Tuesday, January 10, 2012

telangaana prajalu chustunnaru.

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా చంద్రబాబు పాద యాత్ర చేస్తుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కిరణ్ కుమార్ సర్కార్ బాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికం,
వాస్తవానికి ఈ నినాదం తో ప్రభుత్వాన్ని నిలదీయ గలిగిన నైతికత బాబుకు లేదు. ఇతని హయాం లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రైతులు , ప్రజలు ఎద్యమిస్తే కాచి చంపిన ఒక
అప్రజాస్వామికుడు. మరో విషయం , బాబు యాత్ర శాంతి భద్రతలకు విఘాతం అని. ఎవరి శాంతి, ఎవరి భద్రత? ప్రజలెవ్వరు గూడా చార్జీలు పెంచాలని కోరుకోవడం లేదు.పెంచ వద్దనే అంటారు.
ప్రజల ఉద్దేశానికి మద్దతుగా బాబు ఉద్యమిస్తానంటే ప్రజలేందుకు వద్దంటారు.? ఈ యాత్ర అయితే గియితే కిరణ్ శాంతికి ఇబ్బంది అవుతుందేమో ?
ఇంకో విషయం , అతడు చంద్రబాబు గావచ్చు,కిరణ్ కుమార్ గావచ్చు, అధికార పీఠం అధిస్టించినపుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం జేసి పక్ష పాత రహితంగా , స్వీయ ప్రయోజనాలకు
తావులేకుండా ప్రజలందరికి సమాన న్యాయం చేస్తామని చెప్పి అధికార పీఠం అధిష్టించిన వారే. కాని కోట్లాది ప్రజలకు కష్ట నష్టాలు కలిగే అనేక చర్యలు చేపడుతూ పిడికెడు పెట్టుబడిదారుల
పెట్టుబడులు మరింత పెరిగే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు.తీసుకుంటున్నారు. ముఖ్యంగా , తెలంగాణా నీళ్ళు, భూములు, ఉద్యోగాలు, నిధులు, వనరులు తెలంగాణా ప్రజలకు చెందకుండా
తమ ప్రాంతం వాడని, తమ వర్గం వాడని, తమ కులం వాడని, తమ తమ బంధు మిత్రులకు లబ్ది చేకూర్చినారు. రాజ్యాంగం ప్రకారం ప్రాంతాల భేదం లేకుండా పాలించిన వాళ్ళ నందరిని జైళ్లల్ల
పెట్టాలి.
చంద్ర బాబు వరంగల్ లో పర్యటించినపుడు గాని, ఇపుడు జగన్ నిజామ బాద్ లో పర్యటిస్తున్నపుడు గాని ప్రజలు నిరసనలు తెలుపుతూ వీరి పోరులు, దీక్షలు తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర
ఆకాంక్షను పూర్వ పక్షం చేస్తాయి గాని తెలంగాణా రాష్ట్ర సాధన లక్షాన్ని బలపర్చేవిగా లేవు అని అడ్డు చెప్పినారు. తెలంగాణా ప్రజల శాంతికి విఘాంతం కలుగుతున్నదని రోడ్ల పైకి
వచ్చి అడ్డుకొనే ప్రయత్నం చేసినారు.ప్రజాస్వామ్యం లో ప్రజల అభిప్రాయాన్ని మన్నిస్తేనే ప్రజాస్వామ్యం మనగాలుగుతుందని ప్రజలు నెత్తి నోరు కొట్టికొని చెప్పినారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఇబ్బంది లేకుండా తెలంగాణా వాదం పూర్వ పక్షం అయ్యే పని జరుగు తున్నది కనుక నాయకులను గృహ నిర్బంధం లో పెడుతారు, అయిదు వేల మందిని అరెతుజేస్తారు.వందల సంఖ్యలో
ప్రజల కాళ్ళు,చేతులు విరిచి తలలు పగులగోట్టడానికి తమ బలగాలకు తోడుగా ప్రయివేటు దండులను అనుమతిస్తారు. యునివర్సిటీ హాస్టల్ గదులల్లోకి వెళ్లి ఆడ పిల్లలని గూడా చూడకుండా
ఇష్టం వచ్చినాట్లు కొట్టినా, విద్యార్థుల పైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపినా, ఈ దమన కంద చూడ లేక 800 మంది పిల్లలు తమ ప్రాణాలు దీసుకుటే అటు ప్రభుత్వం గాని ఇటు
ప్రతిపక్షం గాని అది తమకు సంబంధించిన విషయమే గానట్టు ఎక్కడ గుడా ఒక్క మాట మాట్లాడని మీకు ఇవ్వాల రైతుల పెరుజేప్పుకొని తెలంగాణా లో కాలుబట్టే అర్హత ఉందా?
తెలంగాణాకు ప్రధాన అద్దంకి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణా లో నడిపించవలసిన బాధ్యతా కిరణ్ కుమార్ పైన ఉంది. తెండు సార్లూ తెలంగాణా రాకుండా అడ్డుపడిన
చంద్ర బాబుకు తెలంగాణలో కూడా తన పార్టీని బతికిన్చుకోవాల్సిన బాధ్యతా ఉంది. తెలంగాణా నినాదం ఆధారం తో రెండుసార్లు గద్దేనిక్కి తల్లి రొమ్ముగుద్దిన తాయీ గండడు
వై ఎస్సార్,, తనయుడు తండ్రి ఆశయం కోసమట తెలంగాణా లో తన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యతత జగన్ కు కూడా ఉందట. కాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలను కాపాడ
వలసిన బాధ్యత మాత్రం ఎవరికీ లేదు. అలాగే ఈ పార్తీలల్లో తిరుగుతున్నా తెలంగాణా నేతలకు రేపు తమ పార్టీల టిక్కెట్లు గావాలె, ఆ నాయకులు ఇచ్చేలేదా ఇప్పించే డబ్బులు
గావలె .తప్పిజారిపోయి గెలిస్తే అధికారం పంచుకొనే పదవులు గావలె, అంతే గాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలతో వాళ్లకు పని లేదు.తమ నేతల మాటను తెలంగాణా లో తన్నులు
బడి అయినా తన్ని అయినా నెగ్గించి ! భళీరా మన్నీడా, శహబ్బాస్! అంటే , బాంచన్ దొరా, అనే గడీ పాలేర్లుగా నిలబడుతున్నారు.
ఇక అత్యంత ప్రధానమైన విషయం, అందరు అనుకుంటున్నట్టుగా తర తమ భేదాలు లేకుండా అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణా వాదాన్ని తమ తమ మాటల గారడీలతో తమకు
అనుకూలంగా మార్చుకొని ఓట్లను దండుకొని ప్రజాప్రతినిధులుగా గెలిచి అధికారం సంపాయించి సంపద పెంచుకోవడానికే దప్ప ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా
పాలిస్తాము,నడుచుకున్టాము అనే వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించడం లేదు.
రైతుల సమస్యల పేరుతొ చంద్రబాబు గాని, జగన్ గాని , తెలంగాణలో తిరుగుతారట, కాని తెలంగాణా ఇవ్వాలని మాత్రం అనరట. అయినా ఎద్దిబాగుల తనం అందామా ఇంత అవకాశ వాదం,
ఇంత స్వార్థపరత్వం అందామా మన తెలంగాణా నేతలు వాళ్ళ సీమాంధ్ర నాయకులకు వీర బావుటా ఎత్తుతూనే ఉన్నారు . ఇక అదేదో సినిమాలో అన్నట్లుగా పూరేకు పూరా తెలంగాణా వాదం తో
రెండుసార్లు అధికారం లోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళ పార్టి అన్ని పార్టీల అభిప్రాయాన్ని అడుగుతది కాని తమ అభిప్రాయం చెప్పదు. ఇక్కడనేమో వీళ్ళు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటారు.
ఈ రైతు డ్రామాలు,రచ్చబండ డ్రామాలు, ఉపఎన్నికల డ్రామాలు,ఎవరికోసమో,ఎందుకోసమో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు... ఉపఎన్నికలు, మున్సిపాలిటీ, స్తానిక సంస్తలు,
ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు, ఎన్నికలాట. అప్పుడు ఎన్నికల కోసం దప్ప ప్రజల కోసం ఏమీ చేయని , చేయలేని మీకు ఎందుకు ఓటు వేయాలని నిలదీయనున్న తెలంగాణా ప్రజలను
నిలువరించే దమ్ము మీ కిరాయి సైన్యాలకు ఎంత మాత్రం ఉండబోదు .
పెంటయ్య వీరగొని.

No comments:

Post a Comment