Friday, January 6, 2012

prajasvaamika hakkulu maaku undavaa?

చంద్ర బాబు మాల్లో సారి అబద్దాలుజెప్పి తెలంగాణా ప్రజల చెవిలో పూవుపెట్టి పోయిండు. అయన తెలంగాణాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడ లేదట? నిజ్జంగా నిజమేనా? వాజ్ పేయి సర్కారుల ఒక్క ఓటు
రెండు రాష్ట్రాలు అన్న మానానికి మేము తెలంగాణా ఇవ్వబోతున్నమంటే అడ్డుతగిలి అప్పుడు తెలంగాణ రాకుండా చేసింది ఎవరు మరి? అసెంబ్లీ లో తెలంగాణా అనవద్దు వెనుక బడిన ప్రాంతాలు అని మాట్లాడాలని
ఆదేశించినది ఎవరో? తొమ్మిది డిసెంబర్ అర్ధరాత్రి నుండి రాజకీయం నడిపి నన్నపునేని రాజకుమారితో లగడపాటికి ముద్దులు ఇప్పించి మన పార్టీలు ఎవ్వైతే ఏందీ మనం అందరం సీమంధ్ర వాళ్ళమే, తెలంగాణా వాళ్ళు
మన ఏలుబడి పిడికిలి నుంచి జారిపోతమంటే మనమెట్ల పోనిస్తం అని ఐక్యంగా అడ్డుదగులదానికి నాయకత్వం వహించింది ఎవ్వరు? నిన్నటికి నిన్న అసెంబ్లీ లో అవిశ్వాస తీర్మానం లో మూడు గంటలు మాట్లాడి తెలంగాణా
ముచ్చట ఒక్కసారన్న తీయడానికి నీకు నోరు రాలేదు ఎందుకు? ఏడు వందల మంది తెలంగాణా బిడ్డలు కాంగ్రెస్ , టిడిపి బొంకు రాజకీయాల కారణంగా చనిపోతే కనీసం సంతాప తీర్మానం పెట్టడానికి కూడా నీ మహా నాడు
లో అవకాశం లేకుండా పోయినంతటి అప్రస్తుతమైపోయిన మా తెలంగాణా విషయం నిన్ను ఇవ్వాల తనగురించి నీతో నోరు తెరిపించి మాట్లాదిపిచ్చింది. ఇన్ని సంవస్తరాల నుండి మా తెలంగాణా ప్రజలకు జీవన్మరణ
సమస్య అయ్యి మేము పోరాటం జేస్తుంటే మా గురుంచి ఒక్క మాట జెప్పడానికి కూడా నీకు అసెంబ్లీలో నోరు రాకపాయే కాని నేను మీ తెలంగాణాకు వ్యతిరేకం కాను అనేదానికి నీకు నోరెట్ల వచ్చే గదా ?
మనందరికీ తెలిసిన సంగతే ... అదే ఉప ఎన్నికలు వస్తున్నాయి గనుక ఎట్లా నన్నా కొన్ని ఓట్లు సంపాయిన్చాలేనన్న తపన కనిపిస్తున్నది. కాని మా ఉసికే, మా బొగ్గు, మా నీళ్ళు, మా ఉద్యోగాలు, మా గుట్టల
గ్రానైటు , బాక్షైతు, ప్రధానంగా మా భూములు కొల్లగొట్టుక పోతుంటే మీకు మీ కాంగ్రెస్సుకు వ్యతిరేకంగా మేము పోరాటం జేస్తూ వస్తున్నాం. అది మా ప్రజాస్వామిక కాంక్ష అయిన తెలంగాణా రాష్ట్రం వస్తే దప్ప
ఈ విధ్వంసం ఆగదని. కాని ఒక ప్రతిపక్ష నాయకునివి అయి ఉంది పది జిల్లా ల నాలుగు కోట్ల మంది ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను నీవు అసెంబ్లీ లో ఎందుకు ప్రస్తావించలేదని అడిగితె నీ ప్రజాస్వామిక హక్కుకుభంగం
వాటిల్లిందా? నీ ఒక్కనికి గీ మాత్రం ఇబ్బంది అయితే అంత బాధ పడి పోతున్నావే, మా నాలుగుకోట్ల మంది ప్రజాస్వామిక హక్కుకు భంగం కలిగితే మేము ఎంత బాధపడి పోవాలేనో చెప్పు? మా వెయ్యి మంది బిడ్డల
రక్తం ఏరులయి ప్రవహిస్తే మేము ఎంత బాధ పడి పోవాన్నో చెప్పు? మా ఆపతిల , మా సంపతిల, మా ఏడుపుల, మా ఓదార్పుల అక్కరకు రాని నువ్వు ఇవాళ నీకు ఓట్ల అక్కెర బడంగనే అలాయి బలాయి దీసుకుంట
అంటే నిన్ను ఎట్లా నమ్ముమంటావు. మీ సోదరుడు రాజశెకరుడు 2009 ఎన్నికల పోలింగు అటు అయిపొంగానే , తెలంగాణాకు పోవాన్నంటే ఇక మనకు పాస్పోర్టులు గావాన్నత అని కారేడ్డమాడ లేదా?
టీ అర ఎస్ ను తిడితే తెలంగాణా ఉద్యమం గాదు? ఓ తెలంగాణా టి డి పి నాయకులారా మీరు తెలంగాణా కొరకు చేసిన పోరాటం ఏదైనా ఉంటె ఒక్కటి జెప్పండి. రాజీనామాలు అంటారా? అదొక జోక్ అయిపొయింది.
చేయవలసినప్పుడు వాళ్ళు చేస్తే మేము చేస్తామని డ్రామాలు చేసిండ్రు. సకల జనుల సమ్మె లో మీరు ఎక్కడబోయిండ్రు? పార్ల మెంటులో అసెంబ్లీలో తెలంగాణా రాష్ట్రం కోసం మీరు చేసింది ఏందో సెప్పుండ్రి?
నిన్నటికి నిన్న కిరణ్ కుమార్ తెలంగాణ ల తిరిగి పోయిండు. ఇవ్వాల తెలంగాణా టిడిపి వాళ్ళు చెంద్ర బాబును తిప్పిండ్రు, రేపు వై ఎస్సార్ పార్టి వాళ్ళు జగన్ ను తిమ్పుతారు. ఎల్లుండి నుంచి ఇదే సీమాంద్ర మీడియా,
సీమంద్ర పెట్టుబడి దార్లు అగాగో చూడండి తెలంగాణా ల తెలంగాణా వాదమే లేడని విశాలాంధ్ర విషం గక్కుతాడు పరకాల..
, ... ప్రజాస్వామ్యం గురించి తెగ బాధపడి పోతున్నారు గదా? 5 జనవరి 2010 నాడు డిల్లి లో చిదంబరమే ఏమన్నడు? ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను మనం పట్టించుకోక పొతే ఉద్యమం మన
చేతుల్లోంచి వెళ్లి పోవాల్సిన వాళ్ళ చేతుల్లోకి పోతది అని అనలేదా? మరి అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మతికి రాదు. చర్చిల్ మహాశయుడు అన్నట్టుగా నేను నీ ఆలోచనలతో అసలు ఏకీభవించక పోయినా
నీ ఆలోచనలు చెప్పుకొనే ప్రజాస్వామిక స్వచ్చకోసం నా గొంతులో చివరి ఉపిరి ఉన్నంత వరకు పోరాడుతా నని అన్నాడు గదా? మరి ఆ ప్రజాస్వామిక స్వేచ్చ ప్రకారమే గదా ఆనాడు బషీర్ బాగ్ లో అయినా
ఇయ్యాల 2009 ఎన్నికలప్పుడు నీవు అన్న తెలంగాణ వాదానికి ఎందుకు నిలబడుత లేవు అని నిలదీసిన పాపానికి ఐదువేల మంది అర్రేస్టు, వందల మంది తలలు పగుల గొట్టిచ్చి అక్రమ కేసులు
బెట్టిస్తావ్ ఇదేనా నీ ప్రజాస్వామ్యం అని తెలంగాణా ప్రజలు నిలదీస్తున్నారు. అట్లనే ఇంకొక్క మాట మా తెలంగాణా మాకు కావాలె అని పాటబాడినమా బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికి పిచ్చినావు , మా వీణవంక రవీందర్ రెడ్డి ని, మా కనుకా చారిని తెలంగాణా జనసభలో పనిజేసినందుకని నడివీధిలో నరికి చంపిపిచ్చినావు . అప్పుడు నీకు ప్రజాస్వామ్యం లో ప్రతి పౌరునికి తన భావం చెప్పుకొనే స్వేచ్చ ఉంటది అన్న విషయం ఎందుకు
గుర్తుకు రాలేదని అడుగుతున్నాం. నీకు ఒక్కనికే ప్రజాస్వామిక హక్కు ఉంటాడా? తెలంగాణా గడ్డమీద పుట్టిన పాపానికి మాకేవ్వరికి ప్రజాస్వామిక హక్కులు ఉండవా? అవి కేవలం మీ సమైక్యాంధ్రుల సొత్తు మాత్రమేనా?
పెంటయ్య. వీరగొని.
అడ్వకేట్
కరీంనగర్.

1 comment:

  1. నేను అంబేద్కర్ వాదిని అతని సిద్దాంతం ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాల్సిందే, దానికే నా ఓటు.
    నా మదిలో చాలా రోజులుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.

    1. మనం మనం కొట్టుకొంటు తిట్టుకొంటూ ఇవ్వాల్సిన హస్తిన నాయకులకు వెసులుబాటు కల్పిస్తున్నాము?. వారు హాయిగా మన ఆంద్రప్రదేశ్ లొ జరుగుతున్న ఈ సమైక్య విభజన వాదుల పోరు/తగాదా/తిట్లదండకం (ఏమైనా చెప్పుకోవచ్చు) తిలకిస్తూ మధ్యమధ్యలో మంట ఎక్కువయ్యే టట్లు చేస్తున్నారు?.
    2. ప్రత్యెక రాష్ట్రం కోరుకొనే ప్రాంతంలో దాదాపు అన్నీ పార్టీలు ఈ వాదాన్నే చెబుతున్నాయి. అయితే ఒకరు తరువాత మరొకరు ద్రోహి గ ముద్ర వేయబడుతున్నారు?. అసలు విషయం ఏమిటంటే పార్టీ A వారు 80%, పార్టీ B వారు 10%, C వారు 5%, D వారు 2.5%, E వారు 2.5% మాత్రమే ప్రత్యెక రాస్ట్రవాదం ఉంది అనుకొంటే. వంద శాతం ప్రత్యెక వాదం కావాలంటే పైవన్నీ కలుపుకుపోతేనే కదా అయ్యేది?, అప్పుడే హస్తిన వారు కదులుతారు. అలా కాకుండా మాన రాష్ట్రంలోనే మనలో మనం తిట్టుకొంటూ కొట్టుకొంటూ ఉంటే వారు ఎంచక్కా ఫ్రీ సినిమా చూస్తారు.

    ReplyDelete