్రుని పైన కాలు మోపి చంద్ర శిలలు తెచ్చి ప్రపంచానికి 50 సంవస్తారాలకిందనే చూపిండు. ఇదంతా వాళ్ళు పనిలేక గాదు, ఒకరికంటే ఒకరం యుధ్ధ నైపుణ్యం కలిగిన వారం తస్మాత్ జాగ్రత్త మా జోలికి వస్తే అని ప్రపంచానికి ఛాటి చెప్పడానికే అలా చేశారు. విచిత్రం ఏమిటంటే 21 జులై 1987 లో వారిద్దరు కలిసి కూడా అపోలో సోయేజ్ మిషన్ ను కూడా ప్రయోగించారు. రష్యా శిబిరం కుప్పకూలి పోయిన తర్వాత ఏక ధృవ ప్రపంచం అయిన అమెరికా కు ఇక ఆ అవసరం తీరిపోయింది.  

ఇప్పుడు మనం చంద్రుని పైకి ఒక చంద్రయాన్ 2 ప్రయోగించి పెద్ద ఆగమ్ ఆగమ్ చేస్తున్నము.22 జులై న ,  దాన్ని ప్రయోగించేనాడు పాఠశాలలల్లో పంతుళ్ళు చదువులు చెప్పడం మానేసి పిల్లలతో టీవి లముందు ఆ అపురూప దృశ్యాలను తిలకిస్తూ కూచున్న విషయం చూసినమ్, మీడియా సైతం నభూతో నభవిష్యత్ అంటూ ఎంతగా డబ్బాలు వాయించినాయంటే ఆ గ్లోబెల్ గాన్ని మించి పోయినయ్. సరే దీనితో మన దేశానికి ఒరిగే ప్రయోజనం ఏందో నాకైతే సమజ్ అయితలేదు. రోదసి లోకి పంపే ఆ వస్తువులు అన్నీ మనం బయటి దేశాలనుండి కొనుగోలు జేసి తెస్తున్నవే. ఇంతవరదాకా మనం ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా సమకూరిన ప్రయోజనం ఏమంటే జియో కంపనీ కి ఆ టెక్నాలజీ అతి చౌకగా అమ్మి ప్రజలకు తక్కువ దర లో  నెట్ సౌకర్యం కలుగ జేయడం. కాదంటే కొన్ని పేద దేశాలకు మన ఉపగ్రహాల ద్వారా సేవలు అందించే మార్కెట్ ను చేజిక్కించుకోవడం. కొండంత రాగం దీసి ఏదో పాటబాడినట్టు ఉన్నది సంగతి. ఇప్పుడు భూకేంద్రం తో లింక్ తెగిపోయిన తర్వాత లక్షలల్లో వేతనం , ఏసీ గదులల్లో నివాసం ఉంటూ , కంప్యూటర్ల ముందు కూర్చొని 130 కోట్ల మంది భారత ప్రజలకు వాళ్ళు చేస్తున్న పని ఏమి ఉపాధి కలిపిస్తుందో, ఏ నాగరికత నేర్పింస్తుందో తెలియదు గాని ఆ శాస్త్రజ్ఞులు వారి ప్రాణాలు ప్రాణమొడ్డి నారని ప్రధాని ప్రశంసిస్తుంటే , ఒక వైపు రైతులు , నేత కార్మికులు , పతి రోజు వందల సంఖ్యలో చనిపోతుంటే వాళ్ళ ప్రాణాల గురించి ఒక్క నాడు ఎంపతి చూపని మన నాఊయకులు , చంద్రయాన్ ఆగిపోతే అంత స్పందనా? ఏమి మన రైతులు, ప్రాణాలు పోతున్నాయి గదా ?  అలాగే నల్లమలలో పర్యావరణాన్ని ఎంతో కొంత మెరకైనా కాపాడుతున్న అడవులను , గుట్టలను తవ్వుమని ప్రజా పయోజన వ్యతిరేకమైన సిఫారసుజేసిన ఆ అణుశాస్త్రజ్ఞుల బాధ్యతా రాహిత్యం మన పాలకులకు గొప్ప హితంగా కనిపిస్తున్నది . 

2008 లో యుపియే ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం లో 390 కోట్లతో చంద్రయాన్ 1 , ఇప్పుడు 978 కోట్ల రూపాయలు పెట్టి చంద్రయాన్ 2 ప్రయోగాలు అన్నీ కూడా భారత ప్రజలు ఎదురుకుంటున్న మౌలిక సమస్యలను పక్కదారి పట్టించడానికి చేస్తున్న ఒక భూస్వామ్య,పితృస్వామిక లక్షణాలైన పరువు ప్రతిస్టా అనే ఒక పనికి రాని వ్యవహారమే దప్ప మరోటి గాదు. 

రైతులు ఎరువులు లభించక , అతివృస్టి, అనావృస్టి , వలన బాధపడుతూ పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు దరలు లేక రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యం అయిపోతున్న చోట,సీజనల్ వ్యాధులను అరికట్టలేక నిత్యం ప్రజలు వేల సంఖ్యలో ఆసుపత్రుల ముందు బారులు  కట్టిన అనారోగ్యం ఒకవైపు, చదువుల సంగతిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగించి చేతులు దులుపుకున్న ఈ పాలక వర్గాలు, నేల పైన ప్రజల సమస్యలను వదిలేసి ఆకాశం వైపు చూపడం హాస్యాస్పదం.

గుజరాత్ లో సోమనాథ్ దేవాలయం నుండి తమిళనాడులో బృహదాలయం మధ్యలో మన తిరుపతి వేంకటేశ్వర స్వామి లాంటి అతి గొప్ప గొప్ప ఆలయాలు ఉండగా మనకేమి తక్కువ అంటూ 1800 కోట్లతో యాదగిరి గుడి కట్టిన చందమే , మన చంద్రయాన్లు. మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్న చందం ఉంది మన పాలకుల పాలన.  

No comments:

Post a Comment