Sunday, January 22, 2012

apara raajulu!

పూర్వ కాలం లో రాజులు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి మారువేషాల్లో ప్రజల్లో తిరిగి వాళ్ళ అవస్తలు గమనించి ఆ కస్టాలు తీర్చే వారని కథల్లో చదువుకున్నాము.అట్టి రాజులు చాల గొప్ప ప్రజారంజకులు అని ధర్మప్రభువులు అని ప్రజలు కీర్తించే వాళ్ళని కూడా చదువుకున్నాము. కాని ప్రజల కష్టాలకు కారకులు ఎవరో ఆ కథల్లో ఎక్కడ చెప్పిన దాఖలా లేదు. రాజు తన జనానా ఖర్చులకు, తన చీని చీనాంబరాలకు, దిన చర్యలకు,సేవకుల ఖర్చులు, సైన్యాల నిర్వాహణకు, శత్రు రాజులపైకి దండయాత్రలకు, తన రాజ్యవిస్తరనకోసం జరిగే యుద్దాలకోసం సైనికుల , ఆయుధాలకోసం అవసరమైన సొమ్మును ప్రజల నుండే వసూలు చేసే వాడు అని కూడా చదువుకున్నాము, అంటే ప్రజలు పడుతున్న అన్ని కష్టాలకు పరోక్షంగా రాజులే కారకులు అన్న విషయం ఆలోచించే వాళ్లకు అర్థం అయినాగుడా రాజ విధించే శిరచ్చేదం లాంటి శిక్షలకు భయపడి ప్రజలు ప్రశ్నించే వారు కాదు అనే విషయాలు సత్యకామ జాబాలి లాంటి కథల్లో కనిపిస్తుంటాయి.
అది రాజరిక వ్యవస్థ.. కాని ప్రస్తుతం నడుస్తున్నవి ప్రజాస్వామిక ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నాము.ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకోసమే పాలిస్తున్న ప్రభుత్వాలు ఇవి అని పొలిటికల్ సైన్సు లో చదువుతున్నాము.
అయితే ప్రజల్లో భాగమైన రైతుల కస్టాలు స్వయంగా చూసి పరిష్కరిస్తాము అని అపర రాజులు అయిన చంద్ర బాబు తన చెంద్ర దండును వెంటబెట్టుకొని వస్తే జగన్ వైఎస్సార్ సేన రక్షణలో తెలంగాణలో పర్యటించిన సంగతి చూసి నాము. రాచరిక వ్యవస్తలో ఎలాగైతే ప్రజల సమస్త కష్టాలకు రాజులు కారణం అయ్యేవాల్లో ఇక్కడ తెలంగాణా లో ప్రజలందరి సమస్త కష్టాలకు, నష్టాలకు బాధ్యులు సీమాంధ్ర నాయకత్వం.. ప్రధానంగా చెంద్ర బాబు తెలుగు దేశం ప్రభుత్వం,మరియు వైఎస్సార్ నాయకత్వం లో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వాల కారణం అనేది తెలంగాణా లో ప్రతి పౌరుడు ఇవ్వాళా అంటున్నాడు. తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లో కలువడానికి ముఖ్య కారణం కాంగ్రెస్సు. అలాగే రాసుకున్న రాతలు చేసుకున్న ఒప్పందాలు, ఉల్లంఘించి తెలంగాణా నీల్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు బొగ్గు,విద్యుత్తూ,ఇలా సమస్త సంపదలు తెలంగాణా ప్రజలకు దక్కకుండా సీమాంధ్ర పెట్టుబడి దారులకు కట్టబెట్టినవి ఈ రెండు ప్రభుత్వాల ఏలుబడిలోనే.. తెలంగాణా లోనే రైతులను నిండా ముంచింది వీళ్ళే ఇవ్వాల రైతులను ఉద్ధరిస్తామని ప్రగల్బాలు పలుకు ఇగిలిచ్చుకుంట వస్తున్నది వీళ్ళే.
రైతులకు గిట్టుబాటు ధర వీళ్ళు కల్పించలేదని వాళ్ళు,, వాళ్ళు కల్పించ లేదని వీళ్ళు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకొని ప్రజలను ఇంక మోసగించ గలమని వీళ్ళు భ్రమిస్తున్నారు. రైతుల పట్ల వీళ్ళు చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారు. ఒక పిన్నీసు ను తయారు జేసినా ఆ తయారిదారు తన ఉత్పత్తి కి ధరను తనే నిర్ణయించి అమ్ముకుంటాడు . అట్లాగే దాని ధర కూడా సార్వ జనీనంగా అంతా ఒకే ధరతో అమ్ముకుంటాడు.అట్లా వాడు అమ్ముకోవడానికి ప్రభుత్వాలు సవా లక్ష రాయితీలు ఇస్తాయి .. రైతు పండించే ధరను మాత్రం అతడు నిర్ణయించడానికి వీలు లేదు. ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల పైన రైతు పండించిన ధాన్యానికి ధర ఉంటుంది., ఒక్కక్క సారి పోయిన సంవస్తరం ధరకంటే గూడా తక్కువకు రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు గత సంవస్తరం పత్తి క్వింటాల్ ఆరు వేలు ఉంటె ఈ సంవస్తరం గరిష్టంగా నాలుగు వేలే ఉంది.. అంతే గాక ప్రాంతానికి ఒకరకంగా , సరుకుకు ఒక రకంగా వ్యాపారుల ఇష్టానుసారంగా రైతులను దోచుకోవడానికి వ్యవస్తీక్రుతమైన ఏర్పాట్లు ఉంటాయి, సరుకు రైతుల వద్దనుండి వ్యాపారుల వద్దకు చేరగానే ధరలు ఆకాశానికి పోతాయి .అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా,కమ్యునిస్టు అయినా బిజెపి అయినా అందరు ఒకే సూత్రాన్ని ఎందుకు అవలంభిస్తున్నారు? ఎందుకంటే పారిశ్రామాదిపతులు ఇస్తున్న లేదా ఇవ్వజుపుతున్నడబ్బులు కావాలి కనుక వాళ్లకు లబ్ది చేకూర్చే విధానాలు అవలంభిస్తారు . అలాగే రైతుల ఓట్లు కాకాలి కనుక వాళ్ళ కు ఏవో రాయితీలు ఇస్తున్నట్టు నమ్మబలుకుతారు. కాని ఎప్పుడు కూడా వారు చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. నిజంగానే పాలిస్తున్న పార్టీలు రైతులకు మేలు చేసే ప్రభుత్వాలే అయితే కాస్మీరునుండి కన్యాకుమారి దాకా , బొంబాయి నుండి ఒరిస్సా దాక రైతుల ఆత్మహత్యలు నిరంతరాయంగా ఎందుకు జరుగుతున్నట్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా ఒక్క జిఎమ్మారు , ఒక జిందాలు ఒక బ్రాహ్మణి , ఒక వేదాంత, ఏదయినా ఒక ఆయిల్ కంపని వాళ్ళు ఎవ్వరైనా ఎక్కడైనా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మనకు ఒక్కటయినా కనిపించదు ఎందుకు ?
అయితే అంతిమంగా అయన చంద్రబాబు గానివ్వండి , జగన్ గానివ్వండి , కిరణ్ గానివ్వండి.మరే పాలకుడైనా గానివ్వండి ప్రజల పైన రైతుల పైన ప్రేమ అంటే అది వాళ్ళ ఓట్ల పైన ప్రేమ దప్ప ఆ వర్గాల ప్రయోజనం కోసం ఉద్దేశింప బడింది కాదు అనేది నిర్వివాదాంశం. ఇక ఇక్కడ తెలంగాణా లో వీళ్ళ పర్యటనల సారాంశం చాల స్పష్టం,ఏంటంటే తెలంగాణా వాదాన్ని పూర్వపక్షం చేసి ఇక్కడ ప్రజల్లో తెలంగాణా వాదం ఏమి లేదు అని ప్రపచానికి చెప్పడానికే అందరు కలిసి ఆడుతున్న దొంగ నాటకం. అన్ని పార్తీల వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వచ్చేసరికి ఎవరికీ వారు విడివిడిగా కొట్లాడుతున్నగూడా తెలంగాణా విషయం వచ్చేవరకు మాత్రం అందరుకల్సి తెలంగాణా రాకుండా అడ్డుకోవడానికి చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్న విషయాన్ని తెలంగాణా ప్రజలు జాగ్రత్తగానే గమనిస్తున్నారు.
పెంటయ్య.వీరగొని
అడ్వకేట్ , కరీంనగర్.

Click here to Reply or Fo

No comments:

Post a Comment