Friday, January 27, 2012

sanghatita poraataale sharanyam.

యానం లో వేతనాలకోరకు యాజమాన్యం తో పోరాటం జేస్తున్న కార్మికుల పైన పోలీసులు కాల్పులుజరిపి కార్మిక నాయకుణ్ణి చంపివేసినారు.
పరిస్తితిని చక్కదిద్దేకోరకు అదనపు బలగాలను సంఘటన స్థలి కి పంపినారట. పోయిన పోలీసులు ఎవరికీ మద్దతుగా వెళ్లినట్టు? ముందుగా పోయిన
పోలీసులు కాల్పులు జరుపడం ఎవరికీ రక్షణ కల్పించే కొరకు జరిపినట్టు. ఇంతవరుకు ఎక్కడయినా పోలీసుల కాల్పుల్లో కార్మికులు రైతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి కాని ఎక్కడైనా రైతులో లేక కార్మికుల చేతిలో యజమానులో మరే పెట్టుబడి దారో కాల్చి చంపబడిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. మరి అంత ఖచ్చితమయిన ఆధారాలు ఉన్న కూడా పదే పదే ఈ పోలీసు ప్రభువులు పేద రైతులను , కార్మికులను ఎందుకు కాల్చి చంపుతున్నారో సామాన్యులకు అర్థం కాని విషయం. ఇక్కడ యానం లో ఆ కంపని యజమానికి ఏమైనా ఆర్ధిక నష్టం జరిగితే జరిగి ఉండ వచ్చుగాని చనిపోయిన కార్మిక సోదరుడు అయితే తన కుటుంబ సభ్యులకోసం తిరిగి రాడు. కార్మికుల చమట తో సంపాదించుకున్న ఆస్తి కాలిపోతే మల్లి ఆ కార్మికులే ఆ సంపద అంత సంపాదించే పెడుతారు.
పది పదిహేను రోజుల కింద చెంద్రబాబు రాష్ట్రాన్ని లక్ష కోట్లకు ముంచిన నాయకుని బొమ్మలను ఎక్కడబడితే అక్కడబెడితే కులగోట్టబాడుతాయి అని హేచ్చరించినాడు. దానికి ప్రతిగా ఆ పార్టి నాయకుని ప్రతినిధి మీ ఎన్టీ ఆర్ బొమ్మలు ఉండవు అంటాడు. మా నాయకుని బొమ్మల జోలికి వస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం జేస్తాము అంటారు.కాని ఈ రెండు విగ్రహాలు నిక్షేపంగా ఉంటాయి . ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.అంబేద్కర్ బొమ్మలు కూల్చబడుతున్నయి. దానికి నిరసనగా కేవలం దళిత సంఘాల వాళ్ళు మాత్రమె ఆందోళన చేస్తున్నారుగాని అంబేద్కర్ భారత దేశం మొత్తానికి నాయకుడు కనుక అందరం కలిసి దోషులను శిక్షించే విధంగా కృషి చేస్తాం అనే అన్య వర్గాల వారు కరువైనారు. గణతంత్ర దినోత్సవం నాడు కూడా అంబేద్కర్ బొమ్మ కూల్చబదిన్ది . దోషులను ఎంతటి వారైనా కతినంగా శిఖిస్తాము అని సర్కారు హుంకరిస్తుంది కాని ఏమీ జరుగదు.
ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి కానివ్వండి,అయన జలగం వెంగల రావు కానివ్వండి, ఎన్టి రామ రావు గానివ్వండి, చెంద్రబాబు గానివ్వండి, వైఎస్సార్ గానివ్వండి ముఖ్య మంత్రులుగా పనిజేసిన ఈ పెద్దమనుషులు పదవుల్లోకి వచ్చేటందుకు డబ్బ్లు ఖర్చు చేసిన వాళ్ళే.మళ్ళీ అధికారం లోకి రావడానికి సంపాదించిన వాళ్ళే. తాము మాత్రమె గాకుండా తమ తరతరాలు తిన్న ఒడువని ఆస్తులు సంపాదిస్తారు,తమ సంతానాలు తిరిగి రాజ్యాధికారం లోకి రావడానికి అవసరమైన ఆర్ధిక, రాజకీయ నేపథ్యం ఏర్పాటు చేసి పెడుతారు. ఏ మావోయిస్టులో చెప్పింది గాదు స్వయంగా జాతిపిత గాన్ధిమహాత్ముడే చెప్పిన దేమంటే నీ జేబులో నీ కనీసావసారాలకు మించి ఒక్క రూపాయి ఉన్న అది పక్కవానికి చెందవలసినదే , వాని జేబులో ఉండవలసిన దాన్ని నీవు కాజేసి నట్టే అని అన్నాడు. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుని వద్ద తరతరాలు తిన్న తరుగని ఆస్తి ఉంటది వాళ్ళు అపర అన్నహజారేలవలె ఫోజులు పెడుతున్నారు,మేమే అభివృద్ది చేసినం అంటే మేమే చేసినం అని సొంత డబ్బా వాయించుకుంటున్నారు. పైన తెలిపిన నాయకులు తాము సంపాదించుకున్నది మాత్రమె గాకుండా... మీరు సంపాదించుకున్నది అంతా ప్రజలకు చెంద వలసినదే దాన్ని మేము మీ నుండి కక్కిస్తాము అని నిలదీసిన వేలాది మంది విప్లవ యోధులను చంపించినారు.
అట్లా వాళ్ళు కోట్లు సంపాదించిన నాడుగాని , ప్రశ్నించిన వాళ్ళను చంపివేసిన నాడుగాని ఏ ఒక్కరు ఆ ప్రశ్నించిన వాళ్ళ పక్షాన నిలువక పోగా అట్లా ప్రశ్నించడం నేరము గదా అన్నారు. అట్లా ప్రశ్నించిన ఏ ఒక్కరికి గూడా స్వంత ఇల్లు లేదు.సెంటు భూమి లేదు. బ్యాంకు లో వాళ్లకు అంటూ ఒక్క పైసా బ్యాలెన్సు లేదు. కాని వాళ్ళంతా వేల సంఖ్యలో ప్రజల కోసం ప్రాణాలు సమర్పించినారు. అయినప్పటికీ వాళ్ళ చర్యలను తీవ్రవాద చర్యలు అన్నారు. ప్రజలకు చెందవలసిన వేల , లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ స్వంత ఆస్తులుగా మార్చుకున్న వాళ్ళపట్ల చట్టం తనపని తాను చెసుక పోతుంది అంటారు. ఆ చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కాదుగదా వాళ్ళ జ్ఞాపకార్థం నిర్మించుకున్న స్తూపాలను అవి ఎంత ప్రతిస్తాత్మకం అయినవి అయినా రాతో రాత్ కూల్చివెయబడుతాయి . అరె మావోని ఘోరి అయినా కట్టుకున్టం అంటే ఒప్పుకోబడదు. సాటి మనుషులను చంపినా , వాళ్ళ జ్ఞాపక చిహ్నాలను అలనాటి పిండారీల వలె పేల్చి వేసినా సభ్య సమాజం లో స్పందన ఉండదు.
లక్షలాది ఆదివాసులను నిర్వాసితులను జేసి పోలవరం కడుతామంటే వద్దనే వాళ్ళు కరువౌతారు. వేలాది మంది మత్స కార్మికులకు అన్నం బెట్టె బేల భూములను మల్టినేషనల్ కంపనిలకు అప్పగిస్తామంటే వద్దన్నవాల్లను కాల్చి చంపుతారు. ఆదిలాబాడునుండి ఖమ్మం వరకు లక్షలాది హెక్టార్ల బంగారం పండే సారవంతమైన భూమిని ఓపెన్ కాస్టుల పేరుతొ మరుభూమిగా మార్చి ప్రజలను పక్షుల వలె వలసలకు పంపితే అడ్డుజేప్పిన వాళ్ళను అభువ్రుద్ది నిరోధకులు అని నిందిస్తారు. కోట్ల సంవస్తారాలక్రితం రూపొందిన గుట్టలు ప్రజలకు ఓవర్ హెడ్ తుంకులు అయి వన్య ప్రాణులకూ గృహాలై రక్షణ ఇస్తుంటాయి.ఎవరి ప్రయోజనం కోసమో అవన్నీ ధ్వంసం చేయబడుతాయి , కాని కాదనే వారుండరు. ఇది వర్గాసమాజం దీన్ని అంతం జేయలంటారు కాని అనిచివేయబడుతున్న తెలంగాణా ప్రజలు ప్రత్యెక రాష్ట్రం కోరితే మటుకు అడ్డుజేబుతారు. తెలంగాణ ప్రత్యెక రాష్ట్రం కావాల్సిన్దేనంటారు కాని ఎస్సి వర్గీకరణ మాత్రం వద్దంటారు. నిజంగా నే సంపద అంతా అందరికి సమానంగా పంచాబడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న వాళ్ళంతా తమ తమ భేషజాలు , స్వార్థ ప్రయోజనాలు పక్కనబెట్టి సమిష్టిగా ఉద్యమించవలసిన తక్షణ అవసారాన్ని గుర్తించవలసిన అవసరం బడుగు బలహీన వర్గాల పైననే ఉన్నది.అట్లా సంగటిత పోరాటాలకు ముందుకు రాకుంటే?
ఇవ్వాళ మన నాయకుల విగ్రహాలు కూల్చివెస్తున్నరని , యానం లాంటి చోట మన తోటి కార్మికులను కాల్చి చంపుతున్నారని మొత్తుకొంటే వేట రుచి మరిగిన ఈ మృగారాజులకు వేరు వేరు జేసి వేటాడడం లో ఉన్న ఆ మృగయావినోదం రెట్టింపు అవుతుందే గాని భీతిపడబోవు.
పెంటయ్య.వీరగొని.
అడ్వకేట్
కరీంనగర్,

No comments:

Post a Comment