Friday, April 28, 2017

మనుసుల మాట 3 .

                                                        

1990 దశకం లో ఓరుగల్లు పోరుగడ్డ పైన పది లక్షల మంది తో , తమ జీవించే హక్కుకోసం ,సమాన అవకాశాల కోసం,  సమ సమాజం కోసం  రైతు కూలీ లందరూ కలిసి  మహా సభలు జరుపుకున్నరు. ఆ సభలల్లో పాట లు విన్నవారికి గుర్తుండే ఉంటుంది, పాట పాలక వర్గాన్ని , తమ హక్కుల కోసం, నిలదీసింది, ప్రజల హక్కులు పాలకవర్గాన్నుండి కాపాడుకోవడం  కోసం కలిసి ఉద్యమించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. కానీ " ఆకాశంబునందుండి  ,  హిమాలయ సానువుల పైనుండి, శివుని ఝటా ఝూటము నందుండి " గంగా , ఉత్తుంగ తరంగాన్నుండి , భూమి పైకి  దునికి వచ్చి భగీరథుని పూర్వీకుల స్మితా భస్మం పునీతమ్ జేయడానికి , గంగానది తలవంచుకొని భగీతతుని అడుగుజాడల వెంట నడిచినట్టుగా నిన్న అదే  ఓరుగల్లు పోరుగడ్డ నుండి పాట రాజుల రాజరికాన్ని కీర్తిస్తూ నర్తించిన విధానం చూసిన తర్వాత మనుసుల కలిగిన భావనలు మీతో పంచుకుందామని ఇది రాస్తున్నాను.

1857 లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర యుధ్ధం లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు లో బ్రిటిష పరిపాలన వలన అణిచివేతకు గురైన అనేక ప్రాంతాల రాజులు వారి సైన్యం పాల్గొన్నప్పటికినీ దానికి నాయకత్వం కావాల్సి వచ్చినప్పుడు 81 సంవస్తారాల వృధ్ద్ధుడైన మొఘల్ వంశస్తుడైన బహదూర్ షా ను ముందు నిలుపుకోవాల్సి వచ్చింది. ఇక్కడ తెలంగాణ లో ఏమి జరిగిందో కూడా ఒకసారి చూద్దాం.  

మొఘలుల తాబేదారుగా నియమించబడిన అసఫ్జాహీ వంశస్తుడైన నిజాం చక్రవర్తి పాలన సాగుతున్న కాలం లో నైజాం పేరు తో పాలన జేస్తున్న స్టానిక దొరలు భూస్వాముల ఆగడాలు మితిమీరిన ఫలితంగా తెలంగాణ లో రైతుకూలీలంతా ఏకమై నిజాం అధికార, ఆర్థిక ,  మూలాలకు ఆయువుపట్టైన దొరల గడీలా పైన తిరుగుబాటు జేసిండ్రు . దాన్నీ తెలంగాణ సాయుధ పోరాటం గా చెప్పుకుంటున్నం,. అప్పుడు కామ్రేడ్ యాదగిరి పాడిన " బండేనుక బండి గట్టి ", సుద్దాల  హనుమంతు పాడిన " పల్లెటూరి పిల్లగాడ" లాంటి అనేక పాటలు ప్రజలను సమీకరించడానికి , దొరతనం పైన పోరాటం జేయడానికి ప్రజలకు గుండె ధైర్ణం ఇచ్చినయి. అణిచివేతను, ఆధిపత్యాన్ని సహించని లక్షణం మూలవాసులది. ఆ మూలాలనుండి పుట్టి పెరిగి వచ్చిన తెలంగాణ సమాజం నిరంకుశ నిజాం పాలనను కూల్చివేయడానికి పాటను ఆయుధంగా వాడుకున్నది. భారత యూనియన్ సర్కారు సేనలు నిజాము ను లొంగదీసుకొనే పేరు తో తెలంగాణ లో ప్రవేశించి పనిలో పని గా తెలంగాణ సాయుధ పోరాటాన్ని తన " ఉక్కు పాదం " తో సమూలంగా తొక్కి వేసింది.

1948 నుండి 1969 దాకా 21 యేండ్ల కాంగ్రెస్ పాలనలో కూడా  తెలంగాణ సమాజానికి దక్కవలసిన హక్కులు దక్కక పోవడం చేత తొలి దశ ఉద్యమం 1969 వచ్చింది. ఇక్కడ కూడా తెలంగాణ పాట ప్రధాన పాత్ర పోషించింది.  అది కూడా ఉక్కు పాదం తో అణిచివేయబడిన తర్వాత , 1970 లోవచ్చిన  వసంత మేఘా ఘర్జనలకు మేఘాలు ద్రవించి వర్షం కురిసినట్లుగా తెలంగాణ లో దొర తనానికి వ్యతిరేకంగా , ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాటను ఆలంబన జేసుకొని ఒక గూడ అంజన్న, ఒక గద్దర్, ఒక సంజీవ్, ఒక జయరాజన్న, దొర ఏందిరో దొర పీకుడేందిరో అని నిలదీసుడు షురూ జేసిండ్రు. లక్షలాది మంది వారివెనుక దండుగట్టిండ్రు. సహించలేని కాంగ్రెస్ సర్కారుగానీ, ఆ తర్వాత వచ్చిన టి.డి.పి. సర్కారు గాని అదే ఉక్కు పాదం తో అణిచివేత పేరుతో తెలంగాణ ఉద్యమ కారులను పట్టుకొని కాల్చి చంపిన చరిత్ర చదివినమ్. కానీ కనీసం  రాజ్యాంగ విహితమైన ప్రత్యేక తెలంగాణ ఐనా సాధించుకుందాం అని  1997 వరంగల్ డిక్లరేషన్ , ఆకుల భూమయ్య కన్వీనర్ గా తెలంగాణ జనసభ, పాశం యాదగిరి కన్వీనర్ గా తెలంగాణ ఐక్య కార్యా చరణ కమిటీ జీవన్మరణ పోరాటాలు జెసి ఎందరో కార్యకర్తలను పోగొట్టుకున్నది. ముందు వరుసల ఉన్న నాయకత్వం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడినప్పటికినీ అనుచర గణాలు మాత్రం, అణిచివేతనుండి కొంత వెసులుబాటు దొరికితే బాగుండుననుకుంటున్న కాలం లో 2001 లో వచ్చిన ఈ రాజకీయ పార్టీ వచ్చింది.  ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాటం జేస్తున్న వారికి ఈ రాజకీయ పార్టీ ,  ఒక కవచం వలె ఉపయోగ పడుతుందనుకొన్నారు.   ఫలితంగ ముందువరుసలో ఉండి  పోరాటం జేస్తున్న శక్తులన్నీ ఇటువైపు రాలీ అయినాయి. మిలియన్ మార్చ్ , సాగరహారం, సకలజనుల సమ్మె లాంటి అనేక పోరాటాలకు  వెన్ను దన్నుగా నిలిచింది  మాత్రం మొదటినుండి చెప్పుక వస్తున్న తెలంగాణ  పోరువారసత్వమే !  దాని ఫలితమే  భౌగోళిక తెలంగాణ .

  1857 సైనిక్ మ్యుటినీ అణిచివేయబడింది. తిరుగుబాటు లో పాల్గొన్న యుద్ధయోధులను చంపివేస్తే నాయకత్వం వహించిన నేరానికి బహదూర్ షా రాజభరణం రద్దుజేసి జైల్లో వేస్తారు. ఆ మ్యుటినీ గెలిచి ఉంటే బహదూర్ షా మళ్ళీ చక్రవర్తి అయ్యేవాడు.  పాపం ఆయన పోరాటం లో భాగస్వామి కాకపోయినా గూడా !  ( చెప్పవలిసిన చెరిత్ర ఇంకా చాలా మిగిలే పోయింది, సంక్షిప్తత దృస్ట్యా ముగిస్తున్నాను)

No comments:

Post a Comment