Thursday, April 20, 2017

మనుసుల మాట 2

                                                    
మొన్న ఒక రోజు మా ఉపాధ్యాయ ఉద్యమ మిత్రుడు పెద్దపల్లి లో ఉండే జీవన్ రాజు గారి వద్దకు వెళ్ళిన. అంతకు ముందు ఆయనకు నేను వాట్స్ అప్ లో ఇక పోస్ట్ పంపించి ఉంటి . అందులో కార్పొరేట్ స్కూల్ హాస్టల్ లో చదువే ఒక పిల్లవాని వేదన, బాధ ఎట్లా ఉంటదో ఆ అబ్బాయే రాసినట్టు, ఆ వాట్స్ అప్ పోస్ట్ లో ఉంది. .  ఆ విషయం ఆయన గుర్తు జేసి మీరు పంపిన పోస్టులో పసివాళ్ళ బాల్యాన్ని తలిదండ్రులే ఎలా నలిపివేస్తున్నారో బాగానే చెప్పిండ్రు గాని, వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది సార్ అన్నాడు.
అవునా ఎట్లా ఉందేమిటీ అన్నాను.
మా మనుమడు ఇంట్లో అసలు చదువడు, ఆయనకు ఎప్పుడు చేతిల ఐ పాడ్ ఉండాలే , లేదంటే స్మార్ట్ ఫోన్ ఉండాలే, ఇయ్యకుంటే ఇల్లుపీకి పందిరి వేస్తడు . ముందుగాల తల్లులు అన్నం తినిపించేటప్పుడు వాటిని అలువాటుజేస్తున్నారు . ఆ అలువాటు ను వాళ్ళు మరువ లేక పోతున్నరు. అని అంటూ ఇంకో ఉదాహరణ చెపుతానంటూ , ఒక యెంగ్ ఫాదర్  తనకు పుట్టిన తొలుసూరు కొడుకును అతిగారాబంగా పెంచి, ఇతడు ఎటు పోయినా బండి మీద వెంట తీసుక పోవుడు అలువాటు జేసిండట . ఆఖరుకు వాడు అయ్యలెందే అడుగు ఆవల పెట్టని పరిస్తితి అట.  బడికి గూడా నువ్వు అక్కడ ఉంటేనే నేను ఉంటా అని మారాం జేస్తున్నాడట . ఇగ ఇట్లా జేస్తే గాదని , ఆ పిల్లవాన్ని హాస్టల్ లో వేసి వచ్చిండట. అని చెప్పుతూ తన మనువడిని గూడా హాస్టల్ లో వేసి వచ్చినమ్ అన్నడు.
ఆ తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలో చాలా మంది తలిదండ్రులు పిల్లలను అతి గారాబం జేస్తున్నారు అనీ , , తమ కు ఏదైతే ఎంతో కస్టపడితే గాని అందలేదో అది తమ  పిల్లలకు  కస్టమ్ లేకుండా అందాలన్న తపన, ఆరాటం లో వాళ్ళకు అడిగిండల్లా అందిస్తూ , పిల్లలు తాము ఏదీ కోరినా తమ తలిదండ్రులు ఏదో విధంగా అందిస్తారు లే అనే సూత్రీకరణకు వచ్చే విధంగా తలిదండ్రులే కారణం అవుతున్నారనీ ,  తాము కస్టపడి దాన్ని సంపాదించుకోవాలి, కస్టపడితే గాని దాన్ని పొందలేము అన్న జ్ఞానం వారికి అందకుండా తలిదండ్రులే పిల్లలను ఈ రకంగా తయారు జేస్తున్నారని అనుకున్నాము. మన కాలం లో మన పిల్లలు ఇట్లా చూసిందల్లా అడుగక పోదురు. ఒక వేల అడిగినా అది మనకు అందుబాటులో ఉండని విషయం వాళ్ళకు చేప్బితే అర్థం జేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కొందరు పిల్లలైతే ఎవరి ప్రభావమో గానీ ఇసోంటోనివి మరి మమ్ములను ఎందుకు కన్నవని గూడా అడుగుతున్నరట , అని ఆశ్చర్య పోయినమ్.
ఇంతల నాకు ఒక విషయం యాదికి వచ్చి ఇద్దరం షేర్ జేసుకున్నం. కరీంనగర్ శివారులో ప్రతిమా మెడికల్ కాలేజీ ఉంటది. దానికి సమీపం లోని హోటల్ లో నేను ఒకసారి చాయ్ దాగుతున్న. ఇంతల నలుగురైదుగురు మెడికల్ విద్యార్థులు కూడా అక్కడికి చాయ్ కు వచ్చిండ్రు. వాళ్ళంతా హౌస్ సర్జన్ జేస్తున్నట్టు అర్థం అయింది. హౌస్ సర్జన్  తర్వాత ఏమి జేసుడు అని వాళ్ళ మధ్య చర్చ వచ్చింది.
" మా డాడీ ది పెద్ద నర్సింగ్ హోమ్ . నాకు పెద్దగా కస్టపడవలసిన అవసరం లేదు. ఈ ఎంబీ బిఎస్స్ సీటు గూడా మా డాడీ కొని ఇచ్చిందే " అని ఒకరు అంటే, మరొకరేమో " మా డాడీ ఎన్ని కొట్లైనా ఖర్చు పెట్టి నాకు పీజీ సీటు కొని ఇస్తాడనీ " అనుకుంటున్నరు. డబ్బులు పెట్టి విద్యా కొనుక్కోవడం , మళ్ళీ వడ్డీతో సహా వసూలు జేసుకోవడం అయిపోతున్నదికదా అని  అనుకుంటూ ,  ప్రొఫెషనలిజం ఎక్కడున్నది అని ఇద్దరం వాపోయినమ్. .

మహా విప్లవ యోధుడు , రెవెల్యూషనరీ లెజెండ్ గా పిలువబడే  " చేగువెరా " , తాను డాక్టర్ చదువు చదివినప్పటికినీ తాను డాక్టర్ గా కంటే విప్లవకారునిగా సమాజానికి ఎక్కువ న్యాయం చేయగలనని నమ్మి  , అమెరికా  ఆధిపత్య ధోరణితో లాటిన్ అమెరికా దేశాలను అణిచివేస్తన్నప్పుడు ఆయన దక్షిణ అమెరికా లోని గ్యాటిమాల లో విప్లవమ్ లేవదీసి దాన్ని ఇతర లాటిన్ అమెరికా దేశాలకు విస్తరింప జేసిన వాడు, ఫెడరల్ క్యాస్త్రో ప్రభుత్వం లో మంత్రిగా, విదేశీ రాయబారిగా ,కమ్యూనిస్ట్ ప్రభుత్వం లో ఎన్నో బాధ్యతల్లో  పనిజేసిన వాడు . అలాంటి ఆయన కొడుకు ఒక సారి ఏదో వేదిక నుండి మాట్లాడుతూ " మా నాన్న మాకు ఏమీ సంపాదించి కూడబెట్టకుండా మాకు మహోపకారం జేసిండని " చెప్పిండట . కానీ మనకు ఇప్పుడు, అంబానీలు, ఆదానీలు ఆదర్శమై పోతున్నారు.తమ సంతానానికి సంపద కూడా బెట్టి ఇస్తే సరిపాయే , విలువల వలువలు ఎంత ఊసిపోయినా మాసిపోయినా ఫరువాలేదని తలిదండ్రులు,  తమ తమ అయ్యవ్వలు సంపద కూడా బెట్టి ఇవ్వాలని పిల్లలు భావిస్తున్న పరిస్తితి.

No comments:

Post a Comment