Tuesday, January 17, 2012

adiyunu okanduku manchide!

అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ బెంగుళూర్ లో చదువుతున్న విద్యార్థులు కామన్ స్కూల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తాము ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నతమైన వాళ్ళం
అయిఉన్నాము, మమ్ముల్ని మాతో సమానంగా సరితూగ లేని పిల్లల సరసన కూర్చొని చదువుకోనాలని శాసించే హక్కు ప్రభుత్వాలకు ఉండడం అంటే మా వ్యక్తీ గత స్వేచ్చకు భంగకరం అవుతుంది
అని వాళ్ళు బాధపడి పోతూ అక్కడ కామన్ స్కూల్ విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నా ప్రొఫెసర్ జి.హరగోపాల్ గారి ప్రసంగాన్ని అడ్డుకోన్నారని చదివినాము.
జ్ఞానం. విద్య , సంస్కృతీ , సంస్కారం ఒక మనిషికి ఎక్కడ నుండి లభిస్తాయి అని ప్రశ్నించుకుంటే అవి ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానో వచ్చేటివి కావు , అవి మనుషులు ఈ భూమి మీద
సంచరిస్తున్నప్పటినుండి ఒకరి నుండి ఒకరికి, ఒక సమూహం నుండి మరొక సమూహానికి, ఒక తరం నుండి మరొక తరానికి,ఇచ్చి పుచ్చుకున్న వ్యవహారాలని అర్థం అవుతాయి.మనిషి బ్రతుకదానికి
ప్రాథమికంగా స్వాశించడానికి గాలి తర్వాత అత్యంత ప్రాథమిక అవసరం ఆహారం. ఆ ఆహార సంపాదనలో మనిషి అనేక వేల సంవస్తరాలు పెనుగులాడి, బతుకు పోరాటం జేసి స్తావర జీవితాలకు వచ్చిన
తర్వాత వ్యవసాయం అభివృద్ది జేసుకొని మిగులు ఉత్పత్తి సంపాదించుకున్న తర్వాత ఆ మిగులు సంపదను గతం లో వలె అందరికి సమానంగా పంచకుండా కొందరే దాన్ని దాచుకొనే క్రమం వచ్చిన
తర్వాత సంపద ఎవరివద్దనైతే పోగు అవుతూ పోయిందో వారి ఆధిపత్యం పెరుగుతూ పోయిన విధం చరిత్రలో చూస్తుంటాము. తాము కుదబెట్టుకొన్న సంపదను మరొకరు లాగుకొని వెళ్ళకుండా సైన్యం
కావాల్సి వచ్చ్సింది, సైన్యం తో బాటుగా రాజ్యం వచ్చ్సింది. చిన్న చిన్న రాజ్యాలు ఓడగోట్టబడుతున్నందున సామ్రాజ్యాల అవసరం వచ్చింది. ఈ క్రమం లో ఉత్పత్తిలో భాగస్వాములు కాక పోతున్న
వారి సేవలకు కూడా ప్రతిఫలం ఇవ్వవలసిన పరిస్తితి లో ఉత్పత్తితికి మూలాధారమైన భూమికి అధిపతి రాజు , భూసురుడు. భూమి అంతా ఆయనకే చెందుతుంది కనుక ఆ భూమిని ఎవరు సేద్యానికి
ఉపయోన్చినా రాజుకు పన్ను చెల్లించాలి అనే చట్టం చేసినారు.. అట్లా సేవారంగం లో ఉన్నవారికి ప్రజల కష్టార్జితం వెళ్ళడం ప్రారంభం అయింది. సేవారంగం లో ఉన్నవారికి నిరంతరం ఆహార అన్వేషణలో
పెనుగులాట తప్పింది. వారికి ఆలోచించడానికి విశ్రాంతి లభించింది . విశ్రాంత జీవులు ప్రకృతుని నిశితంగా పరిశీలించి సూర్య, చంద్రుల గతి, ఉరుము,మెరుపు, మేఘాలు వర్షించడం,పంటలు పండడం,
అగ్గిని కనుక్కోవడం చక్రాన్ని, లోహాన్ని కనుక్కోవడం జరిగింది, ఆ శ్రామికులు ఈ సేవారంగం లో ఉన్నవారికి విశ్రాంతి కలిగించకుండా ఉండిఉంటే వీళ్ళకు వాటిని కనుక్కోవడం వీలయ్యేది కాదు. ఆ
కనుక్కున్నా వాళ్ళు అదంతా మా ప్రతిభే అని ఏనాడు అనుకోలేదు. పేటెంట్ హక్కులు తీసుకోలేదు. అదంతా సమాజగాతమే అయ్యింది. ఇంతాగా ప్రజాస్వామిక ఆలోచనలు లేని నాడే ఆ శాస్త్రజ్ఞులు
అది మా ప్రతిభాకాడు అదంతా ప్రజలందరి పైశోధనల ఫలితమే అన్నారు.
రాజ్యాలు రాజులకోరకు అనే భావన పోయి ప్రజాస్వామీకరించాబడి రాజ్యం ప్రజలకోరకే అని అనుకున్న తర్వాత ఆనాటి రాజులు భూస్వాములు, తమ బూజు వాసనలను వదిలించుకోకుండా అవుతున్న
ఉత్పత్తులు, ఉత్పత్తిసాధనాలు అయిన భూమి, పరిశ్రమలు, యంత్రాలు తమవే కనుక ఉత్పత్తి అవుతున్న సంపద తమదే అని శ్రమ పడుతున్న వారికి జీతాలు మాత్రమె ఇస్తాము ఉత్పత్తి సాదహనాల
పైన హక్కులు మాత్రం ఇవ్వము అంటూ తదనుగుణంగా చట్టాలు చేస్తున్నారు. చేస్తున్న చట్టాలు అన్నిగుడా తమ ప్రయోజనాలు నెరవేర్చే విధంగానే ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. ఆ విధంగా సంపద
చదువు కొందరికి మాత్రమె అందుబాటులోకి వచ్చిందన్న విషయం అర్థం అవుతుంది. జరుగుతున్నా సంపదలో హక్కు గురించి ఆలోచించకుండా నిరంతరం సంపద శ్రుస్తిలో పాలు పంచుకొంటున్న
సమూహాలు ఎల్లవేళలా ఆలోచనా రహితంగా ఉండవుకదా? ఇప్పుడు వాళ్ళు తమ హక్కు ను అడుగుతున్నారు. చట్! మీరు మా దగ్గరకు కూడా రావడానికి అర్హత లేని వాళ్ళు అని వాళ్ళను దూరం
కొడితే వాళ్ళు ఘర్షణకు దిగుతారు. సమాజాలల్లో అంతర్యుద్ధం మొదలవు తుంది. అందుకే బూర్జువా మేధావులు, ఫిలాసఫర్స్ ప్రజల హక్కులు కాపాడున్నట్లు నటించాలని అల నటించక నగ్నంగా
బయట పడితే మన అధికారాలకే ఇబ్బంది అని కోల్పోతున్న సమూహాలు రాజ్యాధికారం కోసం తిరుగబడితే అణిచివేతకు హింసను ప్రయోగించ వలసి వస్తుంది ఆ తిరుగుబాటులో మనకు ప్రాణ నష్టం
జరుగుతుంది, కనుక మనం దోచుకు తింటున్న సంపదలో రాలిపడుతున్న తుంపరల ను అయినా వాళ్లకు దక్కేటట్లుచూసుకోవాలి అని చెప్పుకొన్నారు. మనలో కలుపుకోన్నట్లు అయినా నటించాలి
అని రాసుకున్నారు. ఈ పిల్లకాకులను పెంచిన ఆ పెద్దకాకులకు ఈ సామాజిక స్పృహ లేక పోవడం వలన పెద్దకాకుల మాటలను, వాదనలను వినివినీ ఉన్న పిల్లకాకులు అట్లా వాదిస్తున్నారు.
అదియును ఒకందుకు మంచిదే, కోల్పోతున్నవాళ్ళు ఇప్పటికైనా తమలో తాము పోట్లాడుకోవడం ఆపివేసి సంపద అంతా అందరికి సమానంగా చెందే పోరాటాలవైపు సాగిపోతారని ఆశిద్దాం.
పెంటయ్య.వీరగొని.
న్యాయవాది.
కరీంనగర్.

No comments:

Post a Comment